Pages

Friday, November 22, 2013

కార్తీక పురాణము -09వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే నవమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం

విష్ణుదూతా ఊచుః
భవతాంస్వామినాకింకిం వదథ్వంకధితంయతః
కోర్హోత్రయమదండస్య కేధర్మాఃపుణ్యాపాపకాః!!
నూన మస్మాకమగ్రేతు బౄతసర్వంయమానుగాః
ఇతితైరుదితం శ్రుత్వా ఊచుస్తెయమకింకరాః!!
తా ! విష్ణుదూతలు ఇట్లు పలికిరి. " ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీయమదండనకు ఎవ్వడుతగినవాడు? పుణ్యులనగా ఎవరు? పాతకములనగా ఏమిటి? ఈ విషయాలన్నిటినీ సవిస్తారంగా మాకు చెప్పండి" అనగా యమదూతలు ఇలా చెప్తున్నారు.

యమదూతా ఊచుః
శ్రుణుధ్వమవధానేన విష్ణుదూతాస్సునిర్మలాః
పతంగఃపావకోవాయుర్వ్యోమగావోనిశాపతిః!!
సంధ్యాహనీదిశఃకాల ఇతిదేహస్యసాక్షిణః
ఏతైరధర్మోవిజ్ఞాతస్సనోదండస్యయుజ్యతె!!
తా !  "ఓ విష్ణుదూతలారా! సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనిషి పుణ్యపాపములకు సాక్షులు, మేమి వీరి సాక్ష్యాన్ని విచారించి పాపం చేసిన వారిని దండిస్తాం.


స్వవేదమార్గరహితః శ్రుతిస్మృత్యాదిదూషకః
నిందితస్సాధువృత్తానాం సమేదండ్యోనసంశయః!!
తా !  వేదమార్గాన్ని వదలి ఇచ్ఛాను సారంగా తిరిగుతూ, వేదశాస్త్రాలను దూషిస్తూ సాధుబహిష్కృతుడైన వారిని మేము దండిస్తాము.

విప్రంచగురుమస్వస్థం పాదాద్యైర్యదితాడయేత్
యోమాతాపితరౌద్ద్వేష్టి సదండ్యోనాత్రసంశయః!!
తా !  బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు అయినవారిని మేము దండిస్తాము.

యోనిత్యమనృతంవక్తి ప్రాణిహింసాపరాయణః
కులాచారపరిభ్రష్టస్సయాతియమమందిరం!!
తా !  నిత్యమూ అబద్ధమాడుతూ జంతువులను చంపుతూ కులాచారము వదిలిన వారిని మేము దండిస్తాము.

దత్తాపహారకోదంభో దయాశాంతివివర్జితః
యంపాపకర్మనిరతస్సయాతిమయమందిరమ్!!
తా !  ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవారిని, డాంబికులను, దయాశాంతులు లేని వారిని, పాపాత్ములను మేము దండిస్తాము.

పరదారాభిగమనం సభుం కైయమయాతనామ్
యస్సాక్షికంవదేద్ద్రవ్య లోభేనాత్యంతదుష్టధీః!!
తా !  పరుని భార్యతీ క్రీడించువానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పేవారిని మేము దండిస్తాము

అహంతుదాససూరేతి సభుంక్తెయమయాతనాం
మిత్రద్రోహీకృతఘ్నశ్చ సభుంక్తెయమయాతనాం!!
తా !  నేను దాతనని చెప్పుకొను వారిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారినీ, అపకారమును చేయువారినీ, మేము దండిస్తాము.

వివాహవిఘ్నంయఃకుర్వాత్సభుంక్తెయమశాసనం
యోవాపరేషామైశ్వర్యం దృష్ట్వానూయేతదుష్టధీః!!
తా !  వివాహమును చెరిపే వారినీ, ఇతరుల సంపదను చూసి అసహ్యపడువారినీ మేము దండిస్తాము.

పరేషామర్భక్తానాంచ సగచ్ఛేద్యమయాతనాం
కన్యాద్రవ్యేణయోజీవేత్తథావార్థుషి కేనచః!!
తా !  పరుల సంతానమును చూసి దుఃఖించేవారిని, కన్యాశుల్కములచేత జీవించే వారిని వడ్డీతో జీవించువారిని మేము దండిస్తాము.

తటాకకూపకుల్యానాం విఘ్నమాచరతేచయః
తథాన్యవిఘ్నకర్తాచ పాతకీచనసంశయః!!
తా !  చెరువును, నూతిని, స్వల్పకాలువలను నిర్మించడాన్ని మాన్పించేవారిని, నిర్మితములైన వాటిని చెరచువారిని మేము దండిస్తాము.

యఃపితౄన్నసముద్దిశ్య శ్రాద్ధం మోహేనవానరః
నిత్యకర్మపరిత్యాగీ సభుంక్తెయమశాసనం!!
తా !  మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచినవారిని నిత్యకర్మను వదిలిన వారిని మేము దండిస్తాము.

పరపాకపరిత్యాగీ పరపాకరతస్తథా
పితృశేషాన్నభోక్తాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  తాను వండిన అన్నములో ఇతరులకు ఇంతపిసరు కూడా పెట్టక తినేవాణ్ణి, ఎల్లప్పుడూ పరుల అన్నమును మాత్రమే తినేవాణ్ణి, పితృకర్మలయందు భోక్తలు తినివదిలిన ఎంగిలి భుజించువారిని, దండింతుము.

సదదస్వేతియోబౄయా న్నదద్యాద్బ్రాహ్మణేషుచ
శరణాగతహంతాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  ఇతరులు దానము చేస్తుండగా ఆ సమయంలో అడ్డుపడేవారిని, యాచించిన బ్రాహ్మణులకివ్వని వానిని తన శరణుజొచ్చిన వానిని చంపేవానిని మేము దండింతుము.

స్నానసంధ్యాపరిత్యాగీ నిత్యంబ్రాహ్మణనిందకః
బ్రహ్మఘ్నశ్చాశ్వగోఘ్నశ్చ సయాతియమమందిరం!!
తా !  స్నాన, సంధ్యావందనాలను విడిచినవానిని, నిత్య బ్రాహ్మణనింద చేసేవాణ్ణి, బ్రాహ్మణహంతకుణ్ణి, అశ్వ హంతకుణ్ణి, గోహత్య చేసినవాణ్ణి దండింతుము.

ఏవమాదీని పాపాని యమేనోక్తానివైష్ణవాః
యేకుర్వంతియమేలోకె తేన్వభూయంతి యాతనామ్!!
తా !  ఇలా మొదలుగాగల పాతకములను చేయు మనుషులు మా యమలోకమందు మాచేత యాతనలను పొందుతారు

అయంవిప్రాన్వయెజాతో దాసీపతిరజామిళః
అనేనార్జిత పాపానాం సంఖ్యానాస్తినసంశయః!
జన్మప్రభృతిజన్మాంతం పాపమేవముపార్జితం
అయంవైవిష్ణులోకస్య కథమర్హతిదుష్టాధీః!!
ఇతి తేషాంపచశ్శ్రుత్వా విష్ణుదూతాశ్శుచిస్మితాః
మేఘగంభీరయావాచా ఊచుః కిలముఖాంబుజాః!!
తా !   ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు పుట్టి, దాసీ సంగలోలుడై, అది మొదలు జన్మాంతము వరకు పాపములు చేసినవాడు. ఇతని చేత చేయబడిన పాపములకు ఇంత అని మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎలా అర్హుడౌను?" అని ఈ ప్రకారముగా విష్ణుదూతలను ప్రశ్నించినమీదట, విష్ణుదూతలు చిరునవ్వు నవ్వుతూ ఉరుములా అన్నట్లు సమాన గంభీరధ్వనితో ఇట్లనిరి.

విష్ణుదూతా ఊచుః
అహో ఆశ్చర్యమేతద్ధి యద్యూయంమూఢచేతసః
శృణ్వంతుధర్మమర్యాదాం సమాధానేన చేతసా!!
తా ! విష్ణుదూతలిట్లు పలికిరి " అహో ఏమాశ్చర్యము మీరింత మూఢులెట్లైనారు.? ధర్మమర్యాదను మేము చెప్పెదము సావధానంగా వినండి.
  
యోదుస్సంగపరిత్యాగీ సత్సంగతిముపాశ్రయః
బ్రహ్మజ్ఞానంతతీనిత్యం నదండ్యస్సయమేనవై!!
తా !   దుస్సంగమును విడుచువారు, సత్సంగమును ఆశ్రయించువారు నిత్యము బ్రహ్మచింతనమును చేసేవారు యమదండార్హులు కారు.

స్నానసంధ్యాదినిరతో జపహోమపరాయణః
సర్వభూతదయాయుక్తో నసయాతియమాలయం!!
తా !   స్నాన సంధ్యావందనాదులాచరించేవారు, జపహోమములాచరించేవారు, సర్వభూతములందు దయావంతులు, యమదండార్హులుకారు.

బ్రహ్మణ్యాధాయకర్మాణి సత్యవాగనసూయకః
జపాగ్ని హోత్రేయః కుత్యాత్ న సయాతియమాలయం!!
తా !   సత్యవంతుడై మాయాదోషరహితుడై, జప అగ్నిహోత్రములను చేయుచూ కర్మలను సగుణ బ్రహ్మయందుంచినవాడు యదండార్హుడు కాడు. (బ్రహ్మణ్యాధాయ కర్మాణి.. ఈ శ్లోకములో కర్మలను బ్రహ్మమునందుంచినవాడు అని చెప్పినప్పుడు సగుణ బ్రహ్మమునే చెప్పవలసి ఉండును, నిర్గుణబ్రహ్మమును గూర్చికూడా తెలుసుకొన్నవాడు పూర్ణుడై కర్మరహితుడగును వానికి కర్మాకర్మములతో సంబంధంలేదుకదా! అందుకే సగుణ బ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది)

యోన్నదానదాతానిత్యం వారిదానం ప్రయత్నతః
గోదానంచ వృషోత్సర్గం యఃకుర్యాన్నసపాతకీ!!
తా !   నిత్యమూ అన్నదానమో, జలదానమో చేసేవాడు గోదానం చేసినవారు, వృషోత్సర్గం (ఆబోతును వదిలిన వారు) దండార్హులు కారు.

విద్యాదానంచార్ధికేభ్యః యః కుర్యాద్భక్తిమాన్నరః
పరోపకారనిరతః నసయాతియమాలయం!!
తా ! విద్యకోరినవారికి శ్రద్ధగా విద్యాదానం చేసేవారు, పరోపకారాసక్తి కలిగినవారు, యమదండార్హులు కారు.
 
యేవిష్ణుమర్చయేద్భక్త్యాతస్యాంగేజపముత్తమం
వివాహోపనయౌకర్తా నసయాతియమాలయం!!
తా !   విష్ణువును పూజించేవారు, హరినామ స్మరణచేసేవారు, వివాహము ఉపనయనములు చేసేవారు యమదండార్హులుకారు

యేనాధమంటపంమార్గే రాసనిర్మాణమేవచ
అనాధప్రేతసంస్కారాన్నసయాతియమాలయం!!
తా !   మార్గమధ్యంలో మణ్టపాలు కట్టించినవారు, ఆటస్థలాలను కట్టించినవారు, దిక్కులేని శవానికి అంత్యేష్టి చేసినవారు, చేయించినవారు యమదండార్హులు కారు.

సాలగ్రామార్చనంనిత్యం తత్తీర్థంచపిబేన్నరః
తస్యదండప్రణామంచ యఃకుర్యాన్నసపాతకీ!!
తా !   నిత్యమూ సాలగ్రామ అర్చనచేసి ఆ తీర్థాన్ని పానము చేసినవారు, దానికి వందనం చేసేవారు, యమదండార్హులు కారు.

తులసీమణిమాలాంతు గళేధృత్వార్చయేద్ధరిం
సాలగ్రామశిలాంవాపి నసయాతియమాలయం!!
తా !   తులసి కర్రలతో చేసిన మాలను మెడలో ధరించిన హరిని పూజించే వారు, సాలగ్రామాన్ని పూజించేవారు యమాండార్హులు కారు

యేషాంగృహేచతులసీ వర్తతేహరిసత్కథా
గీతాపాఠపరాయేచ నతేయాంతియమాలయం!!
తా !    ఇంట్లో తులసి మొక్కలను, వనాన్ని పెంచేవారు, హరి కథాశ్రవణం చేసేవారు, భగవద్గీతాపారాయణం చేసేవారు యమదండార్హులు కారు.

నిత్యంభాగవతంయస్య లిఖితంపుస్తకంగృహే
తిష్ఠతెచార్చయేద్వాపి నసయాతియమాలయమ్!!
తా !   భాగవతుల సత్కథలు వ్రాసి ఇంట్లో పూజించేవారు ఆ ఇంట్లో ఉన్నవారు యమదండార్హులు కారు.

తులాసంస్థేదినకరే మకరస్థేచభాస్కరే
మేషసంక్రమణేభానౌ స్నానశీలాసయాంత్యధ!!
తా !   సూర్యుడు మేష, తుల, మకర సంక్రమణంలో ఉండగా తెల్లవారు ఝామునే స్నానమాచరించేవారు యమదండార్హులు కారు.

రుదాక్షమాలికాంధ్రుత్వా కృతంయేనజపంశుభం
దానయోమపరోనిత్యం నసయాతియమాలయం!!
తా !   రుద్రాక్షమాలికను ధరించి జపదానహోమాదులనాచరించేవారు యమదండార్హులు కారు.

అచ్యుతానందగోవింద కృష్ణనారాయణావ్యయ
ఇతియోవదతేనిత్యం నసయాతియమాలయం!!
తా !   నిత్యమూ అచ్యుతా, అనంతా, గోవిందా, కృష్ణా, నారాయణా, అవ్యయా, రామా ఇత్యాది హరినామ సంకీర్తనలు చేసేవారు యమదండార్హులు కారు.

యఃకర్ణికాయాంమ్రియతే మరణేహరిముచ్చరన్
సర్వపాపరతోవాపి నసయాతియమాలయం!!
తా !   కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘట్టంలో హరి స్మరణ చేస్తూ చనిపోయినవారు, సర్వపాపాలు చేసినవాడైనా యమదండార్హులు కారు

స్త్రీరాజగురుగోహంతా యేచపాతకినఃపరే
నామవ్యాహరణాద్విష్ణోర్మరణేహ్యఘనిష్కృతిః!!
తా !   దొంగ, సురాపానం చేసేవారు, మిత్ర హంతకులు, బ్రాహ్మణహంతకులు, గురుతల్పగతులు, స్త్రీహంతకులు, రాజ, గురు గో హత్యాది మొదలైన పాపములు చేసినా మరణకాలంలో హరిని స్మరిస్తే పాపవిముక్తులౌదురు.

అజ్ఞానాదధవాజ్ఞానా దుత్తమశ్లోకనామయత్
సంకీర్తనాదఘహరం పుంసాందుష్కృతినామపి!!
తా !   తెలిసి కానీ తెలియకకానీ హరినామ సంకీర్తనం చేసినవారు పాపాత్ములైనాసరే ముక్తులగుదురు.
సాంకేత్యంపారిహాస్యంచ స్తోకం హేళనమేవవా
వైకుంఠవామగ్రహణ మశేషాఘనివారణమ్!!
తా !   హరినామమును, సంకేతిస్తూగాని, సంకేతంగాగాని, పరిహాసానికి గానీ, తెలిసికానీ తెలియకకానీ, కొద్దిగాగానీ, ఎక్కువగాగాని, పలికేవారు పాపముక్తులగుదురు.
పతితస్ఖ్సలితోభగ్న స్సదుష్టస్తప్తజాహతః
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతియాతనామ్!!
తా !   క్రింద పడినప్పుడు, తొట్రుపాటు పడినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదులచేత పీడింపబడినప్పుడు, సప్తవ్యసనములచేత పీడింపబడినప్పుడు, వశములో లేనప్పుడౌనా సరే, హరి నామ సంకీర్తన చేసినవారు యమదండనార్హులు కారు.

యచ్చిత్తేసర్వపాపాపి హరినామాన్య శేషతః
పాపానిజన్మాంతరసంచితాని యేనైవతన్నిష్కృతివర్జితాని
పూయంతినామగ్రహణేన విష్ణోర్మనుష్యలోకెదివివాస సంశయః!!
గురూణాంచలఘానాంచ పాపానాంనాశనాయచ
యద్యసౌభగవన్నామ మ్రియమాణస్సమగ్రహీత్
తేనపాపావినశ్యంతి వహ్నౌప్రక్షిప్తతూలవత్!!
ఇత్యుక్త్వాతేయమభటాన్ విష్ణుదూతాన్సుతేజసః
హైమపుష్పకమధ్యస్థ మజామిళమతంద్రితాః!!
అహృత్యజగ్ముర్వైకుంఠం తదాహాజామిళోనృప
నవందేశిరసాదేవం కింకరాన్ దర్శనోత్సుకః!!
అథాజామిళ అకర్ణ్య దూతానాం యమకృష్ణయోః
ధన్యోస్మ్యనుగృహీతోస్మి యుష్మత్సందర్శనాదహం!!
తా !   అనేక జన్మలలో కూడబెట్టిన ప్రాయశ్చిత్తరహితములవలన కొండలలా పేరుకు పోయిన పాపాలన్నీ హరినామ సంకీర్తనచేత నశిస్తాయి. మరణావస్థలో ఉండి హరినామస్మరణ కొద్దిగా చేసినా, అధికంగా చేసినా వాని పాపాలన్నీ అగ్నిలో పడిన దూదివలె నశిస్తాయి." అని విష్ణుదూతలు పలికి అజామిళుని యమదూతలనుండి విడిపించిరి. తరవాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరించి మీదర్శనం వల్ల మేము తరించాము అనెను. తరవాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి.

అథాజామిళ ఆకర్ణ్య దూతానాంయమకృష్ణయోః
అహో మేపరమంకష్టం యదభూదచితాత్మనః!!
ధిజ్ఞ్మాంవిగర్హితం సద్భిః దుష్కృతంకిలకజ్జలం
హిత్వాబాలాంసతీంయోహం సురాపామసతీమిమాం!!
వృద్ధావనాధౌపితరౌ నాన్యగోద్ధూత పాపినౌ
అయోయమాధునాత్యక్తావనభిజ్ఞే ననీచవత్!!
సోహం వ్యక్తంపతిష్యామి నరకేభృశదారుణే
ధర్మఘ్నాః కామినోయ విందంతి యమయాతనామ్!!
తా !   తరవాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టాన్ని పొందాను. ఆత్మ హితం చేసుకోలేకపోయాను ఛీ ఛీ నాబ్రతుకు సాధు సజ్జనులచేత నిందింపబడేది అయ్యింది కదా! పతి వ్రతయైన భార్యను వదిలి కల్లుతాగుతూ మాంసముతింటూ తిరిగెడి ఈ దాసీ దానిని స్వీకరించాను. వృద్ధులై నాకంటే వేరు దిక్కులేని పుణ్యాత్ములైన నా తల్లిదండ్రులను నీచుడ్నై విడిచాను కదా! అయ్యో ఎంత ధర్మహంతనైనాను. కాముకుణ్ణై నిరంతరమూ అనుభవించే నరకానికి నేను నిశ్చయంగా వెళ్తాను.

కిమదంస్వప్నంహోస్విత్ మయాదృష్టమిహాద్భుతం
వాక్వద్యయాతితమ్యాస్తె  కృష్ణఘోరాసిపాణయః!!
ఫూరామయాకృతేనైవ భాన్యంపుణ్యేసకర్మణా
అన్యధామ్రియమాణస్య విస్మృతిర్వృషలోపతే
వైకుంఠనామగ్రహణం హిహ్వావక్తుమిహార్హతి!!
క్వచాహుకితవఃపాపోబ్రహ్మఘ్నోనిరపత్రపః
క్వచనారాయణేత్యేవ భగవన్నామమంగళం!!
తా !   ఇదేమి ఆశ్చర్యము ఇది స్వప్నమా! ఆ విచ్చుకత్తులను ధరించిన యమభటులెటుపోయిరి? నేను పూర్వ జన్మమందు పుణ్యమాచరించినవాడను కాబట్టే దాసీదానితో జీవించిన నాకు మరణ సమయంలో హరినామ స్మృతి ఎలా కలిగింది. నా నాలుక హరినామాన్నెట్లు గ్రహించింది. పాపాత్ముడనైన నేనెక్కడ అంత్యకాలమందలి స్మృతి ఎక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపేనేనెక్కడ? మంగళుడైన నారాయణుడెక్కడ?

ఇత్యుక్త్వాభగవద్భక్తి మాలంబ్యాత్మావమాత్మని
తతస్సాయుజ్యపదవీం లేభేయన్నామకీర్తనాత్
నారాయణేతియన్నామ జగదచ్యుతరక్షణం
యాతివిష్ణోఃపదంరాజన్ నిర్ధూతాశేషకిల్బిషః
తా !   అజామిళుడిట్లు విచారిమ్చి నిశ్చలమైన మనసుతో భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలము జీవించి తరవాత సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తనము చేసేవారు సమస్తపాతకముక్తులై వైకుంఠలోకాన్ని పొందెదరు. ఇందుకు సందేహములేదు." అని మహర్షి పలికెను.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె నవమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

~~~~~~~~~~~~~~~~~~~~~~ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN

No comments:

Post a Comment