Pages

Monday, August 12, 2013

మొట్టమొదటి సారి

శ్రీ గురుభ్యోనమః
నేను జీవితంలో మొట్టమొదటి సారి చేసిన పనులలో చాలా విషయాలలో సఫలీకృతుణ్ణి కాకపోవచ్చు, కానీ భావి జీవితంలో ఆయా విషయాలలో పట్టు సాధించడానికి అదే తొలి మెట్టు. ఆ
క్షణంలో కొంచెం సేపు అసఫలీకృతుణ్ణయ్యానన్నభావనకిలోనవుతానేమో కానీ అది నన్ను కుంగదీయదు సందర్భం నన్ను గోడక్కొట్టిన రబ్బరు బంతిలా పైకి లేపుతుంది అని నమ్ముతాను. నాకేమి చాలామందికి అలానే ఉంటుందనుక్కుంటా. పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించేవారు కూడా వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలలో కొన్ని సార్లు విఫలం అవుతూంటారు. విఫలం కన్నా అసఫలీకృతులౌతారు అన్నది సరియైన పదమేమో, విఫలమైన వాళ్ళు మళ్ళీ ప్రయత్నించరు కదా, అసఫలీకృతమైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి సాధిస్తారు. అదేనా సాధన అంటే?

2 comments:

  1. అయ్యా,
    పరీక్ష లేక ప్రయత్నం అంటే దానికి సఫలీకృతం లేక అసఫలీకృతం లేక విఫలం అన్నవి ఉంటాయి.
    సాధన అంటేనే పూర్తీ అయ్యేదాకా స్థిరచిత్తంతో కొనసాగించే ఉపాసన. అంతే కాని దానికి పరిమితులు ఉండవు. కొన్ని సందర్భాలలో కొనసాగింపు మధ్యలో ఆపేస్తే అది విరామం అవుతుంది అంతే కాని pass or fail అని ఉండదు అని నా ఉద్దేశ్యం. ఈ జన్మలో కాకపోతే తరువాతి జన్మలలో కొనసాగింపు జరుగుతుంది. జీవితంలో చేసే పనులకి, సాధన కి లంకె పెట్టడము సరి కాదేమో.

    కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

    ReplyDelete
    Replies
    1. ఒకటి లౌకిక సాధన మరోటి పారలౌకిక సాధన, ధన్యవాదాలు శర్మగారూ

      Delete