శ్రీగురుభ్యోనమః
శ్రీరాముడికన్నా అవమానం పొందినవారూ, కష్టపడ్డవారూ లేరు. ఆఖరికి వెలివేయబడి
నలుగురు మంత్రులతో కలిసి కాలం వెళ్ళదీస్తున్న వానర నాయకుడు సుగ్రీవుడు కూడా
శ్రీరాముని పరాక్రమానికి ప్రజ్ఞకి పరీక్ష పెట్టాడూ. అది నాస్థాయి కాదని అలగలేదు, రాముడు. రావణుడైతే మరీ ఘోరంగా పిరికివాడు, మనికిమాలిన రాముడన్నాడు నీ
ప్రజ్ఞ, నీ విశేషం, నీ ప్రతిభ, నీ నేర్పరితనం లోకులెరగకపోవచ్చు, తెలియక నిన్ను తక్కువగా ఎంచవచ్చు నిర్లిప్తత
పొందక, ఓ నవ్వు నవ్వుకుని, నిన్ను నువ్వు మెఱుగు పెట్టుకునే అవకాశంగా
తీసుకో.. గుర్తింపు కతీతంగా ధీరుడెప్పుడూ స్వశక్తిపైనే నిలబడతాడు, మార్గదర్శకుడౌతాడు.
-శంకరకింకర
No comments:
Post a Comment