Pages

Tuesday, January 22, 2019

'చిత్‍'తు రాతలు గీతలు


నువ్వేం పెద్ద ధర్మాత్ముడివా? శ్రీరాముళ్ళా బిల్డప్ ఇవ్వకు!
నువ్వేం పెద్ద పండితుడివా? మహామహోపాధ్యాయలా బిల్డప్ ఇవ్వకు
నువ్వేం పెద్ద సిద్ధాంతివా? వరాహమిహిరుడు ఆర్యభట్టుల్లా బిల్డప్ ఇవ్వకు
నువ్వేం పెద్ద సాహితీవేత్తవా? విశ్వనాథవారిలా ఫోజు కొట్టకు
నువ్వేం సంగీతజ్ఞుడివా? నువ్వేం ఎమ్మెస్సూకాదు బాలమురళీకాదు
నువ్వేం...... వా? నువ్వేం...... కాదు, కాస్త తగ్గు.

ఔను, నేను పైవేవీ కాదు. కేవల సాధకుణ్ణి, అతి చిన్నవాణ్ణి.
సరే ఇంకా చెప్పేదా... ధర్మాత్ములందరికీ రాముడాదర్శమే కానీ అందరూ రాముళ్ళే కానక్కరలేదు.

మహామహోపాధ్యాయలేకాదు ఏ బిరుదులు డిగ్రీలు పట్టాలు లేకున్నా పండిన పండితులెందరో,

జీవనగమనానికి ఆర్యభట్టు వరాహమిహిరుడేకాదు రోజువారీ పంచాంగ చూసి అన్వయం చేసుకోగలిగినా పండిపోవచ్చు.

కవికులనాథ విశ్వనాథయే కాదు కాళిదాసైనా కూడా అక్షరాలతోనే మొదలు

ఎమ్మెస్సూ, బాలమురళివంటి సంగీతమేకాదు జోలపాడే తల్లి, చెల్లి, భార్య నువ్వూ సంగీతజ్ఞులే....

శ్యామకృష్ణుని సంగీతానికి జీవించి ఉండగానే పెద్దపేరు రాలేదు ఐనంత ఎవరికీ తక్కువ కాదు అందరికన్నా ఎక్కువే...

ఎందరో మహానుభావులు అందరికీ సాష్టాంగాలు, ఎందరెందరికీ పద్మాలూ, రత్నాలు రాలేదు దానర్థం వచ్చినవాళ్ళు ఎక్కువకాదు రానివాళ్ళు తక్కువకాదు.

పోన్లే అది వదిలెయ్.... చెప్పినా అర్థంకాకపోవచ్చు... ఆలోచనా పరిథి విస్తృతమైతే తప్ప అర్థం అవదు.....

"నువ్వదా, నేనిది" అని ఎంచడాన్ని వదలుతున్నవాణ్ణి
"నువ్వదా, నేనిది" అని ఎంచడాన్ని ఎదిరిస్తున్నవాణ్ణి
వెరసి "నువ్వుకు నేనుకు " మూలాన్ని
పై ఏ ముసుగూ లేని వాణ్ణి,
అవేవీ దాయలేనివాణ్ణి
అణగి ఉండేవాణ్ణి.

-శంకరకింకర


No comments:

Post a Comment