Pages

Thursday, June 13, 2019

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

పెద్దగీతను చిన్నది చేయాలంటే.. దాని పక్కన ఇంకో పెద్దగీత గీయడం ఒక పద్ధతి. కానీ పెద్ద గీత గీయలేనితనం లేదా విషయంలేక గొప్పదిగా చూపడం కుదరకపోతే? అసలు పెద్దగీతని, గొప్పతనాన్ని చిన్నదిగా చూపడం... అనాదిగా మనిషి బలహీనత.. అదే జరిగిందిక్కడా...

-శంకరకింకర

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

ఈ మాట వింటూనే నోటి వెంబడి పాట వస్తుంది.
రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారు, కానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట అరుదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.

అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం
గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం
భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం
జయ జయ రాఘవ రాజారాం 

-చెరుకు రామ మోహన్ రావు, Cheruku Rama Mohan Rao (Saturday, 23 December 2017)

4 comments:

  1. ఈ పాట, నారాయణ నారాయణ అల్లా అల్లా .. మన సిక్యూలర్ రచయితలు పాడి పరవశించి పోతారు.

    ReplyDelete
  2. "వక్రీకరణ" అన్నారు. కానీ ఏ రకమైన వక్రీకరణ అన్నది చెప్పలేదు.

    ReplyDelete
    Replies
    1. సాంతం... భావ వక్రీకరణ, సాహిత్య మార్పు, తుష్టీకరణ చేర్పు..

      Delete
  3. రఘుపతి రాఘవ రాజారాం అనే పేరు ఒక్కమగాడు అనే సినిమాతో మరింత వక్రీకరించబడటం జరిగింది!

    ReplyDelete