శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఒకానొకప్పుడు ఒక శంకరాచార్యులని ఒక నాస్తికుడైన వ్యక్తి ఇలా
ప్రశ్నించారట "మీరు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం,
దాని ఫలితం, స్వర్గం, నరకం,
మోక్షం, దేవుడు, ఆత్మ అని
ఏవేవో చెపుతారు. మాకవన్నిటిమీదా నమ్మకంలేదు అవన్నీ ఎవరో కల్పించినవి అని ఇప్పటి విజ్ఞానం
ద్వారా మాకు తెలుస్తోంది. మీరు చెప్పేవి బోధించేవి ఇవన్నీ అసలు లేవు అని మా నమ్మకం.
కాబట్టి మీ జీవితాన్ని సరి యైన విధంగా మలచుకొని, ఈ కల్పిత శాస్త్రాలు
వాటి నిబంధలలో కట్టుబడడం వగైరా ఈ ఇబ్బందులన్నీ వదిలి మీ ఇష్టం వచ్చినట్లు హాయిగా
జీవించచ్చు, మీ కళ్ళముందు కనబడుతున్నదాని గురించి మీ మేథాశక్తిని
మనుష్యజాతికి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. మీ జీవితమూ వ్యర్థం కాదు అని చెప్పారట"
దానికి ఆ శంకరులు చిరునవ్వి నవ్వి " అవును మీరు చెప్పింది
బాగుంది. మీరు చెప్పిందాంట్లో విషయాలు నాకు మంచి చెప్పాలని ప్రయత్నించి చెప్తున్నారు
భగవంతుడు మీకు మేలు చేస్తాడు.
1) ఒక వేళ మీరన్నట్లు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం ఊర్థ్వాధోలోకాలు, పాప పుణ్యాలు,
మోక్షం లేవు అనుక్కుని, వేదాది శాస్త్రాలు నిబంధనలు
అన్నీ కల్పితాలు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు జీవించమన్నారు. ఇప్పుడు నేను చేసేది నా
ఇష్టం వచ్చినట్లు జీవించడమే, నాకు వేదం అన్నా శాస్త్రమన్నా సనాతన
ధర్మమన్నా ఇష్టం అందుకు అనుగుణంగా జీవిస్తున్నాను కాబట్టి నేను సంపూర్ణ అంగీకారంతో
సంపూర్ణసంతోషంతోటే ఈ జీవితాన్ని సాగిస్తున్నాను. వేరేవిధంగా జీవించడం నాకు ఇష్టముండదు.
కాబట్టి మేమూ, మా పూర్వాచార్యులు చెప్పినట్లు నిజంగా పైన చెప్పినవి
లేకున్నా మా జీవితం మాకు నచ్చిన విధంగా సాగుతున్నది కాబట్టి ఇలా జీవించడంలో మాకే ఇబ్బందీ
లేదు.
2) ఒక వేళ అలా మీరన్నట్లు కాక మేము , మా పూర్వాచార్యులు నమ్మిన మా వేద శాస్త్రాదులే వేదాంతర్గతమైన సిద్ధాంతములు
సత్యమని, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం,
జీవుడు, ఆత్మ ఇత్యాదుల ఎరుక మీకు దేహాంతంలో తెలిసిందనుక్కోండి
అప్పుడు మీరేమి చేయగలరు, ఏదైనా చేయడానికి అప్పుడు మీకు దేహమే
ఉండదు కదా! మేము మా పూర్వాచార్యులు, వేద శాస్థ్రాదులు,
ధర్మం చెప్పినట్లు జీవించాం మాకు ఇబ్బందిలేదు మరి మీరో? ఇన్ని రోజులూ మీరబద్ధం అనుకున్నది సత్యం అను ఎరుక వచ్చాక సమయం మించిపోతుందే?
మరి మీలోని జీవుడు ఎలా ఉద్ధరణ పొందుతాడు?
మీరు చెప్పిన విషయాన్ని తీసుకుంటే రెండు పార్శ్వాల్లోనూ ఇబ్బంది
లేని వాళ్ళం మేము. మీరు నమ్మింది మీకు తప్పని తేలిననాడు ఇబ్బందుల్లో ఉండేది మీరు...!
మాకు రెండు విధాల్లోనూ ఉండేది ఆనందమే...! మా ధర్మాన్ని నమ్మి చరించే వారికి ఏ స్థితిలో
నైనా ఉండేది ఆనందమే.
కాబట్టి సనాతన ధర్మ చరితులమైన మా జీవితం గురించి మీకు బెంగవద్దు, మీ జీవితాన్ని మీరు గట్టెక్కించుకోండి. ఈ జీవితాన్ని మీ ఉద్ధరణకి
పది మంది ఉద్ధరణకి పనికి వచ్చేలా తీర్చిదిద్దుకోండి... భగవంతుడు మీకు మేలు చేస్తాడు,
మీకు శుభం కలుగుతుంది....!!!
(ఎప్పుడో పెద్దలు చెప్పిన చద్దిమూట, చెవులతో ఒడిసి పట్టుకున్నది)
అయ్యా నేనెక్కడో చదివాను శంకరాచార్యుల వారు కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా అద్వైత సిద్ధాంతమని, మీరేమో కర్మ సిద్ధాంతమని చెప్తున్నారు అసలు అద్వైత సిద్ధాంతం ఆసాంతం తెలుసుకొని రాస్తే బాగుంటది అనుకుంటున్నాను
ReplyDelete> శంకరాచార్యుల వారు కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా అద్వైత సిద్ధాంతమని
Deleteఅద్వైతం కర్మసిధ్ధాంతానికి కాంప్లిమెంటరీ. వ్యతిరేకం కాదు.
ధన్యవాదములు
Deleteనమస్తే
ReplyDeleteతప్పకుండానండీ, తెలుసుకోవడమొక్కటే నేను చేసే ప్రయత్నం. ఐతే మీరు చదివిందెక్కడో ఏ పుస్తకమో తెలీదు అలా ఎవరైనా చెప్పినా రాసిన వారికి తెలీకో సరిగ్గా అర్థంకాకో అలా అనుంటారు. వారు చెప్పింది కేవల కర్మ ఫలితాన్నివ్వదు, ఆ కర్మవలన ప్రీతి పొందిన దేవతలు ఫలితాన్నిస్తారు అని. శంకరుల జీవతంలోని కుమరిల భట్టు, మండన మిశ్ర, సరసభారతుల గూర్చి, శంకరులు వారితో జరిపిన చర్చలు, వారిచ్చిన వాఙ్మయం పరిశీలించగలరు. శంకరులు కర్మ సిద్ధాంత వ్యతిరేకి కాదు, వేద విహితమైన కర్మలు నిర్వహించి ఆ కర్మలచేత చిత్తశుద్ధి పొంది తద్వారా జ్ఞానమును పొంది తత్వమసి - ఉన్నదంతా ఒక్కటే, అన్యము లేదు అనే అద్వైత స్థితిని చేరాలి అని వేదాంతర్గతమైన విషయములే వారి బోధల సారాంశం.. శంకరులు మనందరికీ ఇచ్చిన సాధన / సోపాన పంచకం చూడగలరు... "వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్ ..."
Dhanyavadamulu.. Sir
ReplyDeleteWelcome to the blog and thank you sir
Deleteచక్కటి సందేశం. ధన్యవాదములు నాగేంద్ర.
ReplyDeleteబ్లాగులోనికి స్వాగతం
Deleteనాగేంద్ర గారు చెప్పిన మాటలు సరైనవే కాని కొంత తేడా ఉంది కర్మకాండ లో ఇరుక్కోవద్దనే శంకరోపదేశం కన్నప్ప ఏ వేదాలు చదవడానికిి?
ReplyDeleteబ్లాగులోనికి స్వాగతం, ధన్యవాదములు
Deleteఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా, ఇలాంటి కల్పిత శాస్త్రాలకు ఆనందాన్ని బలిపెట్టకుండా జీవించాననుకోండి,
ReplyDelete1) చచ్చిపోయిన తరువాత ఇవన్నీ లెనిమాట రూఢి అయ్యిందనుకోండి, మిగినలినవాళ్ళకన్నా సుఖంగ జీవించిన త్రుప్తి నాకు ఉంటుంది.
2) ఒకవేళ ఈశాస్త్రాలుచెప్పిన కబుర్లన్నీ నిజమేననుకోండి... "దేవుడా నువ్వు నాకిచ్చిన పంచేంద్రియాల పరిధిలోలేనిదాన్ని ఎలా నమ్మేది?, అలా రూధిచేసుకోదగ్గ సమాచారం నాకు లేనప్పుడు నాకు వినిపిస్తున్న మాటలు నీవేననీ నా ఊహలు కాదని ఎలా రూడిచేసుకొనేది, నాకు తెలిసినంతలో నేను నిజాయితీగా జీవించానేకానీ, నాకు అర్ధంకానివాటిని అర్ధమైనట్లు బుకాయిస్తూ, నన్నునేను మోసంచేసుకోలేదు, నేను నమ్మినవాటిని ఇంకొకరిమీద రుద్ది వారంతా తప్పుడు వాళ్ళని judgeచేస్తూ బ్రతకలేదు. నీ ఇష్టమొచ్చింది చెయ్యి" అంటాను. దేవుడనేవాడికి తనను పొగడలేదన్న కచ్చలేకుంటే, నిజాయితీమీద గౌరవముంటే నన్ను అర్ధంచేసుకుంటాడు. అలా కాకుంటే అలాంటివాణ్ణి పొగుదుతూ, వాడుచెప్పిన దారిలో నడుచుకొని జీవితాన్ని వృధాచేసుకోనందుకు మరింత తృప్తితో ఆ అనర్హుడు విధించే శిక్షను అనుభవిస్తాను (ఆంగ్లేయుల చేతిలో శిక్షలనుభవించిన మన దేశభక్తుల్లాగా).
బ్లాగులోనికి స్వాగతం, ధన్యవాదములు !
Deleteఅయ్యా మీరు చెప్పిన దాని ప్రకారం దేహాంతంలో తృప్తి దేనికి కలుగుతుంది. మనిషి పోయాక ఏమీలేదు అంటే అందరికన్నా ఆనందంగా జీవించాను అన్న తృప్తి దేనికి (అప్పుడు దేహం లేదు కదా ) కలుగుతోంది నాకర్థంకాలేదు. వాదు కోసం కాదు, అర్థం కాక అడిగాను....
Deleteమీరేమిటి అలా అడిగారు. తృప్తి ఆత్మకి సంబంధించినదని (ఆత్మతృప్తి అన్న పదంకూడా ఉంది కదా!) విన్నానే. ఎవరైతే మీపోస్టులోని ఆలోచనలతో ఎవరైతే దేహానంతరంకూడా సమాధానపడగలుగుతున్నారో, ఎవరైతే 'ఉధ్ధరణ' పొదగలుగుతున్నారో వరే తృప్తికూడా పొందుతున్నారనేది నా అభిప్రాయం.
ReplyDeleteఅదీకాక... తీరా చనిపోయాక, వేదాలు వర్ణించిన దేవుడి ముందుకాక, వేరొక దేవుడి ముందు జీవుడు/ఆత్మను ప్రవేశపెట్టారనుకోండి. అప్పుడా దేవుడు తను ఫలానా పుస్తకంలో తనొక్కణ్ణే దేవుణ్ణని చెప్పినా, జీవుడు/ఆత్మ తనకి రోజుకు ఇన్నిసార్లు ప్రార్ధనలు చెయ్యలేదనో, తనంతటతానుగా తాను అసూయా పరుణ్ణని, ఇతరదేవతలను పూజిస్తే తనకు కోపం వస్తుందనీ ప్రకటించినా కూడా జీవుడు/ఆత్మ తనను కాక ఎవరినో దేవుళ్ళుకాని వారిని పూజించి, వారిపేరున చెప్పబడిన ధర్మాలను పాటించాడనీ తద్వారా తనను అవమానించాడనీ శిక్షిస్తేనో?
అసలు మనము నమ్మిందే పరమధర్మమని, మన నమ్మకలు పొరబాట్లుకావని మనకు ఎలా తెలుస్తుంది? ప్రపంచంలో ఇన్ని మతాలున్నప్పుడు ఒక్కోమతం తమ జీవనవిధానమే అసలు సిసలైఅన ధర్మమని చెబుతున్నప్పుడు ఎవరు స్వర్గానికి వెళతారో, ఎవరు నరకానికి వెళతారో, ఎవరు పొరపాటున ధర్మమనుకొని ఎవరో చెప్పిన తప్పుడుధర్మాన్ని ఆచరిస్తున్నారో ఎవరుమాత్రం ఖచ్చితంగా చెప్పగలరు?
మీరు పొరపడి రెంటినీ కలుపుతున్నారు, ఈ రెండు సిద్ధాంతాలు ఒకటికొకటి కలవవుగా... అందులో ఇదుండే ఛాన్స్ లేదు, ఇందులో అదుండే ఛాన్స్ లేదు. కాబట్టి ఒకవేపు నుంచే వెళదాం, రెండూ కలపకుండా,
Deleteమీమాటల్లో ఉన్న #1) చచ్చిపోయిన తరువాత ఇవన్నీ లెనిమాట రూఢి అయ్యిందనుకోండి, మిగినలినవాళ్ళకన్నా సుఖంగ జీవించిన త్రుప్తి నాకు ఉంటుంది. #
అన్న సందర్భంలో ఆత్మ అనేదే లేదు కదా ఆ తృప్తి దెహాంతంలో (చచ్చిపోయిన తరవాత) దేనికి కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఎవరికి రూఢి అవుతుంది? ఏవీ లేవనుక్కున్న సిద్ధాంతం ప్రకారం అప్పుడు జీవుడూ లేడు, ఆత్మ లేదు, దేహమూ పోతుంది కదా తృప్తి దేనికి కలుగుతోంది అని నా అనుమానం... అది నివృత్తి చేయమని అడిగాను... ఆత్మ తృప్తి వగైరా అన్నీ రెండవ పాయింట్లో ఉన్నట్టుగా మరణానంతర జీవితం ఉందని నమ్మినప్పుడే కాని లేదని నమ్మినప్పుడు కాదు కాబట్టి ఆత్మ తృప్తి అనేది ఇక్కడ సరి కాదు దేహం లేదు కాబట్టి దేహానికి కాదు... మరి దేనికి తృప్తో చెప్పమని ప్రార్థన..
ఇక మిగిలిన వాటికి ప్రాతిపదిక కేవలం ’విశ్వాసము’. మీ వంటి పెద్దలు ఇవన్నీ లేదన్నా దానికి ప్రాతిపదిక ’మీ విశ్వాసం’... అలాగే ఇవన్నీ ఉన్నాయన్న మాబోంట్ల ప్రాతిపదిక ’మా విశ్వాసమే’.
ఇక మతం వేరు ధర్మం వేరు ఏమతం ఏది ఎంతమంది దేవుళ్ళు, అంతమందిలో వాళ్ళకున్న గొడవలు అవన్నీ పెద్దలు చేసే పెద్ద చర్చలు లెండి, ఇలా మనటాపిక్ కి దూరంగా జరిగి ఇవన్నీ చర్చిస్తే టీవిల్లో వచ్చే అసంబద్ధ చర్చల్లా ఉంటుంది.... అవన్నీ కాదు కానీ పైన నా సందేహ నివృత్తి మాత్రం చేయండి pls..
"మీరు చెప్పిన విషయాన్ని తీసుకుంటే రెండు పార్శ్వాల్లోనూ ఇబ్బంది లేని వాళ్ళం మేము. మీరు నమ్మింది మీకు తప్పని తేలిననాడు ఇబ్బందుల్లో ఉండేది మీరు...! మాకు రెండు విధాల్లోనూ ఉండేది ఆనందమే...! మా ధర్మాన్ని నమ్మి చరించే వారికి ఏ స్థితిలో నైనా ఉండేది ఆనందమే."
ReplyDeleteఆత్మ ఉందని నేను నమ్మను. మీరడిగిన ప్రశ్నలోనే మరణానంతర కాన్షస్ గురించిన ఒక assumption ఉంది. మీరు ఉదహరించిన తర్కంలోకూడా లోపాలున్నాయని చెప్పడానికే మీ assumptionకూడా కొనసాగించాను దానికి నేను కొన్నిసార్లు ఆత్మ అన్నాను (ఆ సమయానికి కాన్షస్ అన్న పదం గుర్తుకురాలేదు) . మరణించాక ఎవరైతే తాము జీవించిన మార్గం సరైనదని/సరైనదని కాదని తెలుసుకోగలుగుతున్నారో వారే బ్రతికి ఉన్నప్పుడు తృప్తిగా బ్రతికినందుకు సంతోషం/తృప్తి అనుభవించగలరుకదా. ఎవరైతే మీతర్కంలో చనిపోయిన తరువాత బ్రతికుండగా తాము సరైన ధర్మాన్ని పాటించామని తెలుసుకోగలుగుతున్నారో, వాళ్ళే నాతర్కం ప్రకారం తృప్తిని పొందుతున్నారు.
నేనడిగిన మొదటి, రెండు ప్రశ్నలు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి. ఒకవేళ ఆత్మ దేవుడి ముందుకెళ్ళాక, ఆదేవుడు నేను చెప్పిన ధర్మం పాటించకపోగా, ఇంకెవరిదో ధర్మాన్ని పాటించి నన్ను అవమానించావు అని హుంకరిచే అవకాశంలేదా? అప్పుడు ఈ ధర్మ శాస్త్రాలని నమ్మనివారికీ, పొరపాటున కానిధర్మాన్ని అనుసరించినవారికీ తేడా ఏముంటుంది? ఇద్దరూ సిసలైన ధర్మాన్ని కాదని తామునమ్మిన మార్గాన్ని అనుసరించినవారేగా!
#ఎవరైతే మీతర్కంలో చనిపోయిన తరువాత బ్రతికుండగా తాము సరైన ధర్మాన్ని పాటించామని తెలుసుకోగలుగుతున్నారో, వాళ్ళే నాతర్కం ప్రకారం తృప్తిని పొందుతున్నారు... # "కాన్షియస్‍నెస్, ఎరుక"... మీదగ్గరనుంచి రావలసిన వాక్యాలు వచ్చాయి చాలా సంతోషం.. ధన్యవాదాలు..
Deleteమీ మూడో పేరా ఈ చర్చకి అప్రస్తుతం అని పైనా ఉటంకించాను... కారణం అందులో మోకాలికి బట్టతలకి సంబంధాలున్నాయి కాబట్టి. ఒక చిన్న సలహా వీలైతే తీసుకోండి... సనాతనమైన ధర్మం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, కాబట్టి వైరుధ్ధ్యాలకి తావు లేదు! మతం అంటే ఎవరి మతికి పుట్టినట్లు వారు తయారు చేసినది కాబట్టి మతాలు వేరుండవచ్చు, రెండూ ఒకటని భ్రమ వద్దు... స్వస్తి..