Pages

Wednesday, February 4, 2015

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 4

Continuation
భగవంతుని పై భక్తీ, భయమూ రెండూ శ్రేయోదాయకమే. భయం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేకపోతేనే తంటా..
//భక్తిలో కూడా ఆత్మ వంచన ఉంటుందా? అని మనకు అనిపించవచ్చు గానీ, ఇప్పుడు భక్తిలోనే ఆత్మ వంచన ఎక్కువగా ఉంటోంది. గుళ్లకు వెళ్లకపోయినా, స్వాములకు నమస్కరించకపోయినా కీడు `దండం పెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత సమాజంలో వెల్లివిరుస్తున్న భక్తిలో అధిక శాతం భయంతో, ఆశతో కూడినది మాత్రమే!
పాపం దేవుళ్లు! మనుషుల్లో పేరుకుపోతున్న స్వార్థచింతన దైవ చింతనగా మారి దేవుళ్లను ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తోంది. ఆంగ్ల నామ సంవత్సరంతోపాటు వైకుంఠ ఏకాదశి కూడా ఒకేరోజు రావడంతో తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. నూతన సంవత్సర వేడుకలను విందు, మందు, చిందుతో ఆనందించి, ఆస్వాదించి ఇళ్లకు చేరుకునేవారు కొందరైతే, స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో గుళ్లకు బయలుదేరిన వారు మరికొందరు. ఒకే సమాజంలో ఎంత వైరుధ్యం! మొత్తంమీద తెలుగునాట భక్తిరసంలో మునిగి తేలుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేవుళ్లకు ఊపిరి సలపనంతగా! //
దీని వల్ల సనాతన ధర్మానికి భావితరాలకి నష్టమెంతో భవిష్యత్కాలం నిర్ణయిస్తుంది కానీ, సనాతన ధర్మంలో ( హిందూ మతంఅని పిలువబడే) ఏదో ఐపోతోంది అనుక్కునే మీకు బెంగేమీ అక్కర్లేదు మీకంత ప్రేమ కారిపోతుందనీ మేము నమ్మలేదు. విందు వినోదాల పేర్ల మీద మత్తులో అర్థరాత్రిఅపరాత్రులు తేలియాడే వారికన్నా, భయంతోటో మరేదానితోటో దానికి దూరంగా ఉండి భగవంతునికి భాగవతులకి దగ్గరగా ఉండడమే శ్రీరామ రక్ష. నిజంగా తెలివుండి సమాజం మీద అతిప్రేమ దాన్ని రక్షించాలనే తపనే ఉంటే ఆ విందు చిందు వినోదాలరూపంలో జరిగే సామాజిక అవలక్షణాలను ఖండించడంకోసం డిసెంబరు నెలాఖరునుండి జనవరి ఒకటి రెండు తారీఖులలో ఒక్క ఆర్టికలూ రాయలేదెందుకనో అన్యమతస్థులు బాధపడతారనో లేక సానుభూతో ఆసంపాదకవర్గానికే తెలియాలి. భక్తిలో ఆత్మ వంచన ఉందోలేదో ఆయా భక్తుల వ్యక్తిగత విషయం కానీ ఈ పత్రికా వ్యాసంగాలలో ఖచ్చితంగా ఆత్మవంచన, సనాతన ధర్మంపై ద్రోహపురిత విద్వేషపూరితమైన సంపాదకుల మనోభావాలు సుస్పష్టం.

//ఇటీవలే ఒక టీవీలో విన్నాను. సారాంశం ఏమిటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కార్తీక పౌర్ణమి నాడో, వైకుంఠ ఏకాదశి నాడో దీపాలు వెలిగించి దేవుడిని వేడుకుంటే చాలునట! అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలేదు.//
ఇలా ఎవరూ చెప్పలేదు చెప్పరు. సాంతం వినకుండా బిట్వీన్ ద లైన్స్ లాగా టెంపరరీ భక్తిలాగానో లేక గేలి చేయడానికో లేదా దీపాలు పెట్టేవేళగి గ్లాసులో రంగునీళ్ళు తాగుతూ వింటే (దొరల సావాసాలతో దొరలవాట్లేగా ఉండేది) ఇదిగో ఇలాగే వినిపిస్తుంది అనిపిస్తుంది. సనాతన ధర్మంలో దీపానికున్న ప్రాధాన్యత తెలుసుకుని ఆ విషయం చెప్పిన పెద్దాయన ప్రసంగం సాంత వింటే తెలుస్తుంది అరకొరగావిన్న మిడిమిడి జ్ఞానంతో కాదు. పోనీ వారమంతా పాపా కార్యాలు చేసి వారానికోసారి ముసుగుచాట్లో చెప్తే పాపాలు పోతాయని చెప్పడంలో కనబడని వింత దీపం విషయంలో ఎందుకు సదరు సంపాదకీయులకి కలిగిందో నాకు అవగతం కాలేదు ... ‘ముసుగుచాట్లో చెప్తే పాపాలు పోతాయనిదాన్ని ప్రశ్నిస్తూ ఒక్క ఆర్టికలూ రాయడానికి చేతులు రావు... ఇష్టమైన డ్యాష్ ఇంగువతో సమానమని చిన్నప్పుడు ఎవరో అంటుంటే విన్నా....

//‘దేవుడు చేసిన మనుషుల్లారా- మనుషులు చేసిన దేవుళ్లారాఅని దేవుడు చేసిన మనుషులుచిత్రంలో ఎన్‌.టి.ఆర్‌ పాడతారు. దేవుళ్లను వ్యాపార వస్తువుగా మార్చారని దశాబ్దాల క్రితమే ఆ పాట రాసిన శ్రీశ్రీ గుర్తించారు. ఇప్పుడు ఈ విషయంలో మరింత పురోగతి సాధించాం. దేవుడు మనుషులను సృష్టించడం ఏమో గానీ, మనుషులే దేవుళ్లను ఎడాపెడా సృష్టించి పారేస్తున్నారు.//
సినిమా సాహిత్యం మనకాదర్శం అయ్యింది మరి!!! శ్రీశ్రీ రాసిన పాటసంగతేమోకానీ ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగురుతానందట, ఆయన చెప్పిన మాటలు ఆయన శ్రీమతినే మార్చలేకపోయానని చదువుకున్నాం ఆయనగురించి చదివినప్పుడు. నేనూ కాలేజీలో ఆయన అభిమానినే. అసలు విషయమ్ తరవాత తెలిసింది. అంత ప్రక్షాళనే చేయలనే తలపు నియతి ఉంటె సదరు సంపాదకులవారు దైవదూతనే దేవుడుగా మార్చి డబ్బాశ చూపి అవినీతిని భక్తిలోనూ మతవిశ్వాసాలలోనూ లంచాలని ప్రేరేపించి ప్రచారం చేస్తున్న మతాన్ని నిలదీయవలసి ఉన్నది.

నాకనిపించిందేమంటే సంపాదకుల సహజ అహంభావమువల్లనూ, ఆభిజాత్యా పోకడలవల్లనూ  స్వయం ప్రకటిత ఆధ్యాత్మ విద్వాన్, హైందవ ధర్మ సంస్కర్తని ఎవరూ గుర్తించక ఆధ్యాత్మిక సభల్లో ప్రత్యేక గౌరవాదులు అగ్ర తాంబూలాలూ ఇవ్వకపోవడం వల్ల ఎక్కడో సదరు పత్రిక సంపాదకుల అహానికి తగిలిన  దెబ్బవల్లనో లేక ఇందాక నా అనుమానం (అనుమానమే సుమీ) లాగా సనాతన ధర్మేతర మతానుయాయుల ప్రాపకానికో లేక వారితో పడ్డ కక్కుర్తి, లాలూచీలకో (మళ్ళీ ఇది నా అనుమానమే సుమీ) సంస్కరణ ముసుగులో రాసిన అజ్ఞానపు రాతలు అని. ఏతావాతా మరి వీరి వెనకుండి విషం చిమ్మిస్తున్నదెవరో లేక పత్రికా యజమానులు సంపాదకులు దేనికి కొమ్ముకాస్తున్నారో అర్థం చేసుకోలేనంత వారుకాదు ప్రజలు. ఈయన ప్రస్తుతించిన సినిమాకీ సమాధానాలిందులోనే ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా ఉటంకించనక్కర్లేదు. ఇంతకుముందే ఎందరో చెప్పారు కూడా. చేతిలో పత్రికలు, ఇతర ప్రచురణ, ప్రసార మాధ్యమాలు అనువుగా అందుబాటులో ఉన్నాయని మన భావ దారిద్ర్యాన్ని ఇతరుల భావాలుగా రుద్ది మాట్లాడడం అవివేకం, మూఢత్వం. భారతజాతిలో ఇటువంటి విషయాలు విషాలు కొత్తేమీకాదు, విషం పుట్టడం దాన్ని గ్రసించడం పురాణోక్తమే.
click below link to the original article in the paper 
 http://www.andhrajyothy.com/Artical.aspx?SID=73429&SupID=26

శంద్విపదే శం చతుష్పదే

లోకా సమస్తాసుఖినోభవన్తు

4 comments:

 1. చాలా బాగా రాసారు నాగేంద్ర గారు. నెనర్లు.

  ReplyDelete
 2. విషమును అమ్రుతము గ మార్చే శక్తి మన సనాతన ధర్మానిది.థ్యాంక్స్ నాగేoద్ర గారు.

  ReplyDelete
  Replies
  1. స్వాగతం అనిల్ గారూ

   Delete