Pages

Sunday, March 10, 2013

శివదర్శనమ్

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా!
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్కథయ మమ వేద్యో2సి పురతః!!

పరమశివా! కారుణ్య సముద్రాంతరంగా! ఇది నీకు నాయందు యుక్తమా తెలుపుము ప్రభూ!  నీ శిరస్సు, పాదములను చూడదలచి హరి బ్రహ్మలే వరాహము, హంసలుగామారి ఒకరు ఊర్థ్వదిశగానూ మరొకరు అథోదిశగానూ పయనించి శ్రమనుపొందినా నిన్నెరుగనైతిరి. శంభో! మరి ఎలా? నాయెదుట ప్రత్యక్షమై నాకు మీరెట్లు కనిపించెదరో/తెలియనగుదురో తెలియజేయుము.

శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేకంగా శివ సంబంధ విషయాలు చదివుదామని ఉన్న పుస్తకాలు తరచి చూస్తూ అనుక్కోకుండా శివానందలహరిలో అలవోకగా చూడగా 99 శ్లోకం కనపడింది, శివానందలహరిలో శ్లోకరచనకి ముందు (రచన అనడం తప్పే మన్నింపబడెదనుగాక )కాలడి శంకరులకి కైలాస శంకరుల దర్శనం అయ్యిందినీ, శ్లోకం చదివినవారికి సదాశివుడు సద్యఃఫలితం ఇస్తాడనీ పెద్దల వ్యాఖ్యానం.


అద్యమేసఫలం జన్మ చాద్యమేసఫలంతపః
అద్యమేసఫలం జ్ఞానం శంభోత్వత్పాదదర్శనాత్ !!
కృతార్థోహం కృతార్థోహం కృతార్థోహం మహేశ్వర
అద్యతేపాదపద్మస్య దర్శనాద్భక్తవత్సల !!
శివశ్శంభుశ్శివశ్శంభు శ్శివశ్శంభుశ్శివశ్శివః
ఇతి వ్యాహరతోనిత్యం దినాన్యాయాంతుయాంతుమే !!
శివే భక్తిశ్శివే భక్తిశ్శివే భక్తిర్భవే భవే
సదాభూయాత్సదాభూయాత్సదాభూయాత్సునిశ్చలా !!
ఆజన్మ మరణంయస్య మహాదేవోనదైవతం
మాజనిష్యతమద్వం శే జాతోవాద్రాగ్విపద్యతామ్ !!
జాతస్యజాయమానస్య గర్భస్థస్యాపిదేహినః
మాభూన్మమకులేజన్మ యస్యశంభుర్నదైవతమ్ !!
హరశంభోమహాదేవ విశ్వేశామరవల్లభ
శివశంకరసర్వాత్మ న్నీలకంఠనమోస్తుతే !!
అగస్త్యాష్టకమేతత్తు యఃపఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహమోదతే !!

అనుక్కోకుండా శివరాత్రి సంబంధిత శ్లోకమే కంటిముందు కనపడడం, శివదర్శనమే అని భావిస్తూ.. వాచాలత్వమూ, భావనావ్యగ్రతా అని ఎవరికైనా అనిపిస్తే శివభక్తితో కలిగిన ఉన్మత్తత అని క్షమించెదరని కోరుతూ..


-శంకర కింకరుడు

No comments:

Post a Comment