రాజ్యాంగ కర్తలు రాజ్యాంగ నిర్మాణంలో
చేసిన పెద్దలోపం, వారు విస్మరించిన విషయం ఏమిటో మొన్న హానరబుల్ జస్టిస్ మిశ్రా
తీర్పులో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. భౌతికమూ లౌకికమూ ఐన
న్యాయాన్యాయాల విషయంలో ఈ రాజ్యాంగాన్ననుసరించే చట్టాలు పనిచేస్తాయికాని, మనిషిని
మనిషిగా నిలిపే నైతికత విషయంలో ఇదేమీ చేయజాలదు. అవి చిన్నప్పుడే తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు నేర్పించాలి. తెలిసో తెలీకో హానరబుల్ జడ్జి గారు ఈ అనవసర కామెంట్
(సిక్యులర్ల సెల్ఫ్ గోల్) ఓ విధంగా మంచిపనే చేశారు.
ఉన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు
తెరిచి, పిల్లలకి చిన్నపటినుండే శ్రీ రామాయణ భారత భాగవతాది కావ్యాలు, వాటిలోని
సారమైన సత్య- ధర్మాదులు, నిబద్ధత, నీతి - నియమాలు, మానవీయత - సామాజిక కర్తవ్యం -
ధార్మిక జీవనం, భర్తృహరి నీతి శాస్త్రం, పంచతంత్ర కథలు అందులోని నీతి, నైతికత ఇవి
పిల్లలకి ఇంట్లో నేర్పించండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కనీసం ప్రతివారం
వారానికి రెండురోజులు తమ పీరియడ్లలో ఒక్క ఐదేసి నిమిషాలలో ఒక నీతి విషయం
బోధించండి. ఈ చట్టాలు, రాజ్యాంగం త్రీస్టేట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నీతి నైతికత
బోధించలేవని హాన్రబుల్ జస్టిస్ మిశ్రా జాతీయ గీతం గురించిన తమ తీర్పులో స్పష్టం
చేశారు.
సనాతన ఆర్ష వాజ్ఞమయమా వర్థిల్లు ! జయ జయ!!
-శంకరకింకర
No comments:
Post a Comment