నమస్తే
అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది. సాధారణంగా చాలామంది చేసేది చేస్తున్నది ఆగిపోతున్నది శ్రవణమననాదుల వద్దనే అంటే ఆ అవగాహన వద్దనే అదియే జ్ఞానమని పొరబడి ఆగిపోతారు. ఈ విషయమై ఎన్నో గ్రంథాలు రచించినవారు రచిస్తున్నవారు,
వేదాంత పాఠాలు బోధిస్తున్నలేదా బోధించినవారుకూడా ఈ శ్రవణమననాదుల వల్ల కలిగిన అవగాహనే జ్ఞానమని పొరబడ్డవారున్నారు
(అటువంటి కొందరు పండితులే స్వయంగా తెలుసుకుని చెప్పారు) వానిని దాటి నిధి ధ్యాసము చేసి అందులో కుదురుకుని అనుభవములోకి వచ్చినదే జ్ఞానము.
ఈ ధ్యానము ఉపాసకులు చేసేదో లేక మరే మెడిటేషనో కాదు సర్వత్ర సర్వకాలాలయందు సమస్తమునందు దేహంలో మాత్రమే ఉన్నదనుకున్న ’నేను’ను సర్వత్రావ్యాప్తమైన ఏకాత్మనుగా చూడడమే ఈ ధ్యానము. దాని వల్ల అనుభవమునకు వచ్చేదే జ్ఞానము. అది నిరంతర అనుభవైకవేద్యము.
(పైది ముఖ పుస్తకంలో ఒక మిత్రుని పోస్ట్ కు సవరణగా పంపిన విషయం, )
అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది.... అంటే శ్రుతి స్మృతులతో సహా పురాణేతిహాసాదులు శాస్త్ర భాష్యాలు పఠించడం వల్లనూ,
వినడం వల్లనూ తద్విషయము మీద కలిగేది అవగాహన అది జ్ఞానము కాదు. గురువాక్యమననముతో పాటు కలిగిన ఆ అవగాహనను ఆచరణలో ఉంచి, నిధి ధ్యాసము చేయడం ద్వారా స్థిరీకృతమై అనుభవైకవేద్యమయ్యేదే జ్ఞానము.
- శంకరకింకర
(01/Jan/2015......)
ఇప్పుడు నిధి ధ్యాసం అంటే ఏమిటో మీరే తెలియజెయ్యాలి.
ReplyDelete