Pages

Monday, January 7, 2019

సజ్జన సంగం పొందినా ... తస్మాత్ జాగ్రత


దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకమ్ !
మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః !!

సజ్జనుల సంగం దుర్లభమైనది. అది దొరికనప్పుడు తామర కొలనులో ఇతర జీవాల్లా కాకుండా అడవినుంచి వచ్చి ఆ తామరలలోని మధువును గ్రోలే భ్రమరంలా ఉండగలిగిననాడు సజ్జనులను, సత్పురుషులను ఆశ్రయించినవారి జన్మ సార్థక్యాన్ని పొందుతుంది. అలాకాక, సజ్జన సంగం పొందినా అంతశ్శత్రువులకు లొంగిననాడు, పొందవలసినదానియందార్తి లేక, ఆ తామరతూడు చుట్టూ బురదలో తిరగడంలోనే ఆనందం వెతుక్కోవడం అంటే,  ఆ కొలనులో తామరచుట్టూ తిరిగే ఇతర ప్రాణుల వంటి మరో జీవితమే! తస్మాత్ జాగ్రత శంకరకింకరా!


2 comments:

  1. Nagendra Ayyagari Garu

    Can I copy and paste in Groups like Whatsapp??

    ReplyDelete