Pages

Wednesday, May 24, 2017

గురువు - దీక్ష - శిష్యుడు

శ్రీ గురుభ్యోనమః
అసలు ఒక వ్యక్తియందు గురుత్వం కలిగినా లేదా ఆ గురుత్వం కలిగినపుడు ఆ వ్యక్తినుండి దీక్ష తీసుకున్నా తీసుకుందామనుకున్నా, మనం సాంతం త్రికరణ శుద్ధిగా దానికి సిద్ధంగా అవ్వాలి. "గురువును ఆశ్రయించాలి" అని మొత్తం వాఙ్మయం చెప్తోంది. అది నిస్సందేహం, కాబట్టి ఏదో ఒకరిని ఒక గురువుగా వరించడం, ఏదో ఒక మంత్ర దీక్ష తీసుకోవడం చేయడమొక్కటే దాని పరమావధి కారాదు. మంత్ర దీక్ష తీసుకోవడంతోనే స్థాయి మారిపోదు. nothing will change overnight. ఆ దీక్షతోపాటు దీక్షానిమయాలు. సాధనా పద్ధతులు, ఆ దీక్ష ఉపాసన ie., మంత్ర జపం. ఉపాసన స్థాయిని పెంచుతాయి. కొన్ని మంత్రదీక్షలు తీసుకున్న తరవాత కొన్ని కార్యక్రమ నిర్వహణలకు అర్హత సిద్ధిస్తుంది కానీ దాన్ని సాధన చేయకపోతే ? the purpose is in dilema..

ఒక దీక్ష తీసుకుందామని ఉంది అంటే అది ఎందుకు అన్న ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. "దీక్ష ఆర్ హావింగ్ ఎ గురు ఈజ్ నాట్ ఎ స్టేటస్ సింబల్". ఎంత సాధన ఎక్కువౌతుంటే అంత అంతః పరిశీలనం పెరగాలి. మౌనాన్ని ఆశ్రయించి ఉండగలగాలి. అనవసరమైన, అసంబద్ధమైన, అలవికాని ఆలోచనలకు కళ్ళెం వేయాలి. ఎంతో తెలుసుకోవాలి అన్న ఆతృత చాలా గొప్ప విషయం. కానీ అన్నప్రాశన నాడే కొత్తావకాయ చందానా అన్నీ ఒక్కసారే తెలిసేసుకోవాలి, గబగబాతెలిసేసుకోవాలి అన్న తత్తరపాటు కొంచెం చేటు. గురువుమీద, గురువిచ్చిన దీక్షాధిష్ఠాన దేవతమీద ఇలవేల్పు మీద నమ్మకం, ఆ మంత్ర సాధన మెల్లమెల్లగా జ్ఙానం సమకూరడానికి సాధనాలౌతాయి. చిత్తశుద్ధికలగాలిగా ముందు.

చిత్రం ఏంటంటే మనసుని కంట్రోల్ చెయ్యకపోతే, ఒకటి తెలుసుకుంటుంటే ఇంకోదాన్ని చూపిస్తుంది, లేదా దానికి వ్యతిరిక్తంగా ఉన్నట్లున్నదాన్ని చూపిస్తుంది. ఎట్ టైమ్స్ వుయ్ మే / షుడ్ ఆస్క్ ఇట్ టు షటప్. నిర్ణయం చేసేస్తుంది, జస్ట్ గెట్స్ కారీడ్ అవే విథౌట్ కంప్లీట్ నాలెడ్జ్. సాధనలో చాలా సార్లు సాధికారికంగా విషయం తెలుసుకునేవరకూ కంక్లూడ్ చేసుకోకూడదు. atleast 99% దగ్గర ఐనా ఆగాలి ఫర్ అథెంటికేటెడ్ కంక్లూజన్ కోసం. లేదా ఇదమిద్దంగా ఈ సాధనలో భాగంగా లేదా ఇది తెలుసుకోవడం ద్వార దీని ఫలితం ఇది అని నిర్ణయించుకున్నప్పటికీ, తరవాత ఎప్పుడో తెలుసుకున్నది అసంపూర్ణం, కొంత కరక్షెన్ చేయడం అవసరం, అన్న విషయం తెలిస్తే వెంటనే విథౌట్ ఎనీ ప్రిజుడీస్ వెంటనే కరెక్ట్ చేసుకోగలగాలి. సరైన విషయం తెలిసింతరవాత సెకండ్ థాట్స్ ఉండకూడదు. ఇందులో మన మైండ్ సెట్ కి అర్థం కాలేదు నేను దీన్ని ఒప్పుకోలేకపోతున్నాను ఇత్యాదికి నోరూమ్.. ఒప్పుకోలేకపోయినా, నచ్చకపోయినా ప్రాబ్లెమ్ ఈజ్ విత్ దట్ ఇండివిడ్యువల్ అండ్ హిజ్ ఇగొ నాట్ విథ్ ద ట్రుత్... సాధారణంగా ఇదే జరుగుతుంది. ఆయన అలా చెప్పారు కాబట్టి ఇది అని కంక్లూడ్ చేసింది. కొంత కాలానికి అందులో కొంత మార్పుందని తెలీగానే ఆ మార్పుకి అంగీకరించదు. దాని వల్ల అసహనానికి, ఆవేశానికి గురిచేస్తుంది.. అలాగే జనరిక్గా చెప్పినవేవి స్పెసిఫిక్ గా చెప్పినవేవి అన్న వివేచన ఉండాలి. ఇలాంటి వాటికి గురువు, పండితుల అవసరం అత్యంత ఆవశ్యకం.

గురువు దీక్ష ఇచ్చింతరవాత, ఏదైనా వేరే అడిగినా ముందు అవన్నీ పక్కనపెట్టి చెప్పింది నియమిత రూపంలో ఫలానా సంఖ్య చెయ్యమని చెప్తారు. అది అభ్యాసం. ఈలోగా మెల్ల మెల్లగా గురువు అనుగ్రహం, గురువు యొక్క ఆపేక్ష/వాత్సల్యం, మంత్ర ఋషి అనుగ్రహం, మంత్రాధిష్ఠాన దేవతానుగ్రహం వలన సాధనా బలం పెరిగి చిత్తశుద్ధి కలుగుతూంటుంది. మెల్ల మెల్లగా తెలియవలసిన విషయాలు తెలుస్తూంటాయి. (కారణ జన్ములు, అవతార పురుషులు వీటికి ఎక్సెప్షన్స్). దీక్షా సాధనలో, సమయం, ఆసన శుద్ధి, ఆహార శుద్ధి, ఆహార్య శుద్ధి (వస్త్రధారణ, అలంకరణ, తినే ఆహారం), శాంత స్వభావం, భావ ప్రకటనం, ఇవన్నీ చాలా గొప్ప సహకారం అందిస్తాయి. ఏదో ఒక మంత్రం పొందడానికి ఆమంత్రం ఉన్న గురువును ఆశ్రయించడం కాదు. ఆ గురువు యందు నిశ్చలమైన అఖండ విశ్వాసం ఉండాలి. ఫలానా "మంత్రంకోసం ఎవరోఒక గురువు" కాదు. "సద్ గురువుకోసం మంత్రం " లా ఆలోచన ఉండాలి... . ie., గురువును ఆశ్రయిస్తే ఏమంత్రం ఇస్తే తరిస్తారో ఆమంత్రం ఇస్తారు... గురువుననుగమిస్తే గురువిచ్చారు కాబట్టి తరిస్తారంతే రెండో ఆలోచన ఉండకూడదు. గురువులు అవకాశాన్ని అర్హతను బట్టి అడిగిన మంత్రదీక్షా ఇస్తారు. గురువు మీద నిశ్చల భక్తి నమ్మకం మోక్షార్హతను సాధించగలదు. గురువు వయసులో చిన్న కావచ్చు ఎప్పుడూ జుట్టు పండిపోయి వగ్గైపోయి ఉండక్కరలేదు. ఆది గురువు దక్షిణామూర్తే 16 యేండ్ల యువకుడు.. వృద్ధా శిష్యా గురుర్యువా అని కదా స్తోత్రం.

ఒకటి గుర్తు పెట్టుకోవాలి. శాస్త్రంలో మనకి శాసనాలెన్నో ఉన్నాయి, అలా అని ఎవరినీ వారి మానాన వారి ఖర్మకి వదిలెయ్యలేదు ఈ ధర్మం ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ ఇస్తూనే ఉంది. ఎక్సెప్షన్స్ అన్నీ అందరికీ కాదు, దుర్భలులకీ, అది తప్ప మరోమార్గంలేని వారికీ ఎట్స్.. అందుకే ఇలాగే చేస్తారు ఇలాగే చేయాలి అని నిర్ణయించుకునేటప్పుడు ప్రమాణ వాక్యాలను పరిశీలించాలి. ముఖ్యంగా సాంప్రదాయ బేధాలుంటాయని ఎరగాలి... ఐతే వీటివల్ల మూలంలో మార్పుండదు అంగాలలోనూ, ప్రయోగంలోనూ మార్పులుంటాయి తప్ప. ఎట్ ద సేమ్ టైమ్ మనసాంప్రదాయానికి కొంచెం మార్పులతో ఉంటే పరవాలేదు కానీ మూలాన్నే మారుస్తుంటే సౌమ్యంగా విచారణ చేసి ప్రమాణం తెలుసుకోవాలి/ లేదా సరి యైన విధం మనకి తెలిస్తే తెలపాలి.
గురువు అడగకుండా విద్య / లేదా దీక్ష ఇస్తారని ఎదురుచూడవద్దు. అన్ని సార్లూ అందరికీ అలా కుదరదు. అసలు శాస్త్ర ప్రకారం విద్యను/దీక్షను పొందటానికి విద్యార్థి / దీక్షార్థి గురువును అడగాలి. అడగనిదే విద్య నుడువరాదని ధర్మశాస్త్రం అందునా కలియుగం. భారతంలో చాలా క్లియర్గా చెప్పారు వ్యాసులవారు. వినమ్రుడై వినీతుడై అడగని వారికి విద్యనివ్వరాదని. "శిష్యుడు గురువుని" వరించాలి "గురువు శిష్యుని" కాదు. రామాయణంలో విశ్వామిత్రుడు - శ్రీరాముడు విషయంలో ఇటివంటి విషయం ఉంది. అడగకుండానే విశ్వామిత్రుడు శ్రీరామునికి మంత్రగ్రామం ఇచ్చాడు అని. కానీ అప్పటికే విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు గురుభావనతో అనుగమించారు. విశ్వామిత్రుడు అయోధ్యకొచ్చి దశరథుని మీపిల్లల్ని పిలు మంత్రాలిస్తాను అని అనలేదు. గురు భావనతో రామ లక్ష్మణులు అనుగమించిన విధానం చూసి మంత్రగ్రామం ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. గురువుని వరించాలి, కానీ ఏ దీక్ష కావాలో అది గురువు అనుగ్రహిస్తారు. ఈ విద్య కావాలి అని నిర్బంధించకూడదు. గురువు సంతుష్టుడైతే శిష్యుడు యోగ్యుడైతే వేరే విషయం. అలాగే అగస్త్యుడు కూడా.. అరణ్య కాండలో ఎదురెళ్ళి రాముడిని శిష్యుణ్ణి చేసుకోలేదు. విష్ణువే అని తెలిసినా రాముడొస్తాడని తెలిసినా తన ఆశ్రమంలోనే ఉన్నాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై గురు భావనతో సేవించాడు దివ్యమైన అస్త్ర శస్త్రాలు పొందాడు. ఒక్కసారి ఆ గురుశిష్య సంబంధం ఏర్పడిందా శిష్యుడు ఆపదలో ఉన్నాడని తెలిస్తే ఏం చేయాలో గురువది చేస్తాడు. అగస్త్యుడు ఆదిత్య హృదయం ఇచ్చినట్లు... కాబట్టి గురువుని ఆశ్రయించడం శిష్య కర్తవ్యం, ఏదీక్ష ఇవ్వాలో అది గురువు విషయం అది శిష్యుని పని కాదు.

-శంకరకింకర