Pages

Friday, December 19, 2014

దేయం దీనజనాయ చ విత్తమ్


శ్రీ గురుభ్యోనమః
గేయం గీతా’ 
నామ సహస్రం’ 
ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్’ 
నేయం సజ్జన సంగే చిత్తం’ 
దేయం దీనజనాయ చ విత్తమ్’


          కొందరి పైత్యం విపరీతంగా పెరిగినట్లుంది. ఒకడు దేవుడికి అభిషేకం ఎందుకంటాదు, పూజెందుకంటాడు, మరోడు ప్రసాదంలో చాలా ప్రొటీన్స్ ఉంటాయి అందుకే అందరికీ గుళ్లో పంచేవారంటాడు, మరోడు ఇవన్నీ ఎందుకు జనాలకి సేవ చేస్తే చాలు ఇవన్నీ ట్రాష్ అంటాడు. తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాలని గాలికొదిలేసినోడుకూడా గొప్ప ఫిలాసఫర్లా కవుర్లు చెప్పేవోడే. సినిమా డైలాగులు చెప్పేవాడోడు. ఎక్కడలేని సొంత పైత్యమూ ప్రదర్శించి ఆధ్యాత్మికత మీద తమ భావదారిద్ర్యాన్ని అంటగట్టడానికి రెడీగా ఉంటారు కొందరు. గట్టిగా వాడి మంచికోసం రెండు మందలింపు మాటలు మాట్లాడితే ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయండీ యు కెన్నాట్ ఫోర్స్ అంటాడు, ఆమాత్రందానికి తెలీందాంట్లో తలపెట్టి సోదెందుకూ? ఇట్స్ కామన్సెన్స్, షుడ్ కంపేర్ ఆపిల్ టు ఆపిల్, కార్నర్ ఐనప్పుడు మాత్రమే గుర్తొచ్చే నీ వ్యక్తిగత రీజన్స్ నీకుంటే సమిష్టిగతమైన విషయం మీద కామెంట్ చేసే హక్కు నీకెక్కడిది?

          వాడెవడో అప్రాచ్యపు వాడు వచ్చి సేవ గొప్ప అని మనకి చెప్పక్కర్లేదు. సేవొక్కటే గొప్పైతే సేవ చేయలేని స్థితిలో ఉన్నవాడి గతేంటి? సేవ చేసినవాడు గొప్పవాడు చేయలేనివాడు వేస్ట్ ఫెల్లో అనా వాడర్థం. ఇది సనాతన ధర్మం సార్వభౌమికం అన్ని భూమికలలోని వారినీ ఉద్ధరించేది తప్ప ఏ ఒక్కణ్ణోమాత్రమే కాదు, ఈ మార్గం అనుష్టించేది మాత్రమే, సోది చెప్పి తప్పిచ్చుకునేవి బోల్డు. ఏ సుకర్మైనా చెయ్ అన్ని మార్గాలూ ఇందులో చెప్పినవే... ఉద్ధరింపబడతావ్..

గేయం గీతా, నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్,
నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీనజనాయ చ విత్తమ్’

          ఈ ధర్మంలో చెప్పిన సుకర్మ ఏ ఒక్కటి పట్టుకున్నా ఉద్ధరింపబడతావు. వద్దనుక్కున్నా ఏదో ఒకనాటికి ఇందులో చెప్పిన ఏ ఒక్కదాన్నో తెలిసో తెలీకో పట్టుకుని ఉద్ధరింపబడతావు. పూజలు చేస్తే ఏమొస్తుంది, ముక్కు మూసుకుంటే ఏమొస్తుంది సేవ చేయండి వాళ్ళకి పంచండి వీళ్ళకి పంచండి అని ఎవడో వచ్చి చెప్తే తెలుసుకు ఆచరించే స్థితిలో భారతీయత లేదు. ఉన్నదాంట్లో పదుగురికి పంచడం పంచుకుని తినడం మా రక్తంలో ఉంది. ప్రపంచ దేశాలని కబళించి సొమ్ములెత్తుకెళ్లి మళ్ళీ సేవ చేస్తున్నామనే ముసుగులో ఆ దేశంలోవాళ్ళకే బిచ్చమిచ్చి వాళ్ళ సంస్కృతిని మింగాలని చూసే మొసలి క్రౌర్యం లేదు ఈ జాతికి..

-శంకర కింకర...

          సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు...

Thursday, December 18, 2014

मैत्रीं भजतां अखिल हृज्जेत्रीं - మైత్రీం భజతాం అఖిల హృజ్జేత్రీం....

Sri GurubhyonamaH
This was written by chandra shekarendra saraswati swamy and sung by M.S.Subbulakshmi in UN, This was the peace message sent to the world by the Great Seer. In my view every one of us should read and remember this.....

मैत्रीं भजतां अखिल हृज्जेत्रीं
आत्मावदेव परानपि पश्यत
युद्धां त्यजता स्पर्थां त्यजता
त्यजता परेश्व अक्रममाक्रमणं
మైత్రీం భజతాం అఖిల హృజ్జేత్రీం
ఆత్మావదేవ పరానపి పశ్యత
యుద్ధాం త్యజతా స్పర్థాం త్యజతా
త్యజతా పరేశ్వ అక్రమమాక్రమణం
Serve with Friendship and Humility, which will conquer the Hearts of Everyone. Look upon others similar to yourself. Renounce War Renounce unnecessary Competition for Power, Give up Aggression on others' properties which is wrong
తోటివారి పట్ల మైత్రిని పెంపొందించుకో, స్నేహంతో అందరి హృదయాలలోనూ నువ్వే నిండిపో, అందరిలోఉండే ఆత్మ ఒక్కటే అది నీలోనూ ఉన్నది నీలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది. వారు వేరే నువ్వు వేరే కాదు. అనవసర స్పర్థలు, వైరుధ్యాలు వద్ధు. యుద్ధాన్ని త్యజించు, స్పర్థలను త్యజించు, అక్రమమైన ఆక్రమణలను త్యజించు.

जननी पृथ्वीः कामदुघास्ते
जनको देवः सकल दयालुः
दाम्यत दत्ता दयध्वं जनता
श्रेयो भूयात् सकल जनानां
జననీ పృథ్వీః కామదుఘాస్తే
జనకో దేవః సకల దయాలుః
దామ్యత దత్తా దయధ్వం జనతా
శ్రేయో భూయాత్ సకల జనానాం
Mother Earth is wide enough and ready to give us all we desire like a Kaamadenu. God, Our Father, is very Compassionate to All, So, Restrain yourself, So, Donate your wealth to others, So, Be Kind to others, Oh People of the World, May All People of this World be Happy and Prosperous.

ఈ భూమి మన తల్లి, మన సమస్త కోర్కెలు తీర్చే కామధేనువు వంటిది. తల్లి కొరకు కొట్లాట వద్దు. ఆ దేవుడు మనందరికీ తండ్రి దయాళువు వారివురూ పరమ దయామూర్తులు. వారి పుత్రులమైన మనం కరుణనింపుకొని ఉండాలి. నీలో దయను పెంపొందించుకో, లోకములో జనులందరికీ శుభము కలగాలి, అందరూ క్షేమంగా ఉండాలి.
जय जय शन्कर - हर हर शन्कर
धर्मस्य जयॊश्तु - अधर्मस्य नशॊस्तु

(Listen to the song by clicking on below youtube link)




Tuesday, December 9, 2014

కలిదోషాలు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కాల విభాగంలో ప్రస్తుత కాలానికి అధిపతి కలిపురుషుడు. అతని లక్షణములు అతను పరిపాలించే విధంగానే ప్రజలకి ఫలితాలుంటాయి. అందుకే త్యాగశీలురైన శౌనకాది మహామునులు ఈ కలిదోషాలు ఎలా ఉంటాయో కొద్దిగా చెప్తూ దాని విముక్తి కలిగే మార్గం అంటే ఆ కలి పాలనలో కలిగే దోషాలు మానవులనంటకుండా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పమని శుక్రబ్రహ్మని కోరారు.

అలసులు, మందబుద్ధి యుతులల్పతరాయువులుగ్రరోగ సం
కలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యవి సేయజాలరీ 
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై 
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర! జెప్పవే!

కలియుగంలో జనులు ’మంద భాగ్యులు’ ’అల్పతర ఆయువులు’ అని ఏనాడో తెలియజేయబడింది. ఋషులచే రాబోయే కాలంలో వచ్చే రోగమూ తగు ఔషధమూ తెలియజేయబడ్డాయి. కానీ ఎం లాభం వారు చెప్పినట్లుగానే కలియుగంలో జనం అలసులు-సోమరులు, మందబుద్ధి కలవారు, సుకర్మములు చేయనివారు.. కాబట్టి ఫలితములు కూడా అలానే ఉంటాయి. ఉంటున్నాయి. ఔషధం ఒక్కటే మార్గం స్వధర్మాచరణము, విహిత కర్మాచరణము, ఉపాసన. పోయిన జన్మలో ఏ పాపఫలితాలని కూడ బెట్టుకున్నామో తెలీదు ఈ జన్మలోనూ తెలిసీ తెలీక ఎంతెంత పాపపుణ్యాలను మూటకట్టి నెత్తినెత్తుకుంటున్నామో తెలీదు. కనీసం భగవంతుని దగ్గర నిజాయితీగా ఉండడం నేర్చుకుంటే సగం ఇబ్బంది పోయినట్లే. కష్టం రావడం సాధారణం దాన్ని తట్టుకు నిలబడి దైవం పాదాలు, ధర్మమార్గం ఇంకా గట్టిగా పట్టుకోవడం రావాలి. అంత కృత యుగంలోనూ హరిశ్చంద్రుని కొడుకు లోహితుడు ప్రాణాలు వదిలాడు ఆయన తన ధర్మం తప్పలేదు. తిరిగి బతికాడు. అలాగే త్రేతా యుగంలోనూ అరవైవేల సగరులు మడిసిపోయారు ఐనా ఇక్ష్వాకులు ధర్మం తప్పలేదు కొన్ని అటువంటి కొన్ని లక్షల సంతానం పెట్టు భగీరథాదులు, స్వయం భగవానుడే రామాదులుగా నలుగురుగా వచ్చారు ఆ వంశంలో.

మొన్న మా చుట్టాలావిడతో మన సత్సంగం తరపున భద్రాచలంలో చేసుకున్న శ్రీరామ పట్టాభిషేకం గురించి మాట్లాడుతూ దాని నిర్వహణ ఇత్యాది వివరాలు అడుగుతూంటే ఒకటికి రెండు మార్లు ఆవిడతో ’కళ్యాణం ఏ జంటకాజంట లేదా కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు, అది వ్యక్తిగతోపాసనకి జీవబ్రహ్మైక్య సిద్ధికి తార్కాణం. కానీ పట్టాభిషేకం అందునా శ్రీరామ పట్టాభిషేకం సాంఘికంగా సామూహికంగా చేసుకోవాలి అందరూ కలిసి చేసుకోవాలి. శ్రీరాముల వారు ఏ ఒక్కరికో రాజు కాదు అందరికీ ఆయనే ప్రభువు అని పట్టాభిషేకం చేయాలి అని. స్వామి పట్టాభిషేకం చూసాక / చేసాక మనకి ఆయన ప్రభువు, మనం ఆయన రాజ్యంలోని వారం. అప్పుట్లో శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా అయోధ్యావాసులనెలా పాలించాడో మననీ అలాగే పాలించమని కోరుకోవాలి. కాదు కాదు ఆయన అలాగే మనకే కష్ట నష్టాలు రాకుండా  ఆయన చూసుకుంటాడు అన్న పూనిక ఆ పట్టాభిషేకంతోనే కలగాలి / కలుగుతుంది. అని చర్చసాగింది. అలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే సంపూర్ణ శక్తి లేకున్నా కనీసం శక్తికొలదీ ద్రవ్యం సమర్పించాలి లేకపోతే కనీస కాయిక సాయమో ఏదో ఒకటి చేయాలి. శ్రీరాముడే నాకు ప్రభువు అని గుర్తెరిగి ఆయన ప్రభువుగా ఉండగా ఆయన బాధపడకుండా ఉండేలా జీవించే జీవన విధానం మెల్లగా అలవర్చుకుంటే... మనం రాములవారివారమే అప్పుడు ఏ దోషం మననంటగలదు?

-శంకరకింకర

ఇక రెండో విషయం... చాలా మంది ఈ అన్వయంలో కొంత పొరపాటు లేదా తొట్రుపాటు పడుతున్నట్లు తోస్తున్నది. కలిలో నామ స్మరణం తేలిక. అంటే అదొక్కటే చేసి వైదికమైన విహిత కర్మాచరణలు వదలమని కాదు. అటువంటి విహిత కర్మాచరణలు ఉపాసనా పద్ధతులు, యజ్ఞయాగాదులు వదలమని కాదు వేదం చెప్పిన రీతిలో ఇవి జరుగుతూనే ఉండాలి. కలిలో బ్రహ్మగారికి ఆలయం ప్రత్యేక పూజ లేదు అని పురాణోక్తి. నాలుగు ముఖాలతో వేదం చదివే బ్రహ్మాగారిని పూజించడమే వేదాధ్యయనం, వేద విహితంగా జీవించడం. దాని అసలు అన్వయమేమంటే కలి దోషం వల్ల వేద అధ్యయనము, స్వాధ్యాయము, వేదం చెప్పినదానికి వ్యతిరిక్తంగా చెప్పడం, వేదం వద్దన్నదాన్ని చేయడం సనాతన ధర్మానికి మూల స్థంభాలైన వర్ణాశ్రమ ధర్మాలని కాలరాయాలని చూడడం. ధర్మసోపానాలని పునాదులతో పెకిలించాలనుక్కోవడం. వేద తిరస్కరణమే బ్రహ్మగారిని పూజించకపోవడం. వేదం చదువుకునే అవకాశం అధికారం లేకపోతే వేద పండితులని శక్తిమేరకు సత్కరించాలి లేదా కనీసం నమస్కరిస్తే చాలు వాళ్ళకి ఏవో కానుకలివ్వాలి అని కాదు. అధికారంలేకపోయినా వేదమంత్రాలను అనుష్టించడం కూడని పని. కానీ వేదార్థం తెలుసుకొని తదనుగుణంగా జీవించాలి. అవి అందించడానికి రాముడిగా వచ్చాడు, పురాణ రూపంలో వ్యాసుడందించాడు. 

వేదాధికారం లేనివారు వారికి విధింపబడ్డ విధి నిర్వహిస్తూ భగవన్నామం చేయాలి, వేదాధికారం ఉన్నవారు విహిత కర్మాచరణం చేసి తరవాత భగవన్నామాదులు చేయాలి తప్ప భగవన్నామొక్కటే చాలు మంత్రాలు ఉపాసనలు యజ్ఞాలు అఖ్ఖర్లేదని ఏ విహిత కర్మలని చేసే అవకాశం కర్తవ్యం ఉన్నవారు వదల కూడదు.

ఏదేమైనా శ్రీరాముడే మనకు ప్రభువుగా సర్వజగద్రక్షకుడుగా ఉండగా మన కష్ట నష్టాలన్నీ ఆయనవే అన్న ధృతికలిగి ఉండడం చాలా అవసరం..


సర్వం శ్రీ రామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు

-శంకరకింకర

Wednesday, December 3, 2014

బుర్రకేది తోస్తే అదే చర్చా విషయం...

        పూర్వం కొందరు రాక్షసులు బాగా మదమెక్కి ప్రతివాడిదగ్గరకెళ్ళి అరవ కేకలు పెట్ట యుద్ధానికి రమ్మని పిలువ రాకపోతే సాధుసన్యాసులను ఏడిపించను ఇదే పని. బలిష్టుడైతే కొడతారు బలహీనులైన తాపసులు ఇత్యాదులైతే మీ దేవుడు లేడు గీవుడులేడు అన్నీ నేనే అని వాళ్ళ మానాన వాళ్ళని ఉండనివ్వకుండా సాధు సన్యాసులని మానసికంగా నానా విధాల బాధపెట్టేటైపన్నమాట. మొత్తానికి ఎదుటివాడిని మానసికంగానో శారీరకంగానో గాయపరచడం వాళ్ళు బాధపడుతుంటే సంతోషించడం వంటి శాడిస్టు రాక్షసులన్నమాట. బ్రహ్మగారో వచ్చిఏంట్రా పనులంటే నా ఉపాధే అది కదా రాక్షసోపాధి ఏం చేయమంటావ్ అని అడగడం. ఏదో మళ్ళీ పెద్దలచేద మందలింపచేసుకొని కొత్త వరాలుపొంది బలిసి మళ్ళీ యుద్ధాలకెళ్ళడం అది పరిపాటి వీలైతే వారిని మార్చడానికి లేకపోతే సంహరించడానికి మళ్లీ భగవంతుడు అవతార స్వీకారం చేయడం మామూలే...

        పూర్వం త్రేతాయుగంలో వాలి, రావణుడు కుంభకర్ణుడు వరుసలో దుందుభి అనే ఒక రాక్షసుడుండేవాడుటవాడు పొద్దున్నే ఒక లిస్ట్ చూసుకునేవాడుట నాతో ఓడిపోని బలవంతుడెవడూ అని... ఎవరి పేరు లిస్టులో స్ట్రైక్ అవ్వకపోతే వాడి దగ్గరకెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవ వాణ్ని చితకబాదుడు మధ్యాహ్నం ఇంటికొచ్చి తిని తొంగోడం. ఇదే పని పాట అనవసర గొడవలంటే ఇవే దీనివల్ల వాడంటే అందరికీ హడల్ అన్నమాట. ఉత్తినే గొడవెట్టుకుంటాడెవడ్రాబాబూ వీడని తలట్టుకునేవారు. ఎందుకు వీడికి ఇలా అంటే ఏం కారణం ఉండదు కేవలం ఎవరేం చేస్తారు నన్ను అని కండకావరంతో బలిసి చేసే పనులన్నమాట. వాడికి పోయేకాలం దాపురించి ఒకసారి లిస్టులో వాలి పేరు కనపడింది కాలాంతరంలో వాలిచేతిలో ఒక్క గుద్దుకి చచ్చాడు.

ఇలాంటి వాళ్ళు మనకీ బోలెడు పొద్దున్నే కాఫీ తాగి పేపరు తీసి తిన్నదరక్క సనాతన ధర్మం మీద వివాదాస్పద వ్యాఖ్య చేస్తే ఎంత పబ్లిసిటీ వస్తుంది ఎన్ని లైకులు షేరులు వస్తాయి ఎన్ని కామెంట్లొస్తాయి అని వెతుక్కుని అలా వ్యాఖ్యలు చేయడం, చేసిన పని గొప్పదనిన్నీ, అంతకన్నా జీవితంలో చేయాల్సిన గొప్పపని లేదన్నట్టున్నూ, పైగా నాలెడ్జి షేరింగ్ అంటూ కలరింగిచ్చీ ఏదో విషయాన్ని వివాదం చేసి, చేయించి, ఏ రాక్షసుణ్ణి పొగిడి, దేవుణ్ణి చిన్నతనం చేస్తే (అవేవో కొన్ని ఎడం చేతివాటం పాత తెలుగు సినిమా పైత్యాలలాగా) ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది? అలా రాయొచ్చా లేదా, ఋషులేం చెప్పారు లెక్కేలేదు. ధుర్యోధనుడూ హీరోయే, రావణుడూ హీరోయే.. కొన్ని రోజులు పోతే ఈ అల్‍ఖైదా, ఐసిస్ తీవ్రవాదులూ హీరోలౌతారు. చూసారా ఆ ఒక్కటి తప్ప వాళ్ళలో ఎంత పట్టుదల ఉందీ అదీ మంచి గుణమని కావ్యాలు వ్రాసినా ఆశ్చర్యంలేదు.  రామ భక్తుడో, సాధు పురుషుడో మంచి చెప్పబోతే, మీరు చెప్పే వ్యాస వాల్మీకి రామాయణాది పురాణాలే ప్రమాణం కాదు అవి తప్పుల తడకలని రిటర్న్ కలరింగిచ్చి... అలా చేయడం  దాని మీద మా జన్మ హక్కు మాకు రాజ్యాంగమిచ్చిన హక్కు వగైరా కవుర్లు చెప్పి వితండవాదం చేసే బేచన్నమాట..... వీళ్ళెందుకు చేస్తారంటే ఏమీలేదు గొడవెట్టుకుంటే అదేదో సినిమాలో కిక్కేవేరప్పాటైపు.... నాలుగు తిట్లు తిట్టించుకుని, ఎవడో కడుపు మండినవాడు నాలుగు శాపనార్థాలు పెడితే (లోపలికో బయటికో) తప్ప తిన్నదరగని బేచ్ ఇది.... మన సినిమాల్లోను చాలా గొప్ప పేరున్న టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ట్విట్టర్ సెలెబ్రిటీ & శిష్య బృందం టైపు.... పుర్రెకెంతొస్తే ఏం తోస్తే అది వాగేటైపు...  ... మనసు రంజింపజేయరాదు అన్న సామెతలా..

        ఎప్పుడో అప్పుడు రావాణుడిలాంటి ఈ బ్యాచ్ కి వాలి లాంటోడు వాలి లాంటోడికి రామ సుగ్రీవులు తగుల్తారు, అప్పుడు వదుల్తుంది ......