Pages

Tuesday, September 24, 2013

మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము

ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌ !
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌
తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌ !!

తాత్పర్యము: మొసలి నోటికోరల మధ్య నున్న మాణిక్యమును ప్రజ్ఞతో బయటికి తీయవచ్చును. పెద్దపెద్ద అలలతో ఎగసిపడుతున్న సముద్రమును దాటవచ్చును. ఆగ్రహముతో బుసలు కొడుతున్న సర్పమును పూలదండలా శిరస్సున ధరించవచ్చును. కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము.
  

Monday, September 23, 2013

వీర వీర వీర వీరాంజనేయా

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

హరి మర్కట మర్కటాయ వీరాంజనేయ - మమ్ముల గన్న తండ్రీ వీరాంజనేయ
రామ
కదా లోలాయ వీరాంజనేయా - రామ దాస పోష కాయ వీరాంజనేయా
కోటి
సూర్య ప్రకాసాయ వీరాంజనేయా - కోటి దండాలయా నీకు వీరాంజనేయా
అంజనీ
పుత్రాయ వీరాంజనేయా - ఆపదలు బాపుమయా వీరాంజనేయా
సుగ్రీవ
మిత్రాయ వీరాంజనేయా - సువర్చలా సాహితాయ వీరాంజనేయా
రామ
భక్త సేవితాయ - రామ నామ స్తుత్యాయ వీరాంజనేయా
వీరాంజనేయా
వీరాంజనేయా - వీర వీర వీర వీరాంజనేయా
లంకాగమన
కారకాయ వీరాంజనేయా - లంకా నగర ప్రవేశాయ
లంకా
మర్దనాయ వీరాంజనేయా - లంకా దహన కారకాయ వీరాంజనేయా
వీరాంజనేయా
వీరాంజనేయా - వీర వీర వీర వీరాంజనేయా
అబ్ది
వారిది బంధనాయ వీరాంజనేయా - అతులిత బలధామ వీరాంజనేయా
రామ
లక్ష్మణ సేవితాయ వీరాంజనేయా - రామ లక్ష్మణ రక్షితాయ వీరాంజనేయా
శత్రు
సైన్య నాసకాయ వీరాంజనేయా - సత కోటి భాను తేజా వీరాంజనేయా
నిర్భయత్వ
కారకా వీరాంజనేయా - నీ అభయమిచ్చి కావుమా వీరాంజనేయా
మేము
నీ బిడ్డలమయ్యా వీరాంజనేయా - మమ్మేట్లు గాతువో వీరాంజనేయా
బుద్ధి
బలం యశో ధైర్యం వీరాంజనేయా - మాకు ప్రసాదించు మయా వీరాంజనేయా
నీ
అండ మాకు వీరాంజనేయా - నిరతము నిలుపుమయా వీరాంజనేయా
నీ
నామ స్మరణే వీరాంజనేయా - నీ రూప ధ్యానమే వీరాంజనేయా
మాకు
రక్షా మాకు రక్ష - వీరాంజనేయా - నీ నామ స్మరణే వీరాంజనేయా
జయము
జయము జయము వీరాంజనేయా - నీకు జయము నీకు జయము వీరాంజనేయా
 

శ్రీ ఉపాధ్యాయుల రాధాకృష్ణగారి సహాయంతో

Saturday, September 21, 2013

కర్కోటకస్య .............కలినాశనం! -5

దమయంతి తన చెలికత్తెఐన కేశిని ని పిలిచి అయోధ్యారాజు ఋతుపర్ణుడు తప్ప అన్య రాజులెవ్వరూ ఇపుడు రాలేదు అతనితోపాటు బ్రాహ్మణుడు అతని సూతుడు వచ్చారు. ఆసూతుడెవరో కనుక్కో మన పర్ణాదునికి ప్రతివచనమిచ్చిన బాహుకుడి యెడ ఎందుకో మనసు ముదితమవుతోంది అని చెప్తుంది. కేశిని పరిపరివిధముల అతనిని పరీక్షించి, అతడు వాయువేగమున అన్ని యోజనములు ఎలా వచ్చినదీ తెలుసుకొని, అతడు ఋతుపర్ణునికి వంటవాడనీ తెలుసుకొని అతడు వండిన వంటలు దమయంతీ దేవవద్దకు పంపుతుంది అవి రుచి చూసిన దమయంతీదేవి అతడు నిశ్చయంగా నలుడే అని నమ్మి తన కొడుకు కూతురును నలుని వద్దకు పంపగా అతడు వాత్సల్యం చేత వారిని కౌగిలించుకొని నాపిల్లల్లా ఉన్నారని అంటాడు.

మా పురోహితులవల్ల నువ్వు మారురూపంలో అయోధ్యలో ఉన్నావని తెలిసి నిన్ను రప్పించటానికే  బ్రాహ్మణులచేరి సమాలోచింది ద్వితీయ స్వయంవరాన్ని రచించవలసి వచ్చింది, అని బాహుకుణ్ణి చేరి చెప్తుంది. విలపిస్తుంది విన్నవిస్తుంది. అంత దైవ వశాన ఆకాశవాణి పలుకుగా నరోత్తమా ఆమె పతివ్రత మహాసాధ్వి నీకొరకే పరితపించునది కానీ మారు వివాహమునకు నీయందు అన్యభావనతో స్వయంవరం రచించలేదు అని వినపడుతుంది. ఆకాశంలోంచి పుష్పవృశ్టి కురుసి, దేవ దుందుభులు మ్రోగుతాయి, వాయుదేవుడు ప్రత్యక్షమై నలునికి దమయంతీపతివ్రతాగుణాలు, నలుని యందున్న అనురాగాన్ని విశదీకరిమ్చి చెప్తాడు. నలుడు ప్రమోదాన్ని పొంది క్షణమే కర్కోటకుణ్ణి తలచుకోగా పట్టుపుట్టం వచ్చి తనపైబడి తన అసలు రూపు పొందుతాడు.
తరవాత పుష్కరుని చేరి తన రాజ్యం పొందుటకు జూదమో యుద్ధమో తెలుపమని కోరతాడు, పుష్కరుడు ఇంతకు ముందు నలుని ఓడించిన గర్వముచే దమయంతిని మోహించి తాను ఓడితే  రాజ్యమిస్తాననీ నలుడోడితే దమయంతినీయవలెననీ పందెం కాస్తాడు, కలి ప్రభావంలేని కారణాని దైవ వరప్రభావాన నలుడు గెలిచి రాజ్యాన్ని పొందుతాడు. ఓడిన పుష్కరుని చూసి కిందటిసారి కలి ప్రభావం చేత ఓడాను ఈసారీ అలాగే అనుక్కున్నావు కానీ నిన్నేమీ చేయను నీవు నాకు దాయాదివి కాబట్టి నిన్నేమీ చేయను పొమ్మని వదిలేస్తాడు. ఇక పిల్లా పాపలతో దమయంతి తన భర్తను చేరి సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవిస్తూ కీర్తినిపొందారు.

కథను మహాభారతంలో బృహదశ్వుండు , ధర్మరాజుకు చెప్పి ఇందులోని అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. తరవాత నలోపాఖ్యాన ఫలశృతినీ ఇలా చెప్తాడుఎవరు నలోపాఖ్యానాన్ని సావధానంగా భక్తితో వింటారో, చదువుతారో వారు కలిదోష నిర్ముక్తులౌతారు. అఖిల పుణ్యాన్ని ఆర్జిస్తారు, కష్టాలు బాయరు, పుత్ర పౌత్రాభువృద్ధిని పొందుతారు. ఆరోగ్యము, ఆదాయము, ధన ధాన్యాదులు పొందుతారు, దుష్ట విషయములకు వ్యసనములకు బానిసలవ్వరు, ధర్మాత్ములై కీర్తిని పొందుతారుఅలాగే కలి వరమిచ్చినట్లుగా నలుని కీర్తించినవారిని కలి బాధించడు. ఉపాఖ్యానం పూర్తిగా చదవడం కానీ వినడం కానీ కుదరకపోయినా ఇందులోను పుణ్యచరిత్రులైన వారు పేర్లు తలచుకునేలా క్రింది శ్లోకం పఠించినా కలిదోషం అంటదు. అని చెప్తారు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్ష్యేః కీర్తనం కలినాశనం!

ఆస్తికులు ఈ శ్లోకాన్ని నిత్యమూ చదివి వృద్ధిని పొందెదరుగాక!
స్వస్తి
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

కర్కోటకస్య .............కలినాశనం! -4

విషయమంతా భీమ మహారాజుకు తెలిసి బాధపడి తన అల్లుడు కూతురు ఎక్కడున్నారో అని బ్రాహ్మణుల చేత వెతికిస్తూంటాడు. అలా ఒకనాడు సుదేవుడు అనే బ్రాహ్మణుడు సుబాహుపురంలో రాజమందిరంలో పుణ్యాహవాచనం చేయడానికి వెళ్ళి రాజకుమార్తెఐన సునందతో ఉన్న సైరంధ్రిని దమయంతిగా గుర్తిస్తాడు. దమయంతితో మాట్లాడుతుండగా ఆమె దుఃఖవశురాలై ఏడుస్తూంటే రాజమాత ఇతరులు వచ్చి సుదేవుని చేరి ఈమె గూర్చి విచారించగా ఆమె విదర్భేశుడైన భీమమహారాజు కుమార్తెయనీ నిషధ మహారామైన నలుని పట్టమహిషి అనీ తెలుసుకుంటారు. దమయంతి తల్లి, రాజమాత ఇద్దరూ అక్కచెల్లలు దశార్ణమహారాజు కూతుర్లనీ, దమయంతి, రాజమాతకు వరుసకు కూతురనీ తెలిసి ఆనందం పొందుతుంది.

అక్కడ్నుంచి దమయంతి విదర్భకు బయలుదేరి వెళ్తుంది. భీముడు బ్రాహ్మణులను నియోగించి నలుని వెతికించే ప్రయత్నంలో ఉంటాడు. అందులో పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు అయోధ్యకు వెళ్ళి అక్కడ రాజుతో ఈవిషయం చెప్పి సహాయం చేయమని కోరతాడు అక్కడే ఉద్యోగంలో ఉన్న బాహుకుడు పర్ణాదుడ్ని ఏకాంతంగా పిలిచి నిట్టూర్పులతో భర్తలోని దోషాన్ని సహించిన భార్య దేహాంతముతరవాత ఉత్తమలోకాలు పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అంత పర్ణాదుడు ఇతడు నలుడు కాకపోతే ప్రతివచనం ఎందుకు పలుకుతాడు అనే అనుమానాన్ని పొందుతాడు, విషయాన్ని సుదేవునికి భీమునకు చేరవేస్తాడు.

భీముడు ఋతుపర్ణుని వద్ద ఉన్న నలుని బయటికి తీసుకురావడానికి దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అతి త్వరగా ఋతుపర్ణుని రమ్మని కబురు పెడతాడు. సుదేవుడు అయోధ్యచేరి ఋతుపర్ణుని ఆహ్వానిస్తాడు. అంత ఋతుపర్ణుడు నాకు దమయంతి ద్వితీయ స్వయంవరం చూడాలని ఉంది అతి వేగంగా నన్ను అక్కడకు చేర్చు నాకు నీ అశ్వనైపుణ్యం చూపించి అని బాహుకుడితో చెప్తాడు. అలాగే అని బాహుకుడు వారిని తీసుకొని బయలుదేరతాడు. తన భార్య ద్వితీయ స్వయంవరానికి ఎలా ఒప్పుకొంది అని పరి పరివిధాల ఆలోచిస్తాడు.

బాహుకుని అశ్వనైపుణ్యం చూసి ఆశ్చర్యపోయి ఇతడు, శాలిహోత్రుడో, మాతలో లేక నలుడో తప్ప అన్య మానవులు కాజాలరని తలుస్తాడు ఋతుపర్ణుడు. వయస్సు, విద్యను జూస్తే నలుని వలె ఉన్నాడు, కానీ రూపము వికారముగా ఉంది అని పరి పరి విధాల ఆలోచిస్తాడు. మహానుభావులు దైవ వశాత్త్ ప్రచ్ఛన్న వేషాలలో తిరిగుతుంటారు అలా నలుడు కానీ కాదు కదా అని అనుమానిస్తాడు, అలా ఆలోచిస్తూంటే తన ఉత్తరీయం జారి నేల మీద పడుతుంది, ఒకసారి వేగాన్ని తగ్గిస్తే బ్రాహ్మణుడు తన ఉత్తరీయం తిరిగి తీసుకొస్తాడని చెప్పగా బాహుకుండు నవ్వి అది పడి యోజనం దూరం దాటింది ఇప్పుడు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి తేవడం ఆలస్యమవుతుందని చెప్తాడు. అంత వేగంగా రథాన్ని తోలడం తెలుసుకొని ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు.

ఆదారిలో బాహుకుడు ఋతుపర్ణునికి అశ్వతత్త్వ శాస్త్రమంతా చెప్తాడు. అంత సంతోషించి ఋతుపర్ణుడు తనకు తెలిసిన ఫల వృక్షముల గూర్చి మొత్తం చెప్తాడు. చెట్లు ఎలాంటివి ఎలాంటి పళ్ళుంటాయి వాటి ఆకులు రకాలు అన్నీ చెప్తాడు. అలా ఒకరికొకరు అశ్వవిద్య, అక్షవిద్యను ఉపదేశించుకుంటారు. అంత అక్షవిద్యా మహిమ వలన బాహుకుని నుంచి కలి బయటపడ్తాడు, ఆశ్చర్యంతో చూస్తున్న నలుని వంక జూసి చేతులు జోడించి తాను కలిననీ తన ప్రభావం వల్లనే ఇన్ని కష్ఠాలు కలిగాయనీ చెప్తాడు. కోపంతో నలుడు కలిని శపించబోగా శరణువేడి నీ శరీరంలో ఉన్న కారణంచేత కర్కోటకుని విషంవల్ల నిత్యమూ దగ్ధమవుతూనే ఉన్నాను నన్నుపేక్షించుమని కోరతాడు. నిన్ను కీర్తించిన నరులు నావలన బాధలు పొందరు అని మాట ఇస్తాడు. అపుడు శాంత పడిన నలుడు తనలోని దుర్గుణములన్నీ పోగా కేవల విరూపం మాత్రం ఉండగా ఋతుపర్ణుడు, బ్రాహ్మణునితో సహా విదర్భపురి చేరతాడు. కలి అక్కడే ఉన్న భీత వృక్షాన్ని చేరతాడు. అప్పటుంచీ భీత వృక్షమూ ప్రసిద్ధి చెందింది.

ఋతుపర్ణుని రథం అంతఃపురం వేపుకు వస్తుంటే దాని శబ్దము నాలుగు దిక్కులా వ్యాప్తిచెందుతూ వేగంగా వస్తూండగా దమయంతి ధ్వని విని ఇది నా నాథుడే వస్తున్నాడని నమ్మి అనురాగయై బయటికి వచ్చిచూడగా భీముడు ఋతుపర్ణుని ఆహ్వానించడం చూస్తుంది. అక్కడ నలుడు కనపడక మనసులో తల్లడిల్లుతుంది. బాహుకుడు రథాన్ని రథశాలలో కట్టి అక్కడే విశ్రాంతి తీసుకుంటూంటాడు.