Pages

Sunday, November 29, 2020

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 14వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్దశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

 

వసిష్ఠఉవాచ

పౌర్ణమ్యాంకార్తికేమాసి వృషోత్సర్గం కరోతియః

తస్యపాపాని నశ్యమ్తి జన్మాంతరకృతానిచ!!

తా: వసిష్ఠుడు చెప్పుచున్నాడు, కార్తీకపౌర్ణమిని వృషోత్సర్జనము చెయుటవలన జన్మాంతర పాపములు నశించును. (వృషోత్సర్జనము అనగా ఆంబోతును వదులుట)

 

యఃకార్తికేవృషోత్సర్గం పౌర్ణమ్యాంపితృతృప్తయే

సంకుర్యాద్విధినా రాజన్ తస్యపుణ్యఫలంశ్రుణు!!

గయాశ్రాద్ధంకృతంతేన కోటివారంనసంశయః

పుణ్యదం మానుషేలోకే దుర్లభం కార్తికవ్రతమ్!!

తా: కార్తీకమాస వ్రతము ఈ మనుష్యలోకంలో దుర్లభము, అనగా సులభముగా ముక్తిమార్గమునిచ్చునని భావము, కార్తీకపున్నమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్జనమును చేయువానికి కోటిరెట్లు గయాశ్రాద్ధఫలము చెందుతుంది.

 

యఃకోవాస్మత్కులేజాతః పౌర్ణమాస్యాంతు కార్తికే

ఉత్సృజేద్వృషభంనీలం తేనతృప్తావయంత్వితి

కాంక్షఁతినృపశార్దూల పుణ్యలోకస్థితా అపి!!

పౌర్ణమ్యాం కార్తికేమాసి ఆఢ్యో వాప్యధమోపివా

నోత్సృజేద్వృషభంలోభా త్సయాత్యంధతమోయమాత్!!

పిండదానాద్గయా శ్రాద్ధా త్ప్రత్యబ్దం ప్రతివత్సరే

పుణ్యతీర్థాసంగమనా త్తర్పణాచ్చమహాలయాత్

కార్తికేపౌర్ణిమాస్యాంతు వృషోత్సర్గం వినాగతిః!!

గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణః

ప్రశస్తమూర్జెపౌర్ణమ్యాం వృషోత్సర్గస్సుఖప్రదః!!

తా: స్వర్గమందున్న పితరులు మనవంశమందు ఎవరైనా కార్తీకపున్నమినాడు నల్లని గిత్తను విడుచునా? ఆ విధముగ ఎవరైనా వృషోత్సర్జనము చేసిన తృప్తిపొందెదము అని కోరుకుంటూంటారు. ధనవంతుడుగానీ, దరిద్రుడుగానీ, కార్తీకపున్నమినాడు లోభమువల్ల వృషోత్సర్గమను ఆంబోతునువిడుచుక్రియను చేయనివాడు యమలోకమున అంధతమిస్రమను నరకమును పొందెదరు. కార్తీకపున్నమి రోజున వృషోత్సర్గమును చేయక, గయాశ్రాద్ధము చేసిననూ ప్రతిసంవత్సరమూ తద్దినము పెట్టిననూ పుణ్యతీర్థములు సేవించిననూ మహాలయము పెట్టిననూ పితరులకు తృప్తిలేదు. గయాశ్రాద్ధమును, వృషోత్సర్జమును సమానమని విద్వామ్సులు చెప్పిరి, కనుక, కార్తికపున్నమి నాడు వృషోత్సర్జనము సుఖమునిచ్చును.

 

యఃకుర్యాత్కార్తికేమాసి సర్వధర్మాధికం ఫలం

ఋణత్రయాద్విముచ్యేత కిమన్యైర్బహుభాషణైః!!

యోధాత్రీఫలదానంతు పౌర్ణమ్యాంచసదక్షిణం

కురుతె నృపశార్దూల సార్వభౌమోభవేద్ధృవమ్!!

యంకుర్యాద్దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికేనఘ

సర్వపాపవినిర్ముక్తో తతో యాంతి పరాంగతిమ్!!

కర్మణామనసావాచా పాపంయస్సమ్యగాచరేత్

తస్యపాపానినశ్యంతి కార్తిక్యాందీపదానతః!!

లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాంశివతుష్టయే

ఇహసమ్యక్ఫలం ప్రాప్య సార్వభౌమోభవేద్ధ్రువమ్!!

పాపఘ్నం పుణ్యదంప్రాహుర్లింగదానం మనీషిణః

లింగదానమనాదృత్య యఃకుర్యాత్కార్తికవ్రతం

వజ్రలేపోభవేత్తస్య పాపరాశిర్నసంశయః!!

తా: అనేక మాటలేల? కార్తీకపున్నమినందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానముచేయువాడు దేవ-పితృఋణ, ఋషిఋణ, మనుష్యఋణములనుమ్చి విముక్తినొందును. కార్తీకపూర్ణిమనాడు దక్షిణతోకూడి ధాత్రీఫలమును దానమిచ్చినవాడు సార్వభౌముడగును. కార్తీక పూర్ణిమనాడు దీపదానమాచరించినవారు విగతపాపులై పరమపదమునొందెదరు. కార్తీకమాసమమ్దు దీపదానమాచరించువాని మనోవాక్కాయములచేత చేసిన పాపములు నశించును. కార్తీకపున్నమి నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమునందు అనేక భోగములననుభవించి ఉత్తరజన్మమందు సార్వభౌముడగును.  లింగదానము వలన పాపములు శమించి, పుణ్యము గలుగును, కార్తీకమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమూ కరుగవు.

 

అనంతఫదంప్రోక్తం దుర్లభం కార్తికవ్రతం

పరాన్నంపితృశేషంచ నిషిద్ధస్యచ భక్షణం

శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికేవం చ వర్జయేత్!!

గణాన్నంవృషలస్యాన్నం దేవలాన్నమసంస్కృతం

వ్రాత్యాన్నంవిధవాన్నంచ కార్తికేషడ్వివర్జయేత్!!

అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దేభానువాసరే

సోమసూర్యోపరాగేచ ఊర్జేననిశిభోజనమ్!!

ఏకదశ్యామహోరాత్రం వ్యతీపాతేచ వైధృతౌ

నిసిద్ధదివసేరాజన్ గృహీయః కార్తికవ్రతే!!

విష్ణోర్దినస్యయత్నేన పూర్వోత్తరదినద్వయే

మాసనక్తవ్రతాధీనో నకుర్యాన్నిశిభోజనమ్

నిషిద్ధదివసేప్రోక్తం ఛాయానక్తంమహర్షిభిః

నక్తవ్రతఫలంతేన న నక్తంనిశిభోజనమ్!!

సర్వపుణ్యప్రదెరాజన్ కార్తికేమాసియఃపుమాన్

నిషిద్ధదివసేచాన్నం భోజనంకురుతేయది

తస్యపాపస్యవిస్తారం కథం తేప్రబ్రవీమ్యహమ్!!

తా: కార్తీకవ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీకమాసమునందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువులు తినుట, శ్రాద్ధాన్నము సేవించుట, తిలదానము గ్రహించుట ఈ ఐదూ విడువవలెను. కార్తీకమాసమమ్దు సంఘాన్నము, శూద్రాన్నము, దేవతార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మలను విడువుమని చెప్పువాని అన్నము, విధవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమందు అమావాస్యయందు, పున్నమియందు పితృదినమందు ఆదివారమందు సూర్యచంద్ర గ్రహణములందు రాత్రిభోజనము నిషిద్ధము.  కార్తీకమాసమందు ఏకాదశినాడు రాత్రింబగళ్ళు, వ్యతీపాత వైధృతి యోగాది నిషిద్ధ దినములందు రాత్రి భోజనము చేయరాదు. మాస నక్తవ్రతము ఆచరించిన వాడు ఈ ఏకాదశికి పూర్వోత్తరదినములందును రాత్రిభుజించరాదు. అప్పుడు ఛాయానక్తభోజనము చేయవలెను కానీ రాత్రిభోజనము చేయరాదు. ఛాయానక్తమే రాత్రిభోజన ఫలమిచ్చును. కనుక రాత్రిభోజనముగూడ దినములందు కార్తీకవ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహింపవలెను ఛాయానక్తము అనగా సాయంత్రము తనశరీరమునకు రెండింతలు నీడ వచ్చినప్పుడు భోజనము చేయుట. యిదినిషిద్ధదినములలో గృహస్థులకు, ఎల్లప్పుడు యతి-విధవలకు హితము.  సమస్త పుణ్యములనిచ్చు ఈ కార్తీకమాసమందు నిషిద్ధదినములందు భుజించువారి పాపములు అనంతములగును.

 

తస్మాద్విచార్యయత్నేన కార్తికవ్రతమాచరేత్

తైలాభ్యంగందివాస్వాపం తథావైకాంస్యభోజనం

మఠాన్నిద్రాంగృహేస్తానం నిషిద్ధేనిశిభోజనం

వేదశాస్త్రవినిమ్దాంచ కార్తికేసప్తవర్జయేత్!!

ఉష్ణోదకేనకర్తవ్యం స్నానంయత్రైవకార్తికే

స్నానంతత్సురయాప్రోక్తం నిశ్చితంబ్రహ్మణాపురా

పటుర్భూత్వాగృహేస్నానం యః కుర్యాదుష్ణవారిణా!!

నదీస్నానం తు కర్తవ్యం తులాసంస్థేదివాకరే

కార్తికేమాసిరాజేంద్ర ఉత్తమంతంప్రచక్షతే!!

తటాకకూపకుల్యానాం జలేవాస్నానమాచరేత్

వినాగంగావినాగోదాం వినాతద్వత్సరిద్వరాం

తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్!!

సంప్రాప్యకార్తికంమాసం స్నానం యోనసమాచరేత్

సగచ్చేన్నరకంఘోరం చాండాలీం యోనిమాప్నుయాత్!!

గంగాదిసర్వనదీశ్చ స్మృత్వాస్నానం సమాచరేత్

తతోభివాదనంకుర్యాత్సూర్యమండలగ్ం హరిమ్

కృత్వావిష్ణుకథాందివ్యాం విప్రైస్సార్థంగృహవ్రజేత్!!

తా: కావున, విచారణచేసి ప్రయత్నపూర్వకముగా కార్తీక వ్రతమును ఆచరించవలెను, కార్తీకమాసమందు తైలాభ్యంగనము, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములలో నిద్ర, ఇంట్లో స్నానము, నిషిద్ధ దినములందు భోజనము వేదశాస్త్రనింద కూడదు. కార్తీకమాసములో శరీర సామర్థ్యము కొరకు ఇంటిలో వేడినీటి స్నానము చేయుట కల్లుతో స్నానమాచరించుట యని బ్రహ్మ చెప్పెను, శరీరపటుత్వము / ఆరోగ్యము సరి లేనివారు వేడినీటితో స్నానము చేయవచ్చు.   తులయందు సూర్యుడుండగా కార్తీకమందు నదీస్నానమే ముఖ్యము.  ఒకవేళ నది దగ్గరలో లేకున్న చెరువు, కాలువ, బావులందు స్నానము చేయవచ్చు. అప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానము చేయవలెను, గంగా గోదావరి మహానదులలో స్నానము చేయునప్పుడు ప్రార్థన అవసరంలేదు. గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక, కూపోదక స్నానము కర్తవ్యము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరవాత ఛండాలుడై పుట్టును. గంగాది సమస్తనదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన ఆ శ్రీహరిని ధ్యానించి హరిచరిత్రను విని ఇంటికెళ్లవలెను.

 

 

దినాంతె సర్వకర్మాణి సమాప్యవిధినానృప

పాదౌప్రక్షాళ్యచాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్

పూజయేదీశ్వరంతత్ర షోడశైరుపచారకైః

పీఠస్థంపూజయేచ్చంభుం కల్పోక్తవిధినాఽనఘ

పంచామృతవిధానేన ఫలతోయైఃకుశోదకైః

స్నాపయేత్పుణ్యసూక్తైశ్చ భక్త్యాగౌరీపతింప్రభుమ్!!

తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం

వృషధ్వజాయధ్యానంచ పాద్యంగౌరీప్రియాయచ

అర్ఘ్యంలోకేశ్వరాయేతి రుద్రాయాచమనీయకం

స్నానంగంగాధరాయేతి వస్త్రమాశాంబరాయచ

జగన్నాధాయోపవీతం గంధం కపాలధారిణే

అక్షతానీశ్వరాయేతి పుష్ఫంపూర్ణగుణాత్మనె

ధూమ్రాక్షాయేతి ధూపంవై తేజోరూపాయదీపకం

లోకరక్షాయనైవేద్యం తాంబూలం లోకసాక్షిణే

ప్రదక్షిణంభవాయేతి నమస్కారం కపాలినే!!

తా: పగలు చేయవలసిన వ్యాపారాదులు ఇతర పనులు చేసి, సాయంకాలము తిరిగి స్న్నము చేసి  ఆచమించి పూజాస్థానమందు పీఠముపై శంకరుని ఉంచి, పంచామృతములతోనూ, ఫలోదకముతోనూ, కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతో పూజించవలెను.శంకరుని ఆవాహన చేసి

అ) వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి

ఆ) గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి

ఇ) లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి

ఈ) రుద్రాయ ఆచమనీయం సమర్పయామి

ఉ) గంగాధరాయ స్నానం సమర్పయామి

ఊ) ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి

ఋ) జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి

ౠ) కపాలధారిణే గంధం సమర్పయామి

ఎ)ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి

ఏ) పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి

ఐ) ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి

ఒ) తేజోరూపాయ దీపం సమర్పయామి

ఓ) లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి

ఔ) లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి

అం) భవాయ ప్రదక్షిణం సమర్పయామి

అః) కపాలినేనమః నమస్కారం సమర్పయామి

అని ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను.

 

 

ఏతైర్యోనామభిర్భక్త్యా పూజయేద్గిరిజాపతిం

శంభోర్నామసహస్రేణ మాసమేకంనిరంతరం

పూజాం తేచార్పయేదర్ఘ్యం మాసనక్తవ్రతేనృప

పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రిపంకజ

అర్ఘ్యం గృహాణదైత్యారె దత్తచేదముమాపతే

అర్చయేచ్ఛంకరంభక్త్యా యస్సధన్యోనసంశయః!!

తా: పైన చెప్పిన శంకరనామములచే పూజించి ఈ నెలయంతా శివ సహస్రనామములచేత నిత్యము పూజించి పూజావసానమందు ఈ పైన చెప్పిన శ్లోకరూప మంత్రము (" పార్వతీకాంత... ముమాపతే... ") తో అర్ఘ్యము యివ్వవలెను. ఇలా అర్ఘ్యమునిచ్చినవాడు ధన్యుడై ముక్తుడగును. అనుమానము లేదు.

 

తథావిత్తానుసారేణ దీపమాలార్పణం నృప

దత్వాదానంతువిప్రేభ్యో విత్తశాఠ్యంనకారయేత్!!

ఏవంవిప్రవరైస్సార్థం నక్తంయఃకార్తికవ్రతీ

కురుతేనృపశార్దూల తస్యపుణ్యఫలం శ్రుణు

అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతానిచ

అశ్వమేధసహస్రాణాం ఫలం ప్రాప్నోత్యసంశయః!!

మాసనక్తంచయఃకుర్యాదిత్యేవంవిధినానఘ

పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః!!

మాసనక్తం మహత్పుణ్యం సర్వపాపవినాశనం

సర్వపుణ్యప్రదంనౄణాం కార్తికేనాత్రసంశయః!!

యఃకార్తికేచతుర్ధశ్యాం పితౄనుద్ధిశ్యభక్తితః

బ్రాహ్మణంభోజయేద్దేవంప్రీణంతిపితరోఽఖిలాః!!

యఃకార్తికేసితేపక్షే చతుర్దశ్యాంనరేశ్వర

ఔరసఃపితృభక్తోయ%స్తిలైస్సంగతర్పయేజ్జలే

ప్రీణంతిపితరస్సర్వే పితృలోకంగతాఅపి!!

తా: తన శక్తికొలది దీపమాలలను సమర్పించి శక్తివంచనలేక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడిన నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయయాగములు వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము బొందును. కార్తీకా మాసములో ఈ ప్రకారము మాసనక్తవ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును, సమస్తపాపములు నశించును ఇందులో సందేహములే లేవు. కార్తీకమాసమందు చతుర్దశి పితృదేవతలప్రీతికొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులు తృప్తిపొందెదరు. కార్తికమాసమమ్దు శుక్ల చతుర్దశియమ్దు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించినచో పితృలోకవాసులైన పితరులు తృప్తిపొందెదరు.

 

యఃకుర్యాత్ఫలదానంతు చతుర్ధశ్యాంతుకార్తికే

సతస్యసంతి తేర్హానిర్జాయతేనాత్రసంశయః!!

యఃకుర్యాత్తిలదానంతుచతుర్దశ్యాంతుకార్తికే

ఉపోష్యశంకరంపూజ్య సకైలాసేశ్వరోభవేత్!!

సర్వపాపప్రశమనం పుణ్యదం కార్తికవ్రతమ్

యఃకుర్యాత్సోపిపాపేభ్యో విముక్తోమృతమశ్నుతే!!

ఇదంపవిత్రంపరమమ్ అధ్యాయం యశ్శ్రుణోత్యతః

ప్రాయశ్చిత్తంపరంప్రాహుః పాపానాంనాత్రసంశయః!!

తా: కార్తీకమాసమందు చతుర్దశి నాడు ఫలదాన మాచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహములేదు. కార్తీకమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించినవాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టునదీ, సమస్తపుణ్యములను వృద్ధిపరచునది ఐన కార్తీకవ్రతమును చేయువాడు పాపములు నశించి మోక్షమునొందును. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్తపాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు.

 

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే చతుర్దశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.

 

సంకలనం - కూర్పు

శంకరకింకర    

(శ్రీఅయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ)

~~~~~~~~~~~~~~~~~~~~~~

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

https://sri-kamakshi.blogspot.com/

 


Saturday, November 28, 2020

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 13వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే త్రయోదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

వసిష్ఠఉవాచ

అధేధానీంప్రవక్షెహం ధర్మాన్కార్తిక సమ్భవాన్

ప్రశస్తాత్మాసవైభూప తథాచావశ్యకాంచ్ఛ్రుణు!!

తా: వసిష్ఠుడు మరల చెప్పనారింభిచెను "  ఓ రాజా, కార్తీక మాసములో చేయదగిన ధర్మములను చెప్పదను  "స్వఛ్ఛమైన మనసుతో " వినుము ఆధర్మములన్నీ ఆవశ్యము ఆచరించవలసినవి"

 

సంసారభయభీతస్య పాపభీరోర్నరస్యచ

కార్తికేమాసియత్ప్రోక్తం మత్పిత్రావిధినాపురా

సత్యంబ్రవీమికర్తవ్యాన్ నోచేత్పాపసంభవేన్నృప!!

కన్యాదానంతులాస్నానం శిష్టపుత్రోపనాయనం

విద్యావస్త్రాన్నదానాని ఊర్జెశస్తానిభూపతే!!

విత్తహీనస్య విప్రస్య సూనోశ్చావ్యుపనాయనం

సదక్షిణంసంభారం ఊర్జెదత్వానరోనఘ

తస్యపాపానినశ్యంతి కృతానిబహుళాన్యపి!!

జపేనైకేనగాయత్ర్యా ద్రవ్యదాతుఃఫలంశ్రుణు

అగమ్యాగమనాదీని హత్వాదీనిసహస్రశః

తథాన్యాన్యుగ్రపాపాని భస్మసాద్యాంతిభూమిప!!

గాయత్రీం దేవ దేవస్య పూజాస్వాధ్యాయనార్పణం

ఏతేషామధికం పుణ్యం మయావక్తుంనశక్యతె!!

తా: రాజా! కార్తీక ధర్మములు మాతండ్రియైన బ్రహ్మచే నాకు చెప్పబడినవి, అవి అన్నీ నీకు తెలిపెదను. అన్నియు ఆచరించదగినవే, అవి చేయని పక్షంలో పాపము సంభవిమ్చును. ఇది నిజము, సంసార సముద్రమునుంచి ఊరట కోరుకునేవారు నరకాది భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసములో కన్యాదానము ప్రాతస్స్నానము శిష్టుడైన బ్రాహ్మణపుత్రునికుపనయనము చేయించుట విద్యాదానము వస్థ్రధానము అన్నదానము యివి ముఖ్యము. కార్తీకమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనముచేయించి దక్షిణ యిచ్చిన యెడల అనేక జన్మార్జిత పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రి జపఫలమువలన పంచమహాపాతకములు బూదియగును. గాయత్రీజపము, దేవతార్చన, వేదగానము, వీటిఫలము చెప్పుటకు నాకు శక్యముగాదు.

 

తటాకాయుతనిర్మాణం అశ్వత్థారోపణంశతం

కోటయఃకూపవాపీనాం క్రమాన్నందనపాలనాత్

బ్రహ్మప్రతిష్ఠాపుణ్యస్య కలాంనార్హంతిషోడశీమ్!!

మాఘ్యాంవై మాధవేమాసి చోత్తమంమౌంజిబంధనమ్

కారయిష్యంతిరాజన్ దానందత్వాతుకార్తికే!!

సాధుభ్యశ్శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యోయథావిధి

తథాతేషాంసుతానాంచ ప్రకుర్యాన్మౌంజిబంధనం

తేనానంతఫలంప్రాహుఃర్మునయోధర్మవిత్తమాః!!

తథాతేషాంవిధానంచ కార్తికేమాసిధర్మవిత్

కుర్యాత్తస్యఫలంవక్తుం కశ్శక్తోదివివాభువి!!

సోపితీర్థానుగమనం దేవబ్రాహ్మణతర్పణమ్

యంకర్మకురుతెవాపి ద్రవ్యదాతుఃఫలంలభేత్!!

మౌంజీవివాహమేకస్య యఃకుర్యాన్మేదినీపతే

దత్వార్థం కార్తికేమాసి తదనంతఫలంస్మృతమ్!!

కన్యాదానంతు కార్తిక్యాం యణుర్యాద్భక్తితోఽనఘ

స్వయంపాపైర్వినిర్ముక్తః పితౄణాం బ్రహ్మణః పదమ్!!

తా: పదివేల చెరువులు తవ్వించిన పుణ్యము, వంద రావి చెట్లు పెట్టించిన పుణ్యము, నూతులు, దిగుడుబావులు వందుకు పైగా తవ్వించు పుణ్యము, వంద తోటలు పెంచుపుణ్యము ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవ వంతుకు కూడ సరిపోవు.  కార్తీక మాసందుపనయన దానము చేసి తరవాత మాఘమాసమునకానీ, వైశాఖమునకానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులు ఐన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంతఫలముగలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనమున సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను, అలా చేసినచో కలిగెడి ఫలము చెప్పుటకు భూమిపై, స్వర్గంలో ఎవరికీ సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణులతృప్తిపరచుట చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్య దాతకే చెందును. కార్తీకమాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకుపనయనము వివాహము చేయించిన అనంతఫలము కలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించేవారు తాను పాపవిముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తికలుగించినవాడగును.

 

అత్రైవోదాహరంతీమం పురావృత్తం మహీపతే

తచ్ఛ్రుణుస్సబ్రవీమ్యేవం భక్త్యామైధిలసాదరమ్!!

దావరేబాహుజఃకశ్చిద్దురాత్మావంగదేశగః

సోపినామ్నాసువీరేతి బహుశౌర్యపరాక్రమః

రాజ్ఞన్తస్యమహీపాల భార్యాబాలమృగేక్షణా!!

సోపికాలాత్తుదాయాదై ర్నిర్జితోవనమావిశత్

అర్థాంగ్యాభార్యయాసాకం విచరన్ గహనేవనే

దుఃఖేనమహతాయుక్తో నిర్థనశ్చ మహీపతిః!!

తత్రసాగుర్విణీతస్య భార్యావన్యఫలాశనా

నిర్మలేనర్మదాతీరే పర్ణశాలాం మహీపతి

తతః కాలేప్రసూతాసా కన్యకాంతత్రసుందరీమ్!!

సమరక్షయత్తతోరాజా పూర్వసౌపమనుస్మరన్

వృద్ధింగతారాజకన్యా సుకృతేన పురాకృతా

రూపలావణ్యసంపన్నా నయనోత్సవకారిణీ!!

తా: ఓ రాజా! ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు చెప్పెదను సావధానముగా వినుము. ద్వాపరయుగంలో వంగదేశమునందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడుండెడివాడు. వానికి జింకకన్నులు చూపుల వంటి చూపుగల ఒక స్త్రీ అతనికి భార్యగానుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమున దాయాదులచేత జయింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను తీసుకొని అరణ్యమునందు జీవించుచు చాలా దుఃఖమునొందెను. ఆ అరణ్యమునందు రాజు భార్యయు కందమూలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండెను. ఆ విధముగా జీవనము చేస్తుండగా ఆమె గర్భవతియయ్యెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాల నిర్మించి వారు ఉండసాగెను, ఆ పర్ణశాలయందు ఆ సుందరి ఒక కూతురిని కనెను. రాజు అరణ్యనివాసము, వనములో దొరుకు ఆహారము ఆసమయంలో సంతానసంభవము కలుగగా సంతాన పోషణకు ద్రవ్యము లేకపోవడం అన్నీ తలచుకుని తన పురాకృతమైన పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. కొంకాలమునకు పూర్వపుణ్యవశము చేటా ఆ బాలిక వృద్దినొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ అలరారి చూచువారికి నేత్రానందము కలిగించుచునదాయెను.

 

అష్టవర్షాంమనోరమ్యాం దృష్ట్వాకశ్చిన్మునేస్సుతః

వివాహార్థంమతించక్రే సువీరంసమయాచత!!

తతోవాచతతస్సోపి దరిద్రోహంమునేస్సుత

ద్రవ్యం దేహియధోద్ధిష్టం ఉద్వాహంయదికాంక్షసే!!

ఇతి భూపవచశ్శ్రుత్వా కన్యాసంసక్తమానసః

మునిసూనురువాచేదం రాజానం మిధిలేశ్వర!!

దాస్యామిద్రవిణభూరి రాజన్ తేహంతపోబలాత్

తేనతెరాజ్యసౌఖ్యాని భవిష్యంతి న సంశయః

ఇతిశ్రుత్వావనెరాజా ఓమిత్యాహముదాన్వితః!!

తపశ్చచారతత్తీరే మునిసూనురుదారధీః

తత్రరాజన్బలాద్ద్రవ్యం సమాకర్ష్యహ్యతంద్రితః

తత్సర్వమర్థంనృపతేః ప్రదదేమునిపుత్త్రకః!!

గృహీత్వార్థంవసూన్ రాజా హర్షాల్లబ్ధమనీరధః

వివాహమకరోత్కన్యాం మునేస్తాపసజన్మనః

స్వగృహ్యోక్తవిధానేన కన్యాముద్వాహద్వనేః!!

తా: ఆచిన్నదానికి యుక్త వయస్సు వచ్చినది, మనస్సుకు బహురమ్యముగా ఉన్నది, యిట్లున్న కన్యకనుచూసి ఒక మునికుమారుడు సువీరా నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటవిని ఆ రాజు, నాకూతురిని మునికుమారునికా అని ఆలోచించి, నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనమిచ్చిన నా కన్యకామణిని నీకిస్తానని చెప్పెను. ఈ మాటవిని ఆకన్యయందు కోరికతో ఆ ముని కుమారుడు సరేయని ఒప్పుకొనెను.  ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదిమ్చి బహుద్రవ్యమును నీకిచ్చెదను దానితో నీవు సుఖముగానుండు అని చెప్పి ఆవిధముగానే చేసెను. తరవాత ఆ ముని కుమారుడు నర్మదా తీరమున తపమాచరిమ్చి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును రాజునకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తన కూతురిని ఆ మునికుమారునకిచ్చి తన గృహ్యసూత్రప్రకారముగ పెండ్లి చేసెను.

 

సవోఢాసాపితత్పార్శ్వం జగామమనుజేశ్వర

కన్యాద్రవ్యేణనిత్యం వై హ్యభూత్సోదరపోషకః!!

పునస్సువీరభార్యాసా ప్రజజ్ఞేకన్యకాంతథా

ద్వితీయాంతనుజాందృష్ట్వా పునర్లబ్ద్వాముదాన్వితః

ఇతఃవరంయధేష్టంమె ద్రవ్యంభూరిభవిష్యతి!!

ఏవం విచిమ్త్యమానేతు పుణ్యేనమహతానృప

అజఆమయతిఃకశ్చిత్స్నానార్థం నర్మదాంప్రతి

పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకయత్!!

తమువాచకృపాసింధుర్యతిఃకౌండిన్యగోత్రజః

కిమర్థమత్రకాంతారేకోభవాన్ వదసాంవ్రతమ్!!

ఏవంబ్రువంతమాహేదం భూపాలంకరుణానిధిం

రాజాహంవంగదేశీయ స్సువీర యితివిశ్రుతః

రాజ్యార్థం తైశ్చదాయాదైర్నిర్జితోస్మివనంగతః!!

తా: ఆ కన్యయు వివాహముకాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యావిక్రయద్రవ్యముతో తాను తన భార్యయు సుఖముగా జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి ఈ సారి కన్యను విక్రయించి చాలా ద్రవ్యమును పొందెఅదని తలచి దానితో ఆజన్మాంతము గడచునని భావించెను. రాజట్లు తలచగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాలయందున్న రాజును, భార్యను వారి కూతురుని చూచెను. కౌండిన్యసగోత్రుడైన ఆ ముని దయతో వారిని జూచి ఓయీ నీవెవ్వరవు ఈ అరణ్యమున ఏమిజేయుచున్నావు అని అడిగెను. యతి ఇట్లడిగిన మాటవిని రాజు చెప్పుచున్నాడు, అయ్యా నేను వంగదేశమును పాలించుచున్న రాజును నాపేరు సువీరుడు నాదాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నారాజ్యమును అపహరించిరి నేని ఈ వనమును చేరి నివసించుచున్నాను

 

నదారిద్ర్యసమందుఃఖం నశోకఃపుత్రమారణాత్

నచవ్యధానుగమినేన వియోగః ప్రియావహాత్

తస్మాత్తేనై వదుఃఖేన వదవాసంకృతం మయా

శాకమూలఫలాద్యైశ్చ కృతాహారోస్మికాననే!!

కాంతారేస్మిన్తతోజాతా పర్ణగారేతుకన్యకా

తాంప్రాప్తయౌవ్వనాందృష్ట్వా కస్మైవిప్రసుతాయచ

తస్మాద్భూరిధనం విప్ర గృహీతం యన్మయానఘ

నివసామిసుఖంత్వస్మిన్ కిమత్రశ్శోతుమిచ్చసి!!

ఇతిభూపవచశ్శ్రుత్వా పునరాహయతిస్తదా

మూఢవత్కురుషేరాజన్ మహాపాతకసమ్చయమ్!!

కన్యాద్రవ్యేణయోజీవే దసిపత్రంసగచ్ఛతి

దేవాన్ ఋషీన్ పితౄన్ క్వాపి కన్యాద్రవ్యేణతర్పయేత్

శాపందాస్యంతి తేసర్వే జన్మజన్మస్యపుత్రతామ్!!

యఃకన్యాద్రవ్యకలుషాం గృహీత్వావృత్తిమాశ్రయేత్

సోశ్నీయాత్సర్వపాపాని రైరవం నరకం వ్రజేత్!!

సర్వేషామేవపాపానాం ప్రాయశ్చిత్తంవిదుర్భుధాః

కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తంనచోదితమ్!!

తా: దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగదుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులు భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమమ్దు పర్ణశాలలో నాకు కుమార్తెపుట్టినది, దానిని యౌవ్వనము రాగానే ఒక మునికుమారునికి బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇలా రాజు చెప్పగా విని ఆ యతి ’ రాజా! ఎంత పని చేసితివి మూఢుని వలె పాతకములను సంపాదిమ్చుకొంటివికదా! కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమున అసిపత్రవనమనునరకమందు నివసిమ్చును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తిచేయుచున్నవానికి వారి ప్రతిజన్మమునందు ఇతనికి పుత్రులు కలుగరని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయుపాపాత్ముడు రౌరవనరకమును బొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్ననూ కన్యావిక్రయపాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడలేదు.

 

కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాంకన్యకాంతవ

కన్యాదానం కురుష్వత్వం సహిరణ్యోదకేనచ!!

విజ్ఞాయతేజోయుక్తాయ శుభశీలాయధర్మిణే

కన్యాదానంతుయఃకుర్యాత్కార్రిక్యామ్చశుభేదినే

గంగాదిసర్వతీర్థేషు స్నానదానేనయత్ఫలం!!

అశ్వమేధాదభిర్యాగై రుక్తదక్షిణసంయుతైః

యత్ఫలంజాయతేరాజన్ తత్ఫలంసోపిగచ్చతి!!

ఇత్యేవంగదితంశ్రుత్వా రాజారాజకులేశ్వర

యతింధర్మార్థతత్వజ్ఞం బాహుజఃకృపణోబ్రవీత్!!

కుతోలోకఃకుతోధర్మః కుతోదానం కుతఃఫలః

సుఖభోగైర్వినావిప్రదేహేస్మిన్ సుఖకాంక్షిణీ

పుత్రదారాదయస్సర్వేవాసోలంకరణానిచ

గృహక్షేత్రాణిసర్వాణి దేహాద్యాధర్మసాధనం

ద్వితీయాం మేదుహితరం యోద్రవ్యమ్ భూరిదాస్యతి

తస్యదాస్యేన సందేహః విప్రగచ్ఛయథాసుఖమ్!!

తా: కాబట్టి, ఈ కార్తీక మాసమమ్దు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురును కన్యాదానపూర్వకముగా వివాహము జరిపించుము. కార్తికమాసమందు చేసెడి విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్తతీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలము యధోదక్షిణసమేతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందెడి ఫలము బొందును. అని ఈ విధముగా ఆ యతి చెప్పినది విని రాజు ఆ సకలధర్మవేత్తయైన ఆ మునితో యిట్లనెను. బ్రాహ్మణుడా ఇదేమిమాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వాసోలంకారములున్నందుకు దేహమును సుఖబెట్టి భోగింపవలె, కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమేమిటి, పాపలోకమేమిటి? ఏదో విధంగా ధనం సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చినవానికి యిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములననుభవించుచూ జీవించెదను. నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము.

 

తతోయయౌనర్మదాయాం స్నానార్థంనృపపుంగవ

నృపస్యాస్యగతేకాలే కాంతారేమరణుగతః!!

ఆయయుర్యమదూతాశ్చపాశైరాబధ్యపాపినం

యమానుగాదక్షిణాశాంతతోజగ్ముర్యధాగతమ్!!

తత్రతంసమ్యగాలోక్యయమస్తామ్రారుణేక్షణః

నరకేషువిచిత్రేషు బబాధరవినంధనః

తథాసిపత్రెఘోరేచ పితృభిస్సహపాతయత్!!

సువీరస్యాస్వయెకశ్చిచ్చృతకీర్తిర్మహీపతిః

సర్వధర్మాంశ్చ కారాసౌతధాక్రతుశతానిచ

ప్రచకారస్వకంరాజ్యం ధర్మేణమిధిలేశ్వర

పశ్చాత్స్వర్గంసమాసాద్య సేవ్యమానస్సురేశ్చరై!!

సువీరః కర్మశేషేణ పితృభిర్నరకంగతః

తత్రవ్యచింతయద్ధుఃఖాద్యాతనాహేతుమాత్మనః

పూర్వపుణ్యప్రభావేన యమంప్రాహాతినిర్భయః

తా: ఆమాటవిని యతి స్నానము కొరకు నర్మదానదికి వెళ్ళిపోయెను, తరవాత కొంతకాలమునకు ఆ అడవిలో సువీరుడు చనిపోయెను. అంత యమదూతలు పాశములతో సహా వచ్చి రాజునుగట్టి యమలోకమునకు తీసుకుపోయిరి. అక్కడ యముడు వానిని జూచి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రమనందు రాజును రాజుపితరులను గూడ పడవేసెను. (అసిపత్రవనము = కత్తులే ఆకులుగాగల దట్టమైన అడవి). ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తియనే వాడొకడు సమస్త ధర్మములను చేసి వందయాగములన్ చేసి ధర్మముగా రాజ్యపాలనము చేఇస్ స్వర్గముబోయి యొంద్రాదులచేత కీర్తింపబడెను. ఈ శ్రుతికీర్తి సువీరుని పాతకవిశేషముల చేత స్వర్గమునుంచి తాను నరకమందు బడి యమయాతనలను పొందుచు ఒకనాడు ఇదేమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారేమని విచారించుకుని ధైర్యముతో ఆయమునితో ఇట్లనెను.

 

వాక్యంమెశ్రుణుసర్వజ్ఞ ధర్మరాజమహామతే

పాపలేశవిహీనస్య కిమియందుర్గతిర్మమ

సర్వధర్మావృధాయాంతి ప్రోక్తాఃపూర్వమహర్షిభిః

దివ్యంవిహాయనరకాగమనంచనసాంప్రతమ్!!

తా: సర్వమును తెలిసిన ధర్మరాజా! నామనవి వినుమయ్యా,, ఎంతమాత్రము పాపము చేయని నాకు ఈ నరకమెట్లు సంభవించినది. అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్ని పాటించిననూ వృధాయయ్యేఖాడ, స్వర్గమందున్న నాకు నరకమెట్లు కలిగినది?

 

ఇతిశ్రుత్వాయమఃప్రాహశ్రుతకీర్తి సహామతిం

అస్తికశ్చిద్దురాచారో వంశజస్తుతవాద్యవై!!

సోపినామ్నానువిరేతి కన్యాద్వవ్యేణజీవితం

తేనపాపేనపితరః పుణ్యలోకంగతా అపి

దివశ్చ్యుతాభవంతీహ దుష్టయోనిషుభూతలే!!

ద్వితీయాతనుజాతస్య వర్ధతేమాతృసన్నిధౌ

పర్ణాగారెనృపశ్రేష్ఠ నర్మదాయాస్తటేవనే!!

మత్ప్రసాదాద్భువంగచ్ఛ దేహేనానేనచానఘ

తత్రతిష్ఠంతిమునయస్తేషామేతన్నివేదయ

కన్యాంతాంశ్రుతశీలాయ కార్తికేమాసిభక్తితః

కన్యాదానంకురుష్వత్వమ్ సహిరణ్యోదకేనచ!!

సర్వాభరణసంపన్నాం యః కన్యాంకార్తికేనఘ

ప్రయచ్ఛతివిధానేన సోపిలోకేశ్వరోభవేత్!!

తా: శ్రుతకీర్తి మాటలు విన్న సమవర్తి చెప్పెను, ’ ఓ శ్రుతకీర్తీ, నీవన్నమాట సత్యమే, కానీ నీ వంశస్థుడైన సువీరుడనువాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్తులైనను నరకమందు పడిపోయిరి. ఆ తరవాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! ఆ సువీరునికి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లితో కలిసి పర్ణశాలయందున్నది, ఆమెకింకనూ వివాహము జరుగలేదు. కాబట్టి నీవు నాప్రభావము వలన ఈ దేహముతో అక్కడికి పోయి అక్కడనున్న మునులతో ఈ మాటను చెప్పి ఆకన్యను యోగ్యుడైన వరునకుయిచ్చి కార్తీకమాసమున కన్యాదాన విధానముగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తయైన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతియగును.

 

యతికన్యానజాయేత మౌల్యంవాయఃప్రయచ్ఛతి

దాతుర్గోమిధునం మౌల్యం కన్యాదానంతదుచ్యతె

కన్యాదానఫలంతస్య భవిష్యతినసంశయః!!

కురుత్వం ద్రాక్చవిప్రేభ్యః కన్యామూల్యమ్విధానతః

ప్రీణమ్తిపితరస్సర్వే ధర్మేణానేనసంతతమ్!!

శ్రుతకీర్తిస్తధేత్యుక్త్వా యమంనత్వాగృహంగతః

నర్మదాతీరసంస్థాంచ కన్యాంకనకభూషణాం

కన్యదానంతుకార్తిక్యాం చకారాసౌనృపోత్తమః

కార్తికేశుక్లపక్షేతు విధినేశ్వరతుష్టయే!!

తేనపుణ్యప్రభావేన సువీరో యమపాశతః

విముక్తస్స్వర్గమాసాద్య సుఖేనపరిమోదతే!!

తథైవదశవిప్రేభ్యః కన్యామూల్యందదావసౌ

ప్రయాంతి పితరస్సర్వే పుణ్యలోకం మహీపతే

పాపానియానిచోగ్రాణి విలయంయాంతితత్క్షణాత్

తతస్స్వర్గగతోరాజా శ్రుతకీర్తిర్యథాగతమ్!!

యస్తస్మాత్కార్తికేమాసి కన్యాదానం కరిష్యతి

హత్యాదిపాతకై స్సర్వై ర్విముక్తోనాత్రసంశయః!!

వాణ్యానాసులభంయేపి వివాహార్థం నగేశ్వర

సహియంయేప్రకుర్వంతి తేషాంపుణ్యమనంతకమ్!!

యఃకార్తికేప్రనిష్ఠో విధినాతత్సమాచరేత్

సయాతివిష్ణుసాయుజ్యం సత్యంసత్యంమయోదితం

నాచరేద్యదిమూఢాత్మా రౌరవమ్తుసమశ్నుతె!!

తా: అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఆ ధనదాతయూ లోకాధిపతియగును, కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరునకు యిచ్చి వివాహము చేసినయెడల కన్యాదాన ఫలమునొందును. కాబట్టినీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము యిమ్ము దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సుఖముపొందుదురు.  శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేయని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యకు సువర్ణాభ్హరణభూషితగా చేసి కార్తీకశుక్లపక్షమునందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుపోయి సుఖముగాయుండెను. తరవాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పొయిరి. తానూ యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీకమాసమున కన్యాదాన మాచరించేవాడు విగతపాపుడగును అందులో సందేహము లేదు. కన్యామూల్యమును యివ్వలేనివాడు మాటతోనైనా వివాహ సహాయమును చేసిన వాని పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరిమ్చువాడు విష్ణుసాయుజ్యమును పొందును. ఇది నిజము, నామాటనమ్ముము ఈ విధముగా కార్తీకవ్రతమాచరించనివారు రౌరవాది నరకములను బొందుదురు.

 

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదమూడవ అధ్యాయము సమాప్తము.

సంకలనం - కూర్పు

శంకరకింకర     

(శ్రీఅయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ)

~~~~~~~~~~~~~~~~~~~~~~

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

https://sri-kamakshi.blogspot.com/