Pages

Saturday, July 8, 2017

పోటీతత్త్వం

శ్రీ గురుభ్యోన్నమః

ఈ చిన్ని కథ మనలో చాలా మందికి తెలిసినదే ఐనా మొన్న మా గురువుగారి నోట మరోసారి వినడంతో అందరితో పంచుకుందామన్న ఉద్దేశ్యంతో పంపుతున్నాను.

నేటి  విద్యా విధానాలుజీవన విధానాలు ఒకటేమిటి అన్నీ కాంపిటీటివ్నెస్స్ తోపోటీ తత్త్వంతో సాగుతున్నాయిదానివల్ల పొందేది సింహభాగం అనర్థంఎక్కడో అతి కొద్ది ప్రయోజనం ఉండచ్చుఆఖరికి ఈ పోటీతత్త్వం ఆధ్యాత్మిక జీవనంలో కూడా ప్రవేశించిఅసలు ఆధ్యాత్మికతను మరుగున పడేసి ఆడంబరాలనుడాంబికాలను ప్రోత్సహిస్తోంది... సాధనలో ఎన్నోమెట్లు ఎక్కినవారే దీనికి లోనౌతుంటేఇక సామాన్యుల సంగతి చెప్పఖ్ఖర్లేదుగా.. ఈ పోటీతత్త్వమే రాను రానూ స్పర్థలకి దారితీస్తోంది.

ఇక కథలోకి వస్తే...కథ పాతదేపైన చెప్పిన ఉపోద్ఘాతంచేప్తున్న నేను కొత్త అంతే..
పూర్వం ఒకానొక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారువారిని చిన్నప్పట్నుంచీ వారి తల్లిదండ్రులు అందట్లోనూ గొప్పవారు కావాలన్న ఉద్దేశ్యంతో పుత్ర వాత్సల్యంతో వారిని వివిధ శాస్త్ర పారంగతులని చేయడంలో ఇతరులతోటి సామం చూపి పోటీతత్త్వాన్ని పెంపొందించారుచివరకి వారి మధ్యనే వారికి పోటీ పెరిగిందిఆ తల్లిదండ్రులు కోరుకున్నట్టు వారికి విద్యావిషయాలలో పోటీ పెరిగి వారు చదువుకున్న దాంట్లో వారు నైపుణ్యం సంపాదించారుకానీ..... వారి నరనరాల్లో ఆ పోటీ తత్త్వం ఇమిడి పోయిందిఅలా చాలా రోజులు జరిగాయి..
ఒకనాడు ఆ ఇద్దరూ భగవంతుని గూర్చి తపస్సు చేసి అనుగ్రహం పొందాలనుక్కున్నారుఅలా తపస్సు చేయడంలో కూడా పోటీ పడ్డారుఎవరికి తొందరగా భగవంతుడు దర్శనమిచ్చి వరమిస్తాడో అన్న విషయం నుంచి ఎవరికి గొప్ప వరం పొందుతారో అన్నంత వరకూ పోటీ పడ్డారుఅలా ఇద్దరూ ఒక అడవికి చేరి తపస్సు చేద్దామని ప్రయత్నించారుఒక పెద్ద చెట్టును చూసి అక్కడ తపించాలనుక్కున్నారుమళ్ళీ అక్కడా పోటీతత్త్వం వారిని గెలిచింది.. ఒకడు చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేద్దామనుక్కుంటే ఇంకొకడు చెట్టు చివర కొమ్మలపై కూర్చుని తపస్సు చేద్దామనుక్కున్నాడు కారణం వాడి తలపులో భగవంతుడు పైనుంచి క్రిందకి దిగేటప్పుడు మొదట వాణ్ణి అనుగ్రహించి క్రిందివాడిదగ్గరకెళ్ళాలని తపస్సు చేయసాగాడు... వారి తపస్సులో సాత్వికతలేకుండా పోయింది... అక్కడా ఈ కాంపిటీటివ్నెస్స్ విజృంభించింది.  అలా కొన్ని రోజులు గడిచాయి... భగవంతుడు వారి నిశ్చల తప్పస్సుకు మెచ్చి భగవంతుడు వారికి వరాలివ్వడానికి క్రిందికి దిగివచ్చి చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్నవాడ్ని వరం అడిగాడువాడు ఏం వరమడిగినా క్రిందివాడు తనకన్నా ఎక్కువ ఏదైనా అడుగుతాడేమో అన్న భావనతో భయపడి క్రిందివాడేది అడిగితే దానికి రెండింతలు నాకిమ్మని కోరాడుసరే అని భగవంతుడు చెట్టుకింద తపస్సు చేసుకుంటున్నవాడి దగ్గరకి వెళ్ళి ఏంకావలని అడగగా,వాడు ఆలోచించితనతో పుట్టినవాడు ఎలా ఆలోచిస్తాడో గుర్తెరిగినవాడు కావటం చేత భగవంతుడా నాకు ఒక చెయ్యిఒక కాలుఒక కన్ను పని చేయకుండా చేయమని కోరాడుఅంటే ఈ పోటీ తత్త్వంతో పెరిగిన స్పర్థలవల్ల తన తోబుట్టువు గెలవకూడదు భగవద్విషయంలోనూ తానే గెలవాలన్న మంకుపట్టుతో తనకి ఒక కాలుచెయ్యికన్ను పోయినా తమ్ముడికి రెండూ పోతే తానే గెలిచినట్టు భావించాడు అదే గెలుపనుక్కున్నాడు.

ఇదీ ప్రస్తుత కాంపిటీటివ్నెస్స్ యొక్క ప్రభావం ఎవరితో పోటీ పడుతున్నామోఏ విషయంలో పోటీ పడుతున్నామోదాని పర్యవసానాలేమో తెలియకుండానేఅక్షరాభ్యాసంనుంచే వారికి పోటీ తత్త్వం అలవాటు చేసి వారి ఆలోచనా సరళినిభావిజీవితపు పునాదులను నిర్వీర్యం చేస్తున్నాం మనం.

కనీసంలో కనీసం ఈ పోటీలు ఆధ్యాత్మికతను దూరంగా ఉంచితే బాగుండు అది ఇప్పుడు ఇక్కాడా రాజ్యం చేయాలని చూస్తోందిపోటీలేకుండా అందరం కలిసి సామరస్యంగా ముందుకు సాగడం ఉత్తమంఎవరి శక్తి మేర వారు ముందు వెనకలుగా ఉంటారు అంతే...

సర్వం గురుచరణారవిందార్పణమస్తు
-శంకరకింకర
03-Dec-12

No comments:

Post a Comment