Pages

Saturday, September 14, 2013

భక్తవిలాసం - 63మంది నాయనార్ల పేర్లు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పెరియ పురాణంగా ప్రసిద్ధి కెక్కినభక్తవిలాసంఅను పురాణము కలియుగంలో ఉపమన్యువు ఉపదేశంగా అగస్త్యమహాముని కాంచీ క్షేత్రంలో మునులకు ప్రవచించారు, పురాణ విశేషాలు సూత మహర్షి శౌనకాదులకు చెప్పిన భక్తుల పురాణమిది. ఇది విననంత చేత సంసార బంధములనుండి ముక్తిని యుక్తిగా ఇప్పించగలిగే భక్తి అనే ఉపాయము పెల్లుబికి రక్షించి శరణిస్తుంది అని వాక్కు. భక్తివల్ల ఏం కలుగుతుంది అంటే మార్జాల కిశోర న్యాయము మర్కటార్భక న్యాయములో భగవంతుని పాదములు భక్తుడు విడలేడు, భగవంతుడూ భక్తుని విడి ఉండలేడు, తత్కారణముచేత భగవంతుడే భక్తునికి నిరంతర భక్తి, తత్కర్మాచరణము తద్వారా జ్ఞాన వైరాగ్యములను ఇచ్చి తనయందే ఇక భక్తుని వేరుగా ఉంచలేక తనలో లయము చేసుకుంటాడు. సాయుజ్య మోక్షమునిస్తాడు.

భక్తవిలాస పురాణములో కలియుగములో నున్న 63మంది నాయనార్లను భక్తుల గాథలను గూర్చి పరమేశ్వరుడెలావారిని అక్కున చేర్చుకున్నాడు అన్న విషయాల గూర్చి తెలుపుతాయి నాయనార్ల పేర్లు తలచుకున్నా, విన్నా, చదివినా, స్మరించినా త్రివేణీ సంగమ స్నాన ఫలితమే కాదు అంతకన్నా ఎంతో ఉత్కృష్ట ఫలితం కలుగుతుందనడంలో సందేహం లేదు.

మునులందరూ అగస్త్యమహామునిని 63 మంది నాయనార్లెవరు వారి విశేషాలను చెప్పమని ఉత్సుకతతో కోరగా ఉపమన్యుమహర్షి ప్రవచించిన గాథలను చెప్ప ఉద్యుక్తుడై వారి పేర్లను చెప్పారు... అవధరించండి...


01
సుందరుడు
22
కులబంధనుడు
43
అతిభక్తుడు
02
కుమ్మరి నీలకంఠుడు
23
కురుంబుడు
44
కలికంపనుడు
03
ఇంగితప్రదుడనే వైశ్య శ్రేష్టి
24
పునీతవతి
45
కలినీతి
04
మారభక్తుడు
25
అద్భుతి
46
శక్తి
05
సత్యార్థుడు
26
నీలనగ్నుడు
47
పంచపాదుడు
06
వీరమిందుడు
27
నవనంది
48
మాలాతృణకుడు
07
అమరనీతి మహాచక్రవర్తి
28
జ్ఞానసంబంధుడు
49
అవికారి
08
దారకుడు
29
కలికాముడు
50
కుబ్జపాండ్యప్రభువు
09
ఏనాదినాథుడు
30
మూలనాథుడు
51
వాయులుడు
10
ధీరుడు
31
దండి
52
శూరభిత్తు
11
కళానాథుడు
32
మూర్ఖుడు
53
సింహాంకుడు
12
మానవిక్రముడు
33
మార సోమయాజి
54
ఐడంకుడు
13
శంకులాదాయుడు
34
శాక్యనాథుడు
55
యుద్ధమిత్రుడు
14
గోనాథ
35
నరశార్దూలుడు
56
కీర్తిసఖుడు
15
మూర్తినాథుడు
36
దభ్రభక్తుడు
57
శూరవ్యాఘ్రుడు
16
స్కందనాథుడు
37
ముష్ణ బ్రాహ్మణి
58
శంభుధ్యాయి
17
రుద్ర పశుపతి
38
చేరరాజు
59
పాండ్యపత్ని మహిళేశ్వరి
18
నందుడు
39
గణనాథుడు
60
భక్తప్రియుడు
19
భక్తేంగితవేత్త-చాకలి
40
పరాంతకుడు
61
శోణాక్షుడు
20
చండేశ్వరుడు
41
సత్యదాసుడు
62
వీణాపాణి నీలకంఠుడు
21
వాగీశ్వరుడు
42
ధర్మకేతన-నరసింహరాజు
63
జటిలుడు -జ్ఞానవతి


No comments:

Post a Comment