Pages

Friday, November 8, 2013

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 06వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే షష్ఠోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఆరవ అధ్యాయం

వసిష్ఠ ఉవాచ!
యః కార్తికేమాసి రాజన్ స్నానం పంచామృతేనచ
కస్తూరీ గంధతోయేన విష్ణోరమితేజసః !!
యఃకుర్యాద్భక్తిభావేన మాసమేకంనిరంతరం
సోశ్వమేధాయుత ఫలం ప్రాప్యయాతిశుభాంగతిం!!
యేసాయాహ్నెహరేరగ్రె కార్తిక్యామవనీపతె
దీపదానంప్రకుర్వంతి తద్విష్ణోఃపరమంపదం!!
కార్తికెమాసి సంప్రాప్తె దీపదానం కరోతియః
సుజ్ఞానం ప్రాప్యవిమలం విష్ణోర్లోకమవాప్నుయాత్!!
తులాసంశోధ్యవిధినాపర్తింకృత్వాప్రయత్నతః
శాలిపిష్ఠేన తత్పాత్రం గోధూమేనాధవానృప!!
కార్తిక్యాంకారయేద్భక్త్యా ఘృతవర్తిసమన్వితం
ఘృతపూరితతత్పాత్రం వహ్నిజ్వాలానియోజితం
విప్రాయ వేదవిదుషే పూజ్యభక్త్యా ప్రదాపయేత్!!
తా! వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు మహారాజా! కార్తికమాసములో భక్తితో నెలంతా శ్రీ హరికి కస్తూరితోటి, గంధముతోటి, పంచామృతములతోటి స్నానము చేయించువారు పదివేల అశ్వమేధయాగముల ఫలాన్ని పొంది అంత్యమున ఉత్తమ గతులను పొందెదరు. కార్తికమాసమున సాయంకాలసమయంలో శ్రీ హరి సన్నిధిలో దీపదానమిచ్చువారు విష్ణులోకమును పొందెదరు. కార్తిక మాసంలో దీపదానం చేసినవారు జ్ఞానమును పొంది విష్ణులోకాన్ని పొందెదరు. కార్తీక మాసంలో పత్తిన చక్కగా ధూళి, నలుసులు లేకుండా విడతీసి వత్తిని చేసి, బియ్యపు పిండితో గాని గోధుమపిండితోగాని చేసిన ప్రమిదలో ఆవునేతిని పోసి వత్తిని తడిపి వెలిగించి ఉత్తమ బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలెను.

ఏవంక్రమేణ రాజేంద్ర మాసమేకం నిరంతరం
మాసాం తే రాజ తంపాత్రం వర్తింకృత్వాసువర్ణకం
శాలిపిష్టస్యమధ్యస్థం కృత్వాపూజ్యనివేదయేత్!!
బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాత్స్వయమేవతతఃపరం
మంత్రేణానేనరాజేంద్ర కుర్యాద్దాన మిదంశుభం!!
మంత్ర: సర్వజ్ఞానప్రదందీపం సర్వ సంపత్సుభావహం
          దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తుదామమ!!
ఏవంయంకురుతె రాజన్ నారీవాపురుషోపివా
కార్తికేమాసి రాజేంద్ర సోక్షయ్యంఫలమశ్నుతే!!
దీపదోలభతెవిద్యాం దీపదోలభతేశ్రుతం
దీపదోలభతెచాయుః దీపదోలభతెదివం!!
తా! ఇట్లు నెలంతా చేసి చివర్లో వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని చేయించి బియ్యపుపిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించినతరవాత బ్రాహ్మణ భోజనము గావించి తరవాత క్రింది మంత్రమును చెప్తూ దీపమును బ్రాహ్మణునకు దానము చేయవలెను (మంత్రము పైన ఇవ్వబడింది, దాని అర్థము ఇక్కడ పొందుపరచడమైనది) ."దీపము సర్వజ్ఞాన దాయకము, సమస్త సంపత్ప్రదాయకము, దీపమును నేను దానమిచ్చుచున్నాను, దీపదానమువల్ల నాకు నిరంతరము శాంతికలుగును గాక". లింగబేధములేక ఎవరైననూ ప్రకారంగా  కార్తీకమాసమందు ఆచరించిన అనంత ఫలము పొందెదరు. దీపంవలన జ్ఞానం కలుగును, దీపంవలన శృత్యాది శాస్త్రఫలము కలుగును, దీపదానమువలన ఆయుష్షును పొందును, దీపము వలన ఉన్నతలోకములకు పొందవచ్చును.

జ్ఞానాజ్ఞానకృతంపాపం మనోవాక్కాయ కర్మభిః
కార్తికేదీపదానేన విలయంయాతితత్క్షణాత్!!
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి పురావృత్తంమనోహరం!!
పురాద్రావిడ దేశేతు అంగనాకాచిదప్యభూత్
సుతబంధువిహీనాసా సదాభిక్షాన్నజీవినీ!!
నసంస్కృతాన్నమల్పంచ భుక్తంపర్యుషితాశనా
పరపాకరతానిత్యం నిత్యం కుట్టణపేషణీ
క్రయవిక్రయణీరాజన్ ఆర్జితాభుక్తశేషతః!!
నద్యాతం విష్ణుపాదాబ్జం నశ్రుతాహరిసత్కథా
నగతాపుణ్యతీర్థాని నోపోష్యంవిష్ణువాసరె!!
ద్రవ్యంనానావిధంభూప సంచితంబహుళంతయా
నచోపకారంనోదానం నకృతంస్వాత్మభోజనం!!
తా! కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత తెలిసిగానీ తెలియకగానీ చేయబడిన పాపములు నశించును. విషయమై పూర్వమొక కథ గలదు. వినుము, పూర్వము ద్రావిడదేశమందు సుతులు కానీ, బంధువులు కానీ లేని ఒక స్త్రీ కలదు, స్త్రీ నిత్యము భిక్షమెత్తుకొనిన అన్నము తినునది. ఎప్పుడూ దూషితాన్నమునే భుజించెడిది, పరిశుభ్రమైన అన్నము తినునది కాదు. చద్ది అన్నముని తిని రోజూ ఇతరలవద్ద ధనము పుచ్చుకొని వారికి వంట చేయుట, బట్టలు కుట్టుట, రుబ్బుట నూరుట వంటి పనులు చేసెడిది. ఇట్లా ధనము సంపాదించి, దూష్యమైన భోజనము చేస్తూ అధిక ధనము కూడబెట్టినది. ఆస్త్రీ ఎన్నడూ భగవన్నామము ధ్యానించలేదు. హరికథలు వినలేదు, పుణ్య తీర్థములకు పోలేదు, ఏకాదశీఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారములచే చాలా ద్రవ్యం సంపాదించినది. కానీ తాను తినలేదు పరులకోసం ఉపయోగించలేదు.

ఇత్థమజ్ఞానసంపన్నా మాహకశ్చిద్ద్విజోత్తమః
దైవయోగాత్సమాయాత శ్శ్రీరంగంద్రష్టుమిచ్ఛయా!!
సవిప్రవర్యస్తాం దృష్ట్వా పావబుద్ధిముపాశ్రితాం
అథాహకృపయారాజన్ సర్వభూతదయానిధిః!!
వక్ష్యామిసాంప్రతంమూఢె మద్వాక్యమవధారయ
దుఃఖాద్దుఃఖమయోదేహాః త్వఙ్నాంసాస్థిసమన్వితః!!
దుఃఖాగారోప్యయంమూఢె భూతైః పంచభిరన్వితః
దేహావసానేతేయాంతి పంచభూతాః పృథక్ పృథక్!!
యధైవ గేహవలభౌ నాశంయాం త్యుదబిందవః
జలబుద్బుదవద్దేహో నాశమాయాతినిశ్చితం!!
తా! ఇలా అజ్ఞాన సముద్రంలో మునిగిన ఆమె ఇంటికి దైవ వశాత్త్ శ్రీరంగమునకు పోతూ ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి అయ్యో ఈమె అన్యాయంగా నరకము నకు పోగలదని దయకలిగి ఆమెతో ఇట్లనె. ’ మూఢురాలా! ఇప్పుడు నేచెప్పేది జాగ్రత్తగా విను. విని ఆలోచించుము. శరీరం సుఖదుఃఖముల సమన్వయం. చర్మము, మాంసము, ఎముకలతో గూడినది. ఇది దుఃఖములకు నిలయము.  పంచభూతములైన భూమ్యాకాశవాయురగ్నిజలములు వలన కలిగి వాటితో కూడి ఉన్నది. దేహము నశించగానే పంచ భూతములు ఇంటిపై బడిన వాన చినుకులు ఎలాగైతే వేర్వేరుగా పోవునో అలా వేరువేరగును. ఇది నిశ్చయం.

అనిత్యం దేహమాశ్రిత్య నిత్యంత్వం మన్యసెహృది!!
తస్మాదంతస్థితం మోహం త్యజమూఢెవిచారతః
పతంగోగ్నింసమాగత్య పతత్యేవస్వయంయథా!!
తా! దేహము నీటిమీద నురుగువలె నశించును. దేహము నిత్యము కాదు ఇట్టిదేహము నిత్యమని నమ్మియున్నావు. ఇది అగ్నిలో పడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము.

స్మరసత్యాత్మకం దేవం సర్వభూతదయానిధిం
ధ్యానం కురు మహావిష్ణోః పాదపంకజముత్తమం!!
కామంక్రోధంభయంలోభం మోహంద్రవ్యాభిలాషణం
త్యజవిష్ణుపదద్వంద్వం భజభక్త్యాప్యనన్యయా!!
తా! దేవుడే సత్యమనీ, సమస్త భూతములందు దయగలవాడు అని గుర్తెరుకు. హరిపాదములను ధ్యానించు. కామం-కోరిక, క్రోధము - అత్యంత కోపము,  భయము-ఈశరీరమునకు తత్సంబంధమునకు ఏమగునో అని బెంగ ఆత్మాత్మీయము, లోభము- ద్రవ్యచింతన, ఖర్చు పెడితే ఖర్చవుతుందని ఏదో దాచుకోవాలని ఉబలాటం. మోహము- మమత, అనురాగం, అహం, ద్రవ్యాభిలాషణం- ఇంకా ఇంకా ఇంకా సంపాదించవలెనని కోరిక -  వీటన్నిటిని వదులి నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చెయ్యి.

కురుష్వకార్తిక స్నానం భక్తి భావేన కేశవే
యథాదానం తథా కార్యం కార్తికేచాల్పమేవచ!!
దీపదానం ప్రయత్నేన బ్రాహ్మణాయమహాత్మనే
తేననశ్యంతి పాపాని జన్మాంతర కృతాన్యపి!!
మా కురుష్వాత్ర సందేహం మహాపాపవిముక్తయె
ఇత్యుక్త్వాసయయౌధీమాన్ ఐంద్రీంవిప్రనరస్తదా!!
ఇతితేనోదితంశ్రుత్వా విస్మితారాజసత్తమ
పశ్చాత్తాపమనుప్రాప్య సాకరోత్కార్తికవ్రతం!!
తా! కార్తీక మాసమందు ప్రాతఃస్నానం చేసి, విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము అట్లు చేసిన అనేక జన్మ పాపములు నశించును. విషయంలో ఎటువంటి సందేహము లేదు.’ అని చెప్పి బ్రాహ్మణుడి తూర్పు దిశగా పయనం సాగించెను. తరవాత మాటలు నమ్మి విచారణ చేసుకొని, ఆశ్చర్యమును పొంది తాను చేసిన అకార్యములకు బాధ పడి కార్తీక వ్రతమును ఆరంభించెను.

పతంగోదయవేళాయాం కార్తిక స్నానమంభసి
హరెఃపూజాందీపదానం పురాణ శ్రవణం తథా!!
మాసాం తెవిప్రముఖ్యేభ్యో భోజనం సాప్రయచ్చతి
కార్తికేతుసదారాజన్ మాస స్నానంకరోతిసా!!
తేనశీతజ్వరోత్పత్తిర్జాయతెకుక్షిరోగతః
తప్యమానాదివారాత్రం దుఃఖాద్బాష్పాకులేక్షణా
మమార బంధుహీనాసా స్వర్గలోకంగతాముదా!!
తా! సూర్యోదయ వేళలో చన్నీటి స్నానము, హరి పూజ తరవాత దీపదానము అటు పిమ్మట పురాణ శ్రవణము, విధంగా కార్తీక మాసము నెలరోజులు కార్తీక వ్రతమాచరించి చివరకు బ్రాహ్మణ సమారాధన చేసెను.  ఇతః పూర్వం సరియైన భోజనము లేని కారణము చేతనూ, నెలరోజులు శీతోదకస్నానము చేయుటవలననూ, స్త్రీకి శీతజ్వరము సోకి గర్భమందు రోగము పుట్టి దివారాత్రులు బాధపడి బంధుహీనయై మృతినొందినైది. అనంతరం ఆమె దివ్య విమానమెక్కి స్వర్గమునకు బోయి శాశ్వత సుఖములను పొందినది.

తస్మాత్కార్తికమాసేతు దీపదానంవిశిష్యతే
జ్ఞానాజ్ఞానకృతంపాపం కార్తికేదీపదానతః
నశ్యంతినాత్రసందేహః శంకరేణోదితంపురా!!
ఇదంరహస్యమాఖ్యానం కథితంతవభూపతే
యచ్ఛ్రుత్వాముచ్యతెజంతుః జన్మసంసారబంధనాత్!!
తా! కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధికమైన ఫలప్రదము. కార్తీక దీపదానము తెలిసికానీ తెలియకకానీ చేసిన పాపములను నశింపచేయునుఅని పూర్వము సాక్షాత్ శంకరుడే పలికెను. రాజా రహస్యమును నీకు తెలిపితిని దీనిని విన్న వారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని విష్ణుపదమును పొందెదరు.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె షష్ఠోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఆరవ అధ్యాయము సమాప్తము.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

మీ
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ
www.sri-kamakshi.blogspot.com

~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర

No comments:

Post a Comment