పూర్వం కొందరు రాక్షసులు బాగా మదమెక్కి ప్రతివాడిదగ్గరకెళ్ళి అరవ కేకలు పెట్ట యుద్ధానికి రమ్మని పిలువ రాకపోతే సాధుసన్యాసులను ఏడిపించను ఇదే పని. బలిష్టుడైతే కొడతారు బలహీనులైన తాపసులు ఇత్యాదులైతే మీ దేవుడు లేడు గీవుడులేడు అన్నీ నేనే అని వాళ్ళ మానాన వాళ్ళని ఉండనివ్వకుండా ఆ సాధు సన్యాసులని మానసికంగా నానా విధాల బాధపెట్టేటైపన్నమాట. మొత్తానికి ఎదుటివాడిని మానసికంగానో శారీరకంగానో గాయపరచడం వాళ్ళు బాధపడుతుంటే సంతోషించడం వంటి శాడిస్టు రాక్షసులన్నమాట. ఏ బ్రహ్మగారో వచ్చిఏంట్రా ఈ పనులంటే నా ఉపాధే అది కదా రాక్షసోపాధి ఏం చేయమంటావ్ అని అడగడం. ఏదో మళ్ళీ పెద్దలచేద మందలింపచేసుకొని కొత్త వరాలుపొంది బలిసి మళ్ళీ యుద్ధాలకెళ్ళడం అది పరిపాటి వీలైతే వారిని మార్చడానికి లేకపోతే సంహరించడానికి మళ్లీ భగవంతుడు అవతార స్వీకారం చేయడం మామూలే...
పూర్వం త్రేతాయుగంలో వాలి, రావణుడు కుంభకర్ణుడు ఈ వరుసలో దుందుభి అనే ఒక రాక్షసుడుండేవాడుట. వాడు పొద్దున్నే ఒక లిస్ట్ చూసుకునేవాడుట నాతో ఓడిపోని బలవంతుడెవడూ అని... ఎవరి పేరు లిస్టులో స్ట్రైక్ అవ్వకపోతే వాడి దగ్గరకెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవ వాణ్ని చితకబాదుడు మధ్యాహ్నం ఇంటికొచ్చి తిని తొంగోడం. ఇదే పని పాట అనవసర గొడవలంటే ఇవే దీనివల్ల వాడంటే అందరికీ హడల్ అన్నమాట. ఉత్తినే గొడవెట్టుకుంటాడెవడ్రాబాబూ వీడని తలట్టుకునేవారు. ఎందుకు వీడికి ఇలా అంటే ఏం కారణం ఉండదు కేవలం ఎవరేం చేస్తారు నన్ను అని కండకావరంతో బలిసి చేసే పనులన్నమాట. వాడికి పోయేకాలం దాపురించి ఒకసారి లిస్టులో వాలి పేరు కనపడింది కాలాంతరంలో వాలిచేతిలో ఒక్క గుద్దుకి చచ్చాడు.
ఇలాంటి వాళ్ళు మనకీ బోలెడు పొద్దున్నే కాఫీ తాగి పేపరు తీసి తిన్నదరక్క ఈ సనాతన ధర్మం మీద ఏ వివాదాస్పద వ్యాఖ్య చేస్తే ఎంత పబ్లిసిటీ వస్తుంది ఎన్ని లైకులు షేరులు వస్తాయి ఎన్ని కామెంట్లొస్తాయి అని వెతుక్కుని అలా వ్యాఖ్యలు చేయడం, ఆ చేసిన పని గొప్పదనిన్నీ, అంతకన్నా జీవితంలో చేయాల్సిన గొప్పపని లేదన్నట్టున్నూ, పైగా నాలెడ్జి షేరింగ్ అంటూ కలరింగిచ్చీ ఏదో విషయాన్ని వివాదం చేసి, చేయించి, ఏ రాక్షసుణ్ణి పొగిడి, దేవుణ్ణి చిన్నతనం చేస్తే (అవేవో కొన్ని ఎడం చేతివాటం పాత తెలుగు సినిమా పైత్యాలలాగా) ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది? అలా రాయొచ్చా లేదా, ఋషులేం చెప్పారు లెక్కేలేదు. ధుర్యోధనుడూ హీరోయే, రావణుడూ హీరోయే.. కొన్ని రోజులు పోతే ఈ అల్‍ఖైదా, ఐసిస్ తీవ్రవాదులూ హీరోలౌతారు. చూసారా ఆ ఒక్కటి తప్ప వాళ్ళలో ఎంత పట్టుదల ఉందీ అదీ మంచి గుణమని కావ్యాలు వ్రాసినా ఆశ్చర్యంలేదు. ఏ రామ భక్తుడో, సాధు పురుషుడో మంచి చెప్పబోతే, మీరు చెప్పే వ్యాస వాల్మీకి రామాయణాది పురాణాలే ప్రమాణం కాదు అవి తప్పుల తడకలని రిటర్న్ కలరింగిచ్చి... అలా చేయడం దాని మీద మా జన్మ హక్కు మాకు రాజ్యాంగమిచ్చిన హక్కు వగైరా కవుర్లు చెప్పి వితండవాదం చేసే బేచన్నమాట..... వీళ్ళెందుకు చేస్తారంటే ఏమీలేదు గొడవెట్టుకుంటే అదేదో సినిమాలో ’ఆ కిక్కేవేరప్పా’ టైపు.... నాలుగు తిట్లు తిట్టించుకుని, ఎవడో కడుపు మండినవాడు నాలుగు శాపనార్థాలు పెడితే (లోపలికో బయటికో) తప్ప తిన్నదరగని బేచ్ ఇది.... మన సినిమాల్లోను చాలా గొప్ప పేరున్న టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ట్విట్టర్ సెలెబ్రిటీ & శిష్య బృందం టైపు.... పుర్రెకెంతొస్తే ఏం తోస్తే అది వాగేటైపు... ... మనసు
రంజింపజేయరాదు అన్న
సామెతలా..
ఎప్పుడో అప్పుడు రావాణుడిలాంటి ఈ బ్యాచ్ కి వాలి లాంటోడు ఆ వాలి లాంటోడికి రామ సుగ్రీవులు తగుల్తారు, అప్పుడు వదుల్తుంది
......
Well said
ReplyDeleteహ్హహ్హహ్హ బాగా చెప్పారు
ReplyDeleteపలువురి నోళ్ళలో తమ పేరు నానాలని కొందరు అనవసర చర్చల పేరుతో మతాలు, మత గ్రంధాలు , దైవాలతో ఆటలాడ చూస్తున్నారు .. దీనికి వీరు కూడా అలనాటి రాక్షసుల్లా కుక్కచావు చావడం ఖాయం ధర్మో రక్షతి రక్షితః
ReplyDeleteమీకు స్వాగతం
Deleteతిరిగి స్పందించడంలో కొంత ఆలస్యం జరిగింది...
meeru cheppindi aksharala nijam .
ReplyDeleteGot it
ReplyDeleteమీకు స్వాగతం
Deleteతిరిగి స్పందించడంలో కొంత ఆలస్యం జరిగింది...
బలవంతుడ నాకేమని
ReplyDeleteపలువురతో నిగ్రహించి బతుకుట మేలా
బలవంతమైన సర్పము చలి చీమలచేత చిక్కి చావదె సుమతీ
బాగా చెప్పేరు.
ReplyDeleteస్పందించిన అజ్ఞాతలందరికీ స్వాగతం
ReplyDeleteతిరిగి స్పందించడంలో కొంత ఆలస్యం జరిగింది...