Pages

Friday, August 30, 2013

పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు?

పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పురాణేతిహాసాలలో ఉన్న మహానుభావుల చరిత్రలను వారి వృత్తాంతాన్ని వక్రీకరించి జనబాహుళ్యంలోకి ప్రచారంలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం. పురాణపురుషులను వారి వ్యక్తిత్వాలని వారి నిజ స్థితిని కాకుండా ఎవరికి తోచినట్లు వారు మార్చి వ్రాయటం, పురాణంలో ఉన్న మహానుభావులను కించపరుస్తూ ఉన్న పుస్తకాలు అసలు భారత జాతికే మూలగ్రంధాల్లోవైన పురాణాల వక్రీకరణను ప్రేరేపిస్తున్న లేదా మరుగున పరుస్తున్న పుస్తకాలు వాటి రచయితలను ఎందుకు ఉదాసీనంగా ఉపేక్షించడం జరుగుతోంది. మన ధర్మ గ్రంథాలను, పురాణేతిహాసాలను వక్రీకరిస్తుంటే మనం నిలదీయలేమా?

అవైదిక మతాలలో వారి గ్రంథాలకి వ్యతిరిక్తంగా ఒక్క నాటకం, సినిమా, పుస్తకం, వ్యాసం ఆఖరికి మాట బయటికొచ్చినా మూకుమ్మడిగా అందరూ కలిసి ఖండిస్తారే! న్యాయ పరంగా చట్టపరంగా ఎన్నో విధాల అలాంటి విషయాలు బయటికి రానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటారు.  అలాంటిది మన సనాతన ధర్మంలో ఉన్నవారమెలా మన ధర్మ ప్రచార గ్రంథాల విషయంలో మిన్నకుంటున్నాం? ఉదాసీనతకు కారణమేంటి?

మన పురాణ పురుషులు, పురాణంలో ఉన్న కథలను వ్యక్తులను వారి వ్యక్తిత్వాలను కించపరచినప్పుడు, వారి కథలను వక్రీకరించినప్పుడు ఖండించాల్సిన అవసరం మనకు లేదా? వక్రీకరించబడిన పురాణ కథలు ప్రచారంలోకి రాకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్త మనకు లేదా?

విషయం మీద పెద్దలందరూ కలిసి చర్చిస్తే కనీసం భవిష్యత్తులో పురాణేతిహాసాలను వక్రీకరించే వ్రాతలను ఆపడంలో కొంతైనా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీమీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

6 comments:

 1. దీని గురించి నా బ్లాగులో విపులంగా వ్రాస్తాను ఈ‌ సాయంత్రం.

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా మీ వివరణకై ఎదురుచూస్తానండీ

   Delete
  2. ఈ టాపిక్ మీద శ్యామలీయం గారు రాసిన టపా చూశాను. కరెక్ట్గా చెప్పారు. పోతే ఇంకొక మాట హిందూ మత పురాణా పురుషులను కించపరుస్తున్నపుడు స్వామూలు, బాబాలు పట్టించుకొక పోయినా, హిందూ బ్లాగర్లు మాత్రం ఊరుకోవడం లేదు. తమ స్తాయిలో తాము ఎదుర్కుని తమ మతాభిమానాన్ని చాటుతున్నారు. ఈ మద్య శ్రీ క్రిష్ణ భగవానుడి గురించి నార్ల వారి వ్యాసానికి విపులంగా కాకపోయినా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఒక బ్లాగర్ . కావాలంటే చూడండి.http://kalkiavataar.blogspot.in/2013/07/blog-post_5560.html అలాగే ఇంకొంతమంది బ్లగర్లు తమ వంతు కర్తవ్యం తాము చేస్తున్నారు.
   శ్యామలీయం గారు అన్నట్లు భగవంతుడు వచ్చే దాక భక్తులు నోళ్ళు మూసుకుని ఉండడం కరెక్ట్ కదు అని నా అభి ప్రాయం.

   Delete
  3. మీకు స్వాగతం! మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలావిష్కరిస్తూ మీ భావనలనీ సంపూర్ణంగా సమర్థిస్తున్నాను.

   Delete
 2. భారత జాతికి ముఖ్యంగ హిందువులకు ఉన్న పెద్ద దుర్లక్షణం ఎదుటివాణ్ణి గౌరవించకపోవటం, దానివల్ల ఒకడవునన్నది మరొకడు కాదనే తీరతాడు. పోనీ వాడి అభిప్రాయం అదే అయ్యి ఉంటుంది అనుకుంటే మరికొన్నిరోజులకి దాని వ్యతిరేక అభిప్రాయం మరొక వాదనలో (చర్చలో కాదు) వెళ్ళగక్కుతాడు.మనం బ్లాగుల్లో అలాంటివాళ్ళను చూస్తూనే ఉన్నాము. ఇలాంటి మనుషులున్న మన హిందూ జాతిలో మరొకళ్ళు మన మతం మీదకు దాడిచేస్తుంటే కట్టడిచెయ్యగలిగే శక్తి ఉందనే అనుకుంటున్నారా. ఏనాడో చచ్చిపోయింది. ఏదో దణ్ణం పెట్టకపోతే ఏమవుతుందో అనే భయంతో గుడికివెళ్ళేవాళ్ళు, కోరికలను తీర్చుకోవటానికి మొక్కుకునే వాళ్ళు లేదంటే మూఢ భక్తితో బాబాలు, భజనలు, యాత్రలే కాని మతం మీద ఆసక్తి, మతాచారాలు వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలు అర్ధం చేసుకుని ఆచరించేవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా!! అలా మతం మీద ఆసక్తి మతాచారాలు పాటించగలిగిన వాళ్ళు పదివేలల్లో ఒక్కళ్ళు ఉన్నా ఈ పాటికి హిందూ జాతి ఇలా నీరసపడి ఎవడేది చెబితే అది నోరెళ్ళ బెట్టి విని గంగిరెద్దులాగ తలూపడం జరుగుతూ ఉండేది కాదు.

  ReplyDelete
  Replies
  1. చాలా సంతోషం శివరామ ప్రసాదు గారు! మీకు స్వాగతం! మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలావిష్కరిస్తూ మీ భావనలనీ అర్థం చేసుకుంటున్నాను, సమర్థిస్తున్నాను

   Delete