శ్రీ గురుభ్యోనమః
శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు
ఉన్నాయో, ఇప్పుడే
అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో
నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే
మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే
ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు
అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు
పిచ్చిరాతలు రాయడమేమిటి?
ఓ హిందువా! మేలుకో! అంతర్ముఖమై
నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో
మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న
దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక
తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ
గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.
శంకర జయంతి
శుభాకాంక్షలు.
మన్నాథః
శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః !
మదాత్మా సర్వభూతాత్మా తస్మై
శ్రీగురవే నమః !!
జయ జయ శంకర
హర హర శంకర
-శంకరకింకర