గురుభ్యోనమః
’ధర్మం తలకాస్తుంది’ అని ఒక సామెత ఉంది. అడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే.
రావణునికి పది తలలున్నప్పటికీ తాను చేసిన అధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.
- జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు.
- జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు.
సుందరకాండలో సీతమ్మ దగ్గరకొచ్చి ధర్మం ధర్మం అంటావెందుకు? నేనూ ధర్మాత్ముణ్ణే. పుట్టుకచే బ్రహ్మవంశం వాడైనా ఏమార్చడానికు అనుకూలంగా మా రాక్షస ధర్మం ప్రకారమే నిన్నెత్తుకొచ్చాను అని కొత్త ధర్మాలు చెప్పే ప్రయత్నం చేసాడు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళున్నారు మాదారి కొత్తదారి మా దారి విలక్షణం అని ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసేవాళ్ళు. గురు దక్షిణ దగ్గరకొచ్చేసరికి శాస్త్ర విహితం, అసలు విషయానికొచ్చేసరికి మాదారి శాస్త్రాలకతీతం అనే అవైదిక మార్గంలో సంచరించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని పాలించి పాటించడం వైదికం. అధర్మాన్ని అనుసరించడం అవైదికం.
-శంకరకింకర
No comments:
Post a Comment