Pages

Friday, February 1, 2013

అవును అది సీతాచరితం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ప్రపంచ వాజ్ఞ్మయంలోనే ప్రసిద్ధిగాంచినది, వేద శాస్త్రముల సారమై, భగవంతుడు రాముడుగా నడయాడగా, వేదము ఆయన నడతగా వచ్చినది అదే రామాయణమన్న పేర వెలుగొందింది.
అసలు రామాయణం పేరు రామాయణమేనా? అసలు పేరు 'సీతాయాశ్చరితం మహత్అని మహర్షి వాల్మీకి పెట్టుకున్నపేరు. అవును ఇది  సీతాచరితము. అని వాల్మీకి మహర్షి పొంగిపోయి పెట్టుకున్నపేరు. ఈ కావ్యమునకే అనంతరం వచ్చిన కవులు శ్రీరాముని పేరు సీతమ్మపేరు కలిసి ఉండేలా శ్రీ రామాయణం అని పెట్టారు అదే ప్రచారంలోకొచ్చింది. రామ+ఆయణం లేదా రామా+ఆయణం, రామ అంటే శ్రీ రాముడు, రామా అంటే సీతమ్మ.

వాల్మీకి మహర్షి తన కావ్యంలో సీతామాత పక్షాన్నే ఎక్కువ వర్ణించారు, అమ్మ చారిత్రాన్నీ, నడువడినీ, అమ్మ మాటలనే అమృతబిందువులు ఎక్కడ తొణికిపోతాయో అన్నంత జాగ్రత్తగా అమ్మ పలికిన పలుకులు, సందేశాలు ఇత్యాది అనేకం. ఒకానొక కవి అంటాడు వాల్మీకి సీతమ్మను వర్ణిస్తూ వర్ణిస్తూ ఆయనే ద్రవించిపోయివుంటాడు. వాల్మీకి రామాయణంలో సీతమ్మను పక్కనబెడితే ఏమీ ఉండదు. ఆది కావ్యానికి 'స్త్రీ' పేరు పెట్టబడింది, ఆ ఇతిహాసం మొత్తం సీతమ్మ చుట్టూ పరిభ్రమించింది. ( ఏ ఒకటో రెండో సంఘటనలు చూసి నేడు ఆవాదం ఈవాదం అనేవారు.. దీన్ని గుర్తించి మాట్లాడడం ఆవశ్యకం) అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ మా సీతమ్మ సనాతన ధర్మంలో చరించే ప్రతీ సాధ్వీలలామకూ ప్రతిరూపం.

పురుషుడికి తాను పుట్టిన వంశాన్ని ఉద్ధరించే అవకాశముంది. స్త్రీ తన నడవడి చేత పుట్టిన వంశానికీ, అటు మెట్టిన వంశానికీ ఉద్ధరణహేతువు. సీతమ్మ తాను పుట్టిన విదేహ వంశానికీ, మెట్టిన ఇక్ష్వాకు వంశానికీ కీర్తి తెచ్చిపెట్టింది.

మాఅయ్య రామయ్య కళ్ళు అప్పుడప్పుడూ ఎఱ్ఱజీరతో ఉన్నా, మాయమ్మ కళ్ళు ఎప్పుడూ నలుపే, చలువే................

No comments:

Post a Comment