Pages

Monday, December 23, 2019

చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు!


చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు. సైంటిఫిక్ గా వాళ్ల మెథడ్స్లో ప్రూవ్ చేయబడిందంతే... మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే చెప్పారు. ఓ తులసీ మమ్ములను కాపాడు, రావిచెట్టూ మమ్మల్ని కాపాడు, ఓ మేడీ నీదండం నాకు కావాలి అనుగ్రహించు, ఓ దర్భా నాదోషాలు తొలగించు, రక్షించు అని మన ఋషులు చెట్లతో, మొక్కలతో మాట్లాడి, ప్రార్థించి, వరాలు కూడా పొందారు. ఆ పరంపర మనకనుగ్రహించారు. కొన్నేళ్లు పోయాక పంచభూతాలలోనూ చైతన్యం ఉంది అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. మేము మాత్రం రోజూ సముద్రవసనే దేవి అంటూ మట్టికి (భూమాతకి క్షమార్పణ చెప్పి) నమస్కరించి నిద్రలేస్తూనే ఉంటాం.. వాయుదేవుణ్ణి పూజిస్తాం, పంచభూతాలనూ, ప్రకృతి మాతనూ పూజిస్తాం

సనాతన ధర్మానికి జయం
ఆర్ష ధర్మానికి జయం...

-శంకరకింకర


Saturday, December 7, 2019

సత్సంగమంటే!?

సత్సంగమా? సద్గోష్టియా? సాధక బృందమా?
ఎందరో పెద్దల జీవితాలు, మాటలు, బోధలు పరిశీలించినమీదట చాలా ఆలస్యంగా తెలుసుకున్నది అవగతమైనది శంకరులంతటివారు సత్సంగం ఎందుకు దుర్లభం అని చెప్పారో నన్న విషయం. షరా అన్ని విషయాలలోలాగే మనం చాలా చోట్ల ఒక పదానికి బదులు మరోపదం వాడేస్తుంటాం. సాధారణంగా అన్ని ధార్మిక సంఘాలు, దేవాలయాదులు, భక్త సంఘాలు మొదలైనవాటిని సత్సంగంగా పేర్కొంటూంటాం. నిజానికి అది సత్సంగం కాదు సద్గోష్టి / సాధనా సంగాలే. కొందరికి కొత్తగా కటువుగా అనిపించచ్చు... విచారణ చేయండి. సత్సంగంలో సత్ తో సంగం చేసామా లేక సత్ కొరకు గోష్టి జరిపామా? సమాధానం మనకే అవగతమౌతుంది.

అసలు మొట్టమొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ’సత్’ తో ’సంగం’ అంటే "సత్యంతో కలిసి ఉండడం లేదా సత్ ను ఎరిగినవారితో కలిసి ఉండడం = సత్సంగం".
ఆస్తికులై, భావ సారూప్యత కలిగిన వారందరూ ఒక బృందంగా కలిసి ఉండడం, చర్చించడం స్తుతి, పూజ, అర్చన, ధ్యానాది సాధనలు చేయడం ఇవన్నీ సద్గోష్టి బృందాలు లేదా సాధక బృందాల లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ఎవరైనా సత్ తో సంగం ఉన్నవారు అనగా సత్యాన్ని ఎరిగినవారు ఉంటే అనగా ఒక ఋషి, ముని, హంస, పరమహంస, జ్ఞానంలో పండిన సత్యమెరుక గలవారుంటే అప్పుడు వారితో సంగం కలిగి ఉండడం సత్సంగం ఔతుంది. అలా కాకుండా ఆత్మ ఎరుక లేక, ఆత్మానాత్మ సందిగ్ధంలో ఉంటూ సాధన ప్రయత్నం సాగిస్తున్నవారుంటే అలాటి వారందరూ, అందులో ఉండే పెద్దలైన వేదశాస్త్రేతిహాస విషయ పరిజ్ఞానం ఉన్నవారితో సహా ఉన్నవారందరూ సాధకులే, కొందరు నాలుగుమెట్లు పెనున్నవారు కొందరు మెట్లెక్కడం మొదలెట్టినవారు! అలాంటి బృందాలన్నీ సద్గోష్టి / సాధనా సంగాలే...
-శంకరకింకర


* శిష్యులకు ఋషుల సత్సంగము, వారి సేవ, అవసరమంటారు ?
* వృత్తి రీత్యా నెక్కడో ఉండాలి, సాధువులు సమీపంలో ఉండటం కుదరదు.సత్సంగం లేకపోయినా ,నాకు సాక్షాత్కారం లభిస్తుందా ?
* సత్సంగం అవసరమా ? నేనిక్కడ కు రావటంవల్ల నా కేమైనా ప్రయోజనముంటుందా , ఉండదా - నేను తెలుసుకో గోరేది ఇదే.

మహర్షి !  మొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి నువ్వు. సత్ తో, అంటే  సత్యంతో కలిసి ఉండటమని దాని అర్థం.సత్ ని ఎరిగినవాడినీ,
గ్రహించినవాడినీ, కూడా సత్ అనే అంటారు.సత్ తోగాని, సత్ ని గ్రహించిన వానితో గానీ కలసి ఉండటం అనేది తప్పనిసరి అందరికీ. సంసారసాగరాన్ని  దాటించడానికి  సత్సంగం వంటి నౌక ముల్లోకాలలో వేరే  ఏమీ లేదన్నారు శంకరులు.

    సత్సంగమంటే - సత్ తో  కలసి ఉండటం.సత్ అంటే ఆత్మే. ప్రస్తుతం , ఆత్మే  సత్ అని తెలియకపోవటం వల్ల , ఆ జ్ఞానం కల ఋషి యొక్క సాంగత్యాన్ని  వెతుక్కుంటాం. అదే సత్సంగం. అంతర్ దృష్టి  కలుగుతుంది. సత్ సాక్షాత్కరిస్తుంది.

     !  నీ సహజ స్థితి లో ఉండు !  భగవాన్ శ్రీ రమణ 🌹🌹🌹🌹🌹

Collection from FB

Monday, December 2, 2019

భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?


భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?

భరతఖండంలో, భారతదేశంలో ఉండే సనాతనధర్మీయులకి పర్యాయ పదంగా మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాలు పెట్టుకున్నపేరు హిందు. హిందూ పదం ప్రాచీనం కాదు. అది రాజకీయ నామకరణం. సనాతన ధర్మీయులు సత్యాన్ని నమ్ముతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ దేశంలో వేదాలను నమ్మని చార్వాకులున్నా వారి సిద్ధాంతాన్ని వారు అనుసరించి సత్యాన్వేషణ చేసారు తప్ప మార్చలేదు. భారతీయ జీవన విధానం వేదవిహితమైన సత్యాన్వేషణం. అంటే "భాః, రతః," భాః = కాంతి, వెలుగు, జ్ఞానం దానియందు రతః = రమించేవారు. వారుండే ప్రదేశం భారతదేశం, వారు భారతీయులు. దానికి పర్యాయపదం వచ్చింది, ఇప్పుడు వికృతార్థాలకు తావిస్తున్న "హిందూ" పద (నిజానికి ’భారత’కు) నిర్వచనం.


-శంకరకింకర