Pages

Wednesday, February 4, 2015

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 2

Continuation
ఏం తెలీకుండా ఏదో ఓటి పేలడం తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే...
//‘‘చర్చి ఫాదర్‌ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు- హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?’’ అని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నించారు. చర్చి ఫాదర్‌లలో కూడా అవలక్షణాలు ఉన్నవారు ఇటీవలి కాలంలో ప్రవేశిస్తున్నారనుకోండి. ఆ విషయం పక్కన పెడితే సాటి మనిషిని అంటరానివాడిగా పరిగణించాలని హిందూ మతంలో ఎక్కడ చెప్పారో సదరు స్వాములు, పీఠాధిపతులు చెప్పాలి. కొంతకాలం క్రితం ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులు, అక్కడికి వచ్చిన ఒక పీఠాధిపతిని పూలమాల, శాలువాతో సత్కరించాలని కోరారు. నేను ఆ పని చేయడానికి ఉపక్రమించగానే, సదరు పీఠాధిపతి శిష్యుడు అడ్డుకుని, ‘‘మీరు స్వామిని అంటుకోకుండా వాటిని చేతుల్లో పెట్టండి’’ అని అన్నారు. సాటి మనిషిని అంటుకోవడానికి కూడా ఇష్టపడని సదరు స్వామి మనుషుల మధ్య తిరగడం ఎందుకు? ఏ అడవుల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవచ్చు కదా? మరో స్వామి విషయానికి వద్దాం. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఆయన శిష్యుడు కూడా పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోకూడదు. ముందు సీటు- వెనక సీటుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో స్వామిగారి పాదాల చెంత కూర్చోవాలి. ఇలాంటి దృశ్యాలను చూసిన నాబోటివాళ్లకు సదరు స్వాములను గౌరవించాలని ఎందుకు అనిపిస్తుంది? తాము చేసేదంతా మానవాళి శ్రేయస్సు కోసమని చెప్పే ఈ స్వాములు, సాటి మానవులనే అంటరానివారుగా పరిగణించడం ఏమిటి? మరే ఇతర మతంలోనూ ఈ దురాచారం లేదు.//
హిందువునే కానని ప్రకటించుకున్న ప్రొఫెసర్ గురించి ఈయన కెందుకంత ఉబలాటమో అర్థం కాని విషయం. (birds of same feather fly together….aaa?) సరే ఆ సదరు మేధావి ప్రొఫెసర్ విషయానికి దాన్ని సమర్థించే ఈ మేథావికి ఈ చిన్న విషయం తెలియదేమో మరి.. పుండు వస్తే కడగడానికి రోగం వస్తే సేవచేయడానికి వైద్యులుంటారు. సమాజంలో వైద్యుడు అర్చకుడు అని రెండు వేరు వేరు వృత్తులున్నాయన్న విషయమూ తెలీదు. పాశ్చాత్య దేశాలలోచర్చిలలో ఫాదర్ తప్ప ఇతర వైద్యులుండేవారు కాదేమో మరి... ఐనప్పటికీ భారతదేశంలో చాలా గ్రామాలలో ఉన్న ఆలయాలలో అర్చకులే అవసరార్థం వైద్య వృత్తిని నిర్వహిస్తూ వైద్యులుగా ఉంటూ ఊరిలోని ప్రజలకి వైద్యం చేసేవారన్న సంగతీ తెలీకపోవడం గుర్తించకపోవడం వారి మేధావి తనానికి నిదర్శనమేమో...!!!

ఇక పీఠాధిపతులను ముట్టుకోవాల్సిన అవసరమేమిటి? మనిషిని మనిషి ముట్టుకోవాల్సిన అవసరమేమిటో అవగతం కాలేదు? సదరు పత్రికా యజమాని ఈ ప్రశ్న చాలా సార్లు అడగడం చూశాం. ఒక మనిషిని మనిషి ఎందుకు ముట్టుకోవాలి? చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తుకొని లాలించడానికి, కొడుకు కూతురు కాబట్టి దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించడానికి, అలా చూస్తే శరీర సంబంధంగా ఉన్న కొన్ని అనుబంధాల నేపథ్యం తప్ప మరో మనిషిని ఏమనిషి ఎందుకు తగలాలి? రామాయణంలో చెప్తారు రాక్షసుల గురించి అవతల వారి మీద ఇవతల వారు తమ శరీరాన్ని ఆనించారు, పడేశారుఅని అందుకనా?  సదరు వ్యక్తి పత్రికా యజమాని కాబట్టి తగలాలా? ఆయన కార్యాలయంలో ఆయన ఎంతమందిని రోజూ తాకుతూ ఉంటారు. దానికి ఆయన జవాబు అవసరాన్ని బట్టి అని, ఇక్కడా అంతే అవసరాన్ని బట్టి ఎవరు ఆయా పీఠాధిపతులకి, జగద్గురువులైన వారికి ప్రత్యక్ష శిష్యుడుగా ఉంటారో వారు అవసరాన్ని బట్టి ముట్టుకుంటారు. అసలు గురుశిష్య సంబంధాలు, మర్యాదలు, ఆచారసాంప్రదాయాలు తెలుసా పత్రిక వారికి? అసలు సన్యాస ధర్మం తెలుసా ఈ మేతావికి, ఏం తెలీకుండా ఏదో ఓటి పేలడం తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం..  సన్యాసిని సన్యాసి కానివాడు తగలడం సన్యాసికానివాడికి శ్రేయోదాయకం కాదు అని శాస్త్రవాక్కు, అంత దూల ఉంటే ముట్టుకో జరిగేదాన్ననుభవించు. సన్యాసి అవ్యాజ కరుణతో ఎవరినైనా దీవించడానికో, దీక్ష ఇవ్వడానికో మాత్రమే తగలవచ్చు తమ తపస్సును ఇవ్వవచ్చు. నీకంటికి కనబడనిది అశాస్త్రీయం అంటే, నీప్రాణం నీ కంటికి కనబడదు కాబట్టి నువ్వు బతికున్నావనేదీ అశాస్త్రీయం కాబట్టి నువ్వో శవం అంటే ఒప్పుకుంటానా? తెలీని విషయం కాబట్టి దీనికి అంటరానితనం అని ముద్ర వేయడం ఆయనకున్న అజ్ఞానం, పైత్య ప్రదర్శనం. నమ్మకాలని మూఢనమ్మకాలుగా చిత్రీకరించే అన్యాయమైన అత్యంత హేయమైన విషయమిది. అంటరాని తనం శారీరకమొక్కటే కాదు అది మానసికంగా ఉండకూడదు. సర్వాత్మకత్వ భావన ఈ సనాతనధర్మంలోది, మనిషి పుండే కాదు అవసరమైతే కుక్క, పంది వంటి జీవుల పుండూ కడిగే స్వభావం ఈ ధర్మంలో వారిది. (contd...)

3 comments:

  1. ఈయన అఫిస్ లో "నేను నా ముట్టుకోవటు౦ " మీద ప్రోగ్రామ్ తీస్తున్నారెమో.

    ReplyDelete