Pages

Tuesday, July 11, 2017

హేతువాది అతిపెద్ద మూఢవిశ్వాసం

హేతువాది, నాస్తికవాది దృష్టిలో ఆస్తికులందరూ ఆలోచన చేయనివాళ్ళు లేదా ఆలోచించే శక్తిని వదులుకున్నవాళ్లు గిరిగీసుకుని బ్రతికేవాళ్లు. ఆస్తికుడైన వ్యక్తి ఒక వ్యక్తికి పనికివచ్చే మాట మాట్లాడినా పదిమందికి పనికి వచ్చే పని చేసినా ఆ వ్యక్తి మాట ప్రభావం వలన సమాజంలో ఏ మంచి జరిగినా దాన్ని ఒప్పుకోలేడు. ఒక వ్యక్తిని రోడ్డు దాటించే సహాయం నుంచి తీసుకుని జీవితాన్ని పండించుకునేదైనా లేక సమాజానికి పనికి వచ్చే ఎంత పెద్ద మాట సహాయమైనా సరే జరిగిన ఆ మంచిని అంగీకరించలేడు. పూర్వ నిర్ధారిత సిద్ధాంతం భావజాలం వల్ల ధార్మిక ఆలోచనలు గానీ లేదా మత సంబంధమైన సాహిత్యం కానీ ఎంత మంచిదైనా సహేతుకం కానివనీ, అవి పనికిరానివనే అపోహలో బ్రతికేస్తుంటాడు. ఆ భ్రమ కూడా ఓ మతమే అనీ తానందులో భాగమనీ ఎరుగడు, ఎరిగినా అహం వల్ల అసలంగీకరించడు.

ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయం అనేవి అభివృద్ధికి అడ్డుఅనీ భౌతికంగా ఎన్నో సాధించదలచుకున్నవి వీనివల్ల కుదరదనీ ప్రగాఢ విశ్వాసం. ఐతే వాళ్ళు తమ సిద్ధాంతాల ప్రచారానికి కూడా ఎన్నుకునే మార్గం కళలే. రచన ఒక కళ, బోధన ఒక కళ, ఇంద్రజాలాది ప్రదర్శనలు ఒక కళ, పాట ఒక కళ. ఐనా కానీ వీళ్ళ దృష్టిలో కళ అనేది కేవలం వినోదానికే ఉండాలనీ, దానివల్ల పరంపరాగత చారిత్రక సంప్రదాయిక విషయాలు చెప్పకూడదనీ దాని వల్ల మౌఢ్యం పెరుగుతుందనిన్నీ ఒక నమ్మకం. విచారణ విశ్లేషణ చేయకుండా కళలు, ధార్మిక విషయాలు, మత సంబంధ విషయాలు ఆసాంతం పనికిరాని మూఢవిశ్వాసాలని విశ్వసించడం అతిపెద్ద మూఢవిశ్వాసం. ఆ విశ్వాసంలోనే బ్రతుకుతూ హేతువాదులు నాస్తికులు జబ్బలు చరుస్తుంటారు.

ఏ ఆస్తికుడు కానీ ధార్మికుడు కానీ ఏ నాస్తికుణ్నీ హేతువాదినీ అగౌరవ పరచడు. నిజానికి ఆస్తికులెవరూ ఒకరిపట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించరు అకారణంగా నిందకూడా చేయరు. ఇతరుల్ని అనవసరంగా అకారణంగా విషయం తెలియకుండా గేలి చేసి మాట్లాడరు. దీనికి ఫక్తు వ్యతిరేకం హేతువాదులు, అవతల వ్యక్తి ఎంత సహృదయుడైనా అతని వల్ల, అతని మాటల వల్ల ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి ఎంత మంచి జరిగినా ఒప్పుకోడు. అది మంచే కాదంటాడు. భౌతికమైన, ఆర్థికమైన అభివృద్ధే మంచి గా బేరీజు వేస్తాడు తప్ప వ్యక్తిగత, కుటుంబగత, సామాజిక శాంతి సౌఖ్యాలు వాని పవిత్రతని అంగీకరించడు. దివ్యత్వాన్ని, పవిత్రతనీ అంగీకరించని వానికి దేవుడెలా అర్థం అవుతాడు? తాళం వేసి ఇంట్లో కూర్చున్నవాళ్ళని గుమ్మంలోంచి బైటకి తీసుకురావడం, అవగతం చేసుకోవడం అన్నవిషయానికి వ్యతిరేకంగా బుర్రకి తాళం వేసుకున్న వాళ్ళకి అర్థం చేయించడం కుదరని పని. కూడా ఎక్కడా ఏ డిక్షనరీలోనూ లేని అర్థాన్ని అప్పటికప్పుడు కలిపించి మరీ మంచి అంటే అది కాదు ఇదీ అనే అర్థం సృష్టిస్తాడు. అసలు ప్రజలకి మంచి అంటే అర్థం కేవలం భౌతికం, ఆర్థికం అన్న భావనలో ఉంటాడు.


ఆస్తికులు తమకున్న ఆధ్యాత్మిక భావాలవల్ల కొన్ని కట్టుబాట్లకి లొంగి ఉంటారు. ఎక్కువగా సామాజిక కట్టుబాట్లకి లొంగి తమ జీవనాధారాన్ని సాగిస్తారు. మానవుడు సంఘజీవి అన్న కనీస జీవన సూత్రాలననుసరించి సామాజిక కట్టుబాట్లననుసరిస్తాడు. నాస్తికుడు లేదా హేతువాదులు ఈ కట్టుబాట్లకి ఫక్తు వ్యతిరేకులు. ఇక్కడే, ఇదే వారి అసలు వ్యథ. అలవిమాలిన స్వాతంత్ర్యాన్ని నిగ్రహించేటటువంటి సామాజిక రీతి నియమాల్ని అంగీకరించలేక దాన్ని నిర్దేశించే, లేదా ఉపదేశించే నీతి ఏ రూపంలో ఉన్నా ఏ రూపంలో చెప్పబడినా వ్యతిరేకించడం, అసహన ప్రకటనం, తూలనాడడం జరుగుతుంది. ఆ నీతి నియమాలని ధార్మిక జీవనాన్ని ఎవరు బోధ చేసినా, ప్రచారం చేసినా, వారిని శత్రువులుగా చూసి నీచ కర్మమైన వ్యక్తిగత దాడికి, వ్యక్తిత్వ హననానికి ఒడిగడతారు. కట్టుబాట్లకి లొంగని మనిషికీ ఇతర జంతు జాలానికీ తేడా ఉండదు. కేవలం అవి మాట్లాడలేవు ఇతను మాట్లాడగలడు.

“Science without religion is Lame;
Religion without science is Blind.”
-Albert Einstein

-శంకరకింకర


4 comments:

  1. మతానికి ముందు నైతికత, సంఘజీవనం ఉన్నాయి. తరువాత ఉంటాయి. మతం కేవలం ఆరెండింటిని హైజాక్ చేసి, దానికి కులాల (లేదా క్లాస్‌ల) రంగులద్ది మొత్తం వ్యవహారాన్ని అమానవీయం చేసింది. ఆ అమానవీయతే మతం బోధించే సాంఘిక కట్టుబాట్లైటే, వాటిని కోరుకుంటున్న మీ నైతిక స్థాయి నాకు అర్ధం అవుతూనే ఉంది. దానితోటే మీ ఆలోచనా స్థాయికూడా. మతాలు చెప్పే కట్టుబాట్లు మనల్ని జంతువులకనా హీనస్థాయికి ఏవిధంగా దిగజార్చాయో మనం ఇప్పటికే చూశాం. మీకు అవే కమ్మగా ఉంటున్నాయి మరి.

    ఓ పనిచెయ్యండి. మనుషుల మధ్య గీతలు గీసి, ఒకర్ని ఎక్కువగా, ఒకర్ని తక్కువగా చూపని మతాన్ని, ఒకర్ని దేవునికి ముద్దొచ్చేవారు, మిగతావారు నరికిచంపదగ్గవారు అని క్లాసిఫై చెయ్యని మతాన్నొకదాన్ని చూపించండి. అలాంటి రాతలు లేని మతగ్రంధాన్నో, పురాణాన్నొ చూపించండి. మిమ్మల్ని నమ్ముతాను.

    అన్నట్లు Einstein నాస్తికుడు. మీరిచ్చిన కోట్‌కూడా out of the context కోట్ చెయ్యబడుతున్నదే!


    కొందరు సోమరిపోతులు శారీరక శ్రమని తప్పించుకోవడానికి, అలా తప్పించుకుంటూ తామేదో అతిముఖ్యమని చెప్పుకొని అపరాధభావను ఎగరగొట్టుకోవడానికి తయారనవే ఈ మతాలు. మీంతంలో దాని చాలా స్పస్టంగా చూడొచ్చు. తర్కానికీ, experimentationకీ అందని ఈ చెత్తంతా ఊడ్చేస్తేనే మనుషులు మనుషుల్లా బ్రతగ్గలరు.

    ReplyDelete
    Replies
    1. నమస్తే! మీకు స్వాగతం
      మీ "ఈ సమస్తం చెత్త అనే అంథ విశ్వాసాన్నే" ఎండగట్టడం జరిగింది. పరోపకారార్థమిదం శరీరం, లోకాసమస్తాసుఖినోభవంతు అన్నది నా వాఙ్మయం. వాఙ్మయం చదవకుండా పైపైన అక్కడో ఇక్కడో మతం పేరిట జరిగిన దాష్టీకాల్ని ఎత్తిచూపడం కన్నా, మానవాళి నాశనాన్ని కోరే చెత్త పరిశోధనలవలన, దానిమీద ఆధారపడి హేతువాదం, కమ్యూనిజం అవి సృష్టించిన రాజకీయ, ఆర్థిక అసమానతల వలన మానధనప్రాణ హననాలే ఎక్కువ అని తెలుసుకోవాలి... సాటి మనిషిని మనిషిగా చూడక, మనిషిలోని మంచిని పెంచే నీతినియమాలను మంచి నమ్మకాన్ని సౌహార్ధ్ర భావనతో చూడక, ఆటవికునిలా గేలి చేసే హేతువాది, నాస్తికవాది, తీవ్రవాద సిద్ధాంత కమ్యూనిష్టులకన్నా, ఏదో నమ్మకంతో ప్రశాంతంగా జీవించి పది మంది శాంతిని కోరుకునే "మనిషే" గొప్పవాడు.

      అకారణ ద్వేష హింసలు ఏరూపంలో ఉన్నా మతమైన, తీవ్రవాదమైనా, హేతువాదమైనా నిందనీయమే. హింస అంటే ప్రాణ హననం, హింస్ంటే వ్యక్తిత్వ హననం, హింసంటే వ్యక్తి నింద, హింసంటే కించపరచడం, హింసంటే ధన మాన హననం, ఏ సుపీరియర్ థాట్స్ కి వ్యతిరేకమని హేతువాదులు ప్రకటించుకుంటారో వాళ్ళే తమని తాము తమ సిద్ధాంతాన్ని తాముగా సుపీరియర్ అని చెప్పుకోవడం కన్నా హాస్యమేముంటుంది.

      PS ఐన్స్టీనే కాదు మన చలం కూడా మొదట్లో నాస్తికుడే...
      స్వస్తి మీకు మంచి జరుగు గాక _/|\_

      Delete
    2. Alekhya ante?!!!???

      Delete
  2. "మతాలు చెప్పే కట్టుబాట్లు మనలని జంతువులకన్నా హీనం గా తయారుచేసాయి....." అంటే భగవంతుని సృష్టిలో, భగవంతుని దృష్టిలో ప్రకృతి,పర్యావరణం,జీవరాసులు అన్నీ సమానం కాదంటారు. మరి మతం కన్నా ముందునుండీ ఉన్న సంఘజీవనం , నైతికతా ఎక్కువ తక్కువలు లేకుండా చూసినవే అయితే మనకన్నా జంతువులు తక్కువ అని ఎలా అనుకుంటున్నారు, మనం జంతువులకన్నా హీనం గా తయారయ్యామని??
    సరే ఇంకొక మాట అదే జంతువులకి సంసారం,బంధాలూ,బంధుత్వాలూ కొంచం తక్కువ లేక పరిమితం, కానీ ధర్మ చెప్పిన కట్టుబాట్లతో మనం కొన్ని బంధాలకీ, ఒక కుటుంబ వ్యవ్స్థకీ కట్టుబడి ఉంటున్నాము కదా, అది మీకు జంతువులకన్నా హీనం గా కనపడుతోందా?? లేక జంతువులలాగ కుటుంబం, బంధాలూ, కట్టుబాట్లూ లేకుండా ఉండడం మీకు గొప్పగా ఉంటుందా???

    నైతికత ని మతం హైజాక్ చేసిందా, కొంచం సమాజం లో నైతికత అంటే ఏమిటో చెప్తారా?? అదే నోటితో సంఘజీవనం అంటే ఏమిటో కూడా, కొంచం వినాలని ఉంది.

    ReplyDelete