Pages

Friday, December 21, 2012

క్రోధాద్భవతి సమ్మోహః

శ్రీ గురుభ్యోనమః
ఒకానొక ఊరి చివర ఒక చెఱువుంది. ఒక బ్రాహ్మణుడు దేశాంతరం వెళ్తూ చెఱువు వద్దకు సంధ్యాసమయానికి చేరుకున్నాడు. సంధ్యాసమయమని గుర్తెరికి చెఱువులో స్నానం చేసి గట్టుమీద పక్కగా దగ్గరున్న దర్భాసనం వేసుకుని కూర్చుని సంధ్యావందనం చేసుకుని, జపం చేసుకుంటున్నాడు. ఇంతలో వూరికి సంబంధించిన ఒక రజకుడు ఈయనని చూడక నీళ్ళలో దిగి బట్టలు ఉతకనారంభించాడు. చాకలి బండ మీద బట్టలను దబాదబా బాదడంతో చప్పుడురావడంతో పాటు మురికి నీరు, జపం చేసుకుంటున్న బ్రాహ్మణుడి మీద పడింది. ఆబ్రాహ్మణుడు కళ్ళు తెరిచి చూసి జపం చేస్తుంటే చప్పుడు చేయడమే కాక మురికి నీరు నాపై పడేటట్లు చేసిందెవరు అని కోపంగా చుట్టూ చూసాడు పక్కన నీళ్ళలో నిలబడి బట్టలు ఉతుకుతున్న రజకుడు కనపడ్డాడు. కోపంతో ఊగిపోతూ రజకుణ్ణి పట్టుకుని దబా దబా బాదేసాడు. రజకుడు ఏమీ మాట్లాడలేదు. వెంటనే కోపంతీరి అరెరె ఇలా చేసానేమిటి? నేను బ్రాహ్మణుణ్ణి, స్నానం చేసి జపం చేసుకుంటున్న నేను ఇతన్ని ముట్టుకున్నానే అని చిరాకు పడి చెఱువుకి ఒక పక్కకి వెళ్ళి తిరిగి స్నానం చేయసాగాడు. అదే సమయంలో రజకుడు కూడా అతనికి ఇంకో పక్క స్నానం చేస్తూ కనిపించాడు. "నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి శుద్ధికోసం స్నానం చేస్తున్నాను నువ్వెందుకు స్నానం చేస్తున్నావు?" అని అడిగాడు. అంత రజకుడు "అయ్యా! పుట్టుక చేత మీరు బ్రాహ్మణులు, మీరు వందనీయులే, కానీ మీ క్రోధం చేత మీలో ఛండాలుడు ప్రవేశించాడు, ఛండాలుడు నన్ను ముట్టుకున్నందుకు శుద్ధికోసం నేను స్నానం చేస్తున్నాను" అని చెప్పాడు. అప్పుడు ఆబ్రాహ్మణునికి తాను చేసిన తప్పు తెలిసి అందరితోనూ ప్రేమతో మెలగడం, క్షమను అలవాటు చేసుకున్నాడు, క్రోధాన్ని వదిలాడు. సమ దృష్టి కలిగి ఉండడం అలవర్చుకున్నాడు. అతనిలోని పాండిత్యం, ఆత్య విద్య చూసి అతని వద్ద ఎందరో రాజాధి రాజులు, రాజ్యాలే దాసోహమన్నాయి. ఆయన మాత్రం సత్ లో రమిస్తూ జీవితాన్ని పండించుకున్నాడు.
మీ

No comments:

Post a Comment