Pages

Wednesday, February 4, 2015

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పత్రికా యజమానులు పాత్రికేయులు మీడియ స్వాతంత్ర్యం హక్కులు ఇత్యాది ముసుగులలో దాక్కుని తమ స్వంత ఉద్దేశ్యాలను, అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా లేదా మెజారిటీ ప్రజల అభిప్రాయాలుగా వ్యక్తీకరించి ప్రచురించడం మారిన పత్రికా విలువలకు (అనడం కన్నా కుపాత్రికేయ విలువలు అనడం సబబు అని నా అభిప్రాయం) నిదర్శనం. అన్ని విషయాలలోనూ తమ స్వంత అభిప్రాయాలని చేతిలో పత్రిక/ మీడియా ఉన్నదని ప్రజాభిప్రాయంగా ప్రచురించడం దురలవాటుగా మారింది. కుహనా రాజకీయ క్రీడలలో దాని పాత్ర ఎంతైనా ఉండవచ్చుగాక దాన్ని ప్రతిఘటించడానికి అంతే స్థాయిలో రాజకీయ వ్యవస్థా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉన్నది. మొత్తానికి రాజకీయాలలో విలువలతో సమాంతరంగా పాత్రికేయ /పత్రికా విలువలున్నాయనడంలో సందేహమూ నాకు లేదు. ఒకింత ముందుకెళితే రెండూ ఒకటినొకటి సమర్థించుకుంటూనే ఒకదానికొకటి విరోధమూ ప్రకటించుకుంటాయి. మొత్తానికి రెండు వ్యవస్థలూ లేదా వ్యవస్థలలో ఉన్న పెద్దలు ప్రజలను మభ్యపెట్టడంలో సమానంగా సిద్ధహస్తులే. అటువంటి దాంట్లో అత్యుత్తమ అవార్డులేమైనా ఉంటే వారిద్ధరికీ జాయింట్ గా ఇవ్వవచ్చు.

ఇక టపా అసలు విషయానికి వస్తే, ’కొత్తపలుకులు పలుకుతున్న ప్రముఖ ప్రెస్ / మీడియా యజమాని కం సంపాదకుడు చాలాకాలంగా అవకాశం చిక్కినప్పుడల్లా ఆధ్యాత్మిక విషయాలపై తనదైన శైలిలో వితండవాదంతో విరుచుకుపడడం గమనిస్తున్నాం. ఈయన చందం ఏమిటంటే ఈయన స్వయం ప్రకటిత మేధావి / సంస్కర్త / ఇదీ అదీ అని లేకుండా అన్ని వ్యవస్థలలో ఉండే కుళ్ళును కడిగే మహానుభావుడు. ఎంతవాడినైనానువ్వుఅని ఏకవచనంతో సంబోధించగలిగేంత గొప్ప మనీషి. మూర్తీభవించిన ఆభిజాత్యానికి నిలువెత్తు ఉదాహరణ. దొరల సావాసగాడు కదా వాసనలు పొవుగా. ఐతే ఈయన మీద ఉన్న అవినీతి వ్యాపార సామ్రాజ్య విషయాలపై ఉలకడు పలకడు. అదేదో గురివింద గింజ సామెత చందం.

తెలిసినదైనా తెలీనిదైనా అన్ని విషయాల్లో తలదూర్చటం కొందరికి అలవాటు, తమకు తాము అన్నీ తెలుసనుక్కునే బాచ్ అన్నమాట. దురలవాట్లో భాగంగా అన్నింట్లో వేలుపెట్టే కండూతి ఎక్కువ. కండూతి అంటే అదే మామూలుగా చెప్తే దురద / గోకుడు అని కాస్త డోసు పెంచి సినిమా / మీడియా లాంగ్వేజిలో చెప్తేదూలఅనిఆధ్యాత్మిక విషయాలలో ఈయనది జగద్గురువులు, పీఠాధిపతులు, ఆచార్యులు, వేద విద్వాంసుల స్థాయికన్నా పైనది అని ఈయన భావన. ఈయన మీడియాలోనూ, పత్రికలో ఆధ్యాత్మిక కాలంలో వ్రాసేవారిలోనూ భావన జొప్పిస్తుంటారు. వీరందరూ కలిసి జగద్గురువులు, పీఠాధిపతులు, వేదవిదులు ఆచార్యులు ఏంచేయాలో నిర్ణయించి, వారు ప్రస్తుతం చేస్తున్న పనులను విమర్శించి వారి పత్రికా ముఖంగా వారికి ఉద్బోధ చేస్తారన్నమాట.

ఈయన ఛానెల్లో జరిగే ఆధ్యాత్మిక వేత్తల ఇంటర్వ్యూలలోనూ, చర్చలలోనూ ఈయన సంపాదకీయంలోనూ తరచూ ఒక విషయం చెప్తూంటారు. ముఖ్యంగా సనాతన ధర్మంని ఉద్దేశిస్తూ డాక్టరు దగ్గరకెళ్ళి రోగం చెప్పకపోతే నష్టపోయేది రోగే, మీ హిందూ/సనాతన ధర్మంలో లోపాలు ఒప్పుకోండి అని //శరీరంలో రోగాలను పెట్టుకుని ఏ రోగం లేదని డాక్టర్‌ వద్ద బుకాయిస్తే కుళ్లిపోయేది శరీరమే! హిందూ మతంలో ఉన్న అవలక్షణాలను ప్రక్షాళన చేయవలసింది పోయి, లోపాలను ఎత్తిచూపిన వారిపై దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది.// గత నెల వీరి వ్యాసంలోది ఈవాక్యం. ఈయనకి ఈయన ఒక వైద్యుడు, ధర్మ సంస్కర్త (స్వయం ప్రకటితమన్నమాట)  అని ఈయన ఉద్దేశ్యం. ఇది ఈయన వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయన దగ్గరే ఉంచుకోవచ్చు ప్రజాభిప్రాయంగా పరిగణించి అందరిమీదా ఆయన అభిప్రాయాన్ని రుద్దే హక్కు పారలౌకికంగా కానీ లేదా రాజ్యాంగ పరంగా కానీ వ్యక్తిగా ఆయనకి లేదు. లేదు ఇది ప్రజాభిప్రాయమే అని రుద్దడానికి ప్రయత్నిస్తే అటువంటి పైత్య ప్రకోపం తగ్గించుకోవడానికి ముందు వైద్యుని దగ్గరకెళ్లాల్సింది ఆయనే. (contd...)

5 comments:

 1. ఎవరు సార్ ఆ మహానుభావుడు ?!! ఒక్క సారి వారి నామధేయాన్ని వినాలని ఉంది .

  ReplyDelete
  Replies
  1. మీకు స్వాగతం
   ఈ క్రింద లంకె చూడగలరు..

   http://www.andhrajyothy.com/Artical.aspx?SID=73429&SupID=26

   Delete
  2. Good Blog.. :)

   I Appreciate you!!!

   Delete
 2. ఈయన రెండువైపు చూసే అలవాటు లేని మనిషి ... భక్తి ని భయంతో కలిపి నీవు చేసిన కర్మకు నీవే భాధ్యుడవు అది మంచైనా, చెడైనా. మరి పాపులను రక్షించే దేవుడు ...ఇలాంటివారిలో కూడా పాపులను ప్రక్కన పెడితే అంటూ పాపులనూ వారిని రక్షించే దేవున్ని గట్టున పాడేశారు మీడియా ప్రభువులు ఎంతకైనా సమర్ఘులు అనిపించుకున్నారు.

  ReplyDelete