Monday, February 4, 2013
కుక్షింభరవిద్య
శ్రీ గురుభ్యోన్నమః
అందరికీ నమస్సులు
సాధన గ్రంధ మండలి వ్యవస్థాపకులు శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రిగారి వచనాలు...
తానెవరో తెలిసికొనుటకు ఉపయోగపడినచో అది విద్య కేవలము బ్రతుకు సాగించుటకు ఉపయొగింపబడినచో అది కుక్షింభరవిద్య (బ్రతుకు దెరువు) బ్రతుకుదెరువునకే ప్రాధాన్యమిచ్చిన సమాజము సుఖశాంతులను కోల్పోయి నిరంతరము అశాంతము, కల్లోలితమై విపత్పరంపరకు ఆలవాలమగును
తానెవరోతెలిసుకొనుటకు ఉపయోగించు విద్యకు ప్రాధాన్యమిచ్చిన సమాజము ఇహ పరములను రెండింటినీ పండించుకొనును
కేవలము బ్రతుకు బ్రతుకుటలో ఇంద్రియ సుఖములకై వెంపర్లాట బహిర్ముఖతచే సమకూరును. తానెవరో తెలిసుకొనుట అంతర్ముఖతవలననే సాధ్యమగును.
బహిర్ముఖత్వమునకు ఏ సాధన అఖ్ఖఱయుండదు, కాని అంతర్ముఖత చిరంతన సాధనచే మాత్రమే సాధ్యము.
మానవాళి సుఖసంతోషములతో ఉండవలెనన్న అంతర్ముఖప్రవృత్తి దానికి లక్ష్యమై ఉండవలెను.
వేదములు, శాస్త్రములు, పురాణములు, స్తోత్రాదులు ఇతర వాఙ్మయమంతా మానవుడు అంతర్ముఖుడగుటకు తగిన ప్రబోధమును సమృద్ధిగా సర్వమైన ప్రపంచమునకు పంచి ఇచ్చుచున్నవి.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
https://groups.google.com/group/satsangamu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment