శ్రీ గురుభ్యోనమః
ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న మరోదాడి. ఇదెలా ఉంటుందంటే చాలా చక్కగా, అందంగా, అంతా మన పరిథిలోనే ఉన్నట్టుంటుంది. ఫుట్బాల్ లో సెల్ఫ్ గోల్ వంటిదిది. సరి వివరంలోకి వెళ్తే... మనకే తెలియకుండా మనకంట్లో మనమే వేలు పెట్టి పొడుచుకునే చందంగా కొందరు పండితులు తయారయ్యారు. వారికున్న పాండిత్యాన్ని ఎంచట్లేదు ఎటువంటి అగౌరవాన్నీ ప్రకటించబోవట్లేదు. వాస్తవంగా జరుగుతున్న, లేదా వారి మాటల ప్రాచుర్యం వల్ల జరగబోయే పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించి పరాకు చెప్పుకోవడం నా ఉద్దేశ్యం
సనాతన ధర్మం మరోపేరే వేదధర్మం. వేదంలో ఆచారకాండ, జ్ఞాన కాండ రెండూ ఉంటాయి. దీన్ని సరి ఐన రీతిలో అర్థం చేసుకోవడానికి దానికి అంగాలు ఆ అంగాలకి ఉపాంగాలూ ఇవన్నీ ఉన్నవన్న విషయం అందరికీ విదితమే. ప్రవృత్తి, నివృత్తి రెండు మార్గాలు. మన ధర్మానికి కర్మ-ఆచరణ, జ్ఞాన సముపార్జన రెండూ రెండు పాదాలవంటివి. ఈ రెంటి పాదాలతో చేసిన నడకయే చివరగమ్యమైన అద్వైత స్థితికి తీసుకెళుతుంది (సర్వ సామాన్యులైన అందరికీ ఇదే దారి, అవతార పురుషుల గురించి, అటువంటి విషయాలలో విశేష విభూతి కలిగిన వారి గురించి కాదు). ఐతే ఈ పండితులు ఓ యోగ వాశిష్ఠాన్నో, భగవద్గీతనో, రెండుమూడు ఉపనిషత్తులనో పట్టుకుని వాటినే బోధిస్తూ కర్మలను, ఆచారాలని తూలనాడడం లేదా వాటిని తుచ్చమైనవిగా చూడడం జరుగుతోంది. ఐతే అవి వారు వ్యక్తిగతంగా వారి వారి శిష్యులను ఆస్థాయిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పడంలో ఇబ్బంది ఉండదు. కానీ సార్వజనీకంగా చెప్పినప్పుడే ఇబ్బంది. వేద విహితమైన కర్మలనాచరించి చిత్తశుద్ధిని పొంది ఔపనిషద్ సార జ్ఞానాన్ని పొంద వలసిన విషయాన్ని. తేలిగ్గా సార్వజనీకంగా చెప్పి జాతిని కర్మ భ్రష్టత్వం వేపు, ఆచార భ్రష్టత్వం వేపు ప్రేరేపిస్తే రేపొద్దున్న జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఇప్పటికే పలు మహిమాన్విత అవధూతల అనుయాయులవల్ల ఆచారభ్రష్టత్వం మొదలైంది.. కాదా..?
ఓ అవధానిగారు సంధ్యావందనం అక్కరలేదు, మనం అర్ఘ్యమిస్తేనే సూర్యుడుదయిస్తున్నాడా! ఏం అక్కరలేదు.. స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఓ పదకొండు మాట్లు గాయత్రి చెయ్ చాలు అని టీవీలో ఉవాచ. ఆశ్చర్యం!! ఏం చెప్తున్నామ్ మనం? బహుశా ఆయన కూడా ఏం చెప్పారో ఆయనకే తెలియకుండా చెప్పుంటారు మరి అని నా భావన ’ప్రమాదో ధీమతామపి’ కదా. ఎవరైనా అలా కాదు తప్పకుండా విహిత కర్మ చెయ్యండి అని చెప్తే కండువాగాళ్లంతా అంతే అని ఆయన ఎవర్ని అంటున్నారు. ఉత్తరీయం / కండువా శ్రామికుడి దగ్గరనుంచి పండితుడివరకూ అందరూ వేసుకునే అలవాటు భారతీయ వస్త్రధారణది. పట్టణాల్లో కరువైందేమో కానీ, ఊళ్ళలో ఇంకా ఉంది. నీకు కర్మాచరణ అలవాటుందో లేదో తెలీదు , నోటికి అమ్మవారు విభూతినిచ్చింది.. కర్మలక్కరలేదు కర్మలక్కరలేదు అని నోరేసుకు పడిపోవడం. కర్మ చేయమని చెప్పినవాడిమీద కుళ్ళుకోవడం.. ఇదేనా జ్ఞానం. యోగవాసిష్టం ఇదా చెప్పింది, ఉపనిషత్తులివా చెప్పాయి? సత్యం బ్రూయాత్ .. నిజం చెప్పు, పబ్బం గడుపుకోడానికి ఉనికి కాపాడుకోడానికి లేనిపోనివి కల్పించి స్వబుద్ధి స్వప్రమాణం చెప్పకు. చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివేసాక కీకరకాయ అన్నాట్ట ఇలాంటి పండితుడు..
జ్ఞానం పంచాలి, జ్ఞానం పొందాలి తప్పని ఎవరూ చెప్పరు, ఐతే కర్మలను వదలమని చెప్పడానికి, తద్విధంగా శాస్త్ర ప్రమాణాన్ని మార్చాలని , లేదా వాటిని
వదిలి ముందుకు సాగమనీ ఎలా చెప్తున్నారో అర్థం కావట్లే. అపర శంకరులు అని పేర్గాంచి, ప్రతివాదభయంకరులై సర్వవిద్యలకు తానే ఆలవాలం అయిపోయిన సార్వభౌమ పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత భారతీ తీర్థ స్వామి అంతటివారు వేద విహితమైన కర్మలను మార్చే అధికారం ఎవరికీ లేదు ఆచరించవలసినదే అని చెప్తే, సంధ్యావందనం వదిలేయమని చెప్పే అవధాన్లు మరి వారిని మించిపోయారో అర్థం కావట్లేదు. ఈ రకం ప్రచారం, బోధలు ఎంత దారుణమైనవంటే... కాయలని తీసుకొచ్చి కాభొహైడ్రేట్స్ వాడి పండేలా చేయడం వంటి దారుణ నేరం. పువ్వు పుట్టాలి, పిందె అవ్వాలి, కాయ అవ్వాలి, దోరగా మాగాలి, రంగు మారాలి, పండి కొమ్మనుండి విడివడాలి. తప్ప ఏ కర్మలక్కరలేదు జ్ఞానం ఒక్కటీ చాలు అని చెప్పడం ఇంతే దారుణమైన నేరం. ఆవ్యాపారులు తినే తిండి కాలుష్యం చేస్తే, ఇలాంటి పండితులు అవధానులు బుద్ధి కాలుష్యం, భావ కాలుష్యం ప్రసరింపజేసి సనాతన ధర్మ ప్రచారం అనుక్కుని ద్రోహం చేస్తున్నారు. నాకు ప్రమాణం శంకరుల వాఙ్మయం. ప్రతీదానికీ రండి చర్చకి అంటారుగా నేను రెడీ, శంకరుల సోపాన పంచకం మొదటి శ్లోకం నా ప్రమాణం మీకు అవునా కాదా తేల్చండి.
అసలు ప్రతిదానికీ శంకరుల అద్వైత సిద్ధాంతం... స్నానం వద్దు జ్ఞానం కావాలి అని... అనేటప్పుడు శంకరుల ఉపదేశం ఎందుకు గుర్తు రాదు. శంకరులు కర్మ వదిలెయ్యమన్నారా? అత్యంత శ్రద్ధతో కర్మలనాచరించవలె కాదా, అది కానప్పుడు శ్రద్ధయొక్క అవసరమేమి? వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్ తేనేశస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతామ్ పాపౌఘః పరిధూయతాం భవ సుఖే దోషో 'నుసంధీయతామ్ ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్... "కర్మలని చక్కగా చేయమని శంకరాచార్యులు చెప్తే వ్యతిరిక్తంగా ఏ నోటితో చెప్తున్నారు?" కర్మలని శాస్త్ర ప్రమాణాలని వదలమని ఎవరైనా సనాతన ధర్మంలో చరిస్తున్నవారు చెప్తే... ధర్మ ప్రచారం ముసుగులో ద్రోహం చేయడమే. నా దృష్టిలో ఖచ్చితంగా ఎంత పాండిత్యం ఉన్నా వర్జించవలసినవాడు. నాస్తికుడు, శాస్త్రం మీద, తద్విహిత కర్మాచరణం మీద నమ్మకం లేని వాడు ఈ ధర్మంలో ఉండి చేసే పని, చెట్టులోపల ఉన్న అగ్ని చేసేపని ఒక్కటే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా నాస్తికుడే.
కామాక్షీ పాదార్పణమ్
ReplyDeleteEvarandi as avadhani ?
చొక్కాకి రుద్రాక్షమాలలేస్తారే ఆయనేనండీ
Deleteఅబ్బ !
ReplyDeleteక్యూరియాసిటీ పెరిగి పోతోందండీ ! ఆ అవధాని ఎవరు పేరు చెప్పరూ !
avadhani antene telisipotundi kadandiii
ReplyDeleteఆ ఏదో మాటవరసకి అని ఉంటార్లెండీ వదిలైండీ, నిజంగా అందరూ సంధ్యావందనం చేస్తున్నారా ఏమిటీ, పెళ్ళికి ముందు ఒడుగు చేసే రోజుల్లో నిత్య వందనం ఆశించడం దురాశే కదా.....
ReplyDeleteనమస్తే
Deleteఒక్క మనిషి ఆలోచనే, నడతే మార్పుకి నాంది లక్షలు కోట్లు బౌద్ధం ఆచరిస్తుంటే, వైదిక కర్మ మార్గం వేపు నడిపించింది కుమరిల భట్టు ఒక్కరే! కర్మను పండించి జ్ఞానం వేపు నడిపించి వైదిక ఆచారాలను పునరుద్ధరించింది శంకరులొక్కరే! అందరూ అవైదికం అంటున్నారని వీళ్ళు వదలలేదు... తిరుగి ధర్మ పునరుద్ధరణ దురాశే అనుక్కోలేదు... :)
"సార్వజనీకంగా చెప్పి జాతిని కర్మ భ్రష్టత్వం వేపు, ఆచార భ్రష్టత్వం వేపు ప్రేరేపిస్తే రేపొద్దున్న జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఇప్పటికే పలు మహిమాన్విత అవధూతల అనుయాయులవల్ల ఆచారభ్రష్టత్వం మొదలైంది.. కాదా..? " -
ReplyDeleteఅయ్యా, ఇందులో జాతికి జరిగే నష్టం ఏముందండీ. ఈ సంధ్యావందనాల్లాంటి వేదవిహిత క్రియలు పాటించే/లేదా పాటించాల్సినవాళ్ళు ఎందరు. మిగతా జనాభాకి ఈ ఆచారాలతో ఏమీ సంబంధం లేదు. ఆ పాటించాల్సినవాళ్ళలో చాలామంది ఇవి వదిలేసి చాలా కాలమైంది. అవధూతల అనుయాయుల వల్ల ఈ ఆచారాలు భ్రష్టమైనా, కర్మ భ్రష్టత్వం ఏమీ లేదు. కర్మలంటే జీవితంలో ప్రతివారు వారి పాత్రకు తగ్గట్టు చేయవలసిన కర్తవ్యాలు అనుకుంటే ఇందులో కొంపలు మునిగింది ఏమీ లేదు. ఇక కర్మలంటే ఈ ఆచారకాండ అనుకుంటే ఇవి వేదకాలం నుంచి చాలా మార్పులు చెందుతూ వచ్చాయి. ఐనా ఇవి ఎందుకు చేస్తున్నారో వాటి అర్థాలు, అంతరార్థాలు తెలీకుండా అలవాటుకొద్దీ చేసుకుపోయేవారే ఎక్కువ. ఈ అలవాటుకొద్దీ పాటించే ఆచారాలతో ఎవరికైనా చాదస్తాలు పెరుగుతాయేమో కానీ, చిత్తశుద్ది పెరగటమనేది నమ్మశక్యం కాదు.
వేదాలలో ఆచారకాండ, జ్ఞానకాండ రెండూ ఉన్నాయంటే, శంకరులు ఆచారకాండని కూడా గౌరవించారంటే, జనాలలో ఎవరి స్థాయికి తగ్గది వాళ్ళకి సరిపోతుందని. అంతేకానీ అందరికీ రెండు పడవల మీదా కాళ్ళుండాలని కాదు గదా. ఆచారకాండని సరిగ్గా పాటిస్తేనే జ్ఞానం కలుగుతుందనే మాటని అబద్దమని ఎందరో అవధూతలు నిరూపించారు. ఇక చాలామంది కించిత్ అంతరార్థాన్ని కూడా గ్రహించకుండా ఆచారకాండని జీవితమంతా పాటిస్తూ, వట్టి ఆచారం జ్ఞానానికి దారి తీయాల్సిన అవసరం లేదని, కొండొకచో చాదస్తాలకి మూర్ఖత్వాలకి దారితీసే అవకాశం మెండని నిరూపిస్తున్నారు.
స్వప్రమాణులకి నమస్సులు! మీరు అవధూతలైతే మీకు శిరసా నమస్కారం.
Delete(సర్వ సామాన్యులైన అందరికీ ఇదే దారి, అవతార పురుషుల గురించి, అటువంటి విషయాలలో విశేష విభూతి కలిగిన వారి గురించి కాదు).
అవధూతల గురించి అవతార పురుషుల గురించిన మినహాయింపు తరవాత సాధారణ సాధకుల గురించే చెప్పింది. వేదానికి ఒక కాలం అన్నప్పుడే వేద ప్రమాణం మీద ఉన్న ఆస్తిక్యం తెలుస్తున్నది. ఆచారము, కర్మలు అక్కరలేదని ప్రకటించే స్వాతంత్ర్యం కొందరికెలా ఉందో అంతకన్నా దాన్ని ఖండించే స్వాతంత్ర్యం నాబోంట్లకు రెట్టింపున్నది. శంకరులు చెప్పినది ప్రమాణం అనుక్కుంటే వాదానికి ఆస్కారం లేదు. కాదనుక్కున్నవారితో నాకు వాదూలేదు. నేను శంకర కింకరుణ్ణి.
శంకర కింకరులకి నమస్సులు,
Deleteప్రకటించే స్వాతంత్ర్యము, ఖండించే స్వాతంత్ర్యము అందరికీ ఉన్నాయిలెండి. కానీ పరస్పర ఖండనలు కొత్తగా చేప్పేదేముంది, ఇక ఖండించలేని స్థాయివరకు ఖండించుకుంటూ పోవటం తప్ప. ఇక నా సంగతంటారా, అవధూతనీ కాను, ఆవకాయనీ కానూ, ఓ రకంగా శంకరాద్వైతానికి అభిమానినే.
జ్ఞానానికి ఆచారాలు తప్పనిసరైతే, ఆచారభ్రష్టత్వం జ్ఞానానికి అడ్డమూ ఐతే, తలుపులు మూసుకుని తండ్రికి తద్దినం పెట్టుకుంటున్న మండనమిశ్రుని ఇంట్లోకి దూసుకెళ్ళి శంకరులు వాదించి గెలిచింది ఏమిటండీ? వేదాలలో జ్ఞానకాండ కన్నా ఆచారకాండ గొప్పదని వాదించే మీమాంసికులతో శంకరులు చేసిన వాదమేమిటి మీ దృష్టిలో.
ధన్యోస్మి,
Deleteపొరపాటుగా అర్థం చేసుకున్నారు, శంకరాద్వైతము అనడమే తప్పు. ఇంతకు ముందెవరైనా అలా అన్నా తప్పు. శంకరులు పునరుద్ధరించినది వేదాంత సిద్ధాంతమైన అద్వైతం. శంకరులు తద్దినం పెడుతున్న మండన మిశ్రుణ్ణి తద్దినం పెట్టద్దూ అని చెప్పలేదు. కర్మలూ ఆచారాలు వదిలేయమనీ చెప్పలేదు. కర్మలతో తాదాత్మ్యం వద్దని చెప్పారు. అలా ఐతే ధర్మాన్ని ఆచారాన్ని బోధించడానికి ఆమ్నాయ పీఠాలు పెట్టి ఆచార్యులను నియమించేవారూ కాదు. కర్మాచరణకు వ్యతిరేకులైతే ఆయనపేరుకి ఆచార్య అన్న పేరూ పెట్టుకునే వారు కాదు. పైనే చెప్పాను, వేదంలోని ఆచారకాండ జ్ఞాన కాండ కాంప్లిమెంట్స్ ఈచ్ అథర్. వేదోనిత్య మధీయతాం "తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం" తేనేశస్య విధీయతా మపచితిః "కామ్యేమతి స్త్యజ్యతాం" పాపౌఘః పరిధూయతాం... (సోపాన పంచకం శంకరభగవత్పాదుల సమస్త బోధలకి సారాంశం) ఇట్స్ ఎ ప్రాసెస్ ఎవొల్యూషన్..
ఆచారః పరమోధర్మః శ్రుత్యుక్తః స్మార్త ఏవ చ!
తస్మాదస్మిన్సదా యుక్తో నిత్యం స్యాదాత్మవాన్ద్విజః!!
’ఆచారము’ సర్వోత్కృష్టమైన ధర్మమమని శ్రుతి స్మృతులు చాటుచున్నవి, కాబట్టి తన ఆత్మజ్ఞానమును కోరుకునే వ్యక్తి ఎప్పుడూ సదాచార సంపన్నుడై ఆచారమును పాటించేవాడై ఉండాలి.
ఆచారలక్షణో ధర్మః సంతస్త్వాచార లక్షణాః!
ఆగమానాం హి సర్వేషామాచారః శ్రేష్ఠ ఉచ్యతే!!
ఆచార ప్రభవో ధర్మో ధర్మాదాయుర్వివర్ధతే
ఆచారాల్లభతేహ్యాయురాచారాల్లభతే శ్రియమ్!!
ధర్మము యొక్క లక్షణమే ఆచారము. మంచి అన్న దానికి లక్షణమూ ఆచారమే. అన్ని బోధలకంటే ఆచారము శ్రేష్ఠము. ఆచారమే ధర్మమూలం అక్కడనుండే ధర్మము ఉద్భవించింది. ధర్మము ఆయుష్షుని అభివృద్ధి చేస్తుంది. ఆ ఆచారం వలన మానవునికి ఆయుష్షు సిరిసంపదలు లభిస్తాయి.
(మహాభారతం అనుశాసన పర్వం నుండి..)
అవును అద్వైతం శంకరులది కాదు వేదాంతమే. ఆయనా దాన్ని ఉపనిషత్ మతమే అన్నారు. కానీ ఆ తర్వాత బోలెడు అద్వైతాలు (వేరియేషన్స్) వచ్చాయి, అవన్నీ కూడా వేదాంత సిద్దాతాలే అని చెప్పుకున్నాయి. తేడా కోసమే ఆ పద ప్రయోగం.
ReplyDeleteశంకరుల సోపాన పంచకం కోట్ చేస్తూ ఇట్స్ ఏ ప్రోసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. మరి ఆయనే ఆచారాలనే చీమ అడుగులతో హిమాలయాలని ఎప్పటికి ఎక్కాలి, జ్ఞానమనే రెక్కలు తెచ్చుకో సులువుగా చేరగలవనలేదా. శంకరులని కర్మాచరణకి వ్యతిరేకమని నేను అనలేదు. కానీ అచారాలకే ఒక ప్రయోజనం ఉందని (అంతరార్థంలో ఉన్న జ్ఞానాన్ని సూచించే భౌతిక కార్యం కావటం మినహా) నమ్మే మీమాంసికుల సిద్దాంతాన్ని పూర్వపక్షం చేసారు. ఆచారాలు జ్ఞానాన్ని భౌతికస్థాయిలో మననం చేసుకునే ఒక సాధనమే తప్ప వాటికి అంతకన్నా ప్రయోజనం లేదు. స్థిమితంగా మానసిక ఆరాధన చేయగలిగిన వారికి భౌతిక ఆరాధన కొత్తగా నేర్పేది ఏముంటుంది. పైన ఉదహరించిన సోపానక్రమం ఆచారాల పైన ఇంకా మెట్లున్నాయని, అక్కడే ఆగిపోవద్దని చెబుతోంది కానీ, అదే క్రమంలో మనిషి సత్యాన్ని చేరుకోవాలని ఏమీ లేదు. అదొక కామన్ ఆర్డర్ అంతే. ఆచారాల పాటించకపోయినా నేరుగా జ్ఞానాన్ని అందుకున్నవారూ ఉన్నారనే నేను అవధూతలని ఉదహరించినది. ఆచారాలకింత అనవసరమైన ప్రాముఖ్యత ఇస్తే అది కర్మల పట్ల తాద్యాత్మత పెంచుతుందే కానీ ఎప్పటికైనా తగ్గిస్తుందా.
వేదాంత జ్ఞానాన్ని బోధించటానికే ఆచారపీఠాలు. కానీ అవి కాలక్రమేణా జనాల స్థాయిని అందుకోటానికి తామే జ్ఞానమార్గం నుంచి కిందకి దిగి ఆచారాల్లో పడ్డాయి. సత్యాన్ని చేరుకునే పద్దతి ఒక్కటేనంటూ అది మాదేనంటూ భీష్మించుకు కూర్చున్న మార్గాలన్నిటినీ ఒక్కదారిలోకి మళ్ళించి మహాప్రవాహం చేసారు శంకరులు. ఇప్పుడు జనం మళ్ళీ శుష్క ఆచారాల్లో పడ్డారు. ఎందుకు చేస్తున్నారో తెలీకుండా లెక్కలేనన్ని ఆచారాలు, పట్టింపులు, మళ్ళీ దాంట్లో భేదాలు, గొడవలు. మళ్ళీ మరో శంకరులు రావాలి కాబోలు.
కొందరు భౌతిక కర్మలతో బాగా కనెక్ట్ ఐతే, కొందరు మానసిక భావనలతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎవరి దారి వారిది. ఒకటి మరోదానికి అదే ఆర్డర్లో దారి తీయాలనే రూలేం లేదు. ఆచారాలు పాటించకపోవటాన్ని ధర్మభ్రష్టత్వంగా తీసుకుని ఆవేశపడవలసిందేమీ లేదని నా భావన. పూర్వికుల భోదనల్ని బై స్పిరిట్ తీస్కుంటే చాలని అనుకుంటాను. ప్రపంచమంతా మన ఆచారాలే లేవు కదా, వారంతా ధర్మభ్రష్టులు, ఎప్పటికి సత్యాన్ని చేరలేని వారు ఐపోరు కదా.
అవధూతలు, అవతార పురుషులు ఎక్జెంప్టెడ్ అని ఆల్రెడీ చెప్పా.. సో ఇది మిగిలినవాళ్ళకీ ఆచార మార్గం ఎంచుకున్నవారికే తప్ప అవధూతలకో ఆమార్గంలో ఉన్న వారికో కాదనేగా అర్థం... ఇంక అభ్యంతరమేముంది.... ఇక ప్రపంచమంతా కర్మ భూమి వేద భూమి కాదు, కిచెన్లో వంటచేయమంటున్నా.. హాల్లో చేసినా బెడ్రూంలో చేసినా బయట్నుంచి తెచ్చుకు తిన్నా పరవాలేదు.. అనుక్కుంటే ఫరవాలేదు అలా ఐనా కడుపునిండడంలో మార్పేం లేదు. సోపాన క్రమంలో మొదటి మెట్లే ఎక్కద్దంటే పెద్దంగలు ఉన్న వాళ్లే కాస్త పైమెట్లెక్కగలరు... ఆమెట్లెక్కరలేదని చెప్తే మరి చిన్న చిన్న మెట్లెక్కి పైకొచ్చేవాళ్ళ స్థితి? అయోమయంలోకి నెట్టడంకాదా? కర్మదగ్గరే ఆగిపొమ్మని నేనూ పైనెక్కడా చెప్పలేదు, వేద విహిత కర్మను వదిలెయ్యమని చెప్పే అధికారం ఎవరికీ లేదన్న ఆచార్యుల మాటనే నేను చెప్తున్నది. స్నానం చేయకపోతే, స్నానం చేయలేదంటారు, పాపం చేస్తే పాపి అంటారు, అలాగే ధర్మిగా మారే వరకూ ధర్మం పాటించకపోతే ధర్మభ్రష్టత్వమే అంటారుగానీ మరోటి మరోటి అనరుగా... ప్రవృత్తి నివృత్తి ఏమార్గమైనా పైకెక్కొచ్చు... ప్రస్తుతం ప్రపంచంలో అనాచారం ఏం చేస్తున్నదో ఏం చేయగలదో ఆచారం దేన్ని పునరుద్ధరించగలదో పరిశీలించవచ్చు. ఆచారం అవసరం లేదు కర్మ ధర్మాల అవసరం లేదనుక్కుంటే ఫైన్... అప్ టూ ఇండివిడ్యువల్స్ ఛాయిస్ అలాగే కొనసాగవచ్చు... స్వస్తి
Deleteమీ వాదన సమ్మరైజ్ చేసి స్వస్తి చెప్పారు. ముగించే ముందు నావీ నాలుగు ముక్కలు.
ReplyDeleteఅవధూతలు అవతారపురుషులకే కాదు కొందరు సామాన్యులకీ జ్ఞానమార్గంలోకి నేరుగా అడుగుపెట్టడం కుదురుతుందంటున్నా, వారి వారి మనస్తత్వాన్ని బట్టి. రెండు మార్గాలలోనూ బేబీ స్టెప్స్ ఉంటాయి. ఆచారాలు మాత్రమే జ్ఞానమార్గానికి మొదటి మెట్లు అవ్వాల్సిన అవసరం లేదు. శిష్టుల మార్గంలో కాక, తమ తమ మార్గాల్లో సత్యాన్ని తెలుసుకున్న వారు, ఆ మార్గానికి చెందిన చిన్నచిన్న మెట్లు ఎక్కినవారే.
నేనూ కిచెన్లోనే వంట చేయమంటున్నా, హాల్లోనో బెడ్రూంలోనో కాదు. కాకపోతే బైటినుంచి తెచ్చుకుని తినటాన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదంటున్నా. చేసుకున్నదో, తెచ్చుకున్నదో అది శుచిగా ఉన్నంతవరకు చేసిన చోటుగురించి పట్టింపు ఎందుకు.
ధర్మం పాటించకపోతే ధర్మభ్రష్టత్వమే అనాలన్నారు. నిజమే, కానీ ప్రాంతానికో రకంగా మారిపోయే ఆచారాలని పరమ ధర్మాలనుకుంటే, మనం తప్ప మిగతా ప్రపంచం అంతా ధర్మభ్రష్టంగానే కనిపిస్తుంది. మన ఆచారాలు మనకి ధర్మాలన్నట్టే, వారికీ వారి ఆచారాలు ధర్మాలే కదా మరి.
స్వస్తి
దేవుడు పూజ ప్రియుడు కాదా, స్తోత్ర ప్రియుడు కాదు , కేవలం ధర్మప్రియుడు మాత్రమే , ఎక్కడికైనా వచ్చి వాదిస్తాను అని అంటున్నారు. నువ్వు ధర్మంగా వుండు ఇంక ఏమి చెయ్యవలిసిన పని లేదు అని అనుటున్నారు. పూజ, స్తోత్ర , నామపారాయణ వంటి ప్రక్రియలు ధర్మానుష్టానములో భాగములే కదా మరి ? పూజ అనేది మన శ్రేయస్సుకు, మన ఉద్ధరిణికి కదా , దానికి ప్రమాణాలు కావాలట వీరి ప్రసంగాలు చూసి ప్రభావితం అయ్యినవారికి. కేవలం మానవ సేవ చేస్తే చాలట.. ఇంక కర్మ ఖాండ ఏమి చెయ్యక్కర్లేదట. ఎటు వెడుతోందో తెలియటం లేదు ఈ ధోరణి. పూజ, స్తోత్ర , నామపారాయణ వంటి ప్రక్రియలమీద నమ్మకం లేదట , కానీ భగవంతుడంటే నమ్మకమట. ఇదేరక నాస్తికమో అర్ధం కాదు.
ReplyDeleteవీరికి పూజ, స్తోత్ర , నామపారాయణ వంటి ప్రక్రియలమీద శాస్త్ర ప్రమాణాలు చూపించలేమా ? సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన, జగద్గురువులు స్థానములోనున్న శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు భారతీతీర్ధ స్వామి వారి అనుగ్రహ భాషణ చుసిన , విన్న కూడా నమ్మకపోతే ఎలా ?