Pages

Friday, November 22, 2013

ఆప్పడమొత్తి చూడు - అది తిని నప్పుడే నీ యాశ వీడు

భగవాన్ రమణ మహర్షుల తల్లి అళగమ్మగారు రమణులని అరుణాచలంలో కలిసి ఆయనతో పాటు అక్కడే నివసిస్తున్న కాలంలో చిన్నప్పుడు వేంకట రమణన్కి అప్పడాలు ఇష్టమని అప్పుడు కూడా తయారు చేసి పెడదామని అప్పడాలు దాచి ఆయనకి పెట్టారట/ పెడదామనుక్కున్నారట. అప్పుడు అప్పడం గూర్చి చమత్కారంగా తత్వాన్ని అన్వయిస్తూ రమణులు పాడిన తమిళ పాటకి తెలుగు తర్జుమాట పాట
పల్లవి!!
ఆప్పడ మొత్తి చూడు - అది తిని నప్పుడే నీ యాశ వీడు !!!!ఇప్పుడమియందున - నే మఱి తిఱుగక సద్బోధానందుడౌ సద్గురునాథుడు
చెప్పక చెప్పెడు తత్వమగు, సమము గొప్పది లేనట్టి యొక మాట చొప్పున !!!!
చరణములు
తానుగాని పంచ కోశక్షేత్రమునందు తానుగ పెరు గభిమాన మినుములను నేనెవ్వడను జ్ఞానవిచార తిరుగలిలో నేను గానని పగుల గొట్టి పిండియు జేసి !!!!
సత్సంగ మనియెడు నల్లేరు రసముతో శమదమములనెడు జీలక ఱ్ఱ మిరియములు ఉపరతి యనునట్టి యుప్పును గలిపి ద్వాసన యనియెడి యింగువను జేర్చి !!!!
రాతి చిత్తము నేను నేనని భ్రమయక
లో దృష్టి రోకటి తోను మానక దంచి
శాంతమౌ కొడుపుతో సమమగు పీటపై సంతత మలయక సంతసంబు తోడ !!!!
మౌనముద్ర యనెడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని చే గ్రాగు సద్బ్రహ్మఘృతమున నేనది యగునని నిత్యమును బేల్చి తను దానె భుజియంప దన్మయ మగునట్టి !!!!

No comments:

Post a Comment