Pages

Friday, November 22, 2013

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 09వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే నవమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం

విష్ణుదూతా ఊచుః
భవతాంస్వామినాకింకిం వదథ్వంకధితంయతః
కోర్హోత్రయమదండస్య కేధర్మాఃపుణ్యాపాపకాః!!
నూన మస్మాకమగ్రేతు బౄతసర్వంయమానుగాః
ఇతితైరుదితం శ్రుత్వా ఊచుస్తెయమకింకరాః!!
తా ! విష్ణుదూతలు ఇట్లు పలికిరి. " ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీయమదండనకు ఎవ్వడుతగినవాడు? పుణ్యులనగా ఎవరు? పాతకములనగా ఏమిటి? ఈ విషయాలన్నిటినీ సవిస్తారంగా మాకు చెప్పండి" అనగా యమదూతలు ఇలా చెప్తున్నారు.

యమదూతా ఊచుః
శ్రుణుధ్వమవధానేన విష్ణుదూతాస్సునిర్మలాః
పతంగఃపావకోవాయుర్వ్యోమగావోనిశాపతిః!!
సంధ్యాహనీదిశఃకాల ఇతిదేహస్యసాక్షిణః
ఏతైరధర్మోవిజ్ఞాతస్సనోదండస్యయుజ్యతె!!
తా !  "ఓ విష్ణుదూతలారా! సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనిషి పుణ్యపాపములకు సాక్షులు, మేమి వీరి సాక్ష్యాన్ని విచారించి పాపం చేసిన వారిని దండిస్తాం.


స్వవేదమార్గరహితః శ్రుతిస్మృత్యాదిదూషకః
నిందితస్సాధువృత్తానాం సమేదండ్యోనసంశయః!!
తా !  వేదమార్గాన్ని వదలి ఇచ్ఛాను సారంగా తిరిగుతూ, వేదశాస్త్రాలను దూషిస్తూ సాధుబహిష్కృతుడైన వారిని మేము దండిస్తాము.

విప్రంచగురుమస్వస్థం పాదాద్యైర్యదితాడయేత్
యోమాతాపితరౌద్ద్వేష్టి సదండ్యోనాత్రసంశయః!!
తా !  బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు అయినవారిని మేము దండిస్తాము.

యోనిత్యమనృతంవక్తి ప్రాణిహింసాపరాయణః
కులాచారపరిభ్రష్టస్సయాతియమమందిరం!!
తా !  నిత్యమూ అబద్ధమాడుతూ జంతువులను చంపుతూ కులాచారము వదిలిన వారిని మేము దండిస్తాము.

దత్తాపహారకోదంభో దయాశాంతివివర్జితః
యంపాపకర్మనిరతస్సయాతిమయమందిరమ్!!
తా !  ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవారిని, డాంబికులను, దయాశాంతులు లేని వారిని, పాపాత్ములను మేము దండిస్తాము.

పరదారాభిగమనం సభుం కైయమయాతనామ్
యస్సాక్షికంవదేద్ద్రవ్య లోభేనాత్యంతదుష్టధీః!!
తా !  పరుని భార్యతీ క్రీడించువానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పేవారిని మేము దండిస్తాము

అహంతుదాససూరేతి సభుంక్తెయమయాతనాం
మిత్రద్రోహీకృతఘ్నశ్చ సభుంక్తెయమయాతనాం!!
తా !  నేను దాతనని చెప్పుకొను వారిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారినీ, అపకారమును చేయువారినీ, మేము దండిస్తాము.

వివాహవిఘ్నంయఃకుర్వాత్సభుంక్తెయమశాసనం
యోవాపరేషామైశ్వర్యం దృష్ట్వానూయేతదుష్టధీః!!
తా !  వివాహమును చెరిపే వారినీ, ఇతరుల సంపదను చూసి అసహ్యపడువారినీ మేము దండిస్తాము.

పరేషామర్భక్తానాంచ సగచ్ఛేద్యమయాతనాం
కన్యాద్రవ్యేణయోజీవేత్తథావార్థుషి కేనచః!!
తా !  పరుల సంతానమును చూసి దుఃఖించేవారిని, కన్యాశుల్కములచేత జీవించే వారిని వడ్డీతో జీవించువారిని మేము దండిస్తాము.

తటాకకూపకుల్యానాం విఘ్నమాచరతేచయః
తథాన్యవిఘ్నకర్తాచ పాతకీచనసంశయః!!
తా !  చెరువును, నూతిని, స్వల్పకాలువలను నిర్మించడాన్ని మాన్పించేవారిని, నిర్మితములైన వాటిని చెరచువారిని మేము దండిస్తాము.

యఃపితౄన్నసముద్దిశ్య శ్రాద్ధం మోహేనవానరః
నిత్యకర్మపరిత్యాగీ సభుంక్తెయమశాసనం!!
తా !  మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచినవారిని నిత్యకర్మను వదిలిన వారిని మేము దండిస్తాము.

పరపాకపరిత్యాగీ పరపాకరతస్తథా
పితృశేషాన్నభోక్తాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  తాను వండిన అన్నములో ఇతరులకు ఇంతపిసరు కూడా పెట్టక తినేవాణ్ణి, ఎల్లప్పుడూ పరుల అన్నమును మాత్రమే తినేవాణ్ణి, పితృకర్మలయందు భోక్తలు తినివదిలిన ఎంగిలి భుజించువారిని, దండింతుము.

సదదస్వేతియోబౄయా న్నదద్యాద్బ్రాహ్మణేషుచ
శరణాగతహంతాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  ఇతరులు దానము చేస్తుండగా ఆ సమయంలో అడ్డుపడేవారిని, యాచించిన బ్రాహ్మణులకివ్వని వానిని తన శరణుజొచ్చిన వానిని చంపేవానిని మేము దండింతుము.

స్నానసంధ్యాపరిత్యాగీ నిత్యంబ్రాహ్మణనిందకః
బ్రహ్మఘ్నశ్చాశ్వగోఘ్నశ్చ సయాతియమమందిరం!!
తా !  స్నాన, సంధ్యావందనాలను విడిచినవానిని, నిత్య బ్రాహ్మణనింద చేసేవాణ్ణి, బ్రాహ్మణహంతకుణ్ణి, అశ్వ హంతకుణ్ణి, గోహత్య చేసినవాణ్ణి దండింతుము.

ఏవమాదీని పాపాని యమేనోక్తానివైష్ణవాః
యేకుర్వంతియమేలోకె తేన్వభూయంతి యాతనామ్!!
తా !  ఇలా మొదలుగాగల పాతకములను చేయు మనుషులు మా యమలోకమందు మాచేత యాతనలను పొందుతారు

అయంవిప్రాన్వయెజాతో దాసీపతిరజామిళః
అనేనార్జిత పాపానాం సంఖ్యానాస్తినసంశయః!
జన్మప్రభృతిజన్మాంతం పాపమేవముపార్జితం
అయంవైవిష్ణులోకస్య కథమర్హతిదుష్టాధీః!!
ఇతి తేషాంపచశ్శ్రుత్వా విష్ణుదూతాశ్శుచిస్మితాః
మేఘగంభీరయావాచా ఊచుః కిలముఖాంబుజాః!!
తా !   ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు పుట్టి, దాసీ సంగలోలుడై, అది మొదలు జన్మాంతము వరకు పాపములు చేసినవాడు. ఇతని చేత చేయబడిన పాపములకు ఇంత అని మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎలా అర్హుడౌను?" అని ఈ ప్రకారముగా విష్ణుదూతలను ప్రశ్నించినమీదట, విష్ణుదూతలు చిరునవ్వు నవ్వుతూ ఉరుములా అన్నట్లు సమాన గంభీరధ్వనితో ఇట్లనిరి.

విష్ణుదూతా ఊచుః
అహో ఆశ్చర్యమేతద్ధి యద్యూయంమూఢచేతసః
శృణ్వంతుధర్మమర్యాదాం సమాధానేన చేతసా!!
తా ! విష్ణుదూతలిట్లు పలికిరి " అహో ఏమాశ్చర్యము మీరింత మూఢులెట్లైనారు.? ధర్మమర్యాదను మేము చెప్పెదము సావధానంగా వినండి.
  
యోదుస్సంగపరిత్యాగీ సత్సంగతిముపాశ్రయః
బ్రహ్మజ్ఞానంతతీనిత్యం నదండ్యస్సయమేనవై!!
తా !   దుస్సంగమును విడుచువారు, సత్సంగమును ఆశ్రయించువారు నిత్యము బ్రహ్మచింతనమును చేసేవారు యమదండార్హులు కారు.

స్నానసంధ్యాదినిరతో జపహోమపరాయణః
సర్వభూతదయాయుక్తో నసయాతియమాలయం!!
తా !   స్నాన సంధ్యావందనాదులాచరించేవారు, జపహోమములాచరించేవారు, సర్వభూతములందు దయావంతులు, యమదండార్హులుకారు.

బ్రహ్మణ్యాధాయకర్మాణి సత్యవాగనసూయకః
జపాగ్ని హోత్రేయః కుత్యాత్ న సయాతియమాలయం!!
తా !   సత్యవంతుడై మాయాదోషరహితుడై, జప అగ్నిహోత్రములను చేయుచూ కర్మలను సగుణ బ్రహ్మయందుంచినవాడు యదండార్హుడు కాడు. (బ్రహ్మణ్యాధాయ కర్మాణి.. ఈ శ్లోకములో కర్మలను బ్రహ్మమునందుంచినవాడు అని చెప్పినప్పుడు సగుణ బ్రహ్మమునే చెప్పవలసి ఉండును, నిర్గుణబ్రహ్మమును గూర్చికూడా తెలుసుకొన్నవాడు పూర్ణుడై కర్మరహితుడగును వానికి కర్మాకర్మములతో సంబంధంలేదుకదా! అందుకే సగుణ బ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది)

యోన్నదానదాతానిత్యం వారిదానం ప్రయత్నతః
గోదానంచ వృషోత్సర్గం యఃకుర్యాన్నసపాతకీ!!
తా !   నిత్యమూ అన్నదానమో, జలదానమో చేసేవాడు గోదానం చేసినవారు, వృషోత్సర్గం (ఆబోతును వదిలిన వారు) దండార్హులు కారు.

విద్యాదానంచార్ధికేభ్యః యః కుర్యాద్భక్తిమాన్నరః
పరోపకారనిరతః నసయాతియమాలయం!!
తా ! విద్యకోరినవారికి శ్రద్ధగా విద్యాదానం చేసేవారు, పరోపకారాసక్తి కలిగినవారు, యమదండార్హులు కారు.
 
యేవిష్ణుమర్చయేద్భక్త్యాతస్యాంగేజపముత్తమం
వివాహోపనయౌకర్తా నసయాతియమాలయం!!
తా !   విష్ణువును పూజించేవారు, హరినామ స్మరణచేసేవారు, వివాహము ఉపనయనములు చేసేవారు యమదండార్హులుకారు

యేనాధమంటపంమార్గే రాసనిర్మాణమేవచ
అనాధప్రేతసంస్కారాన్నసయాతియమాలయం!!
తా !   మార్గమధ్యంలో మణ్టపాలు కట్టించినవారు, ఆటస్థలాలను కట్టించినవారు, దిక్కులేని శవానికి అంత్యేష్టి చేసినవారు, చేయించినవారు యమదండార్హులు కారు.

సాలగ్రామార్చనంనిత్యం తత్తీర్థంచపిబేన్నరః
తస్యదండప్రణామంచ యఃకుర్యాన్నసపాతకీ!!
తా !   నిత్యమూ సాలగ్రామ అర్చనచేసి ఆ తీర్థాన్ని పానము చేసినవారు, దానికి వందనం చేసేవారు, యమదండార్హులు కారు.

తులసీమణిమాలాంతు గళేధృత్వార్చయేద్ధరిం
సాలగ్రామశిలాంవాపి నసయాతియమాలయం!!
తా !   తులసి కర్రలతో చేసిన మాలను మెడలో ధరించిన హరిని పూజించే వారు, సాలగ్రామాన్ని పూజించేవారు యమాండార్హులు కారు

యేషాంగృహేచతులసీ వర్తతేహరిసత్కథా
గీతాపాఠపరాయేచ నతేయాంతియమాలయం!!
తా !    ఇంట్లో తులసి మొక్కలను, వనాన్ని పెంచేవారు, హరి కథాశ్రవణం చేసేవారు, భగవద్గీతాపారాయణం చేసేవారు యమదండార్హులు కారు.

నిత్యంభాగవతంయస్య లిఖితంపుస్తకంగృహే
తిష్ఠతెచార్చయేద్వాపి నసయాతియమాలయమ్!!
తా !   భాగవతుల సత్కథలు వ్రాసి ఇంట్లో పూజించేవారు ఆ ఇంట్లో ఉన్నవారు యమదండార్హులు కారు.

తులాసంస్థేదినకరే మకరస్థేచభాస్కరే
మేషసంక్రమణేభానౌ స్నానశీలాసయాంత్యధ!!
తా !   సూర్యుడు మేష, తుల, మకర సంక్రమణంలో ఉండగా తెల్లవారు ఝామునే స్నానమాచరించేవారు యమదండార్హులు కారు.

రుదాక్షమాలికాంధ్రుత్వా కృతంయేనజపంశుభం
దానయోమపరోనిత్యం నసయాతియమాలయం!!
తా !   రుద్రాక్షమాలికను ధరించి జపదానహోమాదులనాచరించేవారు యమదండార్హులు కారు.

అచ్యుతానందగోవింద కృష్ణనారాయణావ్యయ
ఇతియోవదతేనిత్యం నసయాతియమాలయం!!
తా !   నిత్యమూ అచ్యుతా, అనంతా, గోవిందా, కృష్ణా, నారాయణా, అవ్యయా, రామా ఇత్యాది హరినామ సంకీర్తనలు చేసేవారు యమదండార్హులు కారు.

యఃకర్ణికాయాంమ్రియతే మరణేహరిముచ్చరన్
సర్వపాపరతోవాపి నసయాతియమాలయం!!
తా !   కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘట్టంలో హరి స్మరణ చేస్తూ చనిపోయినవారు, సర్వపాపాలు చేసినవాడైనా యమదండార్హులు కారు

స్త్రీరాజగురుగోహంతా యేచపాతకినఃపరే
నామవ్యాహరణాద్విష్ణోర్మరణేహ్యఘనిష్కృతిః!!
తా !   దొంగ, సురాపానం చేసేవారు, మిత్ర హంతకులు, బ్రాహ్మణహంతకులు, గురుతల్పగతులు, స్త్రీహంతకులు, రాజ, గురు గో హత్యాది మొదలైన పాపములు చేసినా మరణకాలంలో హరిని స్మరిస్తే పాపవిముక్తులౌదురు.

అజ్ఞానాదధవాజ్ఞానా దుత్తమశ్లోకనామయత్
సంకీర్తనాదఘహరం పుంసాందుష్కృతినామపి!!
తా !   తెలిసి కానీ తెలియకకానీ హరినామ సంకీర్తనం చేసినవారు పాపాత్ములైనాసరే ముక్తులగుదురు.
సాంకేత్యంపారిహాస్యంచ స్తోకం హేళనమేవవా
వైకుంఠవామగ్రహణ మశేషాఘనివారణమ్!!
తా !   హరినామమును, సంకేతిస్తూగాని, సంకేతంగాగాని, పరిహాసానికి గానీ, తెలిసికానీ తెలియకకానీ, కొద్దిగాగానీ, ఎక్కువగాగాని, పలికేవారు పాపముక్తులగుదురు.
పతితస్ఖ్సలితోభగ్న స్సదుష్టస్తప్తజాహతః
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతియాతనామ్!!
తా !   క్రింద పడినప్పుడు, తొట్రుపాటు పడినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదులచేత పీడింపబడినప్పుడు, సప్తవ్యసనములచేత పీడింపబడినప్పుడు, వశములో లేనప్పుడౌనా సరే, హరి నామ సంకీర్తన చేసినవారు యమదండనార్హులు కారు.

యచ్చిత్తేసర్వపాపాపి హరినామాన్య శేషతః
పాపానిజన్మాంతరసంచితాని యేనైవతన్నిష్కృతివర్జితాని
పూయంతినామగ్రహణేన విష్ణోర్మనుష్యలోకెదివివాస సంశయః!!
గురూణాంచలఘానాంచ పాపానాంనాశనాయచ
యద్యసౌభగవన్నామ మ్రియమాణస్సమగ్రహీత్
తేనపాపావినశ్యంతి వహ్నౌప్రక్షిప్తతూలవత్!!
ఇత్యుక్త్వాతేయమభటాన్ విష్ణుదూతాన్సుతేజసః
హైమపుష్పకమధ్యస్థ మజామిళమతంద్రితాః!!
అహృత్యజగ్ముర్వైకుంఠం తదాహాజామిళోనృప
నవందేశిరసాదేవం కింకరాన్ దర్శనోత్సుకః!!
అథాజామిళ అకర్ణ్య దూతానాం యమకృష్ణయోః
ధన్యోస్మ్యనుగృహీతోస్మి యుష్మత్సందర్శనాదహం!!
తా !   అనేక జన్మలలో కూడబెట్టిన ప్రాయశ్చిత్తరహితములవలన కొండలలా పేరుకు పోయిన పాపాలన్నీ హరినామ సంకీర్తనచేత నశిస్తాయి. మరణావస్థలో ఉండి హరినామస్మరణ కొద్దిగా చేసినా, అధికంగా చేసినా వాని పాపాలన్నీ అగ్నిలో పడిన దూదివలె నశిస్తాయి." అని విష్ణుదూతలు పలికి అజామిళుని యమదూతలనుండి విడిపించిరి. తరవాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరించి మీదర్శనం వల్ల మేము తరించాము అనెను. తరవాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి.

అథాజామిళ ఆకర్ణ్య దూతానాంయమకృష్ణయోః
అహో మేపరమంకష్టం యదభూదచితాత్మనః!!
ధిజ్ఞ్మాంవిగర్హితం సద్భిః దుష్కృతంకిలకజ్జలం
హిత్వాబాలాంసతీంయోహం సురాపామసతీమిమాం!!
వృద్ధావనాధౌపితరౌ నాన్యగోద్ధూత పాపినౌ
అయోయమాధునాత్యక్తావనభిజ్ఞే ననీచవత్!!
సోహం వ్యక్తంపతిష్యామి నరకేభృశదారుణే
ధర్మఘ్నాః కామినోయ విందంతి యమయాతనామ్!!
తా !   తరవాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టాన్ని పొందాను. ఆత్మ హితం చేసుకోలేకపోయాను ఛీ ఛీ నాబ్రతుకు సాధు సజ్జనులచేత నిందింపబడేది అయ్యింది కదా! పతి వ్రతయైన భార్యను వదిలి కల్లుతాగుతూ మాంసముతింటూ తిరిగెడి ఈ దాసీ దానిని స్వీకరించాను. వృద్ధులై నాకంటే వేరు దిక్కులేని పుణ్యాత్ములైన నా తల్లిదండ్రులను నీచుడ్నై విడిచాను కదా! అయ్యో ఎంత ధర్మహంతనైనాను. కాముకుణ్ణై నిరంతరమూ అనుభవించే నరకానికి నేను నిశ్చయంగా వెళ్తాను.

కిమదంస్వప్నంహోస్విత్ మయాదృష్టమిహాద్భుతం
వాక్వద్యయాతితమ్యాస్తె  కృష్ణఘోరాసిపాణయః!!
ఫూరామయాకృతేనైవ భాన్యంపుణ్యేసకర్మణా
అన్యధామ్రియమాణస్య విస్మృతిర్వృషలోపతే
వైకుంఠనామగ్రహణం హిహ్వావక్తుమిహార్హతి!!
క్వచాహుకితవఃపాపోబ్రహ్మఘ్నోనిరపత్రపః
క్వచనారాయణేత్యేవ భగవన్నామమంగళం!!
తా !   ఇదేమి ఆశ్చర్యము ఇది స్వప్నమా! ఆ విచ్చుకత్తులను ధరించిన యమభటులెటుపోయిరి? నేను పూర్వ జన్మమందు పుణ్యమాచరించినవాడను కాబట్టే దాసీదానితో జీవించిన నాకు మరణ సమయంలో హరినామ స్మృతి ఎలా కలిగింది. నా నాలుక హరినామాన్నెట్లు గ్రహించింది. పాపాత్ముడనైన నేనెక్కడ అంత్యకాలమందలి స్మృతి ఎక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపేనేనెక్కడ? మంగళుడైన నారాయణుడెక్కడ?

ఇత్యుక్త్వాభగవద్భక్తి మాలంబ్యాత్మావమాత్మని
తతస్సాయుజ్యపదవీం లేభేయన్నామకీర్తనాత్
నారాయణేతియన్నామ జగదచ్యుతరక్షణం
యాతివిష్ణోఃపదంరాజన్ నిర్ధూతాశేషకిల్బిషః
తా !   అజామిళుడిట్లు విచారిమ్చి నిశ్చలమైన మనసుతో భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలము జీవించి తరవాత సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తనము చేసేవారు సమస్తపాతకముక్తులై వైకుంఠలోకాన్ని పొందెదరు. ఇందుకు సందేహములేదు." అని మహర్షి పలికెను.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె నవమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

~~~~~~~~~~~~~~~~~~~~~~ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 08వ అధ్యాయం

{క్షమించాలి, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్లాగు ఆక్సెస్ చేయలేకపోయాను అందుకే మిగతా పరంపరలు పంపలేదు. ఇవాళే ఆక్సెస్ దొరికింది. తప్పకుండా మిగిలినవి ప్రచురిస్తాను, ఆటంకంలేకుండా భగవంతుడు ఆశీర్వదించుగాక.}

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం

రాజోవాచ
మచ్చిత్తే2ధికసందేహో వర్తతెబ్రహ్మనందన
తన్నాశయాద్యమెబౄహి తద్వక్ష్యామితవప్రభో!!
త్వత్తోమయాశ్రుతంవిప్రసూక్ష్మధర్మస్యలక్షణం
తధావిధం పాతకంచ నిమ్దితం విబుధాదిభిః!!
బహుపాపరతానాంచ వర్ణ సంకరకారిణాం
ఆచారహితానాంచ దుర్జనానాం మహామతే!!
ప్రాయశ్చిత్తైస్తుపూయం తె త్రయీవిద్యాదిసంభవైః
కృత్వా గురూణి పాపాని మానవాదుష్టబుద్ధయః!!
ధర్మలేశేనతే సర్వే కథంయాంతి హరెః పదం
తా! రాజు ఇలా అడుగుతున్నాడు . " వశిష్ఠ మహామునీ! నా మనసులో పెద్ద సందేహమొకటి కలిగింది. దాన్ని మీకు తెలుపుతాను, దయతో సందేహాన్ని సశింపచేయండి. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పారు. పాతకములలో గొప్ప పాతకాలు చెప్పారు. ఐతే వర్ణ సంకర కారకములైన మహాపాపాలు చేసిన దుర్జనులు వేద వేదాలయందు చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మలవలననే దోషరహితులౌరని ధర్మ శాస్త్రములు పలుకగా మీరు చిన్న ధర్మముల వలనఏ పరిశుద్ధులౌదురని తదనంతరం హరిలోకానికి చేరుకుంటారనీ చెప్పినారేల? అది ఎలా సంభవించగలదు"

బ్రహ్మన్ బహూని పాపాని గురూణి వివిధానిచ !!
ప్రాయశ్చిత్తవిహీనాని కృత్వాయాంతికథంహరిం
జ్ఞాత్వాసర్వాణ్యనంతాని పాతకాని నరఃక్వచిత్!!
దిష్ట్యోపలబ్ధధర్మేణ కథంయాంతి హరెఃపదం
మహావజ్రనగంకించి న్నఖాగ్రేణమదోయధా!!
కశ్చూర్ణీకురుతె విప్రనకదాచిత్తధాప్యయం
స్వయంగృహాంతరేస్థిత్వాహ్యగ్నౌదత్వాభ్యమజ్ఞనత్!!
జ్వలమ్తమగ్నిమజ్ఞోసి నాచమ్యేచ్చులకోదకాత్
మహానదీప్రవాహేతు స్వయంగత్వాతతః పునః!!
తృణసంగ్రహణం కృత్వా తథాధారోభవేన్నచ
మహాదుర్గంసమారుహ్య తచ్ఛృంగాత్పతితోనరః!!
తదంతరాళతిలకాగ్రాహకేసభవేత్సుఖం
గురుందుష్కృతమాశ్రిత్య హ్యల్పేనసుకృతేనచ!!
సకధంచవిముచ్యేత పాతకేనాత్యసంభవం
ఇదంమమసమాచక్ష్వ శ్రోతౄణాం విస్మయావహమ్!!
కార్తిక్యాంమాఘవైశాఖె ధర్మసూక్ష్మంత్వయోదితం
బహూనిపాతకాన్యేవ హ్యుదితానిత్వయామునె
తత్సర్వంవిలయంకుర్యాత్సోల్పెనైవచసాంప్రతం!!

తా! "హే బ్రహ్మన్! అనేక మహాపాతకాలు చేసి ప్రాయశ్చిత్తములను చేసుకోకుండా ఎలా హరిలోకవాసులవగలరు? అనంతమైన పాతకాలు చేసి పాపాలు అతి దారుణమైనవని తెలిసీ వీటికి ప్రాయశ్చిత్తాలు చేయించుకోవాలని తెలిసీ అలా చేయక దైవ వశం చేత సంభవిమ్చిన కార్తీక దీపదానాదు పుణ్యములవల వైకుంఠానికి పోవడం ఎలా సంభవిస్తుంది?" అని అడుగుతూ స్వల్ప పుణ్యంచేత అధిక పాపములు నశించడం అనే విషయంలో దృష్టాంతములను చూపుతూ "గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలవల్ల ఖండింపబడని వజ్రపర్వతముని గోటి చివరిభాగము చూర్ణము చేయుటకు శక్యమవుతుందా? తాను ఇంట్లో ఉండి ఇంటి చుట్టూ, పైన నిప్పు పెట్టి కాలిపోతున్న ఇంటి మధ్యలో ఉండి చేతిలో పురిశెడునీళ్ళు తీసుకొని మహాగ్నిమీద చల్లినంత ఆఅగ్ని ఆగునా? మహానదీ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ గడ్డిపరకను ఆధారంగా చేసుకొని ఒడ్డును చేరుకోగలడా? ఎవరైనా అతి గొప్పనైన పర్వతాన్నెక్కి అక్కడనుంచి క్రిందకి దూకి దారిలో చిన్న లతావితానాంలోని తీగను పట్టుకొని క్రింద పడకుండా ఆగగలరా? ఇలాంటివాటిని చూస్తే అధికమైన మహా ఘోరములైన పాపాలు చేసి స్వల్ప పుణ్యముచేత వాటిని నశింపచేయడం ఎలా వీలౌతుంది? సంశయాన్ని నాకు నశింపచేయవలసింది. నాకేగాదు వివరం వింటున్నవారందరికీ కలిగే సందేహాన్ని నివృత్తి జేయండి! కార్తీక, మాఘ, వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయును అని మీరు చెప్పారు అది ఎలా సిద్ధిస్తుందో తెలుపగలరు."


శ్రీ సూత ఉవాచ
ఇతిభూపనచశ్శ్రుత్వా మందస్మేరముఖాంబుహః
ఇదమాహప్రహృష్టాత్మా రాజానంవిస్మయాన్వితం!!

తా! శ్రీ సూతమహర్షి  ఇలా చెప్తున్ణారు ప్రకారంగా రాజు మాటవిని, వసిష్ఠ మునీంద్రుడు చిరునవ్వునవ్వి సంతోషంతో స్వల్పపుణ్యంచేత గొప్పపాపాలెలా నశించును అని ఆశ్చర్యంతో ఉన్న రాజులతో ఇలా పలికెను..

శ్రీ వసిష్ఠ ఉవాచ
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి సాధు సాధువిమర్శనం
మయాప్యాలోకితంసర్వం వేదశాస్త్రవిచారణం!!
తత్రధర్మాహ్య సంఖ్యాతాబహుసూక్ష్మతరానృప
దృశ్యం తెహం ప్రవక్ష్యామి త్వంమాకుర్వత్రసంశయం!!
గుణత్రయాన్వితాధర్మాం రాజన్ శాస్త్రేష్వవస్థితాః
సత్వంరజస్తమఇతి గుణాః ప్రకృతిసంభవాః!!
యోధర్మస్సత్వమాలంబ్యాత్తంసూక్ష్మంకవయోవిదుః
ప్రాయశ్చిత్తాన్య శేషాణి తవః కర్మాన్వితానివై!!
రజోన్వితాని రాజేంద్ర భూయోజన్మప్రదానిచ
ఇదంకృతాకృతఫలం యద్ధర్మంప్రోచ్యతెబుధైః
తద్ధర్మంతామసంప్రాహుర్నిష్ఫలంపృథివీపతె!!
తా! వసిష్ఠమహర్శి జనక మహారాజుతో ఇలా పలికెను " రాజా విను! చాలా మంచి విమర్శ చేసినావు. నేనుగూడా ఇలా విచారించి వేదశాస్త్రపురాణాలను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసింది. అలాంటి సూక్ష్మధర్మములు ఎంత పనైనా చేయగల సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యాలు కూడా స్వల్పమైపోతాయి. ఒకప్పుడు స్వల్పపుణ్యాలు కూడా అధిక ఫలప్రదమౌతాయి. విషయంలో సందేహం పొందవద్దు. ఇంకా వివరం చెప్తాను సావధానంగా వినండి. అలా భేదమెందుకంటే ధర్మములు గుణత్రయంతో కూడుకొనడంవల్ల స్వల్పములు అధికములు అవుతాయి. సత్వ, రజస్, తామసములని మూడు గుణములు. మూడు ప్రకృతివలన కలిగినవి, ప్రకృతి అంటే మూల ప్రకృతి అని తెలియగలరు. అందులో సత్వము వలన చేయబడిన ధర్మాన్ని సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీ తపస్సు కర్మకాండమంతా రజోగుణమువలన కలిగినవి, తమోగుణమువలన చేసిన ధర్మములన్నీ తామసమనబడును ఇవి నిష్ఫలములు."

తస్మాత్సాత్వికధర్మంతు తే సూక్ష్మంకధితంమయా
లేశంవాజాయతేరాజన్ సమృద్ధిఃకాలయోగతః!!
దేశ కాలేయద్దాన మపాత్రేప్రతిపాదితం
విధిహీనమంత్రంచ ధర్మంతత్తామసంవిదుః!!
కాలదేశంసవిజ్ఞాయ ధర్మంయఃకురుతెనృప
తదక్షయఫలంప్రోక్తం ముక్తి హేతుర్నసంశయః!!
యదాధికంవాస్తోకంవా కాలం విజ్ఞాయమానవః
విచారితార్థంకుర్వీత గహనాకర్మపద్ధతిః!!
లభంతేతేనసౌఖ్యాని దుర్లభానిమహీపతే
జ్ఞానేనాప్యధవాజ్ఞానా త్కాలేదేశేచదైవతః
కరోతిఫలమక్షయ్యం జాయతెనాత్రసంశయః!!
కాష్ఠభారాన్ సమాదాయ సన్నివేశ్యనగోపమాన్
తత్రగుంజాఫలంమాత్రమగ్నింనిక్షిప్యతాన్ దహేత్!!
గృహెసంతమసెవ్యాప్తె దీపేనాల్పేనయాద్యుతిః
తమిస్రంవినిహంత్యాశుధర్మోల్పోవాధవానృప!!
యథాకర్తమనీరేతు స్నాత్వాభూయోతినిర్మలే
జలేస్నానేన రాజేంద్ర నిర్మలోజాయతెతథా!!
తా! ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మాన్ని సూక్ష్మమని నీకు చెప్పాను అది కొంచమైనా కాలయోగమువలన వృద్ధి చెందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు, మూడు విధాల యోగ్యతను విచారించక విధి రహితంగా మంత్రరహితంగా చేయు దానాదులు తామసముతో కూడినవి. ఇవి అంత గొప్పనైన పాపనాశక సామర్థ్యము కలది కాదు. దేశకాల పాత్రతలను విచారించి చేసిన ధర్మం అక్షయమై మోక్షహేతువౌతాయి. ధర్మము అధికమో స్వల్పమో కాలాన్నిబట్టి విచారించి నిశ్చయించికోవాలి. కర్మపద్ధతి దిర్విజ్ఞేయము అనగా కర్మ సరణి ఇలాంటిని అని నిర్ణయించుటకు క్లిష్టమైనది. అలా దేశకాల విచారణ చేసి చేసిన ధర్మము వలన సుఖము పొందుతారు. కాబట్టి జ్ఞానముచేతగానీ, అజ్ఞానము చేతగానీ దేశకాలపాత్రత విచారణ చేసి చేసిన ధర్మము అక్షయఫలమునిచ్చును ఇందుకో సందేహంలేదు. అల్పముణ్యం చేత అధిక పాపాలు నశించటంలో దృష్టాంతములు చూపబడుతున్నవి చూడుము. పర్వతమంత ఎత్తులో కట్టెలు పేర్చి అందులో గురువిందగింజ అంత చిన్న అగ్నిహోత్రాన్ని ఉంచితే కట్టెలన్నీ భస్మరాశిగా మారటంలేదా? ఇల్లంతా చీకటిగా ఉంటే అతి చిన్న దీపము వెలుగు ఇల్లంతా ప్రసరించి చీకట్లను తొలగతోయట్లేదా? చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంత స్నానం చేసినా పోని మురికి కొంత స్వచ్చమైన నీటిలో స్నానం చేసినంత మురికి పోవట్లేదా?

అల్పంవాయేనకేనాపి హ్యజ్ఞానేనాథవాసకృత్
నామసంకీర్తనాద్విష్ణోఃదహ్యతెబహుపాతకాః!!
విష్ణుసంకీర్తనంరాజన్ కీర్తయేజ్ఞానమోహితః
క్షయత్యఘంమహదపి వేణుగుల్మమివానలః!!
పురాకశ్చిద్దురాచారో విప్రసూనురజామిళః
దాసీపతిఃక్రూరకర్మా దాసీసంసర్గలాలసః!!
కన్యాకుబ్జెసత్వనిష్ఠో నామ్నా వై సబహుశ్రుతః
తస్యభార్యాధర్మవతీ సాధ్వీపతిపరాయణా
తస్యచాంతరితెకాలే సంజాతోజామిళస్తదా!!
పూర్వకర్మానురోధేన సోభవత్ప్రాప్తయైవనః
కస్యచిద్ద్విజముఖ్యస్య దుర్మార్గస్యచభూమిప!!
గృహదాసీపతిశ్చాసీత్ పూర్వకర్మానుబంధతః
మాతరంపితరంహిత్వా మదనావేశమోహితః!!
తయాసమంసతన్వంగ్యా పానభోజనభక్షణైః
కామశాస్త్రకలాపైశ్చపరిరంభణచుంబనైః!!
అజామిళస్తయా దాస్యా రేమేకామవిమోహితః
సర్వకర్మాణి సంత్యజ్య వేద శాస్త్రోదితానచ!!
తా! తెలిసి కానీ, తెలియకకానీ చేసిన పాపాపు అధికమైనా స్వల్పమైనా హరినామ సంకీర్తనవలన నశిస్తాయి. మహిమ తెలియక చేయబడినదైనా హరినామ సంకీర్తనచే పాపాలు అగ్ని అంటుకున్న దూదిపింజవలె కాలిపోతాయి. పైన చెప్పిన విషయమై ఒక గాథను చెప్పెదను వినుము ఒకానొక కాలంలో కన్యాకుబ్జమునందు వేదవేదాంగ పారంగతుడు సత్యనిష్ఠుడు ఐనఒక బ్రాహ్మణుడుకలడు, అతనికి పతివ్రతయు ధర్మాత్మురాలు ఐన భార్య కలదు. వారిద్దరికీ చిరకాలానికి ఒక కొడుకు పుట్టెను. అతనికి వారు అజామీళుడని నామకరణం చేసిరి. అజామీళుడు పెరికి పెద్దవాడైన తరవాత విధివశాత్ దురాచారుడై దాసీభర్తయై, హింసామార్గమున ఆర్జిస్తూ, నిత్యమూ దాసీ సాంగత్యమునందు ఆసక్తి కలవాడై ఉండెను. అటువంటి వాడు తెలియక చేసిన స్వల్ప పుణ్యం చేత అనగా హరినామ సంకీర్తనం వల్ల తరించెను.
అజామీళుని జీవన విధానమెలాంటిదనిన అజామీళుడు  యౌవనములోకి రాగానే ఒక దుర్మార్గ ఆలోచనతో దాసీతో సంగము చేసి దానియందే ఆసక్తుడై తల్లి దండ్రులను విడిచి కామాతురుడై దాసీతోనే జీవనము సాగిస్తూ వైదిక కర్మలను వదిలి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాదికామకర్మలందు అమితాసక్తి క్లవాడై ఆదాసీతీనే నిరంతరము గడుపుచుండెను.

చక్రుర్నిష్కాసయాంతత్ర తంతదాబాంధవాఃపరే
పరిత్యజ్య తతోలజ్జాం విప్రసూనుస్సపావధీః!!
తస్మిన్నేవాంత్యజభువం ప్రాప్యతత్సద్మచాశ్రితః
పశుపక్షిమృగాదీనాం హన్త్వాతన్మాంసజీవనః!!
శ్వవాగురికసంయుక్తో వనేహింసాపరాయణః
దాస్యామంచచారాసౌ వనేదుష్టమృగాకులేః!!
కదాచిత్సాలవృక్షేసా మధుదృష్ట్వారుహన్నృప
భగ్న శాఖా2వతద్భూమౌ మరణం సముపాగతా!!
అజామిళస్తతోదృష్ట్వా రాజన్ ప్రాణధనేశ్వరీం
స్వపురస్థ్సాప్యబహుధా విలలాపాకులేంద్రియః
గిరిర్గతె మహారాజన్ తాంవిసృజ్యగృహంగతః!!
తా! అజామిళుడు కులాచారభ్రష్టుడైనందున అతని బంధువులందరూ అతనిని ఇంటినుంచి వెళ్ళగొట్టగా, వూరిలోనే ఒక చండాలుని పంచనజేరి అతని ఇంట్లో నివాసముంటూ నిత్యమూ తన ప్రియురాలైన దాసితో కూడి కుక్కలకు ఉచ్చులు వేసి మృగాలను వేటాడేవారిని వెంటబెట్టుకొని అడవికి వెళ్ళి పశు పక్షాదులను, మృగాలను చంపి వాటి మాంసాన్ని భుజిస్తూ కాలం వెళ్ళదీయసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు దాసీది తాగడానికని తాటి చెట్టుఎక్కి ప్రమాదవశాత్తు క్రిందపడి మరణించింది. అది చూసిన అజామీళుడు తనప్రాణం కంటే మిన్న ఐన తన ప్రియురాలు చనిపోవటం చూసి రోదించాడు. ఆశవాన్ని తీసుకొని కొండమీదనుంచి లోయలోకి విసిరి ఇంటికి వెళ్ళిపోయాడు.

తతస్తస్యాన్సుతాతన్వీనురూపాప్రాప్తయౌవనా
తాందృష్ట్వాసచపాపాత్మా తయా రేమెచిరంనృప!!
తస్మాత్సాసుషువేరాజన్ పుత్రాన్ కాలేచవైనృప
క్షీణాయుషోగతాస్సర్వే కనిష్ఠశ్చావశేషితః!!
నారాయణాభిధానంచ చక్రెయుక్తోత్రవర్ణకైః
తిష్ఠన్గచ్చన్ పిబన్ భుంజన్ పర్యటన్ ప్రస్వదన్ సదా
పుత్రపాశేనసంబంద్ధస్తన్నామగ్రహణాతురః!!
తా! అజామిళుడు తరవాత యవ్వనవంతురాలైన దాసి కూతురిని చూసి పాపాత్ముడగుడచే ప్రియురాలి పుత్రిక తన పుత్రిక అనే  నీతిని విడిచి దానితోకూడా చాలాకాలము క్రీడిస్తూ గడిపెను. ఆ దాసీ కూతురుయందు అజామిళునకు కొందరు కొడుకులు పుట్టి మరణించిరి అందులో చిన్నవాడు మాత్రమే బ్రతికెను. అతనికి పూర్వపుణ్య ఫలమున "నారాయణ" అను నామకరణము చేసి వల్లమాలిన ప్రేమతో ఆ అజామిళుడు నడుస్తూ, తిరిగుతూ, తింటూ ఏ పని చేసినా పుత్రప్రేమతో నిరంతరము అతని కొడుకు నామ (నారాయణ) స్మరణ చేయసాగెను.

తతః కాలెసమాయాతె మరణె సముపస్థితె
తన్నేతుమాగతారాజన్ యసుదూతాభయంకరాః
రక్తశ్మశ్రుముఖాలోష్ట దండహస్తాసిపాణయః!!
తాన్ దృష్ట్వాభయసంత్రస్త మాత్మానంనేతుమాగతాన్
ఉవాచవాక్యమేతచ్చపుత్రస్నేహపరివుతః!
దూరేక్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం
ద్రావితేన స్వరేణోచైరాజుహావాకులేంద్రియః!!
శ్రుత్వాతన్మ్రియమాణస్య వదనాద్విష్ణుకీర్తనం
తేవిచింత్యతతోదూరం జాతకంపాస్థ్సితానృప!!
తదాజగ్ముర్విమానస్థా విష్ణుదూతాన్సుతేజసః
యమప్రేష్యాన్ విష్ణుదూతా వారయామాసురోజసా
అస్మాకంవశగోయంచ ఊచుస్తే యమకింకరాన్!!
తా! తరవాత కొంతకాలానికి అజామిళునకు కాలవశాత్ మరణము సమీపించినది. అతని జీవుని కొనిపోవుటకుగానూ ఎఱ్ఱని మీసములు, గడ్డములు కలిగి, చేతులలో దండములను, రాళ్ళను, కత్తులను పట్టుకొన్న భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను తీసుకొనిపోవ వచ్చిన యమదూతుఅలను చూసి భయపడి పుత్రప్రేమచేత దూరంగా ఆడుకుంటున్న కొడుకుని చూసి భయంతో ఓ నారాయణా నారాయణా అని పిలువసాగెను. దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనము మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు వచ్చుటకు సందేహించి దూరంగా పోయి భయంతో చూచుచుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయీ యమదూతలారా అజామిళుడు మావాడుకానీ, మీవాడు కాదు అని పలికిరి.

తే సర్వేవిష్ణుపద్రాజన్ పద్మపత్రాయతేక్షణాః
పీతాంబరధరా ముఖ్యాస్సర్వేపుష్కరమాలినః!!
కిరీటినః కుండలినః చారు స్రగ్వన్త్రభూషణాః
చతుర్భుజాశ్చారు రూపా శ్శంఖచక్రభుజశ్రియః!!
దేశం సుమిశ్రితాలోకాన్ కుర్వంతస్స్వేనతేజసా
దృష్ట్వాచ విష్ణుదూతాస్తే మాయావాక్యం సమబ్రువన్
యూయంహిఉతదేవావా కిన్న రాసిద్ధచారిణాః!!
ఇతితేషాంవచశ్శ్రుత్వాతాననాదృత్యపుష్పకే
అజామిళంసన్నివేశ్యగంతుకామావచోబ్రువన్!!
తా! రాజా! ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాల నేత్రములు కలవారు, పచ్చని పట్టుపీతాంబరములు ధరించి, పద్మ మాలాలంకృతులై, కిరీటములను ధరించి, కుండలధారులై, మంచి మాలికలు అమోఘ వస్త్రములు ఆభరణములు కలవారై నాలుగు చేతులు కలిగి సుందరదేహులై శంఖచక్రములను ధరించి తమ కాంతి చేత ఆ ప్రదేశమంతా ప్రకాశింపచేసేవారైరి. ఇటువంటి తేజోవంతులైన విష్ణుదూతలను చూసి యమదూతలిట్లడిగిరి. " మీరెవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? " అంత యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పక విమానములో ఎక్కించుకొని తమలోకమునకు పోవడానికి బయలుదేరుతూ ఇట్లు పలికిరి.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె అష్టమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
~~~~~~~~~~~~~~~~~~~~~~ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN.