గురుభ్యోనమః
పరిణతి
పొందడం చాలా గొప్ప విషయం, కానీ ఆస్థాయి పొందనివారిని లేక నిజాయితీతో
భగవంతుణ్ణాశ్రయించేవారిని వెర్రివారిలాగానో, అవివేకిగానో,
మూర్ఖుడిగానో మరోటిగానో కించపరచడానికి కాదుగా.. పరిణతి, జ్ఞానం సంపాదించేది లోకుల్ని ఎంచడానికి కాదు, లోక
ప్రియత్వం అలవర్చుకోవాలి. భగవంతునియెడ వారినమ్మకాన్ని గౌరవించగలగాలి. అందరినీ ఒక
గాట గట్టడానికీ, తక్కువ చేసి నవ్వుకోడానికో, గేలి చేసి లూజ్ వర్డ్స్ వాడటానికో కాదు జ్ఞానం సముపార్జించాల్సింది.
వీలుంటే అనునయించి చెప్పాలి. పండితుడన్న అహంకారం వదిలి జ్ఞానం పంచాలి. పండావు
అన్నదానికి గుర్తేమిటంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు. ఆ మాటల్లో కరకుదనంలేక
ఎంత విజ్ఞతతో 'పండు'తనంతో మాట్లాడావా
అన్నది కొలబద్ద.
-శంకరకింకర
No comments:
Post a Comment