నిరహంకార
నిరస్తపాప సుజనానింద్యోల్లస త్కీర్తి గొం
దరు
కామించి యశక్తులై మనములన్ దందహ్య మానేంద్రియా
తురులై
యూరక మచ్చరింతురు; మహాత్ముండీ శ్వరుండైన యా
హరితో
బద్ధ విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
అహంకారమూ, దోషములు
లేనివారు కావటం చేత సజ్జనులకు గొప్ప కీర్తి లభిస్తుంది. అట్టి కీర్తి తమకూ
దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ, వారు అసమర్ధులు కావటం వల్ల
వారికి ఆ కీర్తి రాదు. అందుచేత మనసులో కుతకుత ఉడికిపోతారు. భగవంతుడైన
విష్ణుమూర్తిపై రాక్షసులు పగను పెంచుకున్నట్లు, కారణం లేకుండానే దుర్జనులు
సజ్జనులపై అసూయను పెంచుకుంటారు. (పోతన భాగవతం - ఈశ్వరుడు సతీదేవితో చెప్పిన మాటలు)
No comments:
Post a Comment