శ్రీ గురుభ్యోనమః
నమస్తే
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్ష్యేః కీర్తనం కలినాశనం!
ఈ రోజు యథాలాపంగా ఉన్న పుస్తకాలు చూస్తూ ఏది చదువుదాం అని ఆలోచిస్తూ ఉంటే నలోపాఖ్యానం కనబడింది. సాధారణంగా ఈ నలోపాఖ్యానం పుస్తక ప్రియులకి (ఆధ్యాత్మిక సాహిత్యం) తెలిసే ఉంటుంది. సరే ఈ మహాభారతంలోని ఈ ఉపాఖ్యానాన్ని సంస్కృతంనుండి తెనిగించినవారు నన్నయభట్టారకుడు అని ప్రత్యేకంగా ఉటంకించక్కర్లేదు కదా!. స్థూలంగా ఈ కథ ఏంటంటే
నలమహారాజు అతి యవ్వనవంతుడు, అందగాడు, సద్గుణ సంపన్నుడు, ఈయన గురించి విన్న విధర్భరాజు కుమార్తె దమయంతి ఆయన యందనురాగాన్ని పెంచుకొంది. ఈమె సౌందర్యాన్ని, సుగుణాలను విన్న నలుడూ ఆమెయందనురాగాన్ని పొంది పెండ్లాడదలుస్తాడు. ఈ విషయం దమయంతి తండ్రియైన భీమ మహారాజుకి తెలిసి దమయంతీ స్వయంవరం ప్రకటిస్తాడు. ఆస్వయంవరానికి రాజులంతా వస్తుండగా, ఈ స్వయంవరం గురించి నారదుని వల్ల విన్న దేవేంద్రాదులుకూడా దమయంతిని వరించ దలచి భూలోకానికి వస్తారు.
దారిలో నలుని చూసి అతనినే దమయంతి వద్దకు తమ దూతగా పంపుతారు.
నలమహారాజు ఆ దమయంతి యందు అనురాగమున్నా దేవతలకు మాట ఇచ్చిన కారణం చేత వాఇ దూతగా దమయంతీ మందిరానికి చేరి సమాచారం అందిస్తాడు. ఆ దమయంతి తాను నల మహారాజుని తప్ప దేవేంద్రులైనా ఎవరైనా సరే వారిని వరించనను చెప్తుంది. ఇంద్రాది దేవతల అనుగ్రహం వలన వారి వివాహం చక్కగా వైభవోపేతంగా జరిగి దేవతలచే నిత్య సత్య పరాక్రముడవమని, ధర్మాత్ముడవుగా కీర్తినొందుతావనీ ఎన్నో వరాలు పొందుతాడు నలుడు. అలా నలదమయంతులు ఆనందంగా ఉండమని దీవించిన ఇంద్రాది దేవతలు సంతుష్టులై తమ స్థానాలకు బయలుదేరతారు.
........Contd....
No comments:
Post a Comment