అనగనగా ఒక అడవి, శీతాకాలం వచ్చింది. ఆ అడవిలో కొండముచ్చులు
ఎక్కువ. ఓ సారి ఎప్పుడో దారిన పోయే మనుషులు నిప్పురాజేసి చలి కాచుకోవడం చూసాయి.
వాటికి నిప్పు అని తెలీదు. కానీ అవీ చలికాచుకోవాలనుక్కున్నాయి. అన్నీ గుంపుగా బయలు
దేరి చలి కాచుకోవడానికి వెళ్ళాయి, దూరంనుంచి
వెలుగు కనిపించింది.. వెళ్ళి చలికాచుకోవడం మొదలెట్టాయి. కొంతసేపటికి అటుగా ఒక
కుందేలు వెళ్తూ చూసింది. వాటి దగ్గరకెళ్ళి ఏం చేస్తున్నారనడిగింది. అవి
చలికాచుకుంటున్నాము అని చెప్పాయి.. అది పక్కున నవ్వి ఇవి మిణుగురుపురుగుల వెలుగులు
వేడికాచుకునే నెగడు కాదు అని చెప్పింది. వాటికి కోపం వచ్చి మూర్ఖత్వంతో ఆ కుందేటి
మెడవిరిచి చంపేసాయి.....
అందుకే పెద్దలు ఎవరైనా కొందరు ఫలితంలేని పనీ, ఏదోచేయాలికదా అని చేసే పనినీ చూసి...
కొండముచ్చులు మిణుగురులతో చలికాచుకున్నట్లుంది అంటూంటారు.. అలాగే మూఢులని సమాధాన
పరచి బాగుపరచడంకూడా అంత తేలికవిషయమూ, క్షేమకరమైన విషయమూ కాదని దీన్ని ఉదహరించి చెప్తారన్నమాట.
పక్కవారేదైనా చేప్తే విని ఒకక్షణమైనా
ఆలోచించి సరియైన దాన్ని నిర్ణయించి స్థిరపరుచుకుని అప్పుడు మన పూర్వ నిర్ణయం
తప్పైతే దిద్దుకోవాలి తప్ప మూఢత్వంతో ఎదురు దాడి చేయకూడదు. అలానే మన పూర్వ నిర్ణయం
సరియైనదైతే నిర్భీతిగా నొప్పించకుండా చెప్పి మన కార్యాన్ని మనం
సాధించుకోవాలన్నమాట.
----------------------
విద్యఐనా, ఉద్యోగమైనా, ఆధ్యాత్మికత ఐనా ఏ రంగమైనా అంతే ఏదో ఒకటి వ్రాస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని కాదు.. ఏం చేస్తున్నామో. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుని ఆలోచించి చేయాలి బుర్రకి పదునుపెట్టి వ్యవసాయాత్మక బుద్ధిని పెంపొందించుకోవాలి.
- శంకరకింకర
విద్యఐనా, ఉద్యోగమైనా, ఆధ్యాత్మికత ఐనా ఏ రంగమైనా అంతే ఏదో ఒకటి వ్రాస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని కాదు.. ఏం చేస్తున్నామో. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుని ఆలోచించి చేయాలి బుర్రకి పదునుపెట్టి వ్యవసాయాత్మక బుద్ధిని పెంపొందించుకోవాలి.
- శంకరకింకర
No comments:
Post a Comment