Pages

Monday, January 28, 2013

సనాతన ధర్మంలో ’స్త్రీ’ - 01

శ్రీ గురుభ్యోనమః

నమస్తే

ప్రపంచంలో మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నోసార్లు చాటిచెప్పింది నా ధర్మం, నా దేశం, నాజాతి. అనాదియై, ఉన్నతమైన ఎన్నో భావాలు కలిగి ప్రపంచానికి, లోకానికే కాదు పారలౌకిక వాసులకీ సంస్కారం నేర్పిన గడ్డ గడ్డ. ఇక్కడ పుట్టినందుకు, జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను.

ఒక్క భారతదేశంలోనే,
ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాం, ఏంటమ్మా అని పలకరిస్తాం.
ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపి గౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయజాతికి మాత్రమే తెలుసు.
ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరాదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాల పూజ చేసినా ఆమెకే.
ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమం, అసలు ఆమెయే ఎక్కువ కూడా, మా వేదాలు, శాస్త్రాలు, ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయి. ఆమెయే గృహం, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళి అయ్యీ అవ్వగానే, వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ ఆమె యజమానురాలు. అదీ మాజాతి. అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడం, ఆనక వదిలేయడం అవైదికమూ, భారతీయతా కాని, అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, పాఖండ మతస్తుతల సంప్రదాయం.


నిజానికి సనాతన ధర్మంలో, స్త్రీ మూర్తి లేకుండా మంగళమూ లేదు, మన దేశంలో స్త్రీ మూర్తిలేని ఇల్లు గబ్బిలాల కొంప వంటిదని అభిప్రాయం. ఇంట్లో కళ కళ లాడుతూ స్త్రీమూర్తి తిరుగుతూ దీపం పెట్టిన ఇల్లే దేవాలయం. ఆమెయే దేవత. స్త్రీలేకపోతే మగవానికి గౌరవమే లేదు. ఎంత గొప్పవాడైనా తన పక్కన భార్యగా స్త్రీమూర్తిలేకపోతే వైదిక కార్యక్రమమూ చేయలేడు. అసలు సనాతన ధర్మంలో ప్రవర్తిస్తున్న భారతజాతిలో పురుషుడు ఏది చేసినా స్త్రీ గౌరవాన్ని ప్రకటించేదే అయ్యి వుంటుంది. (ఇది నిక్కం, తఱచి చూడండి. ఊసుపోక ఏదో గాలి రాతలు రాయడం నాకలవాటులేదు.)

అసలు సనాతన ధర్మానికి మూల ప్రమాణం వేదం, వేదాన్నే వేద మాత అని పిలుస్తాం. అన్య మత గ్రంధాలలో ఒక్క గ్రంధాన్ని చూపండి అమ్మా అని పిలిచే గ్రంథాన్ని. అసలు ఒక సంవత్సర కాలంలో చేసే ఉపాసన కూడా దేవీ నవరాత్రులతో స్త్రీని అమ్మవారిగా పూజించడంతో మొదలు. అంత గొప్పది నాజాతి, నా ధర్మం, అంత గొప్పవారు స్త్రీ మూర్తులు. స్త్రీమూర్తులు అంత గొప్పగా కీర్తించి పూజించబడ్డారు నాదేశంలోనే! మరే దేశంలోకాదు, మరే మతంలో కాదు. అసలు భక్తి విశ్వాసాలు పక్కన పెట్టండి వాళ్ళకంత విశాల దృక్పథం అలవడడానికి కూడా నోచుకోని సంస్కార హీనమైన జాతులు ఎన్నో, వారు మారి, మన దేశ ఔన్నత్యాన్నీ, సనాతన ధర్మ ఔన్నత్యాన్నీ తెలుసుకుని వారి దేశాలు వదిలి ఆధ్యాత్మికత, సంస్కారం కోసం మన దేశం పట్టారు. మనం మనది కాని తక్కువదాన్ని ప్రోగు చేసుకోవడం కోసం ఎదురు దారి పట్టాము.

అవైదిక వాదనలు ప్రబలి కట్టుబాట్లు సడలి సినిమాలు, దిన, వార, పక్ష, మాస పత్రికల పేర్న అశ్లీలం జొప్పించే సాహిత్యం వలన అక్కడక్కడా కొందరు సంస్కార హీనులై రాక్షసులలాగా ప్రవర్తిస్తుంటే, అది చూపి, అదిగో మీ జాతి అని అభాండాలు వేస్తున్నారు. అది మా జాతి కాదురా, మీరు, మీ పిచ్చి రాతలు, అలవి మీరిన స్వాతంత్ర్యం వల్ల, మీరు తయారు చేసిన విషపు పురుగులు అని గట్టిగా మనం చెప్పగలగాలి.

సంస్కార హీనులైన అన్యులు గెరిల్లా యుద్ధాల లాగా భారత గడ్డమీద యుద్ధం చేసినా, ఎదిరించాం, ఓడినా ఓర్చుకున్నాం ఎందుకంటే అప్పటికే జాతి నాగరికమైన, సంస్కారవంతమైన జాతి, పోతేపోనీలే మళ్ళీ సంపాదిస్తాం అనుక్కున్నాం తప్ప, తప్పుడు యుద్ధాలు, కుట్రలు ఎరుగని జాతి ఇది. ఓర్పు, క్షమ, ఔదార్యం, సంస్కారం అంటే ఏమిటో మన నరనరాల్లో, మన రక్తంలో ఉన్నది. మనమే కావాలనుక్కుంటే, భూప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకునే వారం, కానీ పూర్వులచే పొందిన సంస్కారంతోటి, శాంతి కాముకత్వం వలన యుద్ధాలకి వ్యతిరిక్తులైన జాతి నా జాతి. ఇప్పుడు నాగరిక జాతి అని చెప్పుకుంటున్నవారంతా ఎటువంటి అనాగరికులో కుసంస్కారులో వారి యుద్ధరీతుల్ని, మోసపుటాలోచనలని చూస్తేనే తెలుస్తుంది. అంత నష్టం జరిపినా ఇంకా భారత జాతి హిమాలయ పర్వతంలా గంభీరంగానే నిలబడి ఉంది, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, నాగరికంగా, ముఖ్యంగా సంస్కారవంతంగా..... అందుకు కుళ్ళుకుంటున్న కుళ్ళు జాతుల మతాలు, వీళ్ళు ఎంత తొక్కినా పడగెత్తి పైకి లేస్తున్నారన్న అక్కసుతో మన ధర్మంపై కత్తిగట్టి, లేనిపోనివి ప్రచారం చేసి తిరిగి మనలో మనకి తగవులు తెస్తున్నారు. పిపీలికాన్ని బ్రహ్మాండం చేసి చూపుతున్నారు. తస్మాత్త్ జాగ్రత్త వీళ్ళబారిన పడకండి. మనలోనూ ఒకరిద్దరు తప్పుడు రాతలు రాసేవారు, మాటలు మాట్లాడే వాళ్ళుండవచ్చు. వారి తప్పుడు మాటలను చేష్టలను మన జాతి అందరిమీదా, మన ధర్మంలోని అందరికీ, మన ధర్మానికీ ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తస్మాత్త్ జాగ్రత్త. అందునా మన వేళ్ళతోనే మన కళ్ళు పొడవడానికన్నట్లు మనవారినే మనకి వ్యతిరేకంగా వారి కుబోధలచే ఆకర్షించి వారి వేపుకు తిప్పుకుని మనపై ఏనాటినుండో యుద్ధం సాగిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా మన సోదరులు అంతర్జాలంలో యుద్ధాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు, వారు ఘోరీలా సంస్కారహీనులు, కుట్ర పూరితంగా, మోసంతో, నీతి నిజాయితీ వదిలినవారు కాబట్టి ఓడినా తిరిగి ఏదో ఒక విధంగా మనని ఇబ్బంది పాల్జేయడానికి, మన సంస్కృతిని దెబ్బకొట్టడానికీ వస్తూనే ఉన్నారు. ఇకనైనా, తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు హుందాగా, గంభీరంగా వ్యవహరించాల్సిన మనం మన స్వస్థితిలోనుండి జారిపోరాదు. మనకి మనం పరాకు చెప్తూనే స్వధర్మాన్ని కాపాడుకుందాం.

కన్న తల్లి దండ్రులను బహిరంగంగా అంతర్జాలంలో తిడుతూ వ్యాసాలు రాసే నియతిలేని మనుషులు కూడా సుద్ధులు చెప్పడానికి, మన ధర్మంలో లోపాలెంచటానికి కంకణం కట్టుకున్నారు. మనం వారిలా విషం కక్కనక్కరలేదు, కుళ్ళు కుతంత్రాలు చేయనక్కరలేదు. ఉన్న విషయాన్ని, సనాతన ధర్మ ఔన్నత్యాన్నీ, హిమాలకన్నా ఎంతో ఉన్నతమైన భారతీయ సంప్రదాయపు సంస్కారాన్నీ ప్రకటించడం ద్వారా వారి విషవాక్కులకు విరుగుడు కలగించడం కూడా ఒక పద్ధతి.

అసలుస్త్రీమూర్తులగూర్చి మన వాజ్ఞ్మయం ఎలా కీర్తించింది, మన దేశంలో స్త్రీ మూర్తులు ఎట్లా గౌరవించబడ్డారు/గౌరవించబడుతున్నారో, బ్లాగులో పరంపరగా కొన్ని వ్యాసాలుగా ప్రకటించాలని ప్రయత్నం. ఉన్న 99.9999999......9% మంచిని కనీసంగానైనా చూపక మిగిలిన ఫ్రాక్షన్ శాతం చెడును భూతద్దంలో 100%గా చూపి దాన్ని సనాతన ధర్మంలో చరించే అందరికీ ఆపాదించే సంస్కృతిని నిలువరించటానికే నా ప్రయత్నం. ఆపై జగజ్జనని ఐన పరాదేవత అనుగ్రహం.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

1 comment:

  1. ఆ జగజ్జనని మీ ప్రయత్నాన్ని సఫలీకృతం చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete