Pages

Tuesday, January 22, 2019

నిలిచే చైత్యాన్ని, ఓ దూర్వాంకురాన్ని!

చిరు గాలికి వణికే చిగురుటాకును కాను
ఎదురొడ్డినిలిచే చైత్యాన్ని!

ప్రభంజనానికి వెరసే అడవి మ్రానుని కాను 
తలయెత్తి నిలచే దూర్వాంకురాన్ని!

గంభీరం నా ఆహార్యం
వినయం నా భూషణం

తిలకం నా దర్పం
శిఖయే నా ధర్మం

మాటే నా ఆయుధం
భావం నా కవచం

మౌనం నా తత్వం
తపం నా జీవం

వెరసి,
నిలిచే చైత్యాన్ని,
ఓ దూర్వాంకురాన్ని!

శంకరకింకర

No comments:

Post a Comment