Pages

Thursday, September 19, 2013

పిశాచాః సహచరా..

శ్రీ గురుభ్యోనమః

పరమ శివ తత్త్వం విచిత్రంగా ఉంటుంది. ఆయనను కీర్తించే నామాలు, ఆయన గౌణాలూ సింహభాగం అమంగళ వస్తువులలాగా అమంగళ పదాలలాగా ఉంటాయి. ఒక విధంగా అవి ఆయన సౌలభ్యాన్ని, నిరాడంబరతను, సమదృష్టిని సూచించేవే  ఐనా కొందరు అదే నిజమనుక్కుని శివతత్త్వం మీద అటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. యద్భావంతద్భవతి అన్నట్లు ఎలా ఆలోచించేవారికి, ఎలా కోరే వారికి అలానే కనపడి ఉద్ధరించే స్వరూపం ఆయనది.ఇదే విషయాన్ని అదే పరమాత్మ స్థితికారుడైన విష్ణువుగా ఉన్నప్పుడు అంశలతో జగద్రక్షకుడుగా ఎవరు ఎలా కావాలనుక్కుంటే అలా వచ్చి ఉద్ధరించినట్లు మనం ఎన్ని వృత్తాంతాలలో చూడలేదు.

శివుడు అనగా శుభరూపుడు శుభకరుడు అని అర్థాలు. అలాంటి శివుణ్ణి స్మశాన వాసిగా పిశాచ సహచరునిగా చితా భస్మంపూసుకునే శరీరం ఉన్నవాడిగా నర కపాల మాలాధరునిగా చూసి ఆరాధిస్తారు. కొందరు రూపమున్నవాడే శివుడు, ఆయనకింకొరూపం ఉండదు అని తలచి ఆరాధిస్తారు, కొందరు తత్త్వ సమన్వయం చేసుకుని సచ్చిదానంద విగ్రహం అని ఆరాధిస్తారు, మరికొందరు నిందచేస్తారు, ఆయన సర్వ సముడు అన్నింటినీ స్వీకరించి అనుగ్రహిస్తాడు.

పుష్పదంతాచార్య విరచిత మహిమ్నాస్తోత్రంలో శ్లోకం చదివితే అబ్బ... ఏమి శివ స్వరూపం రా అనిపించకమానదు.
శ్మశానే ష్వాక్రీడా స్మరహర! పిశాచాః సహచరా
శ్చితాభస్మాలేపః స్రగపి నృకరోటీపరికరః
అమంగల్యం శీలం తవ భవతునామైవ మఖిలం
తథాపి స్మర్తౄణాం వరద! పరమం మంగలమసి.

శ్లోకంలో శివ రూపం వర్ణించబడింది రూప సమన్వయము యదార్థంగా చూస్తే
అందరికీ ఆహ్లాదం కలిగించే మన్మథుని చంపేసినవాడా! నువ్వు శ్మశానములలో తిరుగుతావు. పిశాచాదులు నీ తోటి స్నేహితులు, నీతో తిరిగేవారు. పిశాచములు ప్రేతములతో కలిసి నువ్వు తిరుగుతావు. కాలిన శవముల బూడిదను తీసుకొని శరీరానికి పూసుకుంటూ ఉంటావు. మనుషులు చనిపోతే కాలిపోయిన వారి కపాలములతో దండ కుచ్చి ఆమాల వేసుకుంటావు. ఇలా నీ అలవాట్లలో ఏది చూసినా శుభకరమైనది కానేకాదు. అయినా నిన్ను స్మరించే వారికి నువ్వెప్పుడూ మంగళస్వరూపుడవు అత్యంత శుభకరుడవు. అలా ఎలా సాధ్యం నిజంగా అలానే ఉంటాడా? ఏదీ మళ్ళీ ఇంకోసారి తిరిగి చూద్దాం శ్లోక అర్థం.

పై శ్లోకంలో దాచిన శివ తత్త్వ సమన్వయము
ఇక్కడ స్మర అని సంబోధన
స్మర= నిన్ను స్మరించు, ఉపాసించు
= ఆకాశ సూచకము
=అగ్ని సూచకము
స్మర హర = నిన్ను ఉపాసించు వారి దహరాకాశమున అగ్నిబిందు రూపమున స్వయంజ్యోతిగా ప్రకాశించు శివా!
శ్మ శానేష్వాక్రీడా= శ్మ శానేషు+ఆక్రీడా;
శ్మ శానేషు = శమ శయనేషు = అంతర్ ఇంద్రియ నిరోధమునకు శయనము (శమ దమాదు గుణములంటాము కదా) శమ దమాది సాధనాసంపత్తి/ శుద్ధసత్త్వగుణమునకు శయనము అంటే ఆశ్రయము అగు ఉపాసకుల హృదయములందు.
తవ = నీ
ఆక్రీడా= విహరణము, తిరుగుట
పిశాచాః=పిశా..శాః=అవయవములను తమవిగా అనుభవించెడి నాలుగు రకాల శరీరములు,
పిశాచాః= స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ దేహములు
తే సహ చరాః= నీతో కలిసి తిరుగునవి
చితా భస్మ = ప్రణవ ఉపాసన చే సిద్ధమగు జ్ఞాన సిద్ధి /జ్ఞాన దీప్తి
తే ఆలేపః =  నీ వంటికి పూసుకునే ద్రవ్యం
అపి = మరియు
నృ కరోటీ పరికరః = జ్ఞాన సిద్ధికి మార్గం చూపే మాతృకలు/వర్ణముల కూర్పు
తే=నీ స్రక్ = మాల
;  = ప్రాపంచిక సుఖరూప శుభము  = మోక్షప్రద జ్ఞానప్రకాశము = ఇచ్చు వాడా
ఏవం = ఈవిధముగా
స్మర్తౄణాం = నిన్ను స్మరించు లేదా ఉపాసించు వారికి
పరమం మంగలం = ఉత్తమమైన శుభము లేదా అత్యంత శుభకరము
అసి = అగుచున్నావు

తత్త్వజ్ఞులై అంతర్ముఖ అంతః కరణ వృత్తితో (సాధనా సంపత్తితో) ఉపాసించు ఉపాసకుల దహరాకాశములందు నివసించే దేవా శివా! నీవు బహిర్ అంతర్ ఇంద్రియముల నిగ్రహము కలవారి హృదయములలో నిలిచి ఉండేవాడవు. నీ తత్త్వములు విచారణ చేయుటకు వారికి వారి నాలుగు శరీరములైన స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు సహకరించును. నీ తత్త్వమునకు అవే సహచరములై ఉంటాయి. నిరంతరమూ వివేచనా దీప్తిచే సిద్ధించిన తత్త్వనిర్ణయమే జ్ఞాన సిద్ధియే నీ శరీరమునకు పూసుకున్న పూత. జ్ఞానానుభవమునకు త్రోవచూపు అకారాదిక్షకారాంత అక్ష() మాలయే నీ తత్త్వరూపశరీరమునకు అలంకారమగు కంఠమాల. విధముగా శ్రుతి గురూపదేశ మార్గమున నిన్ను ఉపాసించు వారికి నీవు పరమ మంగళుడవు. ఇదే పరబ్రహ్మ తత్త్వం.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు


No comments:

Post a Comment