శ్రీ గురుభ్యోనమః
మరో శివ స్తుతి, మల్హణుడు అని అతి ప్రాచీన కవి భక్తకవి వరేణ్యుడు, మానసికంగా చేసిన ’చిరునవ్వుతో తనలో తాను నవ్వుతూ ఆనందపడిన శివుని, ఆనవ్వును చూసిన బ్రహ్మేంద్రాదుల దర్శనం’.... అద్భుతః.. నేనేదో వారికి సర్టిఫికెట్లిస్తున్నాననికాదు, వారి భావనలో నేనూ ఆ ఘట్టాన్ని తలచుకుని దాన్ని మనోఫలకంపై దృశ్యరూపకంగా చూస్తే పరమానందంగా ఉంది
గౌరీప్రదాన సమయే కథితేచలేన
గోత్రం తవేశ! కిమితి క్షణజాత చిత్రం!
ధన్యైః పితామహ పురందర లోకపాలైర్
దృష్టం నిరుత్తర ముఖం హసతోభవద్ధి!!
శివా! నీకు గౌరీదేవిని కన్యాదానం చేసి వివాహం చేసే సమయంలో హిమవంతుడు "ఈశ్వరా! నీ గోత్రమేమి ?" అని ప్రశ్నించగా ఒక క్షణకాలము నీకు ఆశ్చర్యము కలిగి ఏం చెప్పటానికీ తోచక, తరవాత నవ్వుతూ ఏమీ మాట్లాడక ఊరుకున్నావు. అలా అరమోడ్పు కళ్ళతో నవ్వుతూ కూర్చున్న నీ ముఖాన్ని చూచిరి నీ వివాహానికి విచ్చేసినటువంటి బంధువులగు బ్రహ్మేంద్రాదులు లోకపాలకులు ధన్యత పొందిరి కదా!
చాలా మంచి విషయాలను పరిచయం చేస్తూ మానసికోల్లాసాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తున్నందులకు కృతజ్ఞతలు.
ReplyDeleteహరహర మహాదేవ శంభోశంకరా
నమస్తే
ReplyDeleteస్వాగతం, మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు