Pages

Wednesday, February 13, 2013

ప్రారబ్దం

ప్రారబ్దం అనుభవంలోకి రావడం గూర్చి ఒక చిన్న విషయం,
ప్రారబ్ద వశాత్ ఒక వ్యక్తికి ఒక నాడు విపరీతమైన రక్తస్రావము జరిగి హాస్పిటల్ మంచంమీద పడడం రాసి ఉన్నది అనుక్కుందాం, అది రెండు విధాలుగా అనుభవంలోకి రాగలదు.
౧) ఏధోవిధంగా దెబ్బతగిలి శరీరభాగం తెగి/కోసుకొని రక్తం కారిపోయి హాస్పటల్ లో జాయిన్ అయ్యి హాస్పటల్ మంచంమీదపడి అక్కడి వారిచే వైద్యసేవలు పొంది తగ్గాక ఇంటికెళ్ళవచ్చు.
౨) అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసిన రోగికి అవసరమైన రక్తంకావలసి వచ్చి, సదరు వ్యక్తి హాస్పటల్ కి వెళ్ళి తనంత తానుగా హాస్పటల్ మంచం ఎక్కి రక్తం ఇచ్చి కాసేపు హాస్పటల్ బెడ్ మీద ఉండి అక్కడి వారిచే కొద్ది వైద్య సేవలు పొంది తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఐతే, రెండవ విషయానికి మన ప్రారబ్దం అని బాధ ఉండదు పైగా ఉత్సాహం, ఆనందమూ కలగవచ్చు, కానీ ఇదీ ప్రారబ్దమే అని గుర్తించం. మొదటి విషయంలోనే ప్రారబ్దం అనుక్కుంటాం ఎందుకంటే అది ఎక్కువ బాధ. అసలు ప్రారబ్దమంతా ఈ జీవితాన్ని పొందటమే. రమణులు చెప్పినట్లు ఇదే ఒక పుండు, దీనికి పుళ్ళూపుట్టచ్చు, నొప్పీవేయచ్చు, కండూతితో సుఖమూ అనిపించవచ్చు.
జీవితంలోని విషయాలను పరిశీలిస్తే జాగ్రత్తగా ఈ విధంగా అన్వయమవుతాయి ఒకసారి తరచి చూసుకుంటే.

No comments:

Post a Comment