Pages

Tuesday, October 10, 2017

బస్తీ మే సవాల్..!!! అది కాదు కావలసింది

శ్రీ గురుభ్యోనమః

"నాకంతుంది నాకింతుంది, ఇంత గొప్పది ఉంటే నాదగ్గరుండాలి తప్ప వాళ్ళ దగ్గరుండడమేమిటి?. "నేనన్నిటిలో యెక్కువే అందరికన్నా ఎక్కువే, ఎవరికన్నా తక్కువ కాదు" రాముడికేముంది నాముందు నిలబడలేడు ఆఫ్ట్రాల్ మానవుడు అడవులబడినవాడు" అంటూ... నేనంత వీరుణ్ణీ, అంత పండితుణ్ణీ, అంత అందగాణ్ణీ, అంత ఐశ్వర్యమున్నవాణ్ణీ, అన్జి భోగాలున్నవాణ్ణీ అన్న వాడికి సీతమ్మ ఓ చిన్న గడ్డిపోచ చూపి నీ స్థాయి యిదీ అని చూపింది.

"నేనెంతమ్మా, నావెనక అవతల వేపు అంతమంది మహానుభావులున్నారు నాకన్నా ఎంతో బలవంతులున్నారు, గొప్పవాళ్ళున్నారు, నాతో సమానమైనవారున్నారు కానీ నాకన్నా తక్కువవాళ్ళెవరూ లేరమ్మా" అసలే పిల్లిపిల్లంతై అని వినయంతో కుచిచుకుపోయిన హనుమని ఉత్సాహపరచి, అడవుల్లో రాజ్యంకూడా సరిగాలేని సుగ్రీవుడికి సచివుడు, ఒక శాఖామృగంగా ఉంటూ అడవులు, కొండలు, గుహలు, చెట్లు ఆవాసంగా ఉంటూ ఉండే హనుమతో, మేరుమందర సంకాశమైన అవతార ప్రకటనం చేయించి చూడామణి యిచ్చి లంకా దహనం చేయించింది ఆ సీతమ్మే..

డిసైడింగ్ ఫ్యాక్టర్ రావణుడిలా ఏయ్ కమాన్ గుసగుస బస్తీ మే సవాల్ కాదు నీ జీవన విధానం, నీ ఆస్తిక్య బుద్ధి, నీ వినయం. అదీ దివ్యత్వాన్ని కలిగిస్తుంది. ఆత్మకి (సీతమ్మకి) ఆనందాన్నీ జవాన్నీ కలిగిస్తుంది.

- శంకరకింకర

1 comment: