Pages

Wednesday, October 5, 2016

నవరాత్రి ఉపాసనలో భేదాలు


చాలా మంది నవరాత్రులలో అమ్మవారి అవతారాలు ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయెందుకు కన్ఫ్యూజన్ వస్తోంది అంటున్నారు. విషయమేమంటే. ఈ నవరాత్రి పూజ వైదికంగా చేస్తారు అలాగే పురాణోక్తంగా చేస్తారు. వైదిక విధివిధానంలో ఉత్సవం చేస్తున్నప్పుడు పురాణాలకు వేదాలకు మధ్యనున్న వైదిక తంత్రగ్రంథాలలో చెప్పబడిన శ్రీవిద్యాది శాక్త పరంపరా విధానంలో చేస్తారు వీరు నవదుర్గలుగా (శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత మొ) అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులూ. అదే పురాణోక్త విధానం ఐతే దేవీభాగవతాది గ్రంథాలలో చెప్పినవిధంగా (మహా లక్ష్మీ, సరస్వతీ, దుర్గా, మహిషాసుర మర్ధినీ మొ,,) ఏవిధానం సరియైనది అన్న విషయంలో మీమాంస ఏమీ లేదు. రెండూ సరియే వైదిక తంత్ర విధి విధానంలో తగిన మంత్ర దీక్షా, వేద మంత్ర సమన్వయం తెలిస్తే ఆ అధికారం కలిగి ఉంటే ఆవిధంగా చేయవచ్చు. లేదా పురాణోక్తంగా సార్వజనీకంగా చేయవచ్చు. ఇందులో పూజలో ఉపచార సమన్వయం ఎక్కువగా సస్వర వేదమంత్రాలు బీజ మంత్రాలతో కాక శ్లోకాలతో ఉంటుంది. ఇలా కాక ముఖ్య పూజ మటుకు పైరెంటిలో ఒక ప్రకారం చేసి, అలంకారం అవీ అమ్మవారి మూర్తులలో ఒక మూర్తిని ఎంచుకుని ఉత్సవం చేయడమూ శిష్ఠాచారమే. మొత్తంగా ఈ తొమ్మిది రాత్రులూ జగజ్జననిని ఆరాధించాలి.

-శంకరకింకర

No comments:

Post a Comment