Pages

Tuesday, February 24, 2015

నేను చాలా తెలివైన వాణ్ణి...

ఎప్పుడో ఫేస్ బుక్కులో వచ్చిన కొన్ని పోస్ట్లు తెనిగించా...
-
మా ముత్తాత గారు వేద విదులు త్రికాల సంధ్య చేసేవారు, మా తాతగారు త్రికాల సంధ్య చేసేవారు, మా నాన్నగారు ప్రాతః సంధ్య, దేవతార్చన. వాళ్ళకి సమయం విలువ తెలీదు! నాకు అవన్నీ కుదరవు! వాళ్ళకున్నసమయం నాకులేదు నేను తెలివైనవాణ్ణి.

-మా ముత్తాతగారు పెద్దలు కనబడితే ప్రణిపాతం, అభివాదం చేసేవారు, మాతాతగారూ అభివాదం చేసేవారు, మానాన్నగారికి తెలుసు కొంతమందికి చేసేవారు మమ్మల్నీ పెద్దలకి నమస్కరించమని చెప్పేవారు, ఇప్పుడు నేను ఇండివిజ్యువలిస్ట్ ని, నా పిల్లలు ప్రశ్నేలేదు నేను నా పిల్లలు మరోపెద్దాయనముందు తలవంచడం కాళ్ళు పట్టుకోవడం సవ్వాల్ లేదు... నేను తెలివైనవాణ్ణి.

-మా ముత్తాతగారికి శిఖ ఉండేది, తాతగారికి క్రాఫ్ తో పాటుండేది, నాన్నగార్కి కూడా, నాకు శిఖ లేదు కానీ పిల్లి గడ్డం, మేక గడ్డం ఉంది... నేను తెలివైనవాణ్ణి.

-మాముత్తాతగారు, తాతగార్లది పెద్ద కుటుంబం అందరూ కలిసి ఉండేవారు, మా నాన్నగారు చాలా యేళ్ళకు ఉద్యోగరీత్యా వేరు కాపురం పెట్టారు, నేను పెళ్ళితోటే వేరుకాపురం, నాపిల్లాడికి సంబంధం కుదుర్చుకునే ముందే చెప్పేస్తాను వేరుకాపురం పెట్టమని అప్పుడే నేనూ గృహాప్రవేశం చేస్తాను... సారీ వృద్ధాశ్రమ ప్రవేశం చేస్తాను.. నాకు తెలుసు నేనేమిచ్చానో అదే తిరిగొస్తుందని. నేను తెలివైనవాణ్ణి.

-మాముత్తాతగారి హయాంలో మా ఊళ్ళో ఉండేవారు లేదా కాశీలో ఉండేవారు. కాశీ వెళ్ళి చదువుకోవడం శాస్త్రిడిగ్రీ పొందడం కాశీవాసం, గంగాస్నానం గొప్ప విషయం, అక్కడ శాస్త్ర బోధ, చర్చ చేసేవారు, మారిన పరిస్థితులు మాతాతగారిని కొంత పాఠం చదివాక అప్పట్లో మెట్రిక్ తరవాత ప్రభుత్వోద్యోగం చేయించింది పట్నం పంపింది, ఆయనా కాశీ వెళ్ళేవారు. పరిస్థితులు మా నాన్నగారిని కాలేజీ చదువు చదివించాయి దేశంలోని ఇతర పట్నాల్లో ఉద్యోగానికి పంపాయి, మధ్యలో అప్పుడో సారి కాశీ వెళ్ళి కొన్ని రోజులుండి వచ్చారు, పరిస్థితులు నన్ను అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాలకు ఉద్యోగం కోసం పంపాయి.. నేను కాశీకి వెళ్ళలేదు.. వెళ్తానో లేదో తెలీదు... నా పిల్లలు ఉంటే విదేశంలో నాదగ్గర లేదా మరో విదేశంలో డిగ్రీలు ఉద్యోగం చేస్తారు విదేశవాసం, సముద్ర స్నానం, ఆకాశయానం చేస్తుంటాం, అదేదో పానీయ సేవనం చేస్తారేమో తెలీదు.. కాశీ వాతావరణం హైజీన్ గా లేని వాతావరణం, ఇరుకు సందులు, గంగస్నానం వాళ్ళ ఆరోగ్యానికి హానికరం. మా తాత ముత్తాతగార్లకు కాశీ వాసం ప్రియారిటీ మాకు విదేశవాసం... అంతే తేడా.. అంతా సేమ్ టు షేమ్

ఇంకోటి...

-నేను రిటైర్ అయ్యాను, నా పిల్లల్ని విదేశంలో డిగ్రీలు, ఉద్యోగం సంపాదించేలా పెంచాను వాళ్ళక్కడే స్థిరపడ్డారు. నేను వెళ్లలేను వాళ్ళురారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త జనరేషన్కి మాత్రం నీతులు చెప్తాను Don't run after money + Don't run after foreign degrees అని.... నేను చాలా తెలివైన వాణ్ణి...

-another... మా తాత ముత్తాలు సాంప్రదాయ పద్ధతులలోనే పెరిగారు, మా నాన్నగారూ అంతే, ఒక్క ఉద్యోగాలలో మార్పు తప్ప... నేను నా పిల్లల్ని ఆధునిక భావాలతో పెంచాను (modern upbringing) ఛాదస్తంతో పెంచలేదు. సాంప్రదాయం నాకు తెలీదు అందుకే అది ఛాధస్థం.. నేను చాలా తెలివైనవాణ్ణి..

మా తాతమ్మ, నానమ్మగార్లు ప్రత్యేకంగా మడి చీర కట్టుకుని వండి వార్చేవారు. పట్నంలో మా అమ్మ వాళ్ళలా కాకున్నా పాత పట్టుచీర కట్టుకుని మడి ఆచారం పాటించేది. హ్హుహ్హ్.. మా ఆవిడకి సౌకర్యంగా ఉండదు నార్త్ డ్రెస్సెస్ వేసుకుంటుంది లేదా పొడుగు గౌను (అదేనండీ నైటీ వేసుకుంటుంది)... చీర మాత్రం అప్పుడప్పుడూ పూజలు వ్రతాలకి మాత్రమే కడుతుంది మన సాంప్రదాయాన్ని కాపాడాలి కదూ, ...!!! తనూ నాలాగే చాలా తెలివైంది.. నాకైతే రెడీమేడ్ కుట్టిన పంచెలు (పంచెలనాలా పంచెలలాంటి పైజామా అనాలా) తనకన్నా పూజించే దేవుడికన్నా... నేను తెలివైన వాణ్ణి ...


.... ఇంకా చాలా ఉన్నాయ్ ఎంతని చెప్పుకుంటాం...
Disclaimer : Not pointed at any individual but the circumstances..

8 comments:


  1. >> నేను చాలా తెలివైన వాణ్ణి...

    ఆ స్టేట్ మెంట్ ఇవ్వటం లో నే మీ తెలివి తెలిసి పోతోందండోయ్ !! జేకే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కదా! నేనే వాళ్ళందరి కన్నా తెలివైన వాణ్ణి కదా!

      Delete
    2. Hi Mam,
      Similar to Midhunam Movie,seems people are doing good with , "Attached Detachment and Detached Attachment"

      Delete
  2. There is no wrong in following Attached Detachment and Detached Attachment...

    ReplyDelete
  3. నిజంగానే మీరు తెలివైనవాళ్ళు

    ReplyDelete
    Replies
    1. స్వాగతం శర్మగారూ, ఏదో కొద్దిగా కష్టపడితే ఈ ఫలితం (అదే మీ మెచ్చుకోలు) వచ్చింది...

      Delete
  4. అద్భుతః నాగేంద్ర గారూ...
    కానీ మీకన్నా నేను ఇంకా తెలివైన వాడిని... :)

    ReplyDelete