భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?
భరతఖండంలో, భారతదేశంలో ఉండే
సనాతనధర్మీయులకి పర్యాయ పదంగా మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాలు
పెట్టుకున్నపేరు హిందు. హిందూ పదం ప్రాచీనం కాదు. అది రాజకీయ నామకరణం. సనాతన
ధర్మీయులు సత్యాన్ని నమ్ముతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ దేశంలో వేదాలను
నమ్మని చార్వాకులున్నా వారి సిద్ధాంతాన్ని వారు అనుసరించి సత్యాన్వేషణ చేసారు తప్ప
మార్చలేదు. భారతీయ జీవన విధానం వేదవిహితమైన సత్యాన్వేషణం. అంటే "భాః, రతః,"
భాః = కాంతి, వెలుగు, జ్ఞానం దానియందు రతః = రమించేవారు. వారుండే
ప్రదేశం భారతదేశం, వారు భారతీయులు. దానికి పర్యాయపదం వచ్చింది, ఇప్పుడు వికృతార్థాలకు తావిస్తున్న "హిందూ" పద (నిజానికి ’భారత’కు)
నిర్వచనం.
-శంకరకింకర
Simple and perfect
ReplyDeleteమీకు నెనర్లండీ
Deleteఅంతా గతకాలపు వైభవమే భారత దేశానిది. ఇప్పుడు పరమ కిరాతకులు, కామ పిశాచలు. ఈ దేశాన్ని స్త్రీలకు అత్యంత ప్రమాదకమైనది గా చేశారు. భరతుడు పాలించిన దేశం భారతం అయ్యింది. మీరు చెప్పే అర్థం సరికాదు
ReplyDeleteభరతుడు పాలించకముందు కూడా భరత వర్షమే, భరతఖండమే, ఈ దేశం భారతదేశమే... ఈ దేశం భరతుడితో మొదలవ్వలేదు... పూర్తి వివరం తెలియని వారి అన్వయం...
Deleteభరతుడు దున్నకముందు, భరతఖండాన్ని ఎవరూ దున్నలేదా? అంతకుముందు ఇక్కడ వ్యవసాయమే లేదా?
Delete