Pages

Wednesday, February 4, 2015

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 3

Continuation
////ఊ కొత్త వ్యాపారం.. భక్తి!
దేవుళ్లు మాత్రమే కాదు- ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చెప్పే నయా దేవుళ్లు కూడా పెరుగుతున్నారు. వారికి కూడా వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి సొంత అనుచర గణం, భక్తులు ఏర్పడుతున్నారు. మొత్తంమీద తెలుగు రాష్ర్టాలలో ఇప్పుడు భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారం అని ఎందుకు అనవలసివస్తున్నదంటే- దేవుళ్లకు, ఆయా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఇటీవలి కాలంలో విశేష ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా రోజు మా దేవుడిని దర్శించుకుంటే మీ పాపాలన్నీ పోయి, మీరు పునీతులు అవుతారంటూ ప్రకటనలు చేస్తుంటారు. అంటే, మామూలు రోజుల్లో దేవుడిని దర్శించుకుంటే ఏమీ లాభం లేదన్నమాట! ప్రలోభాలకు లోనుకాకుండా, మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవడానికై గతంలో దేవాలయాలకు వెళ్లి కొద్దిసేపు గడిపేవారు. ఇప్పుడు గంపెడు కోర్కెలతో దేవాలయాలకు వెళుతున్నారు. భక్తుల ఈ కోర్కెల చిట్టాలను ఓపిగ్గా వినలేక, దేవుళ్లకు తలపోటు వస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, మనలా దేవుళ్లు ఆ విషయం బయటకు చెప్పుకోలేరు. అమృతాంజనం గట్రా పట్టించుకోలేరు. ప్రచార హోరు పెంచి దేవుడిని కూడా వ్యాపార వస్తువుగా మార్చిన వాళ్లను ఏమనాలి? ఫలానా గుడిలో వెలిసిన దేవుడు పవర్‌ఫుల్‌ అంటారు. దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదా! ఫలానా గుడిలోనే ఆయన పవర్‌ ఫుల్‌గా ఎందుకుంటారు? అంటే, తమ గుడికి ఆదరణ పెరగాలని ఆయా గుళ్లను కట్టించినవారు కల్పిస్తున్న ప్రచారమే కారణం.//
//ఇప్పుడు లెక్కలేనన్ని పీఠాలు, ఆశ్రమాలు. వీరికితోడు, భక్తులను ఉద్దేశించి ఉపన్యాసాలు చేసేవారు మరికొందరు. వారికి ప్రచారం కల్పించేవారు ఇంకొందరు! మొత్తంమీద వీరంతా ఒక ముఠాగా ఏర్పడి స్వార్థపూరిత భక్తిని మనలో నింపుతున్నారు. పేరు రాస్తే నొచ్చుకుంటారు కనుక ఆ వ్యక్తి పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, ఆయన ప్రసంగాన్ని ఇటీవలే ఒక టీవీలో విన్నాను. సారాంశం ఏమిటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కార్తీక పౌర్ణమి నాడో, వైకుంఠ ఏకాదశి నాడో దీపాలు వెలిగించి దేవుడిని వేడుకుంటే చాలునట! అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఇంకో మతలబు ఉంది. దేవుడి పేరిట ఉపన్యాసాలు ఇస్తున్న ఇలాంటి వాళ్లంతా దేవుళ్లుగా మారిపోతున్నారు. అమాయక భక్తులు వారి కాళ్లకు మొక్కుతున్నారు. వారి చిత్రపటాలను తమ పూజా మందిరాల్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అంటే, గాడ్‌మెన్‌ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందన్నమాట! భక్తి అనేది ఒక బలహీనతగా మారడంతో, భక్తి పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించి లాభాలు గడించేవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటి దాకా విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం గురించి విన్నాం. ఇకపై భక్తి వ్యాపారం గురించి వినబోతున్నాం. భక్తి వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, నాస్తికులుగా ఉన్నవారు సైతం ఆస్తికులుగా మారి భక్తి వ్యాపారానికి బృహత్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.//

పీఠాలు ఆశ్రమాలు ప్రవచనకర్తలు పెరిగితే పెరిగేది సనాతన ధర్మ ప్రచారము దాని భక్తులు, దానికి అన్య మతాలు వారి అనుయాయులు ఉలిక్కి పడాలిగానీ సదరు పత్రిక/ మీడియా వారికి కలిగిన ఇబ్బంది ఏమిటో అర్థం కాలేదు, సనాతనధర్మాన్ని వ్యతిరేకించే మతాలతో లాలూచీ ఉందా లేదా ఎక్కడైనా కక్కుర్తి పడ్డారా అన్న అనుమానమూ ఉంది. సడెన్గా నలుపు తెలుపు పేపరు కలర్ లోకి మారింది అదీ రెండు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో తక్కువ వ్యాపరం చేస్తూ..... సరే అవి వారి రాజకీయ వ్యాపార విషయాలు అది మన సబ్జెక్టూ కాదు.

ఇక ఈ దేశంలో రాజ్యాంగ పరిథిలోనే ఉన్నతమైన గ్రంథంగా పరిగణింపబడుతూ కోర్టులలో ప్రమాణం చేయించే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పిన శ్లోకమిది.
చతుర్విధా భజన్తే మాం జనాస్సుకృతినోర్జున,
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ.
భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఆపత్తునందున్నవాడు, (భగవంతుని) తెలిసికొనగోరువాడు, ధనము(సంపత్తు) నభిలషించువాడు, (ఆత్మ) జ్ఞానముకలవాడు అను నీ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. (భజించుచున్నారు.)
భగవంతుడే చెప్పాడు అర్థార్థి అంటే డబ్బుకావాలన్నవాడు  కూడా నన్నే శరణువేడుతున్నాడు అని మరి ఈ కొత్తపలుకుల రచయితగారికెందుకో ఇంత కండూతితో కూడిన నొప్పి. ఈయనేవన్నా గీతాచార్యుడికన్నా గొప్పవారేమో మరి లేదా ఈ పత్రికవారు డబ్బుకోసం భగవంతుని కాక మరెవరిని ఎక్కడెక్కడ ప్రాధేయపడుతున్నారో ఆ భగవంతునికే తెలియాలి. పైగా అందరి కోర్కెలూ  గంటల కొద్దీ విని తీర్చడం సాధ్యంకాదని వీరి తీర్పున్నూ. చూసారా వీరి స్థాయి భగవంతునికే సాధ్యాసాధ్యాలు నిర్ణయించే గొప్ప స్థాయి సదరు సంపాదకీయులవారిది.

భక్తిని వ్యాపారం చేయడం ఎక్కడైనా తప్పే. ఒప్పని మెడకాయమీద బుర్రకాయ ఉన్న ఎవరూ చెప్పరు. భక్తి పేరిట పీఠాధిపతులు, ప్రవచనకర్తలు భక్తి ప్రచారం చేసేవారు ఒక ముఠాగా ఏర్పడ్డారు అని ఒక విపరీత వ్యాఖ్య చేయడం ఈ వ్యాసకర్త కళ్ళు మూసుకుపోయిన విషయాన్ని నిలువెత్తు మూఢపుటాలోచనలకు మానసిక వైక్లవ్యానికి ప్రతీక మూర్తీభవించిన అహంకార స్వరూపం. పాత్రికేయ ముఠాలలాగా భక్తిలో, ధర్మ ప్రచారంలో ముఠాలుండవు. వార్త సేకరించి ప్రచురించడానికి ప్రచురించకుండా ఉండటానికి ఎందరినో బ్లాక్ మెయిల్ చేసిన పాత్రికేయులు ఎందరో పత్రికా యజమానులమీదా ఈ ఆరోపణలు లేకపోలేదు. ఎదుటివాణ్ణి మోసం చేసే ఒక వర్గానికి కాపుకాసి డబ్బులు సంపాదించే కుహనా మీడియా ముఠాలున్నవన్నది ప్రత్యక్షంగా జగమెరిగిన సత్యం. ఆ పత్రికలోనే సత్యం ఒకచోట ఒప్పుకున్నారు అవినీతికి ఆధారాలుంచరుగా అని. ఐనా అందరూ తమలాగే ఉంటారనుక్కునేవారు కొందరుంటారు అందులో వీరూ ఒకరేమో... ఐనా అందరూ తమలాగే ఉంటారనుక్కునేవారు కొందరుంటారు అందులో వీరూ ఒకరేమో... అన్ని వ్యవస్థల్లోనూ, పత్రికల్లోనూ కక్కుర్తి పడే వాళ్ళున్నట్లే అక్కడక్కడా ఒకరిద్దరు మురికివారుండవచ్చు. వాళ్ళను చూపి సాంతం అంతే అనం కదా.. ఎవరైనా అంటే అంతకన్నా అవివేకి అజ్ఞాని ఎవరూ ఉండరు.


గత సంవత్సరం దేశంలోకి భక్తిపూర్వక దక్షిణ రూపేణా (డొనేషన్స్) వచ్చిన వందల కోట్ల రూపాయలలో90 % పైగా మిషనరీస్ కి సంబంధించినవి అందులో సింహభాగం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంస్థలవి. పైగా ఇవి CBIకి లెక్కలప్పజెప్పనివి. ఎక్కడ భక్తి వ్యాపారముంది? కళ్ళుజోడు మకిలి వదిలించి చూస్తే తెలుస్తుంది. దేవుణ్ణి, మతాన్ని ఎవరమ్ముతున్నారు? కళ్ళుమూసుకుపోయాయో లేక లాలూచీయో... (contd...)

No comments:

Post a Comment