గొప్ప గొప్ప సువాసననిచ్చే చందనపు చెట్లు, సంపెంగచెట్లలాంటి వాటి మొదళ్ళలోనే
బ్రహ్మాండమైన జాతి సర్పాలుంటాయి. అంత మంచి సువాసననిచ్చే చెట్ల మొదట్లో ఉన్నాయని,
విషం కక్కడం మానేసి మంచి సువాసనని అమృతాన్ని
వెదజల్లుతాయనుకుంటున్నారా! ఒక్కనాటికి అలా వదలవవి. వాసనాక్షయం చేసుకోవడం అంత
తేలిక్కాదు. అందుకోసం సత్సంగం వచ్చింది. సత్పురుష సహవాసం చేయగా చేయగా ఎప్పటికైనా
మారతాడు. మారి ఊర్ధ్వముఖపయనం ఆరంభిస్తాడు జీవుడు.
Tuesday, March 19, 2019
Friday, March 8, 2019
నవగ్రహ స్తోత్రం - శ్రీ వేద వ్యాస విరచితమ్
ఆదిత్యాయ చ
సోమాయ మంగళాయ బుధాయ చ !
గురు శుక్ర
శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!
జపాకుసుమ
సంకాశం కాశ్యపేయం మహదద్యుతిమ్ !
తమోరింసర్వపాపఘ్నం
ప్రణతోSస్మి దివాకరమ్ !! ౧ !!
దధిశంఖతుషారాభం
క్షీరోదార్ణవ సంభవమ్ !
నమామి
శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ !! ౨ !!
ధరణీగర్భ
సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ !
కుమారం
శక్తిహస్తం తం మంగలం ప్రణామ్యహమ్ !! ౩ !!
ప్రియంగుకలికాశ్యామం
రుపేణాప్రతిమం బుధమ్ !
సౌమ్యం
సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !! ౪ !!
దేవానాంచ
ఋషీనాంచ గురుం కాంచన సన్నిభమ్ !
బుద్ధిభూతం
త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !! ౫ !!
హిమకుంద
మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ !
సర్వశాస్త్ర
ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !! ౬ !!
నీలాంజన
సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ !
ఛాయామార్తండ
సంభూతం తం నమామి శనైశ్చరమ్ !! ౭ !!
అర్ధకాయం
మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ !
సింహికాగర్భసంభూతం
తం రాహుం ప్రణమామ్యహమ్ !! ౮ !!
పలాశపుష్పసంకాశం
తారకాగ్రహ మస్తకమ్ !
రౌద్రంరౌద్రాత్మకం
ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !! ౯ !!
ఇతి
శ్రీవ్యాసముఖోగ్దీతమ్ యః పఠేత్ సుసమాహితః !
దివా వా
యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి !! ౧౦ !!
నరనారీ
నృపాణాంచ భవేత్ దుఃస్వప్ననాశనమ్ !
ఐశ్వర్యమతులం
తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనమ్ !! ౧౧ !!
గ్రహనక్షత్రజాః
పీడాస్తస్కరాగ్నిసముభ్దవాః !
తా
సర్వాఃప్రశమం యాన్తి వ్యాసోబ్రుతే న సంశయః !! ౧౨ !!
!! ఇతి శ్రీ
వేద వ్యాస విరచితమ్ ఆదిత్యాదీ నవగ్రహ స్తోత్రం సంపూర్ణం !!
Monday, March 4, 2019
శివరాత్రి ప్రార్థన
శివరాత్రివ్రతం
వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు !
మాఘఫాల్గునయోర్మధ్యే
కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా
తు సోపోష్యా కుర్వన్ జాగరణం వ్రతీ !
శివరాత్రివ్రతం
కుర్వే చతుర్దశ్యామభోజనమ్!! 2
రాత్రిజాగరణేనైవ
పూజయామి శివం వ్రతీ !
ఆవాహయామ్యహం
శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్!! 3
నరకార్ణవకోత్తారనావం
శివ నమోస్తుతే !
నమః
శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య
విద్యార్థస్వర్గమార్గప్రదాయినే !
ధర్మం
దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం
దేహి స్వర్గం మోక్షం చ దేహి మే !
లుబ్దకః
ప్రాప్తవాన్ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది
మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు.
నాకుధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము'' - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము
Tuesday, February 19, 2019
ఉనికి - త్యాగం
దారం గుర్తింపు కోరుకుంటే దండ ఉనికిని
కోల్పోతుంది.
పూలు
వాడిపోయినా దారం అలాగే ఉండిపోతుంది
పునాది పైకి
కనపడాలనుకుంటే భవనం నేలమట్టమౌతుంది.
భవనం
మార్పులకి లోనైనా పునాది అలానే ఉండిపోతుంది.
త్యాగమే
వాటి అమృతత్వానికి నాంది!
-శంకరకింకర
Tuesday, January 29, 2019
పరమాత్మనెలా స్వీకరించగలను?
శ్రీ గురుభ్యోనమః
మనలో చాలా మందికి ఈ ప్రపంచంలోని కొందరు లేదా కొన్ని కొన్ని విషయాలు నచ్చవు, ఏదో ఒక పేచీ (compliant). అలాగే నాకూనూ, చిత్ర కారుడు గీసిన చిత్రాన్ని ఇష్టపడినప్పుడే కదా ఆ
చిత్రకారుణ్ణి స్వీకరించేది (Acceptance), అలాగే చిత్రకారుడి చిత్రంలాంటి ఈ ప్రపంచాన్ని యథాతథంగా
అంగీకరించలేకపోతే దాన్ని చిత్రించిన పరమాత్మనెలా స్వీకరించగలను?
ఆత్మవత్ సర్వభూతాని..... నన్ను నేను ఎన్ని చెడులున్నా
మంచి ఉన్నా స్వీకరించుకున్నానో (నాలో బయట ఎవ్వరికీ తెలియని మంచి చెడులతో సహా నన్ను
నేను accept చేసుకున్నట్లు)
ప్రపంచాన్నీ అలాగే స్వీకరించి చూడాలి..... విశ్వంలో విశ్వనాధుణ్ణి చూసే ప్రయత్నం....
-శంకరకింకర (10-Jun-2014)
గురువులు మార్గం మాత్రమే చూపుతారు
శ్రీ గురుభ్యోనమః
ఒకనికి మరొకరు దేవుణ్ణి చూపడమేమిటి? అసంబద్ధం కాకపోతే...
ఆత్మబోధలో శంకరులంటారూ మెడలో ఆభరణం వేసుకుని దాని గురించి ఇల్లంతా ఎక్కడెక్కడో వెతికి చివరికి తనమెడలోనే ఉన్నదని తెలుకొనిన స్వకంఠాభరణంలా... అని...,
ఆత్మబోధలో శంకరులంటారూ మెడలో ఆభరణం వేసుకుని దాని గురించి ఇల్లంతా ఎక్కడెక్కడో వెతికి చివరికి తనమెడలోనే ఉన్నదని తెలుకొనిన స్వకంఠాభరణంలా... అని...,
ఆత్మాతు సతతంప్రాప్తోపి అప్రాప్తవదవిద్యయా
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా!!
గురువులు మార్గం మాత్రమే చూపుతారు, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు (పరమహంస వివేకానందునికి లాగా)
అవతార ప్రయోజనార్థం అటువంటివి చూపగలరు. లేదా మోళి, ఇంద్రజాలం చేసేవారు అలా భ్రమింపజేస్తారు చేస్తారు తప్ప.
భగవంతుడేం సినిమానో నాటకమో కాదు టిక్కెట్లిచ్చి ధ్యానంలో చూపడానికి. ఇలా
చేసేవాళ్ళందరూ పరమహంసలూ కారు టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు వివేకానందులూ కారు.
-శంకరకింకరః (17-May-16)
Tuesday, January 22, 2019
తపో జలాలను సిరాగ మార్చి
పదునెక్కిన మనో కలాన్ని ముంచి వ్రాస్తానొక శాసనం!
ధర్మపరుల ఆలోచనలనావాహన చేస్తూ
ఉపాసకుల ఊపిరులతొ కొత్త శ్వాస తీస్తున్నా!
దృశ్యమే తామైన సమాధి స్థితి
పొందిన ద్రష్టల దృష్టిని కోరుతు ఉన్నా!
మాటల చేతల అంతరాలనూ
చండీసింహపు గర్జనలతో ప్రశ్నిస్తున్నా!
శివపార్వతుల తాండవ కేళీ
విలాస సాక్ష్యమై కాలి అందెగా సత్యాన్నై నిలుస్తున్నా!
పదునెక్కిన మనో కలాన్ని ముంచి వ్రాస్తానొక శాసనం!
ధర్మపరుల ఆలోచనలనావాహన చేస్తూ
ఉపాసకుల ఊపిరులతొ కొత్త శ్వాస తీస్తున్నా!
దృశ్యమే తామైన సమాధి స్థితి
పొందిన ద్రష్టల దృష్టిని కోరుతు ఉన్నా!
మాటల చేతల అంతరాలనూ
చండీసింహపు గర్జనలతో ప్రశ్నిస్తున్నా!
శివపార్వతుల తాండవ కేళీ
విలాస సాక్ష్యమై కాలి అందెగా సత్యాన్నై నిలుస్తున్నా!
పితృదేవతలంటే కేవలం “తండ్రులు” అని అర్థం తీసుకోకూడదు!
దేశికచరణస్మరణం!
పితృదేవతలంటే కేవలం “తండ్రులు” అని అర్థం తీసుకోకూడదు. . పితృదేవతలకు
నమస్కారం అని అంటే కేవలం శరీరం విడిచిన తండ్రి, తాతలేకాదు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా వీరుకూడా పితృదేవతలలో కే వస్తారు... అంతే తప్ప పితృ
అని పేరుందికాబట్టి కేవలం శరీరం విడిచిన తండ్రి
తాతలన్న అర్థం కాదు.. సంధ్యావందనంలోకానీ నిత్యవిధులలోకానీ పితృభ్యోనమః అంటే
శరీరంతో ఉన్న తల్లిదండ్రులకొరకు ఆ నమస్కారం అని కాదు అర్థం. శరీరం తో ఉన్న తల్లిదండ్రులకు నిత్యం చేసేది చేయవలసినది
తిన్నగా పాదాభివందనమే, ఏ మంత్రమూ అవసరంలేదు.
సంధ్యావందనం, నిత్య
నైమిత్తిక కర్మల్లో చేసే నమస్కార తర్పణాదులు దివ్య పితృదేవతలకు, శరీరంతో లేని మాతా పితరులకు ఆ పరంపరలో ఉన్న పైవారికి. రక్త సంబంధం
బంధుత్వం, ఆత్మ బంధుత్వం ఏర్పడిన పితృలోకంలో ఉండే గణాలని
గౌరవించడం పితృదేవతా నమస్కారం.
ఊర్థ్వలోకాల్లో అంటే
ద్యులోకంలో ఉండే పితృ దేవతలు ఏడు గణాల సమూహం అందులో మూడుగణాలకి ఆకారమే ఉండదు.. ఇక లింగబేధమేమిటీ?.. అక్కడకూడా
పితృస్వామ్యం అదీ ఇదీ వంటి ప్రశ్నలు ఉత్పన్నమవడమే అసంబద్ధం.
-శంకరకింకర
యశశ్శరీర హననం
దేశికచరణస్మరణం!
ప్రతి వ్యక్తికీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలుంటాయని సనాతన ధర్మంలో ఉండే
ఆస్తికులకు సంబంధించినవారికందరకూ తెలుసు. ఇది కాక స్థూల శరీరంలో ఉన్నప్పుడే మనిషి
మరొక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. అది తన శీలం వల్ల ఏర్పడుతుంది. శీలం అంటే
చారిత్రము, నడవడి అని అర్థం తప్ప
సినిమా రచయితల చెత్త అర్థం తీసుకోకండి. ఆ నడవడితోడుగా తనకు ఈశ్వరుడిచ్చిన విభూతిని
సమాజ పరం చేసినపుడు యశస్సు కలుగుతుంది. ఆ పరాదేవత ఆ వ్యక్తికిచ్చే మరో శరీరమే
యశశ్శరీరం అంటే కీర్తి శరీరం. ఒక వ్యక్తినెలా ఐతే భౌతికంగా ఇబ్బంది పెట్టాలనీ,
గాయపరచాలనీ, సంహరించాలనీ ప్రయత్నాలు సాగుతాయో
దాని పర్యవసానాలేమిటో, తత్సమానంగా ఈ కీర్తి శరీరాన్ని కూడా
ఇబ్బంది పెట్టాలనీ, యశో హననం చేయాలనీ ప్రయత్నాలు సాగుతాయి.
భౌతిక దాడికి హింసకి ఏదో ఒక కారణం, ఒక పగ, ఒక కక్ష వంటివి ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ సుకీర్తి
వల్ల ఏర్పడిన యశశ్శరీరాన్ని హింసించడానికీ, హననం చేయడానికీ
పెద్దగా ఏకారణమూ ఉండదు. అకారణంగానే యశశ్శరీర హననం చేయాలని చూస్తారు. విచారిస్తే
అకారణ అసూయా ద్వేషాలే దీనికి ముఖ్యమైన ప్రాతిపదిక. ఫలానా వ్యక్తిని గౌరవించడమేమిటి?
ఎందుకు గౌరవించాలి? నాకిష్టంలేదు. అంతే
పెద్దగా ఏ వ్యక్తిగత కారణాలూ ఉండవు. "నాకు" నచ్చలేదు "నేను"
గౌరవించను. ఈ "నేను నాకు" అన్న అహం, అందువల్ల
పుట్టిన అసూయ, ద్వేషం క్రోధంగా మారి వ్యక్తిత్వ హననానికీ
యశోశరీర హననానికీ కారణమౌతుంది. దీనికి లోనైనవాడు ఎంత దిగజారిపోతాడంటే తాను పాడవడమే
కాదు, తాను బురదలో కూరుకున్నా సరే, ఆ
బురద మరక ఎదుటివాడిమీద చిన్నపిసరైనా అంటించాలని ప్రయత్నిస్తాడు. అలా ఆ ప్రయత్నంలో
గోరంత సఫలీకృతమైనా కొండంత వికృతానందాన్ని పొందుతాడు.
నిజమేనా ఇలా యశశ్శరీరం ఉంటుందా? రావణుడికి పట్టినదోషాలలో కేవలం సీతమ్మని ఎత్తుకెళ్లడమే కాదు, రాముడి యశస్సుని తగ్గించి తగ్గించి సీతమ్మ దగ్గర ప్రేలడం కూడా... కర్ణుడు
దుష్టుడైనా యశశ్శరీరం ఉంది, రామాయణ, భారత
వ్యాఖ్యానాలు చదివితే తెలుస్తుంది. యశశ్శరీరహననం చేయడం చేయాలనుకోవడం మహా మహా
పాతకమైన క్రూర చర్య.
మరి ఇలా యశశ్శరీర హననాలు చేయ ప్రయత్నించేవాళ్ళు నిఝంగానే ఉంటారా అని అనుమానమా!?... ఓ కోకొల్లలు.. పరికించి చూడండి...
పుట్టలు పుట్టలు బారులు బారులు....
-శంకరకింకర
సమత్వ భావననకు చోదనం ఒకటే సోదరభావన
మనిషెంత హిపోక్రాట్ అంటే, ప్రాకృతికమైన లేదా ఒక నియతికి లోబడి అంటే తనకన్నా ముందు సృష్టించిబడిన ఏ ప్రమాణముతోటో ఉన్న హెచ్చుతగ్గులను అంగీకరించడు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలుకూడా ఎన్నడూ సములు కారు, కాలేరు. కానీ, అదే వ్యక్తి తాను సృష్టించుకున్న ధన, వస్తు, విద్యా, మేథ, సంపత్తి, అధికార, తాహతుల ఇత్యాదుల ద్వారా అదే అసమానతలను తాను వ్రాసుకున్న చట్టసమ్మతమైన వాటిని నిర్మొహమాటంగా అంగీకరించగలడు. నిజానికి ప్రకృతిలో అసమానత ఒక భాగం, అసమానత ఉన్నా దేని స్థాయి దేని ప్రత్యేకత దానిదే. ప్రకృతినర్థం చేసుకోనంత వరకూ, ప్రకృతి నియమాలనర్థం చేసుకోనంత వరకూ తన అవగాహనా రాహిత్యాన్ని ప్రశ్నించడం విప్లవం అనుకుంటాడు, సమాజాన్ని సంస్కరించుకోవడం అనుకుంటాడు. ఎంతైనా మనిషికదా హిపోక్రసీ ఎక్కువ. దాన్ని మనిషి అర్థం చేసుకోనంత వరకూ అర్థం చేసుకోలేని యుగ కవులూ, మహాకవులూ పుట్టుకొస్తూనే ఉంటారు.... వారి వెంట వెంపర్లాడేవారూ పుట్టుకొస్తూనే ఉంటారు. ఒక మనిషి ఇంకోమనిషికి ఎన్నడూ సమం అవ్వలేడు. మనిషికి మనిషేకాదు ఏజీవీ మరోజీవికి సమం కాదు, సమానత్వం సాధించడం కుదరని పని. సమానంగా చూడమని కోరుకుంటేనో నిర్భంధిస్తేనో వచ్చేది కాదు. ప్రతి వ్యక్తిలో ఎదుటివారిపట్ల ఆదరభావం, ఉదారత, ఒకరికోసం మరొకరి త్యాగబుద్ధి పెచ్చరిల్లాలి. దానికి చోదనం ఒకటే సోదరభావన. అందుకే శంకరులు మాతాచ పార్వతీ పితాదేవో మహేశ్వరః బాంధవాశ్శివభక్తాశ్చ అని ప్రార్థననిచ్చి అందరినీ ఒక కుటుంబానికి చెందినవారిలా చేసారు. ఈ యుగంలో సమత్వ దృష్టి చాటింది, సమత్వ భావననెలా అలవర్చుకోవాలో చెప్పి పెంపొంచింది ప్రచారం చేసింది జగద్గురు ఆది శంకరులే, ఆ తరవాత ఎందరైనా ఆ భావాన్ని పలు విధాల చాటవచ్చుగాక.
-శంకరకింకర
Subscribe to:
Posts (Atom)

