Pages

Tuesday, January 1, 2013

రమణుల మొదటి లిఖిత ఉపదేశం

భగవాన్ రమణ మహర్షుల వారు అరుణాచలం వచ్చిన తరవాత వారు, అరుణగిరినాథర్ ఆలయం వద్ద, అరణగిరి మీద ఆ చుట్టుపక్కల తపస్సు చేసుకుంటూ బ్రాహ్మణ స్వామిగా, మౌన స్వామిగా అందరిచేత పిలవబడేవారు. ఆసమయంలో వారి అమ్మగారు అళగమ్మగారు కొడుకు వేంకట రమణన్ అరుణాచలంలో ఒక స్వామిగా ఉన్నాడని తెలిసుకొని తన మరిదిగారిని అరుణాచలం వెళ్ళి వేంకటరమణన్ నివెనక్కి తీసుకురమ్మని పంపారు. ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో ఆవిడే అరుణాచలం వెళ్ళి విరూపాక్ష గుహలో ఉన్న మౌన స్వామిని తిరిగి ఇంటికి రమ్మని బ్రతిమాలింది, బామాలింది, నిష్ఠూరాలు పలికింది. ఆ తల్లి మనసు పడే వేదనను అక్కడి చుట్టుపక్కలవారు, అప్పటికే రమణుల వద్ద చేరిన శిష్యులు తట్టుకోలేక స్వామిని చేరి ’అయ్యా! మీరు ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మకి స్వాంతన కలిగించకుండా ఉండకుండా ఏదో ఒక సమాధానం చెప్పవచ్చుకదా’ అని అడిగారు.
భగవాన్ రమణుల మొట్టమొదటి లిఖిత ఉపదేశం లోకానికి వారి తల్లి ద్వారా అందింది. ఆ సమయంలో రమణులు "కర్త జీవులను వారి వారి ప్రారబ్ద కర్మానుసారము ఆడించును.జరుగనిది ఎవరెంత ప్రయత్నించినా జరుగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరును. ఇది సత్యము. కనుక మౌనమే ఉత్తమము" అని వ్రాసి ఇచ్చినారు. వారి మొదటి లిఖిత బోధ మాతృమూర్తికి. బహుశా అదే ఆ అమ్మ తిరిగి ముక్తిని పొందు వరకు రమణుల వద్దనే ఉండడానికి కారణమైయ్యుంటుంది. ’మాతృదేవోభవ’ అన్న ప్రమాణానికి సూచనా అన్నట్లు, వారు లోకానికి చేసిన బోధకూడా మొట్టమొదట తల్లి కి నమోవాక్కములర్పిస్తూ మొదలెట్టారా అన్న విధంగా జరగింది

మీ

No comments:

Post a Comment