Pages

Sunday, January 6, 2013

విశ్వాసఘాతకులైన బిచ్చగాళ్ళు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

తిన్న కంచంలోనే ఉమ్మేసేవాళ్ళను గురించి చరిత్రలోనూ, తల్లిపాలు తాగి రొమ్ము కోసేవాళ్ళను గూర్చి సామెతల రూపంలోనూ విని ఉన్నాం, ముష్టెత్తుకుని ముష్టి వేసిన చెయ్యిని నరికేస్తామనే ముష్టివాణ్ణి ఇప్పుడు చూస్తున్నాం...

ఒక మూర్ఖుడిని తిట్టాలంటే మనిషివా పశువ్వా అని నిలదీయడం అలవాటు, ఎందుకంటే మనిషికంటే పశువులు కాస్త తక్కువ అని మన భావన, దీన్ని తిరగరాయాల్సి ఉంది. ఇకపై ఎవణ్ణన్నా అలా నిలదీయాల్సి వస్తే "నువ్వు మనిషివా? ఒవైసీవా?" అని నిలదీయాలి. బహుశా పశువులు కూడా వాటిలో ఉన్న మూర్ఖ పశువుని చూసి " పశువ్వా? ఒవైసీవా?" అని వాటి భాషలో అనుకుంటాయేమో.

12 వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ భారతదేశంపై దండెత్తిరాగా, రాజపుత్రుల చేతిలో ఓడిపోయి పృధ్వీరాజ్ చౌహాన్ దర్బారులో ప్రవేశ పెట్టబడగా, పృధ్వీరాజ్ చౌహాన్, ఘోరీని చూసి మేము నితో ఎలా వ్యవరించాలి అని అడిగితే చచ్చిపోతాననే బెంగతో " మహరాజ్ హమ్ ఆప్కీ గాయ్ హై హమే మాఫ్ కర్దో " అని అడిగితే జీవితాన్ని భిక్షవేసినవాడు మన పృధ్వీరాజ్ చౌహాన్. ప్రాణాలను బిచ్చంగా తీసుకుని పారిపోయి విశ్వాసఘాతకుడై భారతదేశంలోని ఇతర రాజ్యాలను కొల్లగొట్టాడు. పృధ్వీరాజ్ చౌహాన్ ఆనాడు ఘోరీతోసహా ఇతర 25000 తురకలని ప్రాణాలని బిచ్చంగా ఇస్తే బతికినవాళ్ళు. విశ్వాస ఘాతకులైయ్యారు అవాకులు చవాకులు పేలుతున్నారు. హిందుస్తాన్ పాకిస్తాన్ గా భారత దేశం విడిపోయింతరవాత మరోసారి గాంధీ మాటకు మనం వారిని ఇక్కడ ఉండడానికి బిచ్చం వేస్తే ఉండి తిరిగి అన్నం పెడ్తున్న అమ్మచేతిలోనే ఉమ్మేస్తున్నారు.

బాబర్,అక్బర్ సామ్రాజ్యాలలో కూడా గోవధ నిషేధాన్ని అమలు చేసారు. గ్వాలియర్ ఫోర్ట్ శాసనాలలో ఇప్పటికీ గోవధ నిషేధ అమలుకై అక్బర్ 1586లో వేయించిన శాసనమున్నది, ఔరంగజేబు అధికారం వచ్చేవరకూ ఇది కొనసాగింది, కౄరుడైన ఔరంగ జేబు దాన్ని పట్టించుకోలేదు. ఇంగ్లీషువాళ్ళు వచ్చి Divide & Rule Policy అమలు
చేయటానికి హిందూ ముస్లింను విడదీయడానికి దీనికి ఆజ్యంపోసి పెంచారు.

సరే ఉపన్యాసాలు, చర్చలు ఎన్నైనా చెయ్యొచ్చు.... మీరు తీస్కున్న చర్య ఏమిటి? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మరి మీరో? కేవలం చర్చలు టివి కార్యక్రమాలతో దీన్ని మరగున పరచద్దు. మరచిపోవద్దు. ముందు చట్టాన్ని గౌరవిద్దాం, కుదరకపోతే చట్టాన్ని మార్చాల్సిన అవసరాన్ని ప్రకటిద్దాం.

ముష్టివాళ్ళు, బిచ్చగాళ్ళు అన్న పదాలు వాడినందుకు తప్పు పట్టవద్దు, జీవన భృతికోసం ముష్టి/బిచ్చపు వృత్తిలో ఉన్న వారిని కించ పరచే ఉద్దేశ్యం ఏకోశానా లేదు.

Thursday, January 3, 2013

అరుణాచల యాత్ర

అరుణాచలేశ్వరుని ఆనుజ్ఞ మేరకు శ్రీ ప్రసాద్ గారి కుటుంబం మాకుటుంబంతో సహా మొన్న వైకుంఠ ఏకాదశీ సమయంలో మా అందరి అరుణాచల యాత్ర సాగింది. ప్రతీ క్షణం, ప్రతీ సన్నివేశం భౌతికంగా ఒకలా కనపడినా.. ఆంతరంలో అరుణాచలేశ్వరుని వాత్సల్యం, రమణుల బోధ అన్వయమౌతూనే ఉన్నాయి. కూర్చుని చేస్తే పట్టుమని కొన్ని క్షణాలు కుదరని ధ్యానం, రమణులు చెప్పినట్లు గిరి ప్రదక్షిణలో కుదరడం... మీకు తెలియనిదేముంది.. నాబోటిగాడెంతని చెప్పగలడు అరుణగిరి మహత్తు.. బయలు దేరేముందు యాత్రలో అన్నీ నోట్ చేసుకుని యాత్ర అయ్యాక అది రాద్దాం ఇది రాద్దాం అలా ఐతే యాత్రా విశేషాలు చక్కగా ఎప్పటికీ గుర్తుంటాయి అనుక్కున్నాను.
 

రమణాశ్రమం, మాతృభూతేశ్వరాలయం, రమణసన్నిధి, బావి, నిర్యాణ మందిరం, నెమళ్ళు, కోతులు, కుక్కలు, పెద్ద పేద్ద నాగమల్లి చెట్లు, గోశాల అంతా రమణమయం..... వెనకనుంచి స్కందాశ్రమానికి దారి ఆ పైనుంచి కొండకిందకి దృశ్యాలు... చటుక్కున చుఱుకు పెట్టినట్లు ఒరే నువ్వున్నది ఈశ్వరుని మీదరా నీ మనసు ఇక్కడ ఉంచకుండా కొండ మీదనుంచి బస ఎక్కడుంది గుడెక్కడుంది అని వెతుకుతావేం అన్నట్లు తుమ్మిపూల చిన్న మొక్క నేలపై కనిపించింది దానికి మూడే మూడు పువ్వులున్నాయి. చుట్టుపక్కలెక్కడా ఆ పూల మొక్కలు లేవు ఆశ్చర్యం... అనిపించింది ఓహో ఇంకా ఇక్కడ కూడా ఎందుకురా అదీ ఇదీ అని ఆలోచిస్తావు అనుక్కుంటూ అ పువ్వులు మూడూ కోసుకుని అప్రయత్నంగా రుద్రం నా నోట్లోంచి వస్తుంటే ఆ అరుణ గిరిని చూస్తూ లోపలా బయటా అనుభవిస్తూ ఒక పెద్ద శిల దగ్గరికెళ్ళి అరుణాచలేశ్వరా స్థాణువై ఉన్న నువ్వు మమ్మల్నందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ కొండరూపంలో, శిలారూపంలో ,చెట్ల రూపంలో మొత్తం నువ్వే ఉన్నావు అనుక్కుంటూ ఆ మూడు తుమ్మి పూలూ శివునకు సమర్పించినట్లుగా భావించుకొని అక్కడ ఉంచి నమస్కరించి ముందుకు సాగాను.. ఇంకా అక్కడే ఉన్నట్లుంది...

మేము తిరిగి వచ్చిన తరవాత కొందరు మిత్రులు ఎలా జరిగింది యాత్ర అని అడిగినప్పుడు వారితో చెప్పాను ఇది ఓ మూడు రోజులో నాలుగురోజులో చేసే యాత్ర కాదు, ఒక జీవితం సరిపోతుందో లేదో అని... ఏమి వర్ణన చేయగలను... బహుశా అక్కడ కూడా ఈ ’నేను’ పైకి ఎగురుతూ ఉందేమో... యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సః..... అన్న ప్రమాణం ప్రకారం మనస్సు వాక్కు ఎక్కడ ఆగిపోతుందో, "ఆ దివ్యమైన మౌనం, ఆ శరణాగతి సూచించేదేదుందో అదే అరుణాచలం" అని మాత్రం అవగతమైంది.

Wednesday, January 2, 2013

ఈషణాత్రయం

సూరి నాగమ్మ గారి ’నా రమణాశ్రమ జీవితం’ నుంచి...

రమణుల దేహం అరుణగిరి పాదాల వద్ద వదిలివేయబడిన తరవాత కొన్ని రోజులకు రమణుల పెద్దకూతురుగా పేరొందిన సూరి నాగమ్మగారు అన్నా వదినెలతో కాశీ గయాది ఉత్తరభారత యాత్రకి వెళ్లారు. సూరి నాగమ్మగారి వదినగారికి కాశీ వెళ్ళాక కాస్త అస్వస్తత చెందగా వారు మునుపనుక్కున్నట్టుగా కాక యాత్రలో కొన్ని ప్రదేశాలను తగ్గించడం జరిగింది. సూరి నాగమ్మగారు కాశీ విశ్వనాథ సేవనం గంగాస్నానం చేస్తూ తొమ్మిది రోజులూ కాశీలో గడిపారు. హృషీకేశం ప్రయాణం విరమించి గయకి వెళ్ళి అక్కడ పితృకార్యాలు చేయాలని నిశ్చయించి అందరూ గయ చేరారు. వారితో కాశీలో ఉండే తెలుగు పురోహితుడు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి వట వృక్షం కింద ఉన్న విష్ణు పాదాలమీద పితృకార్యానికి సంబంధించి అన్ని కర్మ కాండలూ చేస్తున్నారు. సూరి నాగమ్మగారు మౌనంగా చూస్తున్నారు. అక్కడే వచ్చిన వారు ఆకు, కూర, పండు వదులుతారు, పండాలు సూరి నాగమ్మ గారి అన్నని వదిననీ చూసి మీ ఇద్దరూ మాట్లాడుకుని మీరేమి వదులుతారో చెప్పండి అని చెప్పి, సూరి నాగమ్మగారిని కూడా చూసి అమ్మా మీరేమి వదులుతారు? అని అడిగారట. వారిని చూసి అమ్మగారు ఇక్కడ ఏమూడూ వదలాలి అని తిరిగి అడగగా.. వారు ’ఈషణత్రయం’ అని సమాధానమిచ్చారు. ఈలోగా అక్కడికి యాత్రకై వచ్చిన ఇతర తెలుగువారు ఈషణత్రయం అంటే ఏమిటి అని అడుగగా కాశీ నుంచి తోడు వచ్చిన పురోహితుడు దారైషణ, ధనైషణ, పుత్రైషణ అని చెప్పి, అందరూ ఇవి వదలలేరు కనుక ప్రతిగా ఆకు, కూర, పండు వదులుతారు. (బహుశా అలా తినే వస్తువులను వదలగా వదలగా మనసు సంస్కరింపబడి కాస్త వైరాగ్యం పాలు పెరుగుతుందనేమో).

సూరి నాగమ్మగారు విష్ణుపాదాలకి నమస్కరిస్తూ ’ అయ్యా నేను ఆ ఈషణత్రయాన్ని వదులుతున్నాను అని గట్టిగా చెప్పలేనేమో కానీ, అవి నన్ను పట్టుకోకుండా వదిలేటట్లు అనుగ్రహించమని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.

ఆ అమ్మకి ఉన్న నమ్మకం, గురు భక్తి, దైవచింతన, అణువంతైనా నాయందు కలగాలని దీవించమని ఆయమ్మకే నమస్కరిస్తూ...

సూర్య నాగేంద్ర

Tuesday, January 1, 2013

రమణుల మొదటి లిఖిత ఉపదేశం

భగవాన్ రమణ మహర్షుల వారు అరుణాచలం వచ్చిన తరవాత వారు, అరుణగిరినాథర్ ఆలయం వద్ద, అరణగిరి మీద ఆ చుట్టుపక్కల తపస్సు చేసుకుంటూ బ్రాహ్మణ స్వామిగా, మౌన స్వామిగా అందరిచేత పిలవబడేవారు. ఆసమయంలో వారి అమ్మగారు అళగమ్మగారు కొడుకు వేంకట రమణన్ అరుణాచలంలో ఒక స్వామిగా ఉన్నాడని తెలిసుకొని తన మరిదిగారిని అరుణాచలం వెళ్ళి వేంకటరమణన్ నివెనక్కి తీసుకురమ్మని పంపారు. ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో ఆవిడే అరుణాచలం వెళ్ళి విరూపాక్ష గుహలో ఉన్న మౌన స్వామిని తిరిగి ఇంటికి రమ్మని బ్రతిమాలింది, బామాలింది, నిష్ఠూరాలు పలికింది. ఆ తల్లి మనసు పడే వేదనను అక్కడి చుట్టుపక్కలవారు, అప్పటికే రమణుల వద్ద చేరిన శిష్యులు తట్టుకోలేక స్వామిని చేరి ’అయ్యా! మీరు ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మకి స్వాంతన కలిగించకుండా ఉండకుండా ఏదో ఒక సమాధానం చెప్పవచ్చుకదా’ అని అడిగారు.
భగవాన్ రమణుల మొట్టమొదటి లిఖిత ఉపదేశం లోకానికి వారి తల్లి ద్వారా అందింది. ఆ సమయంలో రమణులు "కర్త జీవులను వారి వారి ప్రారబ్ద కర్మానుసారము ఆడించును.జరుగనిది ఎవరెంత ప్రయత్నించినా జరుగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరును. ఇది సత్యము. కనుక మౌనమే ఉత్తమము" అని వ్రాసి ఇచ్చినారు. వారి మొదటి లిఖిత బోధ మాతృమూర్తికి. బహుశా అదే ఆ అమ్మ తిరిగి ముక్తిని పొందు వరకు రమణుల వద్దనే ఉండడానికి కారణమైయ్యుంటుంది. ’మాతృదేవోభవ’ అన్న ప్రమాణానికి సూచనా అన్నట్లు, వారు లోకానికి చేసిన బోధకూడా మొట్టమొదట తల్లి కి నమోవాక్కములర్పిస్తూ మొదలెట్టారా అన్న విధంగా జరగింది

మీ

నాకు సంతస మొసంగుమా - రామచంద్ర!

శ్రీ గురుభ్యోనమః

నంద నందనుఁడ! గోవింద! నృసింహావ
                తార! ఆనంద! సత్యస్వరూప!
దామోదరా! ముకుందా! వాసుదేవ! ప
                ద్మాక్ష! సీతాపతీ! అవ్యయుండ!
పాపసంహారకా! పతితపావనరూప!
                సంసార విస్తార జలధిదాట
గాఁజేయు, గంభీర కర్ణధారుండ! శ్రీ
                కృష్ణావతారుఁడౌ! విష్ణుదేవ

కాంతిచే, మనోహరుఁడవై గ్రాలువాఁడ!
అచ్యుతానంత! శ్రీ రామ! ఆదిదేవ!
నిత్యతాపత్రయంబు ఖండించి, నాకు
సంతస మొసంగుమా - రామచంద్ర సతము.

(శ్రీ రామ కర్ణామృత ఆంధ్రానువాదం నుండి)

శ్రీ రామ చంద్రా! నీ ప్రతీ నామము, చేష్టితము, అవతారము, లీల, ఇంచుకైనను సరే అవి పాప సంహారకములు, దీనుల యెడ ఉద్ధరణ కారకములు.
ఓ పతిత పావనా! ఎడతెఱిపిలేని తాపత్రయముల వలన కలిగిన దుఃఖముచే అగాధము వంటి చీకటియైన అజ్ఞానమునందు తిరుగువాడను. గంభీరమైన చెవులు కల (ఎంత మంది ఒకేసారి కోరికలు కోరినా అందరి కోరికలూ ప్రత్యేకంగా వినగలిగినంత విశిష్ఠమైన చెవులు కలవాడా) ఓ కృష్ణా! నా ఈ తాపత్రయములను త్రుంచి, అతి పెద్దదై దాట సాధ్యముకాని ఈ సంసార మనే సముద్రాన్ని దాటింపచేసి,నిత్యము, శాశ్వతము, అనంతము ఐన ఆనందమును నా స్వస్థితిగా చేయుమో తండ్రీ! దాశరథీ!


~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

Monday, December 31, 2012

ఈశ్వరా!.......

ఈశ్వరా!.......
ధ్వజ వజ్రాంకుశ శంఖచక్ర హల మత్స్యచ్ఛత్ర కోదండ పం
కజ కల్పద్రుమ కుండలాది శుభరేఖాలంకృతంబై లస
ద్వ్రజకాంతా కుచ కుంకుమాంకిత భవత్పాదద్వయం బాత్మలో
విజయస్ఫూర్తి చెలంగఁ గొల్తు హరి
, గోవిందా! రమాధీశ్వరా!
కంబుగ్రీవము కౌస్తుభా భరణముల్ కర్ణాంత విశ్రాంత నే
త్రంబుల్ చారులలాటమున్ వదనపద్మంబున్ సునాసాపుటీ
బింబోష్ఠోరుకిరీటకుండలములున్ బీతాంబరంబుం గడున్
వెంబైయుండఁగ నిల్వు నామదిని
, గోవిందా! రమాధీశ్వరా!

నీ విఖ్యాత చరిత్రముల్విను చెవుల్ నీపూజకౌహస్తముల్
నీవాసంబుల కేగు పాదయుగము న్నిన్గాంచుమెల్చూపునిన్
గైవారంబొనరించు జిహ్వయును నీకై మ్రొక్కుమూర్ధంబు ని
న్భావింపంగల బుద్ధినాకొసఁగు సాంబా
! భక్తచింతామణి!

నీకీర్తిశ్రుతి నీకథాశ్రవణము న్నీపాదసంసేవయు
న్నీకళ్యాణగుణానువర్ణనము నీ నిత్యాను సంధానము
న్నాకుం బాయకయుండునట్లొసఁగుమన్నా జన్మజన్మంబుల
న్బాకారిస్తుతపాదపద్మ శివసాంబా
! భక్తచింతామణి! 

Friday, December 21, 2012

పెద్దలతో మాట్లాడేప్పుడు

నమస్తే
మీకు పెద్దలు భాగవతులైన వారు సమయమిచ్చి సావకాశంగా మాట్లాడమంటే అభివాదం చేసి, కుశల ప్రశ్నానంతరం మీరేమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. ఏమి మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకోండి. తప్పుగా అనుక్కోకండి, విషయాన్ని సాగదీయకుండా, మధ్య మధ్యలో ఆప కుండా, (without continuos long pauses) క్లుప్తంగా పూర్తి భావం ప్రకటించగలిగేలా మాట్లాడండి. నేను నాది లాంటి అహం పొడచూపే మాటలు వద్దు. మీ తల్లి దండ్రులు, గురువులు, మీ వంశంలోని పెద్దల గూర్చి అడిగినప్పుడు ఉన్నతంగా కీర్తించండి కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ పెద్దలతో కలిసి వెళ్తున్నప్పుడు మీరు మీ పెద్దల్ని డామినేట్ చేస్తునట్లు భావన ఇవ్వకండి. మీరు మాట్లాడినా, మీ కన్నా ముందుగానీ, మీ పక్కన గానీ ఉంచుకుని మాట్లాడండి. అతి ముఖ్యంగా వారు మీకు సమయమిచ్చారు కాబట్టి మీకొరకు వారెదురుచూసే విధంగా చూసుకోండి. సమయపాలనం ముఖ్యం. అలా అని వారు 10గం అని చెప్పారని ఆ సమయానికి వేరెవరో ఉన్నా లోపలకి దూరి పోకుండా, అక్కడి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మీరు వచ్చిన సమాచారం ఇచ్చి వారి పిలుపుకై ఎదురు చూడండి. వారు చెప్పిందానికన్నా ఐదు నిమిషాలు ముందే వారున్నచోటికి వెళ్ళి సమయానికి వారిని కలవడానికి వెళ్ళడం మీ కర్తవ్యం పావుగంట సమయం అంటే అందులోనే మీ పరిచయాదులు మీరు చెప్పాల్సిన విషయం అంతా జరగాలి, వారు ఆనందంతో మీకేదైనా చెప్తే వినడమే మీరు చేయవలసినది, అలా ఆలస్యమైతే.. తిరిగి వారు పంపడం వారి ఇష్టం. అలా అని వారు వెళ్ళమనలేదని అక్కడే ఉండకండి. పనైపోతే బయలుదేరతామని మీరే చెప్పండి, ఆగి ఏమైనా సేవించి వెళ్లమంటే వద్దనకుండా తీసుకోండి అది భాగవతోచ్చిష్టం. మధ్య మధ్యలో వారికి ఇబ్బందిలేకుండానే మీరున్నారని చెక్ చేసుకోండి.
సాంప్రదాయ ఆహార్యం ముఖ్యం శూన్య లలాటంతో వెళ్ళకండి. వారి దేవతార్చనకై (భోజనానికని కాదు) కొన్ని పండ్లు, పువ్వులు వీలైతే తీసుకెళ్ళండి. వారు ఎటువంటి త్వరలోనూ లేకుండా సావకాశంగా ఉంటే, నాలుగు మంచి మాటలు భగవంతుని గూర్చో, వారి గురువుల గూర్చో అనుష్టానం గూర్చో చెప్పమని అడగండి. వారి పూజామందిరాన్ని దర్శించే అవకాశం అడగండి. సందేహాలుంటే అడగమంటే అడగండి, కానీ నిజంగా ఆ సందేహం తీరడం వల్ల మీకు అనుష్టానంలో సందిగ్ధత తొలగుతుందనుక్కుంటే అడగండి. అడగమన్నారని ఏదో ఒకటి అడగకండి. ఏమి అడగాలో తెలియకపోతే, ఏమడగాలో కూడా తెలియని వాణ్ణండీ మీరే దారి చూపండి అన్న అర్థం వచ్చేలా అడగండి.
మొత్తానికి మీరు వారికిబ్బంది కలిగించేలా కాక, విసుగు కలిగించేలాగ కాక, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే పలకరించి మాట్లాడేలా వ్యవహరిస్తే బాగుంటుంది. You have to be very attentive, భాగవతుడు చిరాకు పడితే, ఎంత చదువు, ఆస్థి, పెద్ద కుటుంబం అన్నీ ఉండీ వ్యర్థమైపోతుంది. అటువంటి భాగవతులతో గడిపిన సమయం వృధా కాకుండా సంపూర్ణంగా మిమ్మల్ని ఉద్ధరణవేపుకి నడిపేటట్టు చూసుకోండి.

ఇక ఫోన్ గురించైతే, నమస్కారం నేను (పేరు)శర్మ, (స్థలం)చోటు, రిఫరెన్సు ఏదైనా అవసరమైతే అదీ చెప్పి, అయ్యా ఇప్పుడు మీతో మాట్లాడవచ్చా ఒక్క నిముషం లేదా మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడాలనుక్కుంటున్నారో అన్ని నిముషాలు అని అడిగి వారి అంగీకారం పిమ్మట, కుశలమడిగి, చెప్పవలసిందో, అడగవలసిందో అడిగి వారి సమాధానం పొంది చివర్లో తిరిగి నమస్కారం చెప్పి వారూ ఇక ఫోన్ పెట్టెసారు అని నిర్ధారించుకుని పెట్టెయండి, వారు మాట్లాడుతుంటే మీరు పెట్టేయకండి. ఫోనే కదా అని టీవీలు పాటలు ప్లే అవుతున్న చోట, ఇతర శబ్దాలున్నచోట కాకుండా, రణగొణ ధ్వనులు లేని చోట కాక లోపలికెళ్ళి మాట్లాడండి. ప్రత్యక్షంగా ఉంటే ఎలా ఉంటారో, పరోక్షంలోకూడా అలానే ఉండండి.

ఏదో తెలిసింది, తెలుసుకున్నది చెప్పాను, సరి అనిపిస్తే ఈ సూచనలు తీసుకోగలరు, అన్యంగా అనిపిస్తే వదిలివేయగలరు.
మీ..

వాచ్యార్థము-లక్ష్యార్థము

వాచ్యార్థము-లక్ష్యార్థము

శ్రీ గురుభ్యోనమః
నమస్కారము

మనకు అపార మైన ఆర్ష వాజ్ఞ్మయమెంతో ఉంది. వాటిని బాగా చదివి అర్థతాత్పర్యాదులతో మొత్తం చదివినా అసలు బోధ పడవలసిన ఆత్మ జ్ఞానము బోధపడదు, అది అంతః పరిశీలనము లక్ష్యార్థమును పట్టుకొని అన్వయించుట చేతనే సాధ్యము.

నేను ఎప్పుడో చదివిన వేదాంత వ్యాసావళిలోంచి ఒక చిన్న కథ!
పూర్వం ఒక వ్యాపారవేత్త అతి నైపుణ్యం కలిగి చక్కని వ్యాపారము చేసి బాగా ధనమార్జించాడు. ఇతోధికంగా ధార్మిక, పుణ్యకార్యాచరణాలు చేస్తూ జనులందరితోనూ సఖ్యంగా ఉంటూ జీవనం సాగించేవాడు. తానార్జించిన దానిలో కొంత ధనము తన బిడ్డలకు అందవలెనని సమాలోచన చేసి ఓ 15లక్షల వరహాలు వారికొరకై దాచి ఉంచ నిశ్చయించి లెక్కల పుస్తకములో ’చైత్ర శుద్ధ దశమి నాలుగు ఘడియల పొద్దెక్కిన తరవాత నాచే నిర్మింపబడిన శివాలయ శిఖరములో పదిహేను లక్షల వరహాలు దాచితిని, అవసరార్థం నా తదనంతరం నా పుత్రులు వాటిని తీసుకొనవచ్చు’ అని వ్రాసి ఉంచాడు. తరవాత కొంత కాలానికి కాశ్యాది తీర్థయాత్రలు చేస్తూ అక్కడే శరీరాన్ని వదిలాడు. ఆ విషయమును అతని వెంట వెళ్ళిన మిత్రులు అతని పుత్రులకి చెప్పారు. ఇక బ్రతుకు దెరువుకొరకు వారి తండ్రి ఏ వ్యాపారము నిర్వహించాడో దానినే వీరూ కొనసాగించిరి. అనుభవ లేమి వల్ల నో మరి దైవ వశముననో అంతా నష్టపోయి అప్పులపాలైయ్యారు ఆవ్యాపారి పుత్రులు. కానీ అనుభవము మాత్రం వచ్చినది, ఆ అనుభవముతో వ్యాపారము చేయడానికి తగిన ద్రవ్యము మాత్రం లేదు. ఏం చేయాలో పాలుపోక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, నాన్నగారు బహు దొడ్డ వ్యాపార వేత్త ఆయన ఎంతో ధనము సంపాదించారని కదా మనకు తెలుసు. ఆయన మనకొరకు ఏదైనా ఉపాయము చేసి ఉండవచ్చు కానీ అది మనకెఱుకలో లేదు. వారు వ్రాసిన లెక్కల పుస్తకాలు చూసి ఎంత సంపాదించారు? ఎంత ఖర్చు జరిగింది? ఎంత మిగిలింది? దాన్ని ఎక్కడ ఉంచారు? వంటివి చూద్దామని నిశ్చయించుకున్నారు. తండ్రిగారి లెక్కల పుస్తకములన్నీ వెతుకుతూంటే, ఒకానొక పుస్తకములో బాకీ దార్లనుండి 15 లక్షల వరహాలు వసూలైనట్లూ.., వాటిని తాను ’చైత్ర శుద్ధ దశమి నాలుగు ఘడియల పొద్దెక్కిన తరవాత నాచే నిర్మింపబడిన శివాలయ శిఖరములో పదిహేను లక్షల వరహాలు దాచితిని గాన, అవసరార్థం నా తదనంతరం నా పుత్రులు వాటిని తీసుకొనవచ్చు’ అని వ్రాసిన వ్రాత కన్పడింది.
అంత ఆ వ్యాపారి పుత్రులు ఆనందంతో పొంగి పోయి కూలీలను తీసుకొని తమ తండ్రి నిర్మించిన శివాలయ శిఖరమును కూల్చి చూసిరి. అక్కడ ఏమీ దొరకలేదు. పైగా ఆ ఆలయానికి వచ్చే భక్తులు, పుర జనులు వారిని తిట్టి దరిద్రంతో పాటు ఆలయాన్ని కూల్చిన పాపమూ మీకు తగిలిందని నానా మాటలన్నారు. అందులోనే ఉన్న అప్పులిచ్చినవారు తిరిగి ఇవ్వమని బలవంతం చేయనారంభించారు. ఇక ఏమీ పాలుపోక ఓ పెద్దాయన వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకున్నారు, వారి నాన్నగారి వ్యాపారము, సంపాదన, మరణము, వీరి వ్యాపారము, వచ్చిన నష్టము, అప్పులు, తండ్రిగారి లెక్కల పుస్తకంలో డబ్బు దాచడం గురించి రాసిన లెక్కలు అన్నీ చెప్పుకుని మార్గం చెప్పమన్నారు. అంత ఆ పెద్దాయన తన వద్ద నున్న కొంత ధనమిచ్చి మీరు వ్యాపారం చేయండి, చైత్ర శుద్ధ దశమి వరకు మీ కుటుంబానికయ్యే ఖర్చు ఇస్తున్నాను తీసుకోండి, తిరిగి వచ్చి నన్ను చైత్ర శుద్ధ దశమి నాడు కలవమని చెప్పి పంపించారు ఆ పెద్దాయన.
కాలం గిర్రున తిరిగె, చైత్ర శుద్ధ దశమి నాడు వ్యాపారి పుత్రులందరూ ఆ పెద్దాయనదగ్గరికి వెళ్ళగా, ఆ పెద్దాయన వీరిని ఆ శివాలయము వద్దకు తీసుకెళ్ళి సమయంకోసం వేచి చూడసాగారు. సరిగ్గా నాలుగు ఘడియల పొద్దెక్కగానే ఆ శివాలయ శిఖరం నీడ ఎక్కడ పడుతుందో చూసి ఇదిగో మీ నాయన పదిహేను లక్షల వరహాలు దాచిన శివాలయ శిఖరమని కూలీలతో అక్కడ తవ్వించగా అక్కడ వారికి వారి నాయన వ్రాసి ఉంచినట్లు 15 లక్షల వరహాలు దొరికినవి. అంత వారు ఆ పెద్దాయనకు కృతజ్ఞతలు చెప్పి, చేసిన అప్పులు తీర్చి ఆ తిరిగి వ్యాపారము చేయుచూ ఆనందముగా ఉండి తండ్రి వలనే పుణ్యకార్యాచరణము, ధార్మిక కార్యక్రమములు చేసి జీవితమును పండించుకున్నారు.

వ్యాపార వేత్త కొడుకులకీ, చిక్కు విప్పిన ఆ పెద్దాయనకీ ఏమిటి తేడా? పెద్దాయనకెలా తెలిసింది?

లెక్కల పుస్తకంలో లెక్కలలో అబద్దంలేదు, బాకీలు వసూలైనవి అవి పలానా చోట దాచాను అని రాసి ఉంది. రాసిన భాష అందరికీ చక్కగా అర్థం అయ్యేలా ఉంది. కానీ ధనం మాత్రం కన్పించలేదు. ఆ పెద్దాయన పదిహేను లక్షల రూపాయలు వరహాలు అంత చిన్నగా ఉండే ఆలయ శిఖరం చివర పట్టవని గ్రహించాడు, మరి యెక్కడ అని ఆలోచించి అన్వయం చేసి లెక్కలలో రాసిన విధంగా చైత్ర శుద్ధ దశమినాడు చెప్పిన సమయానికి శిఖరంయొక్క ఛాయ పడిన దగ్గర ఉందని గ్రహించగలిగాడు.

కాబట్టి దీనర్థమేమిటి? వాచ్యార్థము కన్నా లక్ష్యార్థమును ముందు తెలుసుకోవాల్సి ఉంది. అదే మన శాస్త్రాదులలో పురాణేతిహాసాదులలో పైకి కేవల వాచ్యార్థములా కన్పడే ఎన్నో విషయాలకి లక్ష్యార్థములను విచారిస్తే అసలు ఘని దొరుకుతుంది. వాచ్యార్థమును కాక లక్ష్యార్థమును తమ స్వానుభవముచే, అనుష్టానముచే పొంది ఇతరులకు మార్గదర్శకులౌ పెద్దలే గురువులు, ఆచార్యులు. వారి సంగమునే, వారి ఔదార్యముననే మనకు లక్ష్యార్థము సుబోధకమవగలదు. అది లౌకిక విషయమైననూ, పారలౌకిక విషయమైననూ వాచ్యార్థ, లక్ష్యార్థములను గ్రహించి సమన్వయము చేసుకోవడం ద్వారా జీవనం పండించుకోవచ్చు.

సకల వాజ్ఞ్మయము యొక్క లక్ష్యము ఆత్మజ్ఞానమును ఎఱుకలోకి తెచ్చుకోవడమే. కేవల వాచ్యార్థ పరిశీలనము పాండిత్యమునకు పనికిరావచ్చుగాక తద్విషయమున ఉత్తరోత్తర జన్మములందు పుట్టుకతో పాండిత్య వాసన కలిగి ఆత్మజ్ఞానర్జనమునకు ఉపయుక్తము కాగలదేమో.

ఈ కథను అందించిన మహానుభావులకు వందనాలతో
ఇతి శం
-శంకరకింకర
21/Dec/2012