మనిషెంత హిపోక్రాట్ అంటే, ప్రాకృతికమైన లేదా ఒక నియతికి లోబడి అంటే తనకన్నా ముందు సృష్టించిబడిన ఏ ప్రమాణముతోటో ఉన్న హెచ్చుతగ్గులను అంగీకరించడు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలుకూడా ఎన్నడూ సములు కారు, కాలేరు. కానీ, అదే వ్యక్తి తాను సృష్టించుకున్న ధన, వస్తు, విద్యా, మేథ, సంపత్తి, అధికార, తాహతుల ఇత్యాదుల ద్వారా అదే అసమానతలను తాను వ్రాసుకున్న చట్టసమ్మతమైన వాటిని నిర్మొహమాటంగా అంగీకరించగలడు. నిజానికి ప్రకృతిలో అసమానత ఒక భాగం, అసమానత ఉన్నా దేని స్థాయి దేని ప్రత్యేకత దానిదే. ప్రకృతినర్థం చేసుకోనంత వరకూ, ప్రకృతి నియమాలనర్థం చేసుకోనంత వరకూ తన అవగాహనా రాహిత్యాన్ని ప్రశ్నించడం విప్లవం అనుకుంటాడు, సమాజాన్ని సంస్కరించుకోవడం అనుకుంటాడు. ఎంతైనా మనిషికదా హిపోక్రసీ ఎక్కువ. దాన్ని మనిషి అర్థం చేసుకోనంత వరకూ అర్థం చేసుకోలేని యుగ కవులూ, మహాకవులూ పుట్టుకొస్తూనే ఉంటారు.... వారి వెంట వెంపర్లాడేవారూ పుట్టుకొస్తూనే ఉంటారు. ఒక మనిషి ఇంకోమనిషికి ఎన్నడూ సమం అవ్వలేడు. మనిషికి మనిషేకాదు ఏజీవీ మరోజీవికి సమం కాదు, సమానత్వం సాధించడం కుదరని పని. సమానంగా చూడమని కోరుకుంటేనో నిర్భంధిస్తేనో వచ్చేది కాదు. ప్రతి వ్యక్తిలో ఎదుటివారిపట్ల ఆదరభావం, ఉదారత, ఒకరికోసం మరొకరి త్యాగబుద్ధి పెచ్చరిల్లాలి. దానికి చోదనం ఒకటే సోదరభావన. అందుకే శంకరులు మాతాచ పార్వతీ పితాదేవో మహేశ్వరః బాంధవాశ్శివభక్తాశ్చ అని ప్రార్థననిచ్చి అందరినీ ఒక కుటుంబానికి చెందినవారిలా చేసారు. ఈ యుగంలో సమత్వ దృష్టి చాటింది, సమత్వ భావననెలా అలవర్చుకోవాలో చెప్పి పెంపొంచింది ప్రచారం చేసింది జగద్గురు ఆది శంకరులే, ఆ తరవాత ఎందరైనా ఆ భావాన్ని పలు విధాల చాటవచ్చుగాక.
-శంకరకింకర
No comments:
Post a Comment